కెరీర్ @ కలినరీ ఆర్ట్స్
కలినరీ ఆర్ట్స్.. పాకశాస్త్రం. నిత్యనూతనంగా ఉండే కెరీర్ కావాలనుకునే వారికి ఇదో
విభిన్నమైన రంగం. కాకా హోటల్ నుంచి కార్పొరేట్ స్థాయి హోటల్స్ వరకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
మానవాళి ఉన్నంత వరకు ఆహార రంగానికి తిరుగుండదు. తినే ఆహారాన్ని అందంగా, ఆకర్షణీయంగా అందించడంలో ప్రధాన పాత్ర పోషించేదే కలినరీ ఆర్ట్స్. ఆకలిగా ఉన్నప్పుడు కంటికి ఎదురుగా ఘుమఘుమలాడే ఆహారముంటే ఎవరికైనా నోరూరుతుంది. ఆహారాన్ని వివిధ రంగులతో, కొత్త రుచులతో అందించే ప్రయత్నంచేసేవారే కలినరీ ఆర్టిస్టులు. అంటే ఆహారాన్ని వండటం, డిజైన్ చేయడం, ఆకర్షణీయంగా అందించడం, పోషక విలువలు వంటివన్నీ కలినరీ ఆర్ట్స్‌లో భాగంగా ఉంటాయి. ప్రాంతీయ సంస్కృతికి ప్రాధాన్యమిస్తూనే ఆహారంలో ఆధునికతను, పోషక విలువలను అందిచాలి. ఈ రంగంలో నిపుణులకూ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లతోపాటు మరెన్నో అవకాశాలను అందించగల రంగమిది.
ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ (ఐసీఐ)
క్యాంపస్‌లు: తిరుపతి, నోయిడా
అందించే కోర్సులు: బీబీఏ, ఎంబీఏ
నోట్: ఈ కోర్సులను అమర్కంఠ్లోని ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీతో కలిసి ఐసీఐ అందిస్తుంది.
సీట్ల సంఖ్య: బీబీఏ-240, ఎంబీఏ-60
ఎవరు అర్హులు ?
కలినరీ ఆర్ట్స్‌లో చేరాలనుకునే వారికి వంట, దానికి సంబంధించిన అంశాలపై ఆసక్తి అత్యంత ప్రధానం. అదేవిధంగా విద్యార్హతలు.. కలినరీ ఆర్ట్స్ డిగ్రీ కోర్సులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా 10+2 ఉత్తీర్ణత. ఏ గ్రూపు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
బీబీఏ ఇన్ కలినరీ ఆర్ట్స్
ఈ కోర్సు వ్యవధి మూడేండ్లు. ఆరు సెమిస్టర్లు
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయనున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 2021, జూలై 15 నాటికి జనరల్/ఓబీసీలకు 22 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు 27 ఏండ్లు మించరాదు.
ఎంబీఏ
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ). ఈ కోర్సు కాలవ్యవధి రెండేండ్లు. నాలుగు సెమిస్టర్లు.
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో కలినరీ ఆర్ట్స్ లేదా హాస్పిటాలిటీ లేదా హోటల్ మేనేజ్మెంట్ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు: 2021, జూలై 15 నాటికి 25 ఏండ్లు మించరాదు. రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ప్రవేశ విధానం
బీబీఏ: ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షలో ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, అనలిటికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, సర్వీస్ సెక్టార్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
ఎంట్రన్స్ టెస్ట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ఎంబీఏ
ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు.
ఫుడ్ మేనేజ్మెంట్/ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్, మేనేజ్మెంట్, అనలిటికల్ ఆప్టిట్యూడ్, ఐక్యూ, హ్యూమన్ రిసోర్స్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
ఎంట్రన్స్ టెస్ట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ఉద్యోగ అవకాశాలు
కలినరీ ఆర్ట్స్‌లో డిగ్రీ, పీజీ చేసిన వారికి కింది ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అవి.. ఆతిథ్య రంగంలోని హోటల్స్‌లో చెఫ్, కిచెన్ మేనేజ్మెంట్, ఫ్లయిట్ కిచెన్ సర్వీసెస్, నేవీలో హాస్పిటాలిటీ సర్వీసెస్, ఇంటర్నేషనల్ ఫాస్ట్ ఫుడ్ చైన్స్‌లో మేనేజ్మెంట్ ట్రెయినీ/ ఎగ్జిక్యూటివ్, హాస్పిటల్, ఇన్స్టిట్యూషనల్ క్యాటరింగ్. ఐసీఐ, ఫుడ్ క్రాఫ్ట్స్ ఇన్స్టిట్యూట్లలో ఫ్యాకల్టీ అవకాశాలు, షిప్పింగ్, క్రూయిజ్లలో కిచెన్ మేనేజ్మెంట్, రైల్వే హాస్పిటాలిటీ, క్యాటరింగ్ సర్వీసెస్, టూరిజం శాఖ పరిధిలోని హాటల్స్‌లో, స్వయం ఉపాధి వంటి అనేక అవకాశాలు లభిస్తాయి.
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: జూలై 15
వెబ్సైట్: http://thims.gov.in చూడవచ్చు.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు