ప్యాకేజింగ్ కోర్సు.. పక్కా కొలువు!
ప్రపంచంలో అనేక రకాల కెరీర్లు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ఎవర్గ్రీన్ మరికొన్ని సీజనల్‌గా ఉంటాయి. ఎప్పటికీ డిమాండ్ ఉండేవాటిపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. మంచి జీతాలు, భిన్నమైన కెరీర్ ఇంతే కాకుండా నిత్యనూతన ఆలోచనలకు పదును పెట్టే కెరీర్ అయితే మరింత బాగుంటుంది. ఇలాంటి వాటిలో ప్యాకేజింగ్ కెరీర్ ఒకటి. చిన్న వస్తువు నుంచి అత్యంత ఖరీదైన బంగారం వరకు ప్యాకేజింగ్ చేసే కవర్ కూడా చాలా ముఖ్యం. కవర్ అంటే ప్యాకింగ్ డిజైన్, ప్రొటెక్షన్ బాగాలేకుంటే అది మార్కెట్లో నిలబడలేదు. వ్యాపార రంగం ఉన్నంత వరకు ప్యాకేజింగ్ రంగానికి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని ప్యాకేజింగ్ ఇన్స్టిట్యూట్స్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆ సంస్థ అందించే కోర్సులు, కెరీర్ తదితరాల గురించి సంక్షిప్తంగా….
ఐఐపీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ). కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది. దీన్ని 1966లో ప్రారంభించారు.
ఈ సంస్థ ప్యాకేజింగ్ సైన్స్‌లో సంబంధిత పరిశోధనలను చేస్తుంది. ఈ రంగానికి కావాల్సిన నిపుణులను అందించడానికి పలు రకాల కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్‌లో ఈ సంస్థ క్యాంపస్‌లు ఉన్నాయి.
అందించే కోర్సులు
ఎమ్మెస్సీ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ & పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్
గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (దూరవిద్య విధానంలో) సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ప్యాకేజింగ్వీటితోపాటు షార్ట్‌టర్మ్ కోర్సులు, ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అందిస్తుంది.
ఎవరు అర్హులు ?
పీజీ డిప్లొమా కోర్సుకు మ్యాథ్స్/ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ / మైక్రోబయాలజీల్లో కనీసం ఏదో ఒక సబ్జెక్టుగా డిగ్రీ (12+3 విధానంలో) ఉత్తీర్ణత లేదా ఫుడ్‌సైన్స్/అగ్రికల్చర్ లేదా పాలిమర్ సైన్స్ లేదా బీఈ/బీటెక్ కోర్సులు చదివినవారు అర్హులు. వయస్సు 30 ఏండ్లు మించరాదు. గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులకు బీఈ/బీటెక్ లేదా కామర్స్/ఆర్ట్స్ డిగ్రీతోపాటు ఏడాది అనుభవం ఉండాలి. సర్టిఫికెట్ కోర్సుకు ఏదైనా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత.
కెరీర్ ఆప్షన్స్
ప్యాకేజింగ్ కోర్సులు పూర్తిచేసినవారికి ప్యాకేజింగ్ సైంటిస్ట్, ప్యాకేజింగ్ ఇంజినీర్, ప్యాకేజింగ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్, క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ ఇన్ ప్యాకేజింగ్, ఆపరేటర్ తదితర ఉద్యోగాలు లభిస్తాయి.ఫార్యాస్యూటికల్, ఫుడ్ అండ్ బేవరేజెస్ కంపెనీలు, పేపర్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ యూనిట్స్, అగ్రికల్చరల్, రిటైల్ ఇలా అనేక పరిశ్రమల్లో ప్యాకేజింగ్ సంబంధించిన కొలువులకు అవకాశం ఉంది.
ప్లేస్‌మెంట్స్
lమాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో ప్యాకేజింగ్ ప్రత్యేక విభాగంగా గుర్తింపు పొందడంతో ఈ కోర్సులు చేసిన వారికి వందశాతం ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి.
అబాట్ ల్యాబొరేటరీస్, అతుల్ లిమిటెడ్, కొవిన్‌కేర్, ఐపీసీఏ, పిరమల్ హెల్త్ కేర్, హాకిన్స్, హిమాలయ డగ్స్,్ర హల్దిరామ్ ఫుడ్స్, ఐటీసీ, ఎల్ అండ్ టీ, లుపిన్ లిమిటెడ్, డాబర్, కోకాకోలా, ఫ్లిప్‌కార్ట్, గోద్రెజ్, మారికో, టాటా గ్లోబల్, టీవీఎస్ మోటార్స్ తదితర ప్రముఖ కంపెనీలు ఐఐపీలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు వస్తాయి.
ఎమ్మెస్సీ (ప్యాకేజింగ్ టెక్నాలజీ) & పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్
ఎమ్మెస్సీ కోర్సు హైదరాబాద్, ఢిల్లీ క్యాంపస్‌లు మాత్రమే అందిస్తున్నాయి. ఇది ఫుల్‌టైం ప్రోగ్రామ్.
ముంబై క్యాంపస్‌లో బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి సౌకర్యం ఉంది.
lపీజీ డిప్లొమా కోర్సులో మొత్తం 500 సీట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో -40 సీట్లు, ముంబై-280, ఢిల్లీ-100, కోల్‌కతా-80 సీట్లు ఉన్నాయి.
ఈ రెండు కోర్సులకు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
ఎంట్రన్స్ టెస్ట్ తేదీ: జూన్ 18
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 11
వెబ్సైట్: https://iip-in.com
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు