ప్రపంచ నదుల దినోత్సవం ఎప్పుడు?
ముఖ్యమైన జలపాతాలు
-సప్త గుండాల (మిట్టి జలపాతం)- సిర్పూరు (ఆసిఫాబాద్)
-బొదర జలపాతం- కెరమొరి మండలం (ఆసిఫాబాద్)
-కుండాయి జలపాతం- నార్నూరు (ఆదిలాబాద్)
-కనకాయి జలపాతం- ఆదిలాబాద్
-చింతామణి జలపాతం- జయశంకర్ భూపాలపల్లి
-గద్దలసరి జలపాతం- జయశంకర్ భూపాలపల్లి
-బొగత జలపాతం- జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం. దీన్ని తెలంగాణ నయాగరా జలపాతం అని పిలుస్తారు.
-గౌరి జలపాతం- పెద్దపల్లి జిల్లా
-సబితం జలపాతం- పద్దపల్లి జిల్లా
-భీముని పాదం జలపాతం- మహబూబాబాద్ జిల్లా
-ఏడు బావుల జలపాతం- మహబూబాబాద్ జిల్లా
-మల్లెల తీర్థం జలపాతం- నాగర్‌కర్నూలు జిల్లా
రాష్ట్రంలోని నదులు – విశేషాలు
-నదులను గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని పాటమాలజీ అంటారు.
-సరస్సులను గురించి అధ్యయనం చేసేది- లిమ్నాలజీ
-నీటిని గురించి అధ్యయనం చేసేశాస్ర్తాన్ని హైడ్రాలజీ
-ప్రపంచ నదుల దినోత్సవం- సెప్టెంబర్ చివరి ఆదివారం
-ప్రపంచ నీటి దినోత్సవం- మార్చి 22
-ప్రపంచ నీటి దినోత్సవ 2015 నినాదం- నీరు స్థిరమైన అభివృద్ధి
-భారతదేశ నదీవారం- నవంబర్ 24-27 (ఇది మొదటిసారి ఢిల్లీలో 2014లో జరిగింది)
-తెలంగాణ భూభాగం వాయవ్యాన ఎత్తుగా ఉండి ఆగ్నేయదిశగా వాలి ఉంటుంది. అందువల్ల రాష్ట్రంలోని నదులు వాయవ్యం నుంచి ఆగ్నేయ దిశలో ప్రవహిస్తాయి.
-రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన నదులు- గోదావరి, కృష్ణ, మంజీర, మూసి, తుంగభద్ర, శబరి, డిండి, కిన్నెరసాని, పెద్దవాగు, భీమా మొదలైనవి.
గోదావరి
-దీని మొత్తం పొడవు 1465 కి.మీ.
-ప్రవహించే రాష్ర్టాలు- మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
-పరీవాహక రాష్ర్టాలు- మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, కర్ణాటక
-రాష్ట్రంలో ప్రవహించే దూరం- 600 కి.మీ.
-జన్మస్థలం- పశ్చిమకనుమలు లేదా సహ్యాద్రి పర్వతాల్లో మహారాష్ట్రలోని బ్రహ్మగిరి పర్వతం వద్ద ఉన్న నాసిక్ త్రయంబకేశ్వర్‌లోని బిలసరస్సు.
-సముద్ర మట్టం నుంచి జన్మస్థలం ఎత్తు- 1067 మీ. (అరేబియా సముద్రం నుంచి 80 కి.మీ. దూరం)
ప్రాముఖ్యత
-గోదావరి నది దేశ భూభాగంలో 10 శాతం ఆక్రమించి ఉంది.
-ఇది దేశంలో రెండో పొడవైన నది, దక్షిణ భారతదేశంలో మొదటిది.
-దీనికి వృద్ధగంగ, దక్షిణగంగ, ఇండియన్ రైన్ అనే పేర్లు ఉన్నాయి.
-గోదావరి నది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకుర్తి వద్ద మంజీర, హరిద్రా నదులు కలిసి త్రివేణి సంగమాన్ని ఏర్పర్చాయి.
-జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, మానేరు అనే మూడు నదులు కలిసి త్రివేణి సంగమాన్ని ఏర్పర్చాయి.
పుష్కరాలు
-గోదావరి నదికి 12 ఏండ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి.
-రాష్ట్రంలో 2015, జూలై 14-25 వరకు పుష్కరాలు జరిగాయి.
-పుష్కరాల కోసం 5 జిల్లాల్లో (నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం) 106 పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు.
గోదావరి ప్రవాహం
-పశ్చిమకనుమల్లో మహారాష్ట్రలోని బ్రహ్మగిరి పర్వతం వద్ద గల నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద జన్మించి మహారాష్ట్ర గుండా ప్రవహిస్తూ నిజామబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. నిర్మల్ జిల్లా బాసర గుండా ప్రవహిస్తూ నిర్మల్, నిజామాబాద్ సరిహద్దుల గుండా ప్రవహిస్తూ నిజామాబాద్ జిల్లాలోని మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (పోచంపాడు)ను దాటి జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం (ఏడు) జిల్లాల గుండా ప్రవహిస్తూ కొత్తగూడెం జిల్లాలో పాపికొండలను చీల్చుతూ బైసన్ గార్జ్‌ను ఏర్పర్చి పోలవరం (తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో) వద్ద విశాలమైన మైదానంలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దు గుండా ప్రవహిస్తూ రాజమండ్రికి దిగువన ధవళేశ్వరం వద్ద ఐదు ప్రధాన పాయలు (7 పాయలు)గా చీలి ఒక్కొక్క పాయ ఒక్కో ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
అవి..
-గౌతమి- ఉత్తరశాఖ- యానాం వద్ద
-వశిష్ట- మధ్యశాఖ- అంతర్వేది వద్ద
-వైనతేయ- దక్షిణ శాఖ- కొమరగిరి పట్నం వద్ద
-తుల్య- బెండమూరు లంకవద్ద
-భరద్వాజ- బెండమూరులంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
-తుల్య, భరద్వాజ పాయల మధ్యలోకి కౌశికి, ఆశ్రేయ అనే పాయలు చేరి ఒకే పాయగా ప్రవహిస్తూ బెండమూరు లంకవద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
-గోదావరి నది రాష్ట్రంలో మొత్తం 7 జిల్లాల గుండా ప్రవహిస్తుంది.
-నదికి కుడివైపున నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి.
-నదికి ఎడమవైపున నిర్మల్, మంచిర్యాలు జిల్లాలు ఉన్నాయి.
-గోదావరి ఉపనదులు- ప్రవర (మహారాష్ట్ర), పూర్ణ (మహారాష్ట్ర), మంజీర (నిజామబాద్), మానేరు (జయశంకర్ భూపాలపల్లి), కిన్నెరసాని (భద్రాద్రి కొత్తగూడెం), ప్రాణహిత (పెన్‌గంగ, వార్ధా, వైన్‌గంగ అనే మూడు నదుల కలయిక)- జయశంకర్ భూపాలపల్లి, ఇంద్రావతి (జయశంకర్ భూపాలపల్లి), శబరి (భద్రాద్రి కొత్తగూడెం), తాలిపేరు (భద్రాద్రి కొత్తగూడెం), సీలేరు (ఆంధ్రప్రదేశ్)
గోదావరి ఉపనదులు జన్మస్థానాలు మంజీర
-మొత్తం 724 కి.మీ. ప్రవహిస్తుంది.
-పశ్చిమకనుమల్లోని మహారాష్ట్రలో ఉన్న బాలాఘాట్ పర్వతాల్లోని జామ్ఖేడ్ కొండ (భీడ్ జిల్లాలోని పటోడా తాలూకా)ల్లో జన్మిస్తుంది.
-ఈ నది జామ్ఖేడ్ కొండ వద్ద జన్మించి మహారాష్ట్ర, కర్ణాటక గుండా ప్రవహిస్తూ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎగువన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. సంగారెడ్డి జిల్లాలో ప్రవహిస్తూ కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టును దాటి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల గుండా ప్రవహిస్తూ నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద గోదావరి నదిలో కలుస్తుంది.
-ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ (సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్)ల్లో ప్రవహిస్తుంది.
ప్రాముఖ్యత
-ఇది గోదావరి ఉపనదుల్లోకెల్లా పొడవైనది, ముఖ్యమైనది.
-ఇది గోదావరికి కుడివైపు నుంచి కలుస్తున్నది.
-రాష్ట్రంలో గోదావరిలో కలిసే మొదటి ఉపనది.
-ఉపనదులు- కాకివాగు, నల్లవాగు, కౌలాస్ నాలా, ఆలేరు నది.
ప్రాజెక్టులు నిజాంసాగర్ ప్రాజెక్టు
-ఇది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట బండపల్లి గ్రామాల మధ్య నిర్మించారు.
-1923లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నేతృత్వంలో నిర్మించారు. 1931లో దీని నిర్మాణం పూర్తయ్యింది.
-మంజీర నదిపై సుమారు 3 కి.మీ. పొడవు, 14 అడుగుల వెడల్పుతో ఆనకట్ట నిర్మించారు.
-దీని నీటినిల్వ సామర్థ్యం- 58 టీఎంసీలు
-2.75 లక్షల ఎకరాలకు నీరందించడం దీని ప్రధాన లక్ష్యం. కానీ ప్రస్తుతం 2.31 లక్షల ఎకరాలకు మాత్రమే అందుతున్నది.
-విద్యుత్ ఉత్పాదన- 10 మెగావాట్లు
-హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించడం ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రధాన ఉద్దేశం. అయితే ప్రస్తుతం ఇక్కడి నుంచి నీరు రావడం లేదు.
-ఈ ప్రాజెక్టులో భాగంగా కుడి కాలువ అయిన మహబూబ్ నహర్ కాలువ, ఎడమ కాలువైన ఫతేనహర్ కాలువ ప్రధానమైనవి.
-సింగూరు ప్రాజెక్టు (మొగిలిగుండ్ల బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు)
-ఈ ప్రాజెక్టును సింగూరు గ్రామం వద్ద 1998లో మంజీరనదిపై నిర్మించారు. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు.
-దీని నీటినిల్వ సామర్థ్యం 30 టీఎంసీలు.
-విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం- 15 మెగావాట్లు
-ప్రాజెక్టు ఆయకట్టు- 40 వేల ఎకరాలు
-ఇది ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీటిని అందిస్తున్నది.
కౌలాస్ నాలా ప్రాజెక్టు
-ఇది కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సావర్గావ్ వద్ద మంజీర ఉపనది అయిన కౌలాస్‌నాలా వాగుపై ఉంది.
-దీని ఆయకట్టు సామర్థ్యం- 9000 ఎకరాలు
మానేరు నది
-సిరిసిల్ల కొండల్లో జన్మించే ఈ నది మొత్తం 128 కి.మీ. పొడవున ప్రవహిస్తుంది.
-రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది.
-మానేరునది తీరానగల ముఖ్యపట్టణం కరీంగనర్
-ఈ నది గోదావరికి కుడివైపు నుంచి కలుస్తుంది.
-జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ వద్ద గోదావరి నదిలో కలుస్తుంది.
-మానేరునదిపై నర్మాల గ్రామం (సిరిసిల్ల) వద్ద ఎగువ మానేరు డ్యాం (నిజాం కాలంలో)ను నిర్మించారు.
-మాన్వాడ వద్ద మిడ్ మానేరు డ్యాం, కరీంనగర్లో లోయర్ మానేరు డ్యాం ఉన్నాయి.
కిన్నెరసాని
-జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్నవరం చెరువు సమీపంలో జన్మిస్తుంది.
-ఇది జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గుండా ప్రవహిస్తూ భద్రాచలం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది.
-కిన్నెరసాని గోదావరి నదికి కుడివైపున కలుస్తుంది.
-కిన్నెరసాని రిజర్వాయర్ కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటిని అందిస్తున్నది.
కడెం నది
-ఈ నది ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలం బోతాయిపల్లి గ్రామం వద్ద జన్మిస్తుంది.
-ఆదిలాబాద్, నిర్మల్ జల్లాల గుండా ప్రవహిస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పసుపుల గ్రామం వద్ద గోదావరిలో ఎడమవైపు నుంచి కలుస్తుంది.
కడెంపై జలపాతాలు
-ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంతాల వద్ద ఏర్పడింది.
-147 అడుగుల ఎత్తు, 45 మీ. వెడల్పు ఉంటుంది.
-ఇది రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతం.
-పొచ్చెర జలపాతం: బోథ్ అటవీ ప్రాంతంలో ఏర్పడింది.
-ఇది 20 మీ. ఎత్తు ఉంటుంది.
-గాయత్రి జలపాతం: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం తార్నమ్ కుర్దు వద్ద ఏర్పడింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు