-అమైనో ఆమ్లాల పాలిమర్లను ప్రొటీన్లు అంటారు.
-ప్రొటీన్ల నిర్మాణాత్మక ప్రమాణాలు అమైనో ఆమ్లాలు.
-అమైనో ఆమ్లాలు పప్టైడ్ బంధం ద్వారా కలుపబడి ప్రొటీన్లు ఏర్పడుతాయి.
-ప్రొటీన్లు శరీర నిర్మాణానికి అవసరమవుతాయి. అందువల్ల వీటిని దేహ నిర్మాణకాలు/ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది బాడీ అంటారు.
-ప్రొటీన్లలో కార్బన్ (C), హైడ్రోజన్ (H), ఆక్సిజన్ (O), నైట్రోజన్ (N), సల్ఫర్ (S) మూలకాలు ఉంటాయి.
-1గ్రాము ప్రొటీన్ నుంచి 4K.Cal లేదా 4000 Cal శక్తి లభిస్తుంది.
-మానవుడికి ఒక రోజుకు కావలసిన ప్రొటీన్లు- 70 నుంచి 100 గ్రాములు.
-జీవగోళం (Biosphere)పై అత్యంత సమృద్ధిగా లభించే ప్రొటీన్- RUBICO (Ribilose Bispho sphate Carboxylase-Oxygenase)
-మొత్తం జంతు ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా లభించే ప్రొటీన్- కొల్లాజెన్ (Collagen).
-ప్రొటీన్లలో ఉండే అతి ముఖ్యమైన మూలకం- నైట్రోజన్
-ప్రొటీన్లు అధికంగా లభించే పదార్థాలు- పప్పులు, మాంసం, గుడ్లు, చేపలు, పాలు, పుట్టగొడుగులు, సోయాచిక్కుడు.
-సోయాచిక్కుడులో (45-50%) ప్రొటీన్లు, మాంసం (50%) కంటే ఎక్కువగా ఉంటాయి. దీంతో సోయాచిక్కుడును పేదవాడి మాంసం అంటారు.
-ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ రకాల సూక్ష్మజీవుల నుంచి ఏకకణ ప్రొటీన్లను (Scp-Single cell Proteins) తయారుచేస్తున్నారు.
ఉదాహరణ;
-స్పైరులినా, క్లోరెల్లా అనే శైవలాలు, సెల్యులోమోనాస్, ఆల్కలిజీన్స్ అనే బ్యాక్టీరియా, శాకరోమైసిన్ అనే ఏకకణఈస్ట్
-ప్రొటీన్ల తయారీకి తోడ్పడే కణాంగాలు- రైబోసోమ్స్.
-ప్రొటీన్ సంశ్లేషణ/ ఉత్పత్తిలో రెండు దశలు ఉంటాయి. అవి…అనులేఖనం (Transcription)అనువాదం (Translation)
అనులేఖనం
-DNA నుంచి m- RNA ఏర్పడటాన్ని అనులేఖనం అంటారు.
అనువాదం
-m- RNAపై ఉండే సమాచారం ఆధారంగా ప్రొటీన్లు తయారవడాన్ని అనువాదం అంటారు.
-ప్రొటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్లు- ప్రొటియేజ్లు
-ప్రొటీన్లు జీర్ణమై అమైనో ఆమ్లాలు ఏర్పడుతాయి.
-ప్రొటీన్లు ప్రధానంగా రెండు రకాలు. అవి..
జీవశాస్త్రీయంగా సంపూర్ణ ప్రొటీన్లు
-జంతువుల నుంచి లభించే ప్రొటీన్లను జీవశాస్త్రీయపరంగా సంపూర్ణ ప్రొటీన్లు అంటారు. వీటిలో అవశ్యక అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.
ఉదా: పాలు, గుడ్డు, మాంసం, చేపలు, రొయ్యలు
జీవశాస్త్రీయంగా అసంపూర్ణ ప్రొటీన్లు
-మొక్కల నుంచి లభించే ప్రొటీన్లను జీవశాస్త్రీయపరంగా అసంపూర్ణ ప్రొటీన్లు అంటారు. వీటిలో అవశ్యక అమైనో ఆమ్లాలు ఉండవు.
ఉదా: పప్పుధాన్యాలు, చిక్కుడుజాతులు, పుట్టగొడుగులు
ప్రొటీన్ల విధులు
-జీవుల్లో ప్రొటీన్లు చాలా విధులను నిర్వర్తిస్తాయి..
-కొన్ని ప్రొటీన్లు కణత్వచం గుండా రవాణాలో తోడ్పడుతాయి.
-కొన్ని ప్రొటీన్లు హార్మోన్లుగా పనిచేస్తాయి.
-కొన్ని ప్రొటీన్లు ఎంజైమ్లుగా విధులు నిర్వర్తిస్తాయి.
-ప్రొటీన్లు జీవుల పెరుగుదల, అభివృద్ధిలో, ప్రతిదేహాల తయారీ, ద్రవాభిసరణ క్రమతలో తోడ్పడుతాయి.
-కొన్ని ప్రొటీన్లు ప్లాస్మాత్వచం నిర్మాణంలో పాల్గొంటాయి.
అమైనో ఆమ్లాలు
-అనేక అమైనో ఆమ్లాలు కలిసి ప్రొటీన్లను ఏర్పరుస్తాయి.
-వీటిని ప్రొటీన్ల నిర్మాణాత్మక ప్రమాణాలు అంటారు.
-ప్రతి అమైనో ఆమ్లంలో ఒక అమైన్ గ్రూప్ (-NH2), ఒక కార్బాక్సిలిక్ గ్రూపు(- COOH), ఒక ఆల్కైల్ గ్రూపు (-R) ఉంటాయి.
-ఒక అమైనో ఆమ్లంలోని అమైన్ గ్రూపు (-NH2), మరొక అమైనో ఆమ్లంలోని కార్బాక్సిలిక్ ఆమ్లం (- COOH) ల మధ్య పప్టైడ్ బంధం ఏర్పడుతుంది. రెండు అమైనో ఆమ్లాల మధ్య పప్టైడ్ బంధం ఏర్పడేటప్పుడు ఒక నీటి అణువు కోల్పోవడం జరుగుతుంది.
-అత్యధిక ప్రొటీన్లు గల జీవి
– స్పైరులినా (నీలిఆకుపచ్చ శైవలం)
-అత్యధిక ప్రొటీన్లు గల జంతుపదార్థం
– మాంసం
-అత్యధిక ప్రొటీన్లు గల పప్పుజాతి మొక్క
-సొయాబీన్
-అనేక పప్టైడ్ బంధాల కలయిక వల్ల ఏర్పడే అమైనో ఆమ్లాల గొలుసును పాలీపప్టైడ్ గొలుసు అంటారు.
-ప్రకృతిలో లభించే మొత్తం అమైనోఆమ్లాల సంఖ్య-24
-ప్రొటీన్ల ఉత్పత్తిలో పాల్గొనే అమైనోఆమ్లాల సంఖ్య-20
-అమైనోఆమ్లాల ఉత్పత్తిలో తోడ్పడే విటమిన్-B6 (పైరిడాక్సిన్)
-చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే అమైనోఆమ్లం- హిస్పిడిన్
-క్షార అమైనోఆమ్లాలు- లైసిన్, ఆర్జినిన్
-ఆమ్ల అమైనోఆమ్లాలు- గ్లుటామిక్ ఆమ్లం, ఆస్పారిటిక్ ఆమ్లం
-తటస్థ అమైనోఆమ్లాలు – అలనిన్, ైగ్లెసిన్, వాలిన్, ఫినైల్ అలనిన్
-ఆల్కహాలిక్ అమైనోఆమ్లాలు- సీరైన్, థ్రియోనిన్
-ఎరోమాటిక్ అమైనోఆమ్లాలు- టెరోసిన్, ట్రిప్టోఫాన్, ఫినైల్అలనిన్
-సల్ఫర్ అమైనోఆమ్లాలు- సిస్టిన్, సిైస్టెన్, మిథియోనిన్
-అమైనోఆమ్లాలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి
-అవశ్యక అమైనోఆమ్లాలు (Essential amino acids)
-అనావశ్యక అమైనోఆమ్లాలు (Non Essential amino acids )
అవశ్యక అమైనోఆమ్లాలు
-మానవశరీరంలో తయారు కాని అమైనోఆమ్లాలను బయటినుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే వీటిని అవశ్యక అమైనోఆమ్లాలు అంటారు.
-ఇవి శరీర పెరుగుదలలో, అభివృద్ధిలో పాల్గొంటాయి.
-ఇవి మొత్తం 9 అమైనో ఆమ్లాలు
ఉదా:
ల్యూసిన్, లైసిన్, ఐసోల్యూసిన్, అలనిన్, వాలిన్, మిథియోనిన్, ఫినైల్అలనిన్, థ్రియోనిన్, ట్రిప్టోఫాన్, హిస్టిడిన్ అనావశ్యక అమైనోఆమ్లాలు
-ఇవి మానవ శరీరంలో తయారవుతాయి. వీటిని బయటి నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే వీటిని అనావశ్యక అమైనోఆమ్లాలు అంటారు.
-ఇవి మొత్తం- 12 అమైనోఆమ్లాలు
ఉదా: ఆర్జినిన్, ఆస్పారిటిక్ ఆమ్లం, సీరైన్, ైగ్లెసిన్, గ్లుటామిన్, గ్లుటామిక్ ఆమ్లం, సిైస్టెన్, హైడ్రాక్సీప్రోలిన్, ప్రోలిన్, టైరోసిన్, సిట్రులిన్, అలనిన్ కొవ్వులు (Lipids/ Fats)
-ఒక గ్లిజరాల్ అణువుతో మూడు ఫాటిఆమ్లాలు బంధం ఏర్పర్చుకోవడంతో ఒక కొవ్వు అణువు ఏర్పడుతుంది. గ్లిజరాల్, ఫాటిఆమ్లాలను కొవ్వుల నిర్మాణాత్మక ప్రమాణాలు అంటారు. గ్లిజరాల్ అణువు, ఫాటిఆమ్లాల మధ్య ఉండే బంధం ఎస్టర్ బంధం.
-ఒక గ్లిజరాల్ అణువుతో మూడు ఫాటి ఆమ్లాలు ఎస్టర్ బంధంను ఏర్పర్చుకోవడంతో మూడు అణువుల నీరు ఏర్పడుతుంది.
-కొవ్వులు కార్బన్ (C) హైడ్రోజన్ (H), ఆక్సిజన్ (O)లతో నిర్మితమవుతాయి.
-ఇవి నత్రజని రహిత కర్బన సంబంధ పదార్థాలు
-ఇవి నీటిలో కరగవు. కాని సేంద్రియ ఆమ్లాలైన ఈథర్, బెంజిన్, క్లోరోఫామ్ వంటి వాటిలో కరుగుతాయి.
-వీటిని శక్తి నిల్వలు అంటారు.
-ఇవి అత్యధిక శక్తినిచ్చే ఆహారపదార్థాలు.
-ఒక గ్రాము కొవ్వుల నుంచి 9k.cal / 9000cal శక్తి లభిస్తుంది.
-ఇవి కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్ల కంటే ఎక్కువ శక్తినిచ్చే ఆహార పదార్థాలు.
-మానవునికి ఒకరోజుకు కావాల్సిన కొవ్వుల పరిమాణం- 50 గ్రాములు
-దేహంలో కొవ్వులు ఎడిపోజ్ కణజాలంలో నిల్వచేయబడతాయి.
-కొవ్వులను జీర్ణం చేసే ఎంజైమ్లు- లైపేజ్లు, ఎస్టరేజ్లు
-కొవ్వులు జీర్ణమై గ్లిజరాల్, ఫాటిఆమ్లాలు ఏర్పడుతాయి.
-జంతువుల నుంచి లభ్యమయ్యే కొవ్వులు గది ఉష్ణోగ్రత వద్ద ఘనరూపంలో ఉంటాయి.
-మొక్కల నుంచి లభ్యమయ్యే కొవ్వులు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉంటాయి.
కొవ్వులు రకాలు
-కొవ్వులను రసాయన స్వభావం ఆధారంగా 3 రకాలుగా విభజించవచ్చు. అవి.. సరళ కొవ్వులు (Simple Lipids)సంయుగ్మ కొవ్వులు (Conjugated/ Compound Lipids)ఉత్పన్న కొవ్వులు (Derived Lipids)
సరళ కొవ్వులు
-వీటిలో తటస్థ కొవ్వులు (natural lipids), మైనం (waxes)లను చేర్చారు.
తటస్థ కొవ్వులు
-గది ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉన్న తటస్థ కొవ్వులను Fats అంటారు. వీటినే ఘనస్థితి కొవ్వులు (solid lipids) అని కూడా అంటారు.
ఉదా:
వెన్న, డాల్డా
-గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉన్న తటస్థ కొవ్వులను నూనెలు అంటారు.
ఉదా:
వేరుశనగ నూనే, నువ్వుల నూనే
-తటస్థ కొవ్వులు తినదగినవి