చెక్, స్లావిక్ భాషలో రోబోటా అనే పదానికి బానిస కార్మికుడు అని అర్థం. కారెల్ కాపెక్ అనే చెక్ రచయిత రస్సుమ్స్ యూనివర్సల్ రోబోట్స్ (RUR) అనే గ్రంథం ద్వారా రోబో అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. రోబోల అధ్యయనాన్ని రోబోటిక్స్ అంటారు.
1. రోబోటిక్స్ అనే పదాన్ని మొదటిసారి వాడినది ఎవరు?
1) ఇసాక్ అసిమోవ్ 2) జార్జి డివోత్
3) విలియం కాంప్‌బెల్ 4) మైకిల్ లినార్డో
2.రోబోలకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
ఎ. ప్రపంచంలోని మొత్తం రోబోలలో సగభాగం
ఆసియాలోనే ఉన్నాయి.
బి. ఐరోపాలో 32 శాతం, ఉత్తర అమెరికాలో 16 శాతం, ఆస్ట్రేలియాలో 1 శాతం రోబోలు ఉన్నాయి.
సి. దేశాలపరంగా చూస్తే ఒక్క జపాన్‌లోనే 30 శాతం
రోబోలు ఉన్నాయి.
1) ఎ 2) బి 3) పైవన్నీ 4) ఏదీకాదు
3. కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానం గుర్తించండి.
ఎ. ఎటూ కదలకుండా ఒకే ప్రదేశానికి అతికిపెట్టుకుని పనిచేసే రోబోలను స్థిర లేదా ఫిక్స్డ్ రోబోలు అంటారు.
బి. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కదులుతూ పనిచేసే రోబోలను చలనశీల లేదా మొబైల్ రోబోలు అంటారు.
1) ఎ నిజం, బి తప్పు 2) బి నిజం, ఎ తప్పు
3) ఎ, బి రెండూ నిజం 4) ఎ, బి రెండూ తప్పు
4.పారిశ్రామిక రోబోలోని భాగాలు, వాటి విధులను సరిగా జతపర్చండి.
ఎ. మానిప్యులేటర్ 1. ఇది కొలిచే పరికరం
బి. కదిలే యంత్రం 2. ఇది మానవుడి మేధస్సుకు
సమానం
సి. ఎండ్ ఎఫెక్టార్ 3. ఇది జాయింట్లు, లింకులను
కలిగి మానవుని చేయిలా పనిచేస్తుంది
డి. సెన్సార్ 4. ఇది మానవుని కండరాలవలె
ఉండి కదిలే ప్రక్రియలో పాల్గొంటుంది
ఇ. నియంత్రకం 5. ఇది వస్తువులను గ్రహించడం,
పట్టుకోవడం, ఒకచోటు నుంచి మరోచోటుకి మార్చడం
ద్వారా మానవుని అరచేయి, వేళ్లలా పనిచేస్తుంది.
1) ఎ-3, బి-4, సి-5, డి-1, ఇ-2
2) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
3) ఎ-5, బి-3, సి-2, డి-5, ఇ-3
4) ఎ-2, బి-5, సి-3, డి-1, ఇ-4
5.కింది రోబోలు, వాటికి సంబంధించిన విషయాలను సరిగా జతపర్చండి.
ఎ. PARO 1. రోబో బేబీ
బి. ఆండ్రోస్ 2. బాంబ్‌స్కాడ్ రోబో
సి. టామా 3. రోబోటిక్ పిల్లి
డి. టెలివోక్స్ 4. ఉపయోగపడే పనిలోపెట్టిన తొలి
రోబో
ఇ. యానిమేట్ 5. డిజిటల్ నియంత్రణచేసే తొలి
ఆధునిక రోబో
1) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
3) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-1
4) ఎ-3, బి-2, సి-1, డి-4, డి-5
6.రోబోటిక్స్‌కు సంబంధించి ఇసాక్ అసిమోవ్ 3 సూత్రాలు (త్రీ లాస్ ఆఫ్ రోబోటిక్స్) ప్రతిపాదించాడు. కింది వాటిలో అసిమోవ్ ప్రతిపాదించిన సూత్రం ఏది?
ఎ. మానవులను రోబో గాయపర్చరాదు, ప్రతిచర్య ద్వారా రోబోపై దాడికి అవకాశం కల్పించాలి.
బి. మానవులు ఇచ్చిన ఆదేశాలను రోబోలు కచ్చితంగా పాటించాలి.
సి. రోబో తన మనుగడను కాపాడుకోవచ్చు. అయితే ఈ భద్రత తొలి, రెండవ నిబంధనలకు లోబడి ఉండాలి.
1) ఎ 2) బి 3) సి 4) పైవన్నీ
7.పరిశ్రమల్లో రోబోలు వాడకంవల్ల కలిగే లాభం ఏమిటి?
ఎ. వస్తువుల ఉత్పత్తికి అయ్యే ఖర్చు తగ్గుతుంది
బి. ఉత్పాదకత పెరుగుతుంది
సి. నాణ్యమైన ఉత్పత్తి ప్రమాణాలు పెరుగుతాయి
డి. యాజమాన్య నియంత్రణ పెరుగుతుంది
1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) పైవన్నీ
8.తయారీయేతర రంగాల్లో రోబోల ఉపయోగాలు?
ఎ. మైనింగ్ కార్యకలాపాలకు
బి. పెయింటింగ్, ఇతర నిర్మాణరంగ పనులకు
సి. రక్షణ రంగంలో బాంబుల నిర్వీర్యానికి
డి. వ్యోమనౌకల ద్వారా అంతరిక్షంలోకి పంపడానికి
ఇ. గొర్రెల నుంచి ఉన్నిని తీయడానికి
ఎఫ్. అడవుల కోతకు, బంగాళాదుంపల తవ్వకానికి
జి. సముద్రాల్లో మునిగిన ఓడలు, విమానాల వెలికితీతకు
1) ఎ, బి, సి, డి 2) డి, ఇ, ఎఫ్, జి
3) బి, సి, ఇ, ఎఫ్ 4) పైవన్నీ
9. కింది వాటిని జతపర్చండి.
ఎ. నానో రోబోలు 1. నానోమీటర్ పరిమాణంలో
ఉండేవి
బి. స్వార్మ్ రోబోలు 2. ఇతర రోబోలతో కలిసి
పనిచేసేవి
సి. స్కైవాష్ 3. విమానాన్ని శుభ్రపరిచే రోబో
డి. ట్రైలోబైట్ 4. వాక్యూం క్లీనర్లాగా పనిచేసే
రోబో
ఇ. రాప్టర్ 5. వేగంగా పరుగెత్తే రోబో
ఎఫ్. పియానిస్ట్ 6. ప్రపంచ అత్యాధునిక రోబో
1) ఎ-4, బి-5, సి-6, డి-1, ఇ-2, ఎఫ్-3
2) ఎ-3, బి-4, సి-5, డి-6, ఇ-1, ఎఫ్-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5, ఎఫ్-6
4) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-6, ఎఫ్-1
1-1, 2-4, 3-3, 4-1, 5-2, 6-4,
7-4, 8-4, 9-3
————————————–
ప్రతిభకు పరీక్ష