ఇస్రో శాస్త్రవేత్తలు ‘ఫ్యాట్ బాయ్’ అని ముద్దుగా పిలిచే ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక?
- అంతరిక్ష రంగం
1. భారత అంతరిక్ష రంగ పితామహుడు?
1) హోమి జహంగీర్ భాభా
2) విక్రమ్ సారాభాయ్
3) ఎస్ కే మిత్ర
4) బ్రహ్మ ప్రకాష్
2. ఏ సంస్థ ఆవిర్భావంతో భారతదేశంలో అంతరిక్ష కార్యకలాపాలు ప్రారంభించారు?
1) ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్
2) తుంబ ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్
3) ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్
4) విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం
3. ప్రకృతి విపత్తుల సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షించడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్ ప్రోగ్రాంలో భాగంగా డెసిషన్ సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది?
1) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
2) నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెంటర్
3) నేషనల్ అట్మాస్పియరిక్ రిసెర్చ్ ల్యాబొరేటరీ
4) నేషనల్ ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ
4. సూర్యుని పరిశీలన కోసం ఉద్దేశించిన ఆదిత్య-ఎల్ 1 వంటి స్పేస్ ప్రోబ్లను ప్రవేశపెట్టే కక్ష్య?
1) భూ నిమ్న కక్ష్య 2) భూమధ్య కక్ష్య
3) భూస్థావర కక్ష్య
4) లెగ్రాంజియన్ పాయింట్
5. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ. దీన్ని సెప్టెంబర్ 14, 2007 ఆ నాటి ఇస్రో చైర్మన్ జీ. మాధవన్ నాయర్
ప్రారంభించారు
బి. భారత అంతరిక్ష కార్యక్రమాలను
బలోపేతం చేయడానికి, ఈ రంగంలో మానవ వనరులకు తగిన శిక్షణ అందించడానికి దీన్ని ప్రారంభించారు
సి. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది
డి. ఆసియాలో అంతరిక్ష కార్యక్రమాల కోసం ఉద్దేశించిన ఏకైక డీమ్డ్ విశ్వవిద్యాలయంగా ఇది గుర్తింపు పొందింది
1) ఎ, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
6. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. భారత అంతరిక్ష రంగ కార్యక్రమాలకు ఇది నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది
బి. శ్రీహరికోట ప్రధాన కేంద్రంగా దీన్ని ఆగస్టు 15, 1969లో ఏర్పాటు చేశారు
సి. అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలో ఇది తన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది
డి. నిస్సార్, ఉన్నతి, సరళ్ LUPEX, THRISHNA వంటి కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో సైతం తన వంతు కృషిని ఇస్రో నిర్వర్తిస్తుంది
1) ఎ, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
7. జీశాట్-9 ఉపగ్రహానికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. దీన్ని స్వదేశీయంగా రూపొందించిన జీఎస్ఎల్వీ-ఎఫ్09 ద్వారా ప్రయోగించారు
బి. 2230 కిలోల బరువుగల ఈ ఉపగ్రహాన్ని మే 5, 2017న శ్రీహరికోట నుంచి దాని కక్ష్యలోకి చేర్చారు
సి. భారతదేశానికి ఇరుగు పొరుగున ఉన్న ఆరు దేశాలకు కమ్యూనికేషన్, ప్రకృతి విపత్తుల సమయాల్లో అవసరమైన సేవలను అందిస్తుంది
డి. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, శ్రీలంక, పాకిస్థాన్ దేశాలు ఈ ఉపగ్రహం ద్వారా సేవలను పొందనున్నాయి
1) బి, సి, డి 2) సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
8. ఉపగ్రహాల నుంచి పొందాల్సిన సేవల దృష్ట్యా వాటిని ప్రయోగించాల్సిన కక్ష్యలతో జతపరచండి.
ఎ. సమాచార ఉపగ్రహాలు 1. మధ్యస్థ భూ కక్ష్యలు
బి. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు 2. భూస్థావర కక్ష్యలు
సి. వాతావరణ పరిశీలన ఉపగ్రహాలు 3. ధ్రువ కక్ష్యలు
డి. జీపీఎస్ తరహా ఉపగ్రహాలు 4. భూనిమ్న కక్ష్య
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-2, బి-3, సి-4, డి-1
9. (ఎ) : ఉపగ్రహ ప్రయోగ వాహకనౌకల్లో ఉపగ్రహాల చుట్టూ హీటింగ్ షీల్డ్ అమరుస్తారు
(ఆర్) : వాతావరణ పొరలగుండా వాహక నౌక ప్రయాణించేటప్పుడు ఏర్పడే ఘర్షణ నుంచి ఉపగ్రహాలను హీటింగ్ షీల్డ్ కాపాడుతుంది
1) (ఎ), (ఆర్) సత్యం. (ఎ)కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) సత్యం. (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సత్యం, (ఆర్) అసత్యం
4) (ఎ), (ఆర్) రెండూ అసత్యం
10. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు అయిన కక్ష్య?
1) ధ్రువ కక్ష
2) సూర్యానువర్తన కక్ష
3) భూనిమ్న కక్ష్య 4) భూఎగువ కక్ష్య
11. భారతదేశం ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్టు నేత్ర గురించి సరైన దాన్ని గుర్తించండి.
1) భారత గగనతలంలోకి దూసుకు వచ్చే క్షిపణుల నుంచి కాపాడే వ్యవస్థ
2) శత్రు దేశాల విమానాలను గురించి హెచ్చరించే వ్యవస్థ
3) శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించి హెచ్చరించే వ్యవస్థ
4) అంతరిక్ష విపత్తులు, వ్యర్థాల నుంచి భారత ఉపగ్రహాలను కాపాడే వ్యవస్థ
12. భారత అంతరిక్ష రంగానికి సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ. భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమాలను ప్రోత్సహించడానికి 1962లో
INCOSPAR ఏర్పాటయింది
బి. భారత అంతరిక్ష కార్యక్రమాలను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏర్పాటయింది
సి. అంతరిక్షరంగ విధానాల రూపకల్పన, అమలు ఉద్దేశంతో 1972లో అంతరిక్ష విభాగం, అంతరిక్ష కమిషన్ ఏర్పాటయ్యాయి
డి. వాణిజ్య స్థాయిలో భారత అంతరిక్షరంగ కార్యక్రమాలను చేపట్టడానికి 1992లో ఆంట్రిక్స్ కార్పొరేషన్ ఏర్పాటయింది
1) బి, సి, డి 2) సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
13. జతపరచండి.
ఎ. EOS-01 1. GSLV-MK2
బి. RISAT-2BR1 2. PSLV-C49
సి. CARTOSAT-3 3. PSLV-C48
డి. CHANDRAYAAN-2
4. PSLV-C47
5. GSLVMK-MK3
1) ఎ-4, బి-3, సి-2, డి-5
2) ఎ-2, బి-4, సి-3, డి-5
3) ఎ-4, బి-3, సి-1, డి-5
4) ఎ-2, బి-3, సి-4, డి-5
14. చంద్రయాన్-1 ప్రయోగానికి సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ. ఆగస్టు 15, 2003న నాటి ప్రధాని
అటల్ బిహారీ వాజ్‌పేయ్ చంద్రయాన్
కార్యక్రమాన్ని ప్రకటించారు
బి. అక్టోబర్ 22, 2008న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగికి ఎగిసింది
సి. నవంబర్ 14, 2008న చంద్రయాన్-1లో భాగంగా రూపొందించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుని ఉత్తర ధ్రువాన్ని తాకింది
డి. ఆగస్టు 28, 2009న చంద్రయాన్-1 కార్యక్రమం ముగిసినట్లు ఇస్రో (ISRO)
ప్రకటించింది
1) బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
15. 500 కేజీల, 300 కేజీల బరువు గల చిన్న ఉపగ్రహాలను వరుసగా భూనిమ్న కక్ష్యలు, సూర్యానువర్తన కక్ష్యల్లోకి ప్రయోగించడానికి ఇస్రో రూపొందించిన ఉపగ్రహ ప్రయోగ వాహక నౌక?
1) PSLV 2) GSLV
3) SSLV 4) SLV
16. సౌండింగ్ రాకెట్లకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. ఇవి 1 లేదా 2 అంచెలను కలిగి ఘన ఇంధనంతో పనిచేస్తాయి
బి. నవంబర్ 21, 1963న తిరువనంతపురం సమీపంలోని తుంబా నుంచి మొదటి సౌండింగ్ రాకెట్ ప్రయోగించబడింది
సి. ఎగువ వాతావరణ పొరల అధ్యయనం, అంతరిక్ష పరిశోధనల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి
డి. స్వదేశీయంగా రూపొందించిన సౌండింగ్ రాకెట్ RK-75
1) బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
17. కింది జాబితాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
ఎ. సమాచార ఉపగ్రహం 1. IRNSS-1A
బి. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం
2. జీశాట్-30
సి. ఖగోళ పరిశీలన ఉపగ్రహం 3. ఆస్ట్రోశాట్
డి. నావిక్ శ్రేణి ఉపగ్రహం 4. రిసోర్స్ శాట్-1
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-2, బి-4, సి-3, డి-1
18. ఇస్రో శాస్త్రవేతలు ‘ఫ్యాట్ బాయ్’ అని ముద్దుగా పిలిచే ఉపగ్రహ ప్రయోగ వాహక నౌక?
1) PSLV 2) GSLV mark2
3) GSLV mark3 4) SSLV
19. GSAT-30 గురించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ. దీన్ని జనవరి 17, 2020న కౌరూ
అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ రాకెట్ ద్వారా ప్రయోగించారు
బి. ఈ ఉపగ్రహం సి బ్యాండ్, కేయూ బ్యాండ్లలో సమాచార సేవలు
అందిస్తుంది
సి. దీని జీవితకాలం 15 సంవత్సరాలు
డి. INSAT-3DR ఉపగ్రహ స్థానాన్ని ఈ ఉపగ్రహం భర్తీ చేయనుంది
1) బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
20. HySISకు సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ. ఈ ప్రయోగం నవంబర్ 29, 2018న చేపట్టారు
బి. భారతదేశపు మొట్టమొదటి హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్‌గా దీన్ని పేర్కొంటారు
సి. ఈ ఉపగ్రహం సహాయంతో భూ ఉపరితలాన్ని విద్యుదయస్కాంత వర్ణపటంలోని దృశ్య, సమీప, లఘు తరంగ పరారుణ కిరణాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు
డి. ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి PSLV-C43 వాహక నౌక ద్వారా ప్రయోగించారు
1) బి, డి 2) ఎ, బి, సి
3) ఎ, డి 4) ఎ, బి, సి, డి
21. (ఎ) : లెగ్రాంజియన్ పాయింట్-ఎల్1 దగ్గర The Solar and Heliospheric Observatory ఉంది
(ఆర్): లెగ్రాంజియన్ పాయింట్ల దగ్గర నుంచి మాత్రమే సూర్యుడిని నిరంతరం పరిశీలించే వీలు కలుగుతుంది
1) (ఎ),(ఆర్) సత్యం. (ఎ)కు(ఆర్) సరైన వివరణ
2) (ఎ),(ఆర్) సత్యం. (ఎ)కు(ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సత్యం, (ఆర్) అసత్యం
4) (ఎ), (ఆర్) రెండూ అసత్యం
22. భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించుకున్న భారత ప్రాంతీయ మార్గదర్శక ఉపగ్రహ వ్యవస్థకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
1) దీన్ని ప్రస్తుతం ‘నావిక్’గా వ్యవహరిస్తున్నారు
2) నావిక్ ఉపగ్రహ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా 3 ఉపగ్రహాలను భూస్థిర కక్ష్యలో, 4 ఉపగ్రహాలను భూస్థావర కక్ష్యలోకి ప్రయోగించారు
3) నావిక్ వ్యవస్థ కోసం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్దేశించుకున్నారు
4) ఇప్పటివరకు 11 ఉపగ్రహాలను ప్రయోగించగా, ఏడు ఉపగ్రహాలు సక్రమంగా పనిచేస్తున్నాయి
23. భారత క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. రష్యా అందించిన నమూనా క్రయోజనిక్ ఇంజిన్ సహాయంతో భారత్ స్వదేశీయంగా క్రయోజనిక్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టు ఇది
బి. ఈ ప్రాజెక్టు ఏప్రిల్, 1994లో ప్రారంభమైంది
సి. CUSP లో భాగంగా రూపొందించిన క్రయోజనిక్ ఇంజిన్లను GSLV-Mark2, Mark 3 ఉపగ్రహ వాహక నౌకలో
వినియోగించారు
డి. స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్ కలిగిన GSLV తొలి అభివృద్ధి ప్రయోగం ఏప్రిల్ 15, 2010న చేపట్టారు
1) ఎ, బి, సి 2) బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, డి
24. C 7.5 అనేది దేన్ని గురించి వివరిస్తుంది?
1) రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం
2) సమాచార ఉపగ్రహాల్లో పేలోడ్
3) GSLV ఎగువ అంచెలో ఉపయోగించే క్రయోజనిక్ ఇంజిన్
4) PSLV ఎగువ అంచెలో ఉపయోగించే ఇంజిన్
25. ప్రపంచలోనే అత్యధిక ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించిన దేశాల జాబితాలో భారతదేశ స్థానం?
1) 1 2) 2 3) 3 4) 4
26. జీశాట్ 29కు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. జీశాట్ 29 అనేది భారతదేశానికి చెందిన 3423 కిలోల బరువు కలిగిన హై త్రోపుట్ కమ్యూనికేషన్ శాటిలైట్
బి. దీన్ని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి నవంబర్ 14, 2018న ప్రయోగించారు
సి. ఈ ఉపగ్రహం కే-యూ, కే-ఏ బాండ్ల పరిధిలో సమాచార సేవలను అందిస్తూ దేశ వ్యాప్తంగా డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది
డి. మల్టీ-బీమ్, మల్టీ-బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్‌గా జీశాట్29 ఖ్యాతి
గడించింది
1) ఎ, బి, సి 2) బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు