సైబర్ సెక్యూరిటీ.. కెరీర్ గ్యారెంటీ

ప్రస్తుతం మనకు బ్యాంక్‌లో డబ్బులు పోయాయని, కంప్యూటర్, ఫోన్లోని సమాచారం మాయమైందని, ముఖ్యమైన సమాచారం చోరీ అయ్యిందని వంటి సైబర్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇదంతా చేసేది సైబర్ నేరగాళ్లు. వీటిని భద్రంగా సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా కాపాడుకోవడానికి సైబర్ సెక్యూరిటీని వాడుతుంటాం. ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి? దానివల్ల భవిష్యత్తు ఏంటో తెలుసుకుందాం..
సైబర్ సెక్యూరిటీ అంటే?
సైబర్ సెక్యూరిటీ అనే పేరు వినగానే హ్యాకింగ్ ముప్పు అని, సైబర్ ఎటాక్ అని ఇలా చాలా పదాలు గుర్తుకొస్తాయి.
డిజిటల్ వ్యవస్థలో భాగంగా ఉన్న అన్నింటినీ కలిపి సైబర్ అనవచ్చు. దీనిలో భాగంగా ఉన్న సమాచారం (డేటా), కంప్యూటర్ వ్యవస్థలు (సిస్టమ్స్), హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ (అప్లికేషన్లు), నెట్వర్క్స్ మొదలైన వాటన్నింటిని ఇతరుల చేతికి అందకుండా పటిష్ఠమైన భద్రతా వలయాన్ని ఏర్పర్చడమే సైబర్ సెక్యూరిటీ లక్ష్యం.
చాలా సార్లు చాలా మంది విలువైన సమాచారం ఏదీ నా దగ్గర లేదు, నన్నెవరు టార్గెట్ చేస్తారు? నా డివైజెస్‌ని ఎవరు హ్యాక్ చేస్తారు? అసలు నేను ఇంటర్నెట్కే కనెక్ట్ అవ్వను ఎవరు హ్యాక్ చెయ్యలేరు అని అనుకుంటారు. ఇవన్నీ అపోహలు.
ఉదాహరణకి మనకు రోజూ ఏదో ఒక మెసేజ్ కానీ, కాల్ కానీ, ఈ-మెయిల్ కానీ వస్తుంటాయి. మీరు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు, పది వేలు కడితే ఐదు లక్షలు గిఫ్ట్‌గా వస్తాయి, ఫ్రీ కూపన్స్ గెలుచుకున్నారు అని ఇలా చాలా వస్తూనే ఉంటాయి. దీనిని ఫిషింగ్ అంటారు. అంటే ప్రజలకు ఒక ఆశ చూపి నమ్మేలా చేసి వారికి ఏం కావాలో అది చేయించడం. ఇలా రకరకాల టెక్నిక్స్ వాడి మనల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడిప్పుడే వచ్చినవి కాదు చాలా కాలం నుంచి ఉన్నాయి.
ఈఫిల్ టవర్‌నే అమ్మేశారు
1920లో మొదటి ప్రపంచ యుద్ధం పూర్తయ్యాక విక్టర్ లస్టిగ్ అనే అతడు స్క్రాప్ మెటల్ డీలర్లకు తాను ఒక గవర్నమెంట్ అధికారి అని పరిచయం చేసుకుని యుద్ధం వల్ల గవర్నమెంట్ చాలా అప్పుల్లో ఉంది, డబ్బులు అవసరం అని, ప్రఖ్యాత కట్టడం ఈఫిల్ టవర్‌ను నేలమట్టం చేస్తున్నారని, ఆ ఇనుమును అమ్మేస్తున్నారని దాని ద్వారా వచ్చిన డబ్బుతో దేశాన్ని కాపాడుకోవాలనుకుంటుందని నమ్మించి ఈఫిల్ టవర్‌ని ఏకంగా రెండు సార్లు అమ్మేశాడు.
డిజిటల్ ప్రపంచంలో ఫిషింగ్ ద్వారా ఇలా చాలా మందిని ట్రిక్ చేయడం జరుగుతుంది. స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న ఎటాక్స్‌లో 90 శాతం ఫిషింగ్ వల్లనే జరుగుతున్నాయి. అలాగే 92 శాతం మాల్వేర్ (అంటే చెడు చేయడానికి తయారు చేసే ఒక సాఫ్ట్వేర్) ఇలా ఫిషింగ్ ఈ-మెయిల్ ద్వారా వ్యాప్తి చెందుతుంది.
సైబర్ క్రైమ్ అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి కంపెనీకి ఒక అతిపెద్ద ముప్పు అని ఐబీఎం కంపెనీ మాజీ సీఈఓ గిన్ని రొమెట్టి అన్నారు. రోజుకు సుమారుగా 30,000 వెబ్సైట్లు హ్యాక్ అవుతున్నాయి. ఒక డేటా బ్రీచ్ని గుర్తించడానికి, దాన్ని ఆపడానికి సుమారు 280 రోజులు పడుతుంది. 2018 నుంచి 2020 మధ్యలో 73 లక్షల కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ వల్ల నష్టపోవడం జరిగింది.
గో డాడీ
గో డాడీ అనే ఒక కంపెనీ వాళ్లు డిసెంబర్ 2020లో వారి ఉద్యోగులు ఎంత అలర్ట్‌గా ఉన్నారో పరీక్షించడానికి క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా అందరికి హాలిడే బోనస్ ఇస్తున్నట్లు ఒక ఫిషింగ్ ఈ-మెయిల్ పంపింది. ఈ ఈ-మెయిల్లోని లింక్‌ని ఐదు వందలకు పైగా ఉద్యోగులు క్లిక్ చేసి తమ వివరాలు ఇచ్చారు. ఇలా వివిధ సంస్థలు తమ ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి, పరీక్షించడానికి వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి.
సైబర్ నేరగాళ్లు ఇలా ఫిషింగ్ ద్వారా కంప్యూటర్లోకి ప్రవేశించాక వేర్వేరు మార్గాల్లో ఎటాక్స్ చేస్తారు.
ఉదాహరణకు మీకు ఒక ఈ-మెయిల్ వచ్చింది. దానిలో మీరు కోటి రూపాయలు గెలుచుకున్నారు, వివరాలకు కింది లింక్‌ను క్లిక్ చేయండి అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే ఒక వైరస్ కంప్యూటర్లోకి ప్రవేశించి ఫైల్స్ అన్నింటినీ లాక్ చేస్తుంది. ఒకవేళ ఆ ఫైల్‌ను ఓపెన్ చేయాలని చూస్తే అప్పుడు అవి ఓపెన్ కావు. పైగా ఫైల్స్ లాక్ అయ్యాయని, కొంత డబ్బు కడితేనే ఆ ఫైల్స్ మళ్లీ అన్‌లాక్ అయి ఓపెన్ అవుతాయని, వీలైనంత త్వరగా డబ్బు కట్టకపోతే ఫైల్స్ అన్నీ పోతాయని ఓ మెసేజ్ కంప్యూటర్ తెరపై ప్రత్యక్షమవుతుంది. ఆ మెసేజ్‌లో కనిపించిన మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. అది నేరుగా హ్యాకర్ల ఖాతాలోకి చేరుతుంది. ఈ తరహా వైరస్‌ను ర్యాన్సమ్వేర్ అంటారు. అంటే డేటాను తస్కరించే మాల్వేర్.
ఇంతే కాకుండా కార్లను, డ్రోన్లను, గుండె దగ్గర పెట్టే పేస్ మేకర్లను కూడా హ్యాక్ చేసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. దీనివల్ల మన ప్రాణానికి కూడా హాని ఉంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన పరికరాలు, అప్లికేషన్, నెట్వర్క్ని చాలా సురక్షితంగా ఉంచడం అవసరం.
నేర్చుకోవాల్సిన అంశాలు
సైబర్ సెక్యూరిటీని కెరీర్‌గా మలచుకోవాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో స్కిల్స్ ఉండటం ముఖ్యం. డేటాబేస్, సెర్చ్ ఇంజిన్స్ అండ్ సర్వర్స్ పనిచేసే విధానం, కొన్ని ముఖ్యమైన హ్యాకింగ్ టూల్స్, ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ప్రధానంగా పైథాన్, లినక్స్, విండోస్ వంటి వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టంల అంతర్గత నిర్మాణం తెలుసుకోవాలి. నెట్వర్కింగ్ స్కిల్స్ అంటే ఉదాహరణకు కంప్యూటర్ ఎలా కనెక్ట్ అవుతాయనేది తెలిసి ఉంటే మంచిది.
భారతీయుల ముందంజ
గత 5 సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా హ్యకర్ల సంఖ్యలో భారతదేశం ముందున్నది. అలాగే ఫేస్బుక్ బగ్ బౌంటీస్లో ప్రతి సంవత్సరం 125+ దేశాలు పాల్గొనగా ఎక్కువ సంఖ్యలో పరిశోధకులు, బౌంటీస్లో కూడా ఇండియా టాప్ 3 దేశాల స్థానం సంపాదించింది. 2016లో దేశం నుంచి 205 సెక్యూరిటీ పరిశోధకులు పాల్గొని సుమారు 4 కోట్ల బౌంటీస్ గెలుపొందారు.
ఇన్ని అవకాశాలు ఉన్న సైబర్ సెక్యూరిటీలో విద్యార్థులు ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా వారి నైపుణ్యాన్ని పెంచుకోవడం చాలా అవసరం. దీనికోసం ఐబీ హబ్స్, నెక్ట్స్‌వేవ్ సీసీబీపీ ప్రోగ్రామ్స్ ద్వారా సైబర్ సెక్యూరిటీ, ఇతర 4.0 టెక్నాలజీల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఈ ప్రోగ్రాం గురించి మరిన్ని వివరాలు కోసం https://www.ccbp.in/ని చూడవచ్చు, 9390111765 నంబర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించండి లేదా support@nxtwave.techకి మెయిల్ పంపండి. ఉడెమి, కోర్సెరా వంటి వాటిలో కూడా సైబర్ సెక్యూరిటీని నేర్చుకోవచ్చు.
సైబర్ నిపుణులకు డిమాండ్
కంప్యూటరీకరణ, మొబైల్ ఫోన్ల విస్తృతి, అంతర్జాల ఆధారిత వ్యాపారాలు సామాజిక మాధ్యమాల వాడకం, డిజిటల్ వ్యవస్థలో వస్తున్న పెను మార్పుల కారణంగా ఎన్నో పనులు సులభతరమవుతున్నాయి. కానీ వాటితో పాటు సమాచార భద్రత వంటి ముప్పులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. వీటి నుంచి రక్షించుకునేందుకు అత్యధిక సంఖ్యలో నిపుణుల అవసరం కూడా పెరుగుతూనే ఉంది. ISC2 సైబర్ సెక్యూరిటీ స్టడీ 2020 ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీలో 30 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి.
డిమాండ్ ఉన్న కోర్సు: రామ్ గణేష్, సీఈఓ సైబర్ ఐ
సైబర్ సెక్యూరిటీకి ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. దీనిలో స్కిల్స్ సంపాదించినవారికి భవిష్యత్తు బాగా ఉంటుంది. ఈ స్కిల్స్‌ను మేం నేర్పిస్తున్నాం. సైబర్ ఐ ఐబీ హబ్స్ అనుబంధిత అంకుర సంస్థ. ఈ సైబర్ ఐ సంస్థ సైబర్ సెక్యూరిటీతో పాటు ఐఓటీ, లోరా వ్యాన్ వంటి టెక్నాలజీల్లో వివిధ కీలకమైన గవర్నమెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్స్‌తో కూడా పనిచేస్తుంది. నెక్ట్స్‌వేవ్ సీసీబీపీ ప్రోగ్రామ్స్‌లో కూడా చాలా మంది సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నారు.
- Tags
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






