ఏప్రిల్ 1 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆరోదశ పరీక్ష


హైదరాబాద్: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి ఆరో దశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలు వచ్చేనెల 1, 3, 5, 6, 7, 8 తేదీల్లో జరగనున్నాయి. అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రైల్వేరిక్రూట్మెంట్ బోర్డు 2019లో 35,208 పోస్టులతో ఎన్టీపీసీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్ ఆధారితంగా జరుగుతున్న ఈ పరీక్షలు (సీబీటీ) గతేడాది డిసెంబర్ 28న ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో పరీక్షలను దశలవారీగా నిర్వహిస్తున్నారు.
ఈ లెవల్ను పూర్తిచేసిన వారిని తదుపరి రౌండ్లకు ఎంపిక చేస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. గణితం, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాల్లో పరీక్ష పూర్తవుతుంది. తుది ఫలితాల్లో ఎంపికైనవారిని ట్రైన్ క్లర్క్, జూనియర్ క్లర్క్, టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్, జూనియర్ టైమ్ కీపర్ తదితర పోస్టుల్లో నియమిస్తారు.
వెబ్సైట్: www.rrbsecunderabad.nic.in
- Tags
- CBT
- Junior clerk
- NTPC
- Recuritment
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్లో450 పోస్టుల భర్తీ
ఐబీపీఎస్ 6035 క్లర్క్ పోస్టులు భర్తీ
వేరుశనగ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత?