ప్రాక్టీస్ బిట్స్
గతవారం తరువాయి..
11. వికాసం క్రమానుగతమైనది అనే నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషాబోధనలో అనుసరించే క్రమం? (3)
1) W R S L 2) R S L W
3) L S R W 4) S L W R
12. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది, దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవటంవల్ల మంచి గాయకుడవటంతో దాగి ఉన్న వికాస నిమయం? (2)
1) వికాసం సంచితమైనది
2) వికాసం ఒక పరస్పర చర్య
3) వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి
4) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
13. కింది వాటిలో ఏ వికాస సూత్రం గెస్టాల్ట్ వాదాన్ని సమర్థిస్తుంది? (4)
1) వికాసం అవిచ్ఛిన్నం
2) వికాసం అసంచితం
3) వికాసం క్రమానుగతం
4) వికాసం సర్వశక్తుల సమ్మేళనం
14. ఒక ఉపాధ్యాయుడు తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా నియోజనాలను ఇవ్వడం అనేది వికాస నిమయాల్లో దేనిని సమర్థిస్తుంది? (2)
1) వికాసం క్రమానుగతం
2) వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
3) వికాసం రెండు నిర్దేశిక పోకడల్లో సంభవిస్తుంది
4) వికాసం అన్ని దశల్లో ఒకేవిధంగా ఉండదు
15. కింది వాటిలో వికాస సూత్రం? (2)
1) వికాసాన్ని ప్రాగుక్తీకరించలే
2) వికాసం అన్ని దశల్లో ఒకేవిధంగా ఉండదు
3) వికాసం నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా సాగుతుంది
4) వికాసం సంకుచితమైనది
16. పెరుగుదల-వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దేని గురించిన అవగాహన కల్పిస్తుంది? (4)
1) విద్యార్థుల స్మృతి
2) విద్యార్థుల సర్దుబాటు
3) విద్యార్థుల అభ్యసనం
4) విద్యార్థుల వైయక్తిక భేదాలు
17. వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ మొదట తెల్ల ఎలుకతో పాటు తెల్ల బొచ్చుతో ఉన్న బొమ్మలకు భయపడ్డాడు. క్రమేపీ తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు. ఇక్కడ గమనించే వికాస నియమం? (3)
1) వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
2) వికాసం క్రమానుగతమైనది
3) వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది
4) వికాసం సంకుచితమైనది
18. విషయ ప్రణాళిక (సిలబస్) రచనా పద్ధతుల్లోని సర్పిలాకార పద్ధతిని సమర్థించే వికాస నియమం? (1)
1) వికాసం క్రమానుగతమైనది
2) వికాసం అవిచ్ఛిన్నం
3) వికాసం ఏకీకృతం
4) వికాసం ఒక పరస్పర చర్య
19. రమ్య అనే అమ్మాయికి మానసిక లోపం ఉంది. ఇది ఆమె భాషా వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని సూచించే వికాస సూత్రం? (2)
1) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
2) వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి
3) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
4) వికాసం ఒక పరస్పర చర్య
20. బాల్యంలో పిల్లలు ఏడ్చినప్పుడు శరీరం మొత్తం కదల్చడం చేస్తారు. వయస్సు పెరిగిన తర్వాత అదే పిల్లలు కేవలం తనలోని నోరు, కండ్లు మాత్రమే ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం? (3)
1) వికాసం సంచితం
2) వికాసం అవిచ్ఛిన్నం
3) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం
4) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
21. తరగతిలో తెలివి తక్కువ, మందబుద్ధి, సగటు ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులుగల పిల్లలు ఉండటాన్ని సూచించే వికాస నియమం? (2)
1) వికాసం ఏకీకృతం
2) వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
3) వికాసం సంకుచితం
4) వికాసం ఒక పరస్పర చర్య
22. శిశువు సాంఘిక వికాసానికి దోహదపడే క్రీడలను సక్రమంగా ఏకాంతర, సమాంతర, సహకార క్రీడల్లో పాల్గొనడాన్ని సూచించే వికాస నియమం? (4)
1) వికాసం సంచితం
2) వికాసం అవిచ్ఛిన్నం
3) వికాసం ఒక పరస్పర చర్య
4) వికాసం క్రమానుగతం
23. కౌమారదశలో శారీరక, మానసిక వికాసాలు ఉధృతంగా జరుగుతాయి. ఈ వాక్యాన్ని సమర్థించే వికాస నియమం? (1)
1) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు
2) వికాసం సులభ అంశాల నుంచి జఠిల అంశాలకు సంభవిస్తుంది
3) వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
4) వికాసం రెండు నిర్దేశిక పోకడల్లో సంభస్తుంది
24. శిశువు ఏదైనా ఒక వస్తువును ఎత్తడంలో మొదట భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టు, చేతివేళ్లను ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం? (3)
1) వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
2) వికాసం అన్న దశల్లో ఒకేవిధంగా ఉండదు
3) వికాసం రెండే నిర్దేశిక పోకడల్లో సంభవిస్తుంది
4) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
25. చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు ముందుగా మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాతనే ఆధునిక భారతదేశ చరిత్ర బోధించినట్లయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం? (2)
1) వికాసం సంచితం
2) వికాసం క్రమానుగతం
3) వికాసం అవిచ్ఛిన్నం
4) వికాసం ఏకీకృతం
శివపల్లి
టీఎస్& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
9441022571
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు