career guidance-ఆట.. ఉపాధికి బాట
క్రీడారంగం.. మంచి భవిష్యత్తు ఉన్న రంగం. ప్రతిభ ఉంటే స్పోర్ట్స్ రంగంలో అద్భుతమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. క్రీడలు మనిషి శక్తిని కొత్త పుంతలు తొక్కించడంతో పాటు మనోరంజక సాధనాల్లో ముఖ్య భాగమయ్యాయి. సాంప్రదాయకమైన ఆటల కంటే, ఆధునిక, ప్రపంచ గుర్తింపుగల ఆటల్లో ప్రావీణ్యం కనబరిస్తే.. పేరు ప్రతిష్టలతో పాటు ఆదాయం, ప్రభుత్వ ఉద్యోగం లభిస్తాయి. దేశంలో ఎందరో ఆటగాళ్లు వివిధ క్రీడల్లో రాణించి పేరుప్రఖ్యాతలు సంపాదించారు. అందుకే స్పోర్ట్స్‌ను గొప్ప కెరీర్‌గా మార్చుకునేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. స్పోర్ట్స్‌కు సంబంధించి డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకు పలుస్థాయిల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (ఇంపాల్)తో పాటు స్పోర్ట్స్ కాలేజీలు, పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ కాలేజీలు ఏయే కోర్సులు అందిస్తున్నాయి.. ఎలాంటి అంశాల్లో శిక్షణ అందిస్తున్నాయి వంటి పలు అంశాలపై నిపుణ పాఠకుల కోసం..
- స్పోర్ట్స్‌మన్‌గా రాణించాలంటే.. ఎంచుకున్న క్రీడలో ప్రతిభ, సంకల్పం, పట్టుదల చాలా అవసరం. ప్రతి క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలి. ఇంటర్ తర్వాత ఈ కోర్సుల్లో జాయిన్ కావచ్చు. అలాగే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి వారే స్పోర్ట్స్ కోర్సులకు అర్హులు. రొటీన్ కోర్సులు చేసుకుంటూ సరైన జాబ్స్ లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్న యువతకు స్పోర్ట్స్ రంగం చక్కటి వేదిక. కాబట్టి యువత చదువుతో పాటు స్పోర్ట్స్‌పై కూడా శ్రద్ధ పెడితే మంచి భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. కొవిడ్ వల్ల ఎన్ని రంగాలు కుంటుపడినా స్ప్సోర్ట్స్ రంగంపై దాని ప్రభావం అంతగా చూపించలేదు. ఈ సంక్షోభంలో క్రీడా ఈవెంట్లకు కాస్త విరామం రావడమో, వేదికలు మార్చడమో జరిగింది. కానీ పూర్తిగా రద్దయిన పరిస్థితులు తక్కువనే చెప్పవచ్చు.
యూనివర్సిటీ-కోర్సులు
తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ- చెన్నై(TNPESU.ORG)
కోర్సులు
- బీఎస్సీ స్పోర్ట్స్ బయోమెకానిక్స్ అండ్
- కైనెసియాలజీ
- అర్హత: 10+2 ఎంపీసీ, బైపీసీ,
- కంప్యూటర్ సైన్స్
- ఎమ్మెస్సీ, ఎంఫిల్, పీహెచ్డీ కూడా ఆఫర్ చేస్తుంది.
- ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించవచ్చు.
- కైనెసియాలజీ అనే పదం కైనటిక్స్ నుంచి వచ్చింది. బాడీ మూమెంట్ ఏ విధంగా ఉంటుంది. దానికి తగిన విధంగా ఫిట్నెస్ ఎలా పెంపొందించుకోవాలి. సమస్యలు రాకుండా, ఒకవేళ వస్తే దానిని ఏవిధంగా తగ్గించుకోవాలి అనే దానిపై కోర్సు ఇది. మజిల్స్ బలం, బోన్స్ మూమెంట్స్ ఎలా ఉండాలనే దానిపై ఈ మూడు సంవత్సరాల కోర్సులో నేర్పుతారు.
బీఎస్సీ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అండ్ న్యూట్రిషన్.
- ఇది మూడేండ్ల కోర్సు.
- అర్హత: ఇంటర్
- బీఎస్సీ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అండ్ న్యూట్రిషన్. న్యూట్రిషన్‌తో పాటు ఏయే స్పోర్ట్స్‌కు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ ఎలా తీసుకోవాలనే దానిపై కోర్సులో నేర్పుతారు. స్పోర్ట్స్ పర్సనాలిటీ వారు ఎంపిక చేసుకున్న క్రీడను బట్టి ఏం తీసుకోవాలో నేర్పిస్తారు.
- బీఎస్సీ (ఆనర్స్) స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్- శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
- www.csstruoach.in (సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్, చెన్నై)తో పాటు మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (4 ఏండ్లు), ముంబైలోని డీవై పాటిల్ యూనివర్సిటీ, సోమియా విద్యా విహార్ యూనివర్సిటీ ఈ కోర్సును అందిస్తున్నాయి.
బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్
- మణిపాల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ చెన్నై, స్వర్నిమ్ గుజరాత్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (అహ్మదాబాద్), ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (న్యూఢిల్లీ) ఈ కోర్సును అందిస్తున్నాయి.
- కోచింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు పలు యూనివర్సిటీలు కోర్సులను అందిస్తున్నాయి. కోచ్‌గా మారడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో ఎంపిక చేసుకున్న ప్రతి క్రీడా అంశంపై కోచింగ్‌కు సంబంధించి అంశాలను అందిస్తారు.
- బీఎస్సీ స్పోర్ట్స్ న్యూట్రిషన్ చదివిన వారికి హైదరాబాద్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ చదివే అవకాశముంది. ఎమ్మెస్సీ స్థాయిలో స్పోర్ట్స్ న్యూట్రిషన్ చదవవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ ఎమ్మెస్సీ స్పోర్ట్స్ న్యూట్రిషన్, ఎమ్మెస్సీ స్పోర్ట్స్ ఫిజియాలజీ కోర్సులను అందిస్తుంది.
- బీఎస్ఎం (బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్)
- ఇది మూడేండ్ల కోర్సు
- ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ (ముంబై), ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్), ఎన్ఎస్హెచ్ఎం (దుర్గాపూర్)లలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
- ప్రత్యేకంగా స్పోర్ట్స్ మేనేజ్మెంట్పై ఆసక్తి ఉన్నవారికి, దానికి సంబంధించిన కోర్సులు అందించే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. స్పోర్ట్స్ మార్కెటింగ్, స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ మీడియా మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్కు సంబంధించిన వాటిపై మెలకువలు అందిస్తారు.
- ప్రతి క్రీడలో ఆటగాళ్లతో పాటు కొంతమంది స్టాఫ్‌తో జట్టు ఉంటుంది. ఉదాహరణకు క్రికెట్ టీమ్‌నే తీసుకుంటే ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ ఉంటుంది. అందులో కోచ్, అసిస్టెంట్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్కోచ్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఫిజియోథెరపిస్ట్, సైకాలజిస్ట్ ఉంటారు. అలాగే ప్రతి గేమ్‌లోనూ సపోర్ట్ స్టాఫ్ అవసరం ఉంటుంది. స్పోర్ట్స్మన్గానే కాకుండా కోచ్, మేనేజర్, ఫిజియోగా కూడా ఉపాధి పొందవచ్చు. అంతేకాకుండా స్పోర్ట్స్ ఫెడరేషన్, స్పోర్ట్స్ మార్కెటింగ్, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ జర్నలిస్ట్, ఫొటోగ్రఫీ, న్యూట్రిషనిస్ట్‌గా కూడా అవకాశాలు లభిస్తాయి.
గ్రాడ్యుయేట్ కోర్సులు
- బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ)
- బీపీఈ
- బీఎస్సీ ఇన్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ న్యూట్రిషన్
- బీఎస్సీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్
- బీఎస్సీ స్పోర్ట్స్ సైన్స్
- బీబీఏ ఇన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్
- బ్యాచిలర్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్
- బీఏ స్పోర్ట్స్ మేనేజ్మెంట్
మాస్టర్ డిగ్రీ
- మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ)
- ఎమ్మెస్సీ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్
- ఎమ్మెస్సీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్
- మాస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్
- ఎమ్మెస్సీ ఇన్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ న్యూట్రిషన్
- ఎంబీఏ స్పోర్ట్స్ బిజినెస్
- మాస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు
- పీజీ డిప్లొమా స్పోర్ట్స్ కోర్సెస్
- పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్
- పీజీ డిప్లొమా ఇన్ సైన్స్ న్యూట్రిషన్
- పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్
- పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ జర్నలిజం
- పీజీడీఎం ఇన్ స్పోర్ట్స్ బిజినెస్
- పీజీడీఎం ఇన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్
పీహెచ్డీ
- పీహెచ్డీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్
- ఎంఫిల్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్
- పీహెచ్డీ ఇన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్
- దేశంలోని టాప్ స్పోర్ట్స్ కాలేజీలు
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, పటియాల
- ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్, న్యూఢిల్లీ
- లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్వాలియర్
- లక్ష్మీబాయి నేషనల్ కాలేజీ ఫర్ ఫిజికల్ ఎడ్యుకేషన్, తిరువనంతపురం
- టాటా ఫుట్‌బాల్ అకాడమీ, జంషెడ్పూర్
- ఢిల్లీ యూనివర్సిటీ
డిగ్రీ కోర్సులు
- కోర్సు వ్యవధి నాలుగేండ్లు
- అర్హత- ఇంటర్
- స్పోర్ట్స్- ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్.
- కోర్సులో భాగంగా కోచింగ్ పద్ధతులతో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన టెక్నిక్స్, ఎక్సర్సైజ్ ఫిజియాలజీ, టీచింగ్ మెథడ్స్ లాంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. కోర్సు పూర్తిచేసినవారు స్పోర్ట్స్ కోచింగ్‌కు సంబంధించి అత్యుత్తమ పరిజ్ఞానం, నైపుణ్యం సంపాదిస్తారు.
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇంఫాల్
- దేశంలోని మొదటి స్పోర్ట్స్ యూనివర్సిటీ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇంఫాల్ 2021-22కు గాను పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాదికి గాను వివిధ యూజీ/పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు కోరుతుంది.
- అకడమిక్స్, రిసెర్చ్, అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్, ఇతర సేవలు అందిస్తుంది. అకడమిక్స్‌లో భాగంగా స్పోర్ట్స్ కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, డాక్టోరల్ కోర్సులను అందిస్తుంది. స్పోర్ట్స్ కోచింగ్, అథ్లెట్ల ప్రతిభను మెరుగుపరిచి వెలికితీసేందుకు స్పోర్ట్స్ వర్సిటీ దేశ, విదేశీ పరిశోధకులు, నిపుణలతో కలిసి పనిచేస్తుంది.
బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్
- నాలుగేండ్ల కాలపరిమితి గల ఈ కోర్సులో ఆర్చరీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, బాక్సింగ్, హాకీ, స్విమ్మింగ్, షూటింగ్, వెయిట్‌లిప్టింగ్ స్పెషలైజేషన్లు ఉన్నాయి.
- ఇంటర్/ తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి.
- ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్‌కు 50 శాతం, అభ్యర్థి క్రీడా ప్రతిభకు మరో 50 శాతం మార్కుల ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ (బీపీఈఎస్)
- కాలపరిమితి మూడేండ్లు.
- ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన ఉత్తీర్ణత.
- ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్‌లో 70 శాతం, స్పోర్ట్స్‌లో చూపిన ప్రతిభకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది. వీటి ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
ఎమ్మెస్సీ స్పోర్ట్స్ కోచింగ్ (రెండేండ్లు)
- బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్/ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, బీపీఈఎస్ విత్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్/బీపీఈడీ లేదా తత్సమాన కోర్సుల్లో 50 శాతం మార్కులు తప్పనిసరి.
- ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్‌కు 100 మార్కులు, క్రీడా ప్రతిభకు 30 మార్కులు, వైవాకు 20 మార్కులు. వీటి ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ (రెండేండ్లు)
- బీపీఈఎస్/బీపీఈడీ/బీఏ హానర్స్, బీఏ సైకాలజీ/ స్పోర్ట్స్ సైకాలజీలో 50 మార్కులు తప్పనిసరి.
- ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్‌కు 100 మార్కులు, వైవాకు 30 మార్కులు, క్రీడా ప్రతిభకు 20 మార్కులు వెయిటేజీ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
ముఖ్య సమాచారం
- ఎన్ఎస్యూ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ- ఆగస్టు 17
- ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్- సెప్టెంబర్ 10
- ఫిజికల్ ఫిట్నెస్, గేమ్ ప్రొఫిషియన్సీ టెస్ట్- సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు
- వెబ్సైట్: www.nsu.ac.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు