వాట్ నెక్ట్స్ ఆఫ్టర్ ఇంజినీరింగ్!
12వ తరగతి పూర్తి చేసుకొని అండర్ గ్రాడ్యుయేషన్ కోసం విద్యార్థులు ఒక కళాశాలలో చేరగానే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు ఒక దారిలో పడుతుందని ఉపశమనం పొందుతారు. పిల్లలు కూడా అంతే గంటల తరబడి చదివి, పరీక్ష రాసి, మార్కుల కోసం ప్రతి క్షణం చేసిన పోరాటం నుంచి స్వేచ్ఛ దొరికిందనుకుంటారు. ఇలా అనుకున్న వారు ఎందరో ఉన్నారు. కానీ ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఒకటి ఉంది.ఇంజినీరింగ్ తర్వాత అవకాశాలు
l ఇంజినీరింగ్ తర్వాత విద్యార్థులు రెండు ప్రధాన మార్గాల్లో వెళ్లవచ్చు. అందులో ఒకటి ఉన్నత విద్య, రెండు ఉద్యోగం.
ఉన్నత విద్యావకాశాలు
ఉన్నత విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ప్రధానంగా రెండు దిశల్లో ఆలోచించవచ్చు. ఒకటి సాంకేతిక విద్య వైపు, రెండు మేనేజ్మెంట్ విద్య వైపు. ఈ రెండు మార్గాల్లో ఎటువైపు వెళ్లాలన్నది వారు ఎటువంటి కెరీర్ కావాలన్నదానిపై ఆధారపడి ఉంటుంది.
సాంకేతిక విద్య ఎవరు ఎన్నుకోవచ్చు
ఇంజినీరింగ్‌లో ఎన్నో నేర్చుకుంటారు. చదివిన చదువుల్లో సబ్జెక్టు పై మీకు బాగా మక్కువ ఉంది. అందులో ఇంకా లోతుగా చదవాలనుకునే వారు సాంకేతిక విద్యావకాశాల కోసం ప్రయత్నించవచ్చు.
ఈ విద్య కోసం దేశంలో ప్రయత్నించవచ్చు లేదా విదేశాల్లోనూ చదవచ్చు.
ఎంటెక్.. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ పట్టా మన కళాశాలలు ఇస్తాయి. ఎంటెక్‌లో అవకాశం కోసం దేశవ్యాప్తంగా రాసే పరీక్షల్లో గేట్ ప్రధానమైంది. ఇందులో ఇంజినీరింగ్‌లో చదివిన సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు, ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్‌తో పాటు జనరల్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు కూడా ఉంటాయి.
విదేశాల్లో సాంకేతిక విద్య అభ్యసించాలనుకునేవారు దానికి కావాల్సిన ప్రామాణిక పరీక్షలు రాయాలి. ప్రతి దేశానికి సొంత ప్రవేశ విధానం ఉంటుంది. ఈ పరీక్షలు వెర్బల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాంగ్వేజ్ స్కిల్స్ మీద ఉంటాయి. వినడం, మాట్లాడటం, రాయడం, చదవడం ఆధారంగా రూపొందించిన పరీక్షల ద్వారా మీ ఆంగ్ల భాషా నైపుణ్యాలు పరీక్షిస్తారు. కొన్ని దేశాల్లో విద్యార్థులు ప్రాంతీయ భాషలను కూడా నేర్చుకోవాలి.
ప్రత్యేక పరిశోధనలు చేయాలని ఆసక్తి కలవారు లేదా విద్యాబోధన పట్ల ఆసక్తి కలవారు పీహెచ్డీ చేయవచ్చు.
మేనేజ్మెంట్ ఎవరు ఎన్నుకోవచ్చు
ఒక సంస్థ సరిగా పనిచేయడానికి ఉద్యోగులు, అన్ని విభాగాల మధ్య సమన్వయం చేసుకోవడానికి నిర్వాహకులు అవసరం. అటువంటి ఉద్యోగావకాశాల పట్ల ఆసక్తి ఉన్నవారు ఎంబీఏ విద్య అభ్యసించవచ్చు. ఐఐఎంలు నిర్వహించే మేనేజ్మెంట్ ప్రోగ్రాంలకు ఎంతో పేరు ఉంది. వీటిలో ప్రవేశానికి క్యాట్ స్కోర్లు పరిగణనలోకి తీసుకుంటారు. అనేక ఇతర కళాశాలలు కూడా క్యాట్ స్కోర్‌ను ప్రవేశ అర్హత కోసం పరిగణిస్తాయి. ఇది కాకుండా ఎంబీఏ ప్రవేశానికి ఇంకా చాలా పరీక్షలు ఉన్నాయి.
విదేశాల్లో ఎంబీఏ కోసం జీమ్యాట్ స్కోర్లు అవసరం. కొన్ని కళాశాలలు జీఆర్ఈ స్కోర్లను కూడా తీసుకుంటాయి. మీరు కొద్దిగా ఉద్యోగానుభవం పొందిన తరువాత ఎంబీఏని అభ్యసించడం ఎక్కువ లాభసాటి.
ఉద్యోగ అవకాశాలు
ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు చదివే కోర్సులకు అనుగుణంగా అవకాశాలను వెతుక్కోవచ్చు. అలాగే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇతర డిపార్ట్మెంట్లో చదివిన వారికి కూడా ఫ్రెషర్స్‌గా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. గేట్ పరీక్ష రాయడం ద్వారా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడానికి అర్హత లభిస్తుంది.
ఇతర అవకాశాలు స్వయం ఉపాధి, బోధనా రంగం, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం గ్రూప్స్ లేదా సివిల్ సర్వీసెస్‌కు ప్రయత్నించవచ్చు.
అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కానీ అది సాధించడానికి చివరి నిమిషంలో ప్రయత్నిస్తే సరిపోదు. మీ 4 సంవత్సరాల ఇంజినీరింగ్ విద్యాకాలంలో ఏమి సాధించాలి, ఏమి చేయాలి అనే దానికి ఒక ప్రణాళిక వేసుకోవాలి. దానికోసం ఈ 4ఏ పద్ధతిని పాటించండి. అదేంటంటే అడాప్ట్, ఎయిమ్, యాక్ట్, అచీవ్.
ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం- అడాప్ట్
అడాప్ట్ అంటే కాలేజీని అలవాటు చేసుకునే ప్రయత్నం చెయ్యండి. చుట్టూ ఏమి జరుగుతుందని గమనిస్తూ ఉండండి. కొత్త ప్రదేశం, కొత్త వాతావరణం, కొత్త స్నేహాలు. మొదట కాలేజీ గురించి, కోర్సుల గురించి అర్థం చేసుకోవాలి. మీకు ఉన్న సౌకర్యాలు ఏమిటనేది తెలుసుకోండి. క్యాంపస్, అందులోని మనుషులతో పరిచయం పెంచుకోండి.
హోమ్‌వర్క్‌లు చూసే టీచర్లు ఉండరు. కాబట్టి మీ చదువు మీ బాధ్యత అన్నది ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది.
పదో తరగతి వరకు డిస్క్రిప్టివ్ పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. పన్నెండో తరగతిలో ఆబ్జెక్టివ్ పరీక్ష కోసం ఎంతో ప్రయత్నిస్తారు. అలాగే కాలేజీకి వచ్చిన తర్వాత చదివే విధానం మారుతుంది. పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర రిఫరెన్స్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. లైబ్రరీలో చదవడం, డిజిటల్ లైబ్రరీని ఉపయోగించడం నేర్చుకోవాలి. కొన్ని కళాశాలల్లో మొదటి సంవత్సరం మార్కులను బట్టి బ్రాంచ్ మార్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే స్కాలర్షిప్లు కూడా లభిస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి.
రెండో సంవత్సరం- ఎయిమ్
తర్వాత ఏమి చేయాలన్నది ఆలోచించడం మొదలుపెట్టండి. క్యాంపస్ అలవాటై పోతుంది. ప్రొఫెసర్లు, సీనియర్స్‌ని కలిసి ఉంటారు. కాలేజీ గురించి ఒక అవగాహన వచ్చి ఉంటుంది.
ఆసక్తి ఉన్న కాలేజీ క్లబ్ యాక్టివిటీస్‌లో పాల్గొనండి. ఏ కెరీర్‌కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టండి.
మీ లక్ష్యం ఏమిటని నిర్ణయించుకోవాలి. దానికోసం ముందు చెప్పిన అవకాశ మార్గాలలో ప్రతి ఒక మార్గం గురించి కాలేజీకి సంబంధించిన ఒక వ్యక్తినైనా కలవండి.
మూడో సంవత్సరం- యాక్ట్
ఒక లక్ష్యం నిర్దేశించుకొని ఉంటారు. ఇది ఆచరణకు సమయం. లక్ష్యాన్ని సాధించడానికి చేయాల్సిన ముఖ్యమైనవి ఏమిటని తెలుసుకొని మొదలు పెట్టండి. ఉదాహరణకు మీరు రాయాల్సిన పరీక్షలకు సంబంధించిన కోచింగ్ తీసుకోవడం, కావల్సిన స్కిల్స్‌ని పెంచుకోవడం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం చదవాల్సిన పుస్తకాలు కొనడం.
కొన్ని పరీక్షల వ్యాలిడిటీ 2 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. విదేశీ ప్రయత్నాలకు రాయాల్సిన పరీక్షలు మూడో సంవత్సరం చివరివరకు పూర్తిచేసే ప్రయత్నం చేయండి.
కాలేజీ క్లబ్‌లలో లీడర్షిప్ అవకాశాల కోసం ప్రయత్నించండి.
సీనియర్ల ప్లేస్‌మెంట్స్ ఎలా జరుగుతున్నాయి. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని తెలుసుకోండి. అలాగే ఇంటర్న్‌షిప్ అవకాశాల కోసం ప్రయత్నించండి. ఇంటర్న్‌షిప్‌లో బాగా పనిచేస్తే ఆ కంపెనీ నుంచి మీకు ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది.
నాలుగో సంవత్సరం- అచీవ్
మీరు అనుకున్నది సాధించాల్సిన సమయం.
అమెరికా వెళ్లాలనుకునే వారు అప్లికేషన్ ప్రాసెస్ మొదలు పెట్టాలి. ఎంబీఏ చేయాలనుకునే వారు క్యాట్ పరీక్షలకు సన్నద్ధం కావాలి. ఎంటెక్ కోసం గేట్ రాయాలి.
మాక్‌టెస్టులు రాయండి.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం మీ డాక్యుమెంట్స్ సర్టిఫికెట్స్ అన్ని సరిగ్గా చూసుకోవాలి. మాక్ ఇంటర్వ్యూలు ప్రాక్టీస్ చేయండి.
ప్రాజెక్ట్ వర్క్‌ని పక్కన పెట్టకుండా అది మీ మొదటి వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ప్రయత్నించండి.
ఎప్పటికప్పుడు మీ అవకాశాలను బేరీజు వేసుకుంటూ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేసరికి తర్వాత ఏంటి అన్న ఒక స్పష్టతతో సంతోషంగా కాలేజీ లాస్ట్ వీక్‌ని ఆనందంగా
గడపండి.
వాట్ నెక్ట్స్ అని ఎవరైనా అడిగితే ఆందోళన పడే పరిస్థితికి రాకుండా, వారిని దూరం పెట్టాలని ప్రయత్నించకుండా, ఆ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకుంటూ వృత్తిపరమైన
అభివృద్ధి పొందండి.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు