బ్యాంక్ ఆఫ్ మహారాష్రలో జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
హైదరాబాద్: ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఖాళీగా ఉన్న జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన, అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల్లో 150 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 6 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
మొత్తం పోస్టులు: 150
ఇందులో జనరల్ 62, ఈడబ్ల్యూఎస్ 15, ఓబీసీ 40, ఎస్సీలకు 22, ఎస్టీలకు 11 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్ఏ, ఎఫ్ఆర్ఎం వంటి కోర్సులు పాసైనవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో మూడేండ్లపాటు ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉండాలి. 25 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1,180, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.118
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 6
వెబ్సైట్: ttps://www.bankofmaharashtra.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు