ఎన్‌బీసీసీలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ బిల్డింగ్స్ కన్స్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్బీసీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో 35 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చేనెల 21 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 35
ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్) 25, మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సివిల్ పోస్టులకు బీటెక్ లేదా బీఈలో 60 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ పోస్టులకు.. బీఈ లేదా బీటెక్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా దానికి సమానమైన కోర్సు ఉండాలి. ఏప్రిల్ 21 నాటికి 29 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: గేట్-2020 వ్యాలిడ్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్ 21
వెబ్సైట్: https://www.nbccindia.com
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు