ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022
యూపీఎస్సీ ఈఎస్ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్
వెబ్సైట్: www.upsc.gov.in దరఖాస్తుకు చివరితేదీ: 12-10-2021
భర్తీచేసే ఉద్యోగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కమ్యూనికేషన్ విభాగాల్లో ఉంటాయి.
ఎగ్జామినేషన్
ఈ పరీక్ష మూడు దశల్లో ఉంటుంది.
స్టేజ్-1 ప్రిలిమినరీ
మెయిన్స్‌కు అర్హత మార్కులు ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి నిర్ణయిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన మార్కులు ఫైనల్ ర్యాంకింగ్ కోసం కూడా ఉపయోగపడతాయి.
ప్రిలిమినరీలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 200 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. దీనిలో జనరల్ స్టడీస్, ఇంజినీరింగ్ ఆప్టిట్యూడ్ (లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథ్స్, జనరల్ ఇంజినీరింగ్ బేసిక్స్, ఐసీటీ ఎథిక్స్, వ్యాల్యూ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెషన్) సంబంధిత ప్రశ్నలు ఉంటాయి.
దీనిలో అన్ని బ్రాంచీలకు ఒకే విధంగా ఉంటుంది.
దీనిలో కనీస అర్హత మార్కులు సాధించాలి.
పేపర్-2లో 300 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
దీనిలో ప్రశ్నలు సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ (సుమారు 12 సబ్జెక్టులు) నుంచి వస్తాయి.
పేపర్-1, పేపర్-2 కలిపి 500 మార్కులు ఉంటాయి. ఈ పేపర్లు ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి.
నెగెటివ్ మార్కింగ్‌లో ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కులు కోత విధిస్తారు.
ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ జవాబులు గుర్తించినా అది నెగెటివ్ మార్క్ అవుతుంది.
ప్రశ్నలు ముఖ్యంగా 4 విధాలుగా విభజించుకోవచ్చు.
కాన్సెప్ట్స్, ఫార్ములాస్, డెఫినేషన్స్ థియరీస్, లాస్‌ను గుర్తుచేసుకొనే విధంగా మెమరీ రీకాలింగ్ క్వశ్చన్స్ 10 నుంచి 15 శాతం వరకు ఉంటాయి.
సబ్జెక్ట్స్‌ను విశ్లేషించే సామర్థ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు 35 నుంచి 40 శాతం వరకు ఉంటాయి.
ఇంజినీరింగ్, సాంకేతికతను అప్లయ్ చేసే విధానం పై ప్రశ్నలు 20-25 శాతం ఉంటాయి.
ఇంజినీరింగ్, సాంకేతికతల్లో లోపాలను గుర్తించడం, సరిచేయడం వాటి పై ప్రశ్నలు 15-20 శాతం ఉంటాయి.
స్టేజ్-2 మెయిన్
స్టేజ్-1 (ప్రిలిమినరీ)లో అర్హత మార్కులు దాటిన వారు స్టేజ్-2 రాయాలి.
ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి 6 నుంచి 7 సార్లు ఖాళీలను బట్టి ఆ ఏడాదిలో స్టేజ్-2కు పంపుతారు. (1:6 లేదా 1:7)
స్టేజ్-2లో కూడా రెండు పేపర్లు ఉంటాయి. ఇవి కన్వెన్షనల్ టైప్ ప్రశ్నలు సంబంధిత ఇంజినీరింగ్ నుంచే ఇస్తారు.
ప్రతి పేపర్లో 300 మార్కులకు ప్రశ్నలుంటాయి. మొత్తం 600 మార్కులు.
దీనిలో నెగెటివ్ మార్కింగ్ లేదు.
ఈ పేపర్లు ఇంగ్లిష్‌లో ఉంటాయి. జవాబులు కూడా ఇంగ్లిష్‌లోనే రాయాలి.
ఈ పేపర్లు కన్వెన్షనల్ టైప్ ప్రశ్నలు, డెరివేషన్స్, ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్, ఇంజినీరింగ్‌లోని డీప్ కాన్సెప్ట్స్‌ను పరీక్షించే విధంగా ఉంటాయి.
స్టాండర్డ్ టెక్ట్స్ బుక్స్‌లోని డెరివేషన్స్, కాన్సెప్ట్స్, గ్రాఫ్స్, థియరీ, కన్వెన్షనల్ టైప్ ప్రాబ్లమ్స్ ను ప్రాక్టీస్ చేయాలి.
స్టేజ్-1, స్టేజ్-2లో సాధించిన మార్కుల ఆధారంగా స్టేజ్-3 (పర్సంటేజ్ టెస్ట్)కి ఖాళీల సంఖ్యకు రెండింతల మంది (1:2)ని ఎంపిక చేస్తారు.
స్టేజ్-3 పర్సనాలిటీ టెస్ట్
ఇది 200 మార్కులకు ఉంటుంది.
దీనిలో అర్హత మార్కులు ఉండవు. దీనిలో వచ్చిన మార్కులు ఫైనల్ ర్యాంక్‌కు ఉపయోగపడతాయి.
పర్సనాలిటీ టెస్ట్‌లో అభ్యర్థి లీడర్షిప్ క్వాలిటీస్, ఇనిషియేటివ్ ఎబిలిటీస్, ఇంటెలెక్చువల్ స్కిల్స్ మాట్లాడే విధానం, సామాజిక స్పృహ, ప్రాక్టికల్ అప్రోచ్ లాంటి లక్షణాలపైన ముఖాముఖి ప్రశ్నలు అడుగుతారు.
దీనిలో విజయం సాధించాలంటే మాక్ పర్సనాలిటీ టెస్ట్‌లకు అటెండ్ కావాలి. వ్యక్తిత్వ వికాసం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
స్టేజ్-1 500 + స్టేజ్-2 600 + స్టేజ్-3 200. మొత్తం 1300 మార్కులు. ఈ మూడు దశల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ ర్యాంక్‌ను నిర్ణయిస్తారు.
ఫైనల్ ర్యాంక్ ఆధారంగా నియామకాలు చేపడతారు.
ప్రిపరేషన్
ప్రిలిమినరీ ఫిబ్రవరి 2022లో జరిగే అవకాశం ఉంది.
ప్రిలిమ్స్‌కు ప్రిపేర్ అవ్వడానికి 120 రోజుల ప్రణాళిక తయారుచేసుకోవాలి.
ఇంజినీరింగ్‌లోని 12 యూనిట్స్, జనరల్ స్టడీస్ ఏ రోజు ఏయే సబ్జెక్ట్స్ ప్రిపేర్ కావాలనేది షెడ్యూల్లో క్లారిటీగా నిర్ణయించుకోవాలి.
ప్రిపరేషన్ ప్లాన్‌లో ముందుగా బేసిక్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్‌ను తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది. తరువాత కోర్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ ప్లాన్ చేసుకోవాలి.
ప్రిపరేషన్లో ఎప్పుడు వచ్చిన డౌట్స్‌ను అప్పుడే సబ్జెక్ట్స్ నిపుణులను సంప్రదించి క్లారిఫై చేసుకోవాలి.
ప్రతిరోజు ప్రిపేర్ అయిన టాపిక్ నుంచి కొన్ని ప్రశ్నలు సాధన చేయాలి.
టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. కాబట్టి ప్రతిరోజు కొన్ని ప్రశ్నలు సమయం ప్రకారం సాధన చేసి సమయపాలన అలవాటు చేసుకోవాలి.
స్టాండర్డ్ టెక్ట్స్ బుక్స్ చదివి కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి.
కొత్తగా నేర్చుకొన్న ప్రతి విషయాన్ని, ప్రతి ఫార్ములాను ప్రత్యేకంగా బుక్‌లో చేర్చుకోవాలి. ఇవన్నీ చివరగా క్విక్ రివిజన్‌కు ఉపయోగపడతాయి.
రోజులో కొంత సమయం గ్రూప్ స్టడీ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
ప్రతిరోజు గత ఈఎస్ఈ పరీక్షల ప్రశ్నలు సాధన చేసి రాబోయే ప్రశ్నలను ఊహించి ప్రిపేరైతే చాలా ఉపయోగం ఉంటుంది.
120 రోజులు, రోజుకు 14 గంటలు మొత్తంగా సుమారు 1700 గంటలు ప్రణాళికలో ఉండాలి. ఏ సమయం ఏ గంట ఏది చదవాలో క్లారిటీ ఉండాలి.
సబ్జెక్ట్‌లవారీగా టెస్టులు, మోడల్ టెస్టులు ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. దానికి ఆన్లైన్ టెస్ట్ సిరీస్‌ను సంపాదించాలి.
కాంపిటీషన్లో ఏ స్థానంలో ఉన్నామో అంచనా వేసుకొని ప్రిపేర్ కావాలి. ఎప్పటికప్పుడు సెల్ఫ్ మోటివేట్ అవుతూ ప్రిపరేషన్ కొనసాగించాలి.
ప్రశ్నలు చదవడంతో పాటు ఆప్షన్స్ చదవడంలో పొరపాట్లు చేయకుండా రీడింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. చదివే వేగం అక్యురసి సరిచూసుకోవాలి.
ప్రాబ్లమ్స్ సాధన చేసేటప్పుడు చివరి న్యూమరికల్ వరకు ప్రాక్టీస్ చేయాలి. న్యూమరికల్ ఎబిలిటీ లేదా అన్సర్స్ చేయడంలో పొరపాటు చేయకూడదు.
ప్రిపరేషన్ కాలంలో అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. దానికి కావాల్సిన చర్యలు ప్రతిరోజు తీసుకోవాలి.
JC. RUDRAPATI
Director
Space Engg Academy
Saimedha
Koti, Hyderabad
ప్రిలిమినరీ మోడల్ పేపర్
జనరల్ స్టడీస్
- When is the National small Industry Day celebrated every year?
1) August 30 2) September 1
3) September 3 4) september 5
2.India s First Dragonfly fossil was found in which state recently?
1) UP 2) Andaman and Nicobar
3) Jharkhand 4) MP
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - What is The condition for Retrogressive winding in DC machines?
1) Yb > Yf 2) Yb <Yf
3) Yb=Yf 4) Y6=0.5yf - Zero sequence currents can flow from a line into a Transformer bank If the windings are in
1) grounded star/delta
2) delta/star 3) star/ground star
4) delta/ delta - When the voltage source are Replaced with short circuits and current sources are replaced with open ckts leaving dependent sources in the circuit the term applied is?
1) super position 2) thevinin
3) Nortan 4) Millman
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ - A bipolar Transistor has a=0.98 ICo= 10mA If the base current 100 mA then collector current would be..
1) 2.91MA 2) 3.4 MA
3) 4.91MA 4) 5.49 MA - A system has a Receiver noise Resistance of 50W it is connected to an Antenna with an output Resistance of 50W the noise figure of the system is..
1) 1 2) 2 3) 50 4) 101 - If a Large amount of Infor -mation is to be Transmitted in small amount of time we require it ?
1) low frequency signals
2) narrow Band signals
3) wide Band signals
4) High frequency signals
మెకానికల్ ఇంజినీరింగ్ - The temperature of a body of area 0.1 m2 is 900k. the wave length for maximum monoc -hromatic emissive power will be near?
1) 2.3 mm 2) 3.2 mm
3) 4.1 mm 4) 5.0 mm - Handleability of steel is assessed by..?
1) charpy Impact Test
2) Rockwell Hardness Test
3) Jominy end quench Test
4) Open Hole Test - Which are of the following Relations with used notations will hold good in a dynamic vibration absorber system under tuned conditions?
1) k1k2=m1m2
2) k1m2 =m1 k2
3) k1 m1= k2 m2
4) k1+ k2= m1+ m2
సివిల్ ఇంజినీరింగ్ - an average in a 125mm slump, the concrete may lose about
(in first one hour)
1) 15 mm of slump
2) 25 mm of slump
3) 40 mm of slump
4) 50 mm of slump - Flattering and smoothing the Road surface by scrapping is called?
1) Compaction 2) Consolidation
3) Grading 4) Ditch digging
Answers
1-1, 2-3, 3-2, 4-1, 5-1, 6-4, 7-2, 8-3, 9-2, 10-3,11-2, 12-4, 13-3
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు