మది దోచేలా.. గది
ఇల్లు ఎంత విశాలంగా, అందంగా ఉన్నా గోడలకు వేసే పెయింట్‌ను బట్టే కొత్త ఆకర్షణ వస్తుంది. అంతేకాదు, ఆ వర్ణాలు ఇంటి వాతావరణంపైనా ప్రభావం చూపుతాయి. అయితే, చాలామంది తమకు ఇష్టమైన రంగులనే ఎంచుకొంటారు తప్ప, అవి నిజంగా ఇంట్లోని గదులకు నప్పుతాయా లేదా అన్నది ఆలోచించరు. అలాంటి వాళ్లకు, ఏ రూమ్‌లో ఏ పెయింట్ వేస్తే బాగుంటుందో నిపుణులు సూచిస్తున్నారు..
లివింగ్ రూమ్: ఇంటిల్లిపాదీ ఎక్కువ సమయం గడిపేది లివింగ్ రూమ్‌లోనే. టీవీ చూసినా, అతిథులతో మాట్లాడినా ఇక్కడే. ఈ గది గోడలకు లేత గోధుమరంగు లేదా బూడిద రంగు బాగుంటాయి.
బాత్ రూమ్: ఆధునిక బాత్రూమ్లలో నేలమీద తెల్లటి టైల్స్, మార్బుల్స్ ఉంటాయి. ఇలాంటప్పుడు గోడలకు ముదురు రంగులు వేస్తే బాగుంటుంది. ఉదాహరణకు బొగ్గు, ఇనుము రంగులు వాడొచ్చు.
కిచెన్: వంటగది అంటే ఇంట్లో అందరికీ ఇష్టమే. కిచెన్ ట్రెండీగా కనిపించాలంటే, నేవీ బ్లూ ఎంచుకోవాలి. అలాగే, గదిలో ఎక్కువగా ఇత్తడి, రాగి వస్తువులు ఉంటే మరింత కళ వస్తుంది.
డైనింగ్ రూమ్: అపార్ట్మెంట్ కల్చర్‌లో ఇంట్లోకి వెలుతురు తక్కువగా వస్తుంటుంది. అందువల్ల డైనింగ్ రూమ్‌లోని గోడలకు వైట్, క్రీమ్ వైట్, సెమీ వైట్ రంగులను ఎంచుకోవాలి. గోడలపై నచ్చిన సీనరీలు, పెయింటింగ్స్ పెట్టుకుంటే ఆ గది మరింత అందంగా మారుతుంది.
కిడ్స్ రూమ్: పిల్లలకు కేటాయించిన గదులకు, ఆఫీస్‌గా మార్చుకున్న గదులకు
క్యాలమైన్ రంగును ఎంచుకోవాలి. లేత గులాబీ వర్ణం కూడా వేసుకోవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు