సరికొత్త ‘ప్లాస్టరింగ్’
‘కరోనా’ ప్రభావంతో ధరల పెరుగుదల, కూలీల కొరత.. నిర్మాణ రంగాన్ని ఇప్పటికీ పట్టి
పీడిస్తున్నది. ఫలితంగా భవన నిర్మాణంలో కీలకమైన ‘ప్లాస్టరింగ్’ పనులకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఈ నేపథ్యంలో ‘తక్కువ ఖర్చు – ఎక్కువ ప్రయోజనాలు’ ఉన్న ‘వాటర్ ప్రూఫింగ్ ప్లాస్టరింగ్’ పద్ధతి.. మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది.
నిర్మాణ రంగంలోనూ రోజురోజుకూ సరికొత్త సాంకేతికత పెరిగిపోతున్నది. ఈ రంగంలో ఇటుక, స్టీల్‌తోపాటు ఇసుకకూడా ప్రధానమైన ముడిసరుకు. అయితే, కరోనాతో అనుకున్నంత స్థాయిలో ఇసుక లభ్యత ఉండటం లేదు. దీని ప్రభావం ‘ప్లాస్టరింగ్’ పనుల్లో కనిపిస్తున్నది. అంతేకాకుండా, రెండు దఫాలుగా చేసే ప్లాస్టరింగ్ కోసం ఎక్కువ సంఖ్యలో కూలీలు, నీరు అవసరమవుతుంది. ఇంకా పని పూర్తికావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్లాస్టరింగ్ పనులను తొందరగా పూర్తి చేయడానికి బిల్డర్లు సరికొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ‘వాటర్ ప్రూఫింగ్ ప్లాస్టరింగ్’గా పిలిచే సరికొత్త సాంకేతికతతో సమయం ఆదా కావడంతోపాటు ఖర్చుకూడా భారీగా తగ్గి, అనేక అదనపు ప్రయోజనాలూ కలుగుతున్నాయి.
వినియోగం ఇలా..
‘జెన్ప్లాస్ట్ డబ్ల్యూపీ’ (వాటర్ ప్రూఫింగ్ ప్లాస్టర్) అనేది ఇటుక గోడపైనా నేరుగా పూత వేయగల వాటర్ ప్రూఫింగ్ ప్లాస్టర్. సాధారణ ప్లాస్టరింగ్‌లో ఇసుక, సిమెంటుతో కలిపి చేసే సన్నమాలు మాదిరిగానే, ఇది రెడీ మిక్స్‌లో దొరుకుతుంది. ఇందులో ఫైబర్స్ ఉంటాయి. దీనిని ఎరేటెడ్ లైట్ వెయిట్ ఇటుకలు, ఫ్లై యాష్ ఇటుక, ఏసీసీ ఇటుక, జీఎఫ్ఆర్జీ గోడలు, సిమెంట్ బ్లాక్, ఏరోకాన్ ప్యానెల్స్పైనా సమర్థవంతంగా వినియోగించవచ్చు. ఇందులో వాడే సిమెంట్ తెలుపు రంగులో ఉంటుంది. దీనివల్ల పెయింట్ ఖర్చుకూడా తగ్గుతుంది. మాల్‌ను మిక్స్ చేసి, మామూలు పద్ధతిలాగే ప్లాస్టరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇటుక గోడను శుభ్రం చేసుకున్న తర్వాత మొదటి కోటింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత రెండో దఫా కోటింగ్‌తో పని పూర్తవుతుంది. ఈ పద్ధతిలో నిర్మాణ జీవితకాలం పెరుగుతుంది. దీనికి వాటర్ క్యూరింగ్ కూడా అవసరం లేదు.
ఎన్నెన్నో ప్రయోజనాలు..
సాధారణ ప్లాస్టరింగ్‌లో ఎంత జాగ్రత్తగా క్యూరింగ్ చేసినా, గోడలకు పగుళ్లు వస్తాయి. కిటీకీలు, మెట్లు, తలుపుల వద్ద ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అదే వాటర్ ప్రూఫింగ్ పద్ధతిలో ఎలాంటి పగుళ్లు రావని ‘జెనెసెస్ కంపెనీ’ ప్రతినిధులు కరుణాకర్ (సివిల్ ఇంజినీర్), పీఎం కుమార్ (కెమికల్ ఇంజినీర్)లు చెబుతున్నారు. అంతేకాకుండా గోడలపై ఎలాంటి పాకురు రాదనీ, వాన నీటిని పీల్చుకోవడం తక్కువని అంటున్నారు. సంప్రదాయ పద్ధతిలో సూర్యరశ్మివల్ల బయటి గోడల రంగు పేలిపోతుందనీ, వాటర్ ప్రూఫింగ్‌తో ఈ సమస్య ఉండదని చెబుతున్నారు. సాధారణ పద్ధతిలోకంటే ఇందులో పూత మందం తగ్గించవచ్చు. ఫలితంగా మెటీరియల్ వ్యర్థాలు తగ్గడంతోపాటు సమయం ఆదా అవుతుంది. కూలీల భారం తగ్గి, ఖర్చు ఆదా అవుతుంది. ఇందులో యువీ రక్షణ, యాంటీ ఫంగల్లాంటి ప్రత్యేకతలు ఉండటంతోపాటు ఉష్ణోగ్రతనూ నియంత్రణలో ఉంచుతుంది. అందుకోసమే, ఈ ‘వాటర్ ప్రూఫింగ్ ప్లాస్టరింగ్’ పద్ధతి ప్రస్తుత బిల్డర్లకు కల్పతరువుగా మారింది.
సగానికి సగం..
సంప్రదాయ ప్లాస్టరింగ్‌తో పోలిస్తే, ఈ రకం పద్ధతిలో ఖర్చుతోపాటు సమయం కూడా సగానికి సగం తగ్గిపోనున్నది. ఇందులో ఇసుక వినియోగం చాలా తక్కువ. దీనికి క్యూరింగ్ (నీళ్లు పట్టడం) అవసరం లేదు. దీంతో నీటిని భారీగా ఆదా చేయవచ్చు. ఒక ఇంటికి సాధారణ ప్లాస్టరింగ్ చేయడానికి 10 నుంచి 15 రోజుల సమయం తీసుకుంటే, ఈ వాటర్ ప్రూఫింగ్ ద్వారా మూడు నుంచి నాలుగు రోజుల్లోనే పని పూర్తి చేయవచ్చు. సాధారణ పద్ధతిలో ఫీట్‌కు రూ.100 దాకా ఖర్చయితే, ఇందులో రూ.50 మాత్రమే ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు.
-వర్ధెల్లి బాపురావు
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు