బెహ్లెర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డ్ విజేత?
- డుగోంగ్ పరిరక్షణకు దేశంలోని ఏ రాష్ట్రంలో రిజర్వ్‌ను ఏర్పాటు చేయనున్నారు? (సి)
ఎ) కేరళ బి) ఒడిశా
సి) తమిళనాడు డి) పశ్చిమబెంగాల్
వివరణ: డుగోంగ్ సంరక్షణ రిజర్వ్‌ను దేశంలో తొలిసారిగా తమిళనాడులో ఏర్పాటు చేయనున్నారు. పాక్ అఖాతానికి ఉత్తరాన దీనిని ఏర్పాటు చేస్తారు. డుగోంగ్ను సాధారణ పరిభాషలో సముద్రపు ఆవులు (సీ కౌ) అంటారు. వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం ప్రస్తుతం కేవలం 200-250 డుగోంగ్లు ఉన్నాయి. అందులో దాదాపు 150 పాక్ బే, గల్ఫ్ ఆఫ్ మన్నార్లలో ఉంటాయి. వీటి పరిరక్షణకు కట్టే రిజర్వ్ దాదాపు 500 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. - న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌లో కొత్తగా సభ్యత్వం పొందిన దేశాలు ఏవి? (డి)
- యూఏఈ 2. ఉరుగ్వే 3. బంగ్లాదేశ్
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
వివరణ: బ్రిక్స్ దేశాలు (బీఆర్ఐసీఎస్-బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సంయుక్తంగా ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సభ్యత్వాన్ని పెంపొందిస్తున్నాయి. ఇటీవల యూఏఈ, ఉరుగ్వే, బంగ్లాదేశ్‌లు ఇందులో చేరాయి. పేద, మధ్య తరగతి దేశాల సాంఘిక, ఆర్థిక అభివృద్ధి కోసం ఈ బ్యాంక్ కృషి చేస్తుంది. దీని ప్రధాన కేంద్రం షాంఘైలో ఉంది. అలాగే బ్యాంక్ ప్రాంతీయ కేంద్రాలు జొహాన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా), సావోపౌలో (బ్రెజిల్), మాస్కో (రష్యా)ల్లో ఉన్నాయి.
- యూఏఈ 2. ఉరుగ్వే 3. బంగ్లాదేశ్
- కింది వాక్యాల్లో సరైనవి ఏవి? (సి)
- రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డ్ పేరును ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నగా మార్చారు
- రాజీవ్‌గాంధీ నేషనల్ పార్క్ పేరును ఒరాంగ్ నేషనల్ పార్క్‌గా మార్చారు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
వివరణ: రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డ్‌ను ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో క్రీడలకు సంబంధించి ఇది అత్యుత్తమ పురస్కారం. దీనిని తొలిసారిగా తీసుకుంది విశ్వనాథన్ ఆనంద్. అలాగే అస్సాంలోని రాజీవ్‌గాంధీ జాతీయ పార్క్ పేరును ఒరాంగ్ జాతీయ పార్క్‌గా మారుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పార్క్ బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. 1985లో దీనిని అభయారణ్యంగా ప్రకటించారు. ఆ తర్వాత 2016లో జాతీయ పార్క్‌గా గుర్తించారు.
- టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? (బి)
ఎ) 18 బి) 19 సి) 20 డి) 21
వివరణ: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ఆటను ప్రదర్శించింది. అయిదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం 19 పతకాలు సాధించింది. పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. అవని లేఖరా, సుమిత్, మనిష్ నర్వల్, ప్రమోద్ భగత్, కృష్ణనగర్లు బంగారు పతకాన్ని సాధించారు. 2016 వరకు భారత్ పారాలింపిక్స్‌లో అందుకున్న మొత్తం పతకాల సంఖ్య కంటే ఈ ఏడాది సాధించినవే ఎక్కువ. షూటింగ్లో విజయం సాధించిన తొలి పారాలింపిక్ క్రీడాకారిణిగా అవని లేఖరా కొత్త రికార్డ్‌ను నమోదు చేశారు. అలాగే పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి క్రీడాకారిణి, ఒకే టోర్నీలో వేర్వేరు పతకాలు కూడా సాధించిన క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించారు - మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, జుక్కల్ ఇటీవల వార్తల్లో నిలిచాయి. కారణం? (ఎ)
ఎ) దళిత బంధును ఆ ప్రాంతాల్లో కూడా అమలు చేయనున్నారు
బి) స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి
సి) రికార్డ్ స్థాయిలో వర్షం నమోదైంది
డి) ఏదీ కాదు
వివరణ: దళితుల్లో ఆర్థిక సాధికారత కోసం చేపట్టిన దళిత బంధు పథకాన్ని నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవి మధిర నియోజకవర్గంలోని చింతకాని (ఖమ్మం జిల్లా), తుంగతుర్తిలోని తిరుమలగిరి (సూర్యాపేట జిల్లా), అచ్చంపేటలోని చారగొండ (నాగర్‌కర్నూలు జిల్లా), జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాల్లో (కామారెడ్డి జిల్లా) దళిత బంధును అమలు చేస్తారు. ఆయా మండలాల్లోని ఎస్సీ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందిస్తారు. వాసాల మర్రిలో ప్రారంభించారు. తర్వాత లాంఛనంగా హుజురాబాద్ నియోజకవర్గం మొత్తం పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నారు. - ఆసియా ఖండంలో ప్లాస్టిక్ ఒప్పందాన్ని చేసుకున్న తొలి దేశం? (సి)
ఎ) సింగపూర్ బి) భూటాన్
సి) భారత్ డి) శ్రీలంక
వివరణ: వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, భారత ప్రభుత్వాలు సంయుక్తంగా ప్లాస్టిక్ ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీనిని అమలు చేయనున్న తొలి ఆసియా దేశం భారత్. 100% పునర్వినియోగ ప్లాస్టిక్‌ను వినియోగించడంతో పాటు ఎన్నో లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. 2030 నాటికి వాటిని సాధించనున్నారు. భారత్ ఏటా 9.46 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందులో దాదాపు 40% వ్యర్థాన్ని సేకరించడం లేదు. ఇది పర్యావరణానికి విఘాతం కలిగిస్తుంది. ఈ ఒప్పదంలో 17 రకాల వ్యాపార సంస్థలు కూడా భాగస్వామ్యం అయ్యాయి. - ఇటీవల కార్బి ఆంగ్లాంగ్ ఒప్పందం కుదిరింది. ఇది దేనికి సంబంధించింది? (డి)
ఎ) పర్యావరణ మెరుగు
బి) ప్లాస్టిక్ వ్యర్థాన్ని అరికట్టడం
సి) కశ్మీర్లో శాంతిస్థాపన
డి) ఈశాన్య రాష్ర్టాల్లో శాంతి స్థాపన
వివరణ: అస్సాం రాష్ట్రంలోని అయిదు తిరుగుబాటు గ్రూప్‌లు, ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్బి ఆంగ్లాంగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కార్బి ఆంగ్లాంగ్ అనేది ఆ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా. ఈశాన్య రాష్ర్టాల్లో పురోగతిలో భాగంగా దీనిని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా కార్బి ప్రాంత అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారు. అలాగే ఇక్కడి అటానమస్ కౌన్సిల్‌కు మరిన్ని అధికారాలు కల్పిస్తారు. స్థానిక ప్రజల కోసం ఒక సంక్షేమ మండలిని కూడా ఏర్పాటు చేస్తారు. - దేశంలో తొలి బయో బ్రిక్ ఆధారిత భవనాన్ని ఏ నగరంలో ప్రారంభించారు? (డి)
ఎ) కాన్పూర్ బి) ఇండోర్
సి) వడోదర డి) హైదరాబాద్
వివరణ: దేశంలో తొలిసారిగా బయో బ్రిక్స్‌తో తయారు చేసిన భవనాన్ని హైదరబాద్‌లోని ఐఐటీ ప్రాంగణంలో ప్రారంభించారు. బోల్డ్ యూనిక్ ఐడియా లీడ్ డెవలప్మెంట్ (బీయూఐఎల్డీ) అనే ప్రాజెక్ట్‌లో ఇది భాగం. - కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి? (సి)
- శ్రీలంకలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించారు
- గినియా దేశంలో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
వివరణ: ఆర్థిక అత్యవసర పరిస్థితిని శ్రీలంకలో విధించారు. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో పాటు ఆ దేశ కరెన్సీ విలువ డాలర్‌తో పోలిస్తే విపరీతంగా పడిపోయింది. శ్రీలంక ప్రధానంగా పర్యాటక రంగంపై ఆధారపడింది. ప్రధాన ఆదాయ వనరుగా ఈ రంగం ఉంది. అయితే కరోనా మూలంగా పర్యాటక ఆదాయం భారీగా తగ్గింది. మరోవైపు ఆహార పదార్థాల దిగుమతులు ఆ దేశంలో ఎక్కువ. కరోనా వల్ల సరఫరా తగ్గి, డిమాండ్ పెరగడంతో ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ఇది సంక్షోభానికి దారి తీసింది. 2019 నవంబర్ నుంచి ఆ దేశపు రూపాయి విలువ ఆగస్ట్ 2021 నాటికి 20% పడిపోయింది. మరోవైపు పశ్చిమాఫ్రికా దేశం అయిన గినియాలో అధికారాన్ని సైన్యం చేజిక్కించుకుంది. ఆ దేశ అధ్యక్షుడు అల్ఫాకాండేను నిర్బంధించారు. ప్రభుత్వంతో పాటు రాజ్యాంగాన్ని కూడా రద్దు చేశారు. ప్రాంతీయ గవర్నర్లను తొలగించి వారి స్థానంలో సైన్యాధికారులను నియమించారు.
- వతన్ ప్రేమ్ యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? (డి)
ఎ) పశ్చిమబెంగాల్ బి) కేరళ
సి) మహారాష్ట్ర డి) గుజరాత్
వివరణ: గ్రామాల్లో స్మార్ట్ స్కూల్, కమ్యూనిటీ హాల్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, అంగన్వాడీల ఏర్పాటు, నీటి పునర్వినియోగం, డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం, చెరువులను మెరుగు పరచడం, సౌరశక్తి వినియోగం, బస్టాండ్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులే ప్రాతిపదికగా గుజరాత్ రాష్ట్రంలో వతన్ ప్రేమ్ యోజన పథకాన్ని ప్రారంభించారు. రూ.1000 కోట్లను డిసెంబర్ 2022 నాటికి వ్యయం చేస్తారు. ఒక గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులకు విదేశాల్లోని గుజరాతీలు 60% వరకు వ్యయం చేస్తే, మిగిలిన 40 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. - టోక్యో పారాలింపిక్స్‌లో పతకాన్ని సాధించిన ఐఏఎస్ అధికారి ఎవరు? (బి)
ఎ) భవీనా బి) సుహాస్ యథిరాజ్
సి) హర్విందర్ సింగ్
డి) మరియప్పన్ తంగవేలు
వివరణ: 2020 టోక్యో పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో సుహాస్ యథిరాజ్ వెండి పతకాన్ని సాధించారు. ఈ ఘనత సాధించిన తొలి ఐఏఎస్ అధికారిగా ఆయన చరిత్ర సృష్టించారు. 2020 నుంచి నోయిడా జిల్లా మేజిస్ట్రేట్‌గా ఆయన విధులను నిర్వహిస్తున్నారు. అలాగే ఈ పోటీల్లో భారత్‌కు తొలి పతకాన్ని అంధించింది భవీనా బెన్. హర్విందర్ సింగ్ ఆర్చరీలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. మరియప్పన్ తంగవేలు 2016 రియో ఒలింపిక్స్‌తో పాటు 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ విజేతగా నిలిచి పతకాలు సాధించారు. - కింది వాక్యాలను పరిశీలించండి? (సి)
- మాల్దీవుల దేశానికి భారత్ 400 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను ఇచ్చింది
- లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం వల్ల భారత్ ఎగమతులు పెరుగుతాయి
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
వివరణ: గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్‌కు మాల్దీవుల దేశానికి భారత్ 100 మిలియన్ డాలర్ల గ్రాంట్‌తో పాటు, 400 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ కూడా ఇవ్వనుంది. అతి తక్కువ వడ్డీతో పాటు వినియోగించుకున్న మొత్తానికే వడ్డీ చెల్లించే ప్రత్యేక తరహా విధానాన్నే లైన్ ఆఫ్ క్రెడిట్ అంటారు. ఇలా ఏ దేశం అయినా భారత్ నుంచి లైన్ ఆఫ్ క్రెడిట్ తీసుకుంటే నిర్మించబోయే ప్రాజెక్టుకు సంబంధించి 75% సరకులను భారత్ నుంచే కొనుగోలు చేయాలి. అంటే ఇది భారత ఎగుమతులను పెంచుతుంది.
- ‘ఎస్ఐఎంబీఈఎక్స్ (సింబెక్స్)’ అనే సైనిక విన్యాసం ఏ రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి? (డి)
ఎ) భారత్-శ్రీలంక
బి) శ్రీలంక-మాల్దీవులు
సి) సింగపూర్-మలేషియా
డి) భారత్-సింగపూర్
వివరణ: సింబెక్స్ పేరుతో భారత్, సింగపూర్లు సంయుక్తంగా నావిక ద్వైపాక్షిక విన్యాసాలను నిర్వహిస్తాయి. దక్షిణ చైనా సముద్రంలో ఇటీవల 28వ విన్యాసాలను ఇరు దేశాలు కొవిడ్-19 జాగ్రత్తలను పాటిస్తూ విజయవంతంగా పూర్తి చేశాయి. ఇరు దేశాల మధ్య విన్యాసాలను 1994లో ప్రారంభించారు. విదేశాలతో భారత్ చేపడుతున్న ఈ తరహా విన్యాసాల్లో ఇదే అత్యంత సుదీర్ఘమైంది. - సెప్టెంబర్ 5ను ఏ రోజుగా నిర్వహిస్తారు? (బి)
- ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం
- జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
- అంతర్జాతీయ దాతృత్వ రోజు
ఎ) 2 బి) 2, 3 సి) 1, 3 డి) 1, 2, 3
వివరణ: భారత తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి అయిన సెప్టెంబర్ 5న ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తారు. ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ఆయనే. బెనారస్ విశ్వవిద్యాలయంతో పాటు పలు ఇతర యూనివర్సిటీల్లో ఆయన వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. తాత్విక రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. ఏటా అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తారు. అలాగే సెప్టెంబర్ 5 అంతర్జాతీయ దాతృత్వ రోజు, మదర్ థెరిస్సా వర్ధంతి కూడా అదే రోజు.
- బెహ్లెర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డ్‌ను గెలిచిన భారతీయుడు? (సి)
ఎ) ఆకాంక్ష బి) జేబీ మొహపాత్ర
సి) శైలేంద్రసింగ్ డి) డా. నాగేశ్వరరావు
వివరణ: భారత జీవ శాస్త్రవేత్త శైలేంద్ర సింగ్ ‘బెహ్లెర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డ్’ను పొందారు. ప్రమాదపు అంచుల్లో ఉన్న మూడు టర్టిల్ (సముద్రపు తాబేలు) జాతులను పరిరక్షించేందుకు ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డ్ లభించింది.
ఆకాంక్ష: దేశంలోనే తొలి అండర్‌గ్రౌండ్ మైనింగ్ మహిళా ఇంజినీర్‌గా జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ఆకాంక్ష ఘనత సాధించారు. బిర్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మైనింగ్ ఇంజినీరింగ్ పట్టా పొందారు.
జేబీ మొహపాత్ర: కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి చైర్మన్‌గా జేబీ మొహపాత్ర నియమితులయ్యారు
డా. నాగేశ్వరరావు: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన ఢిల్లీలోని డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ డైరెక్టర్‌గా డాక్టర్ నాగేశ్వరరావు నియమితులయ్యారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
- Tags
Previous article
స్కాలర్షిప్స్.. చదువుకు చేయూత !
Next article
పదమూడేండ్ల బ్రిక్స్ ప్రస్థానం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు