What is a vortex | వర్తులామానం అని దేన్ని అంటారు?
త్రికోణమితి పరిచయం
-త్రికోణమితి త్రిభుజంలోని కొలతల గురించి చర్చించే శాస్త్రం. ఇది లంబకోణ త్రిభుజం ఆధారంగా నిర్మితమైంది.
లంబకోణ త్రిభుజం
1. అతి పెద్ద భుజమే కర్ణం
2. మిగిలిన భుజాలను ఎదుటి ఆసన్న భుజాలుగా పరిగణిస్తారు.
3. ఈ మూడు భుజాలను ట్రయోడ్లు అంటారు.
4. ఒక కోణం తప్పనిసరిగా 90 డిగ్రీలు ఉంటుంది.
5. మిగిలిన రెండు కోణాలు పూరకాలు, ఒక్కొక్క కోణం అల్పకోణం (0 < 90o).
6. (కర్ణం)2 = (ఎదుటి భుజం)2 + (ఆసన్న భుజం)2
దీనిని పైథాగరస్ ట్రయోడ్ సిద్ధాంతం అంటారు.
-త్రికోణమితి అనే పదం గ్రీకు భాష నుంచి పుట్టింది.
-గ్రీకు భాషలో Trio అంటే మూడు, Gonia అంటే కోణం, Metron అంటే మాపనం లేదా కొలత అని అర్థం. అంటే త్రికోణమితి అంటే మూడు కోణాల కొలత అని అర్థం.
-త్రిభుజంలోని మూడు భుజాలకు, మూడు కోణాలకు మధ్యగల సంబంధాలను హిప్పారకస్ అనే గ్రీకు గణిత
శాస్త్రజ్ఞుడు ఏర్పరిచాడు.
-త్రికోణమితిని ఇంజినీరింగ్, సర్వేయింగ్, సముద్రయాణం, అంతరిక్షవిజ్ఞానం వంటి అనేక రంగాల్లో ఉపయోగిస్తారు.
-లంబకోణం అంటే 90o గల కోణం.
-అల్పకోణం 0o నుంచి 90o ల మధ్యగల కోణం.
-అధికకోణం 90o నుంచి 180o ల మధ్యగల కోణం.
-కోణం చేసిన తర్వాత భ్రమణ కిరణం ఏ స్థానంలో అగుతుందో ఆ కిరణాన్ని అంతిమ కిరణం అంటారు.
-అంతిమ కిరణం లేదా భుజం శీర్షం వద్ద ఒక సంపూర్ణ భ్రమణాన్ని పూర్తి చేసినచో ఆ కోణం విలువ 360o.
-అంతిమ భుజం సవ్యదిశలో భ్రమణం చేస్తూ చేసిన కోణాన్ని ధనాత్మక పరిమాణంగాను, అపసవ్యదిశలో భ్రమణం చేస్తూ చేసిన కోణాన్ని రుణాత్మక పరిమాణం గాను తీసుకుంటారు.
-చిన్న కోణాలను కొలవడానికి ముఖ్యంగా మూడు మానాలు అమలులో ఉన్నాయి. అవి
1. షష్ఠ్యాంశ మానం (ఆంగ్ల పద్ధతి- డిగ్రీలు)
2. శతాంశ మానం (ఫ్రెంచి పద్ధతి-గ్రేడ్లు)
3. రేడియన్ మానం (వర్తులామానం- రేడియన్లు)
1. షష్ఠ్యాంశ మానం (ఆంగ్ల పద్ధతి)
డిగ్రీ: తొలి భుజం నుంచి అంతిమ భుజానికి ఏర్పడిన భ్రమణం ఒక సంపూర్ణ భ్రమణంలో 360వ భాగం అయితే ఆ కోణ ప్రమాణాన్ని ఒక డిగ్రీ అంటారు. దీనిని 1o తో సూచిస్తారు.
నిమిషం: ఒక డిగ్రీని 60 సమాన భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని 1 నిమిషం అంటారు. దానిని 1 అని సూచిస్తారు.
సెకండు: ప్రతి నిమిషాన్ని తిరిగి 60 సమాన భాగాలుగా చేసి ప్రతి సమ భాగాన్ని ఒక సెకండు అంటారు. దీనిని 1॥ గా సూచిస్తారు.
ప్రతి దశలో 60 సమ భాగాలు చేయడం వల్ల ఈ మానానికి షష్ఠ్యాంశమానం అని పేరు వచ్చింది.
-1o = 60; 1=60॥
2. శతాంశ మానం (ఫ్రెంచి పద్ధతి)
-ఈ మానం ఫ్రెంచి వారు ఎక్కువగా ఉపయోగించేవారు. ఈ మానంలో ఒక లంబకోణాన్ని 100 సమ భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక గ్రేడ్ అంటారు. ఒక గ్రేడ్ 1g తో సూచిస్తారు.
90o = 100g
3. రేడియన్ మానం (వర్తులామానం)
రేడియన్: O కేంద్రంగా r వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని తీసుకోండి. వృత్త వ్యాసార్థం (r) తో సమానమైన చాపాన్ని వృత్త పరిధిపై తీసుకుంటే ఆ చాపం అదే వృత్త కేంద్రం వద్ద చేసే కోణాన్ని ఒక రేడియన్ అంటారు. ఈ కోణానికి శీర్షం వృత్త కేంద్రం వద్ద ఉంటుంది. దీనిని rc తో సూచిస్తారు.
-రేడియన్ వృత్తాన్నికి సంబంధించినందున రేడియన్ మానాన్ని వర్తులామానం అని అంటారు.
2 రేడియన్లు = 360o అంటే 2 = 360o
రేడియన్లు = 180o అంటే = 180o
1 రేడియన్ = 1c =180o/ = 57o1611
1 డిగ్రీ = 1o = 0.01746 రేడియన్ (సుమారు)
-రేడియన్ ఒక కోణ ప్రమాణం
l = r ( రేడియన్లలో వ్యక్తం చేయాలి)
l = వృత్త చాపం
r = వ్యాసార్థం
= కోణం
D/90o = G/100g = C/
ఈ సూత్రంలో D డిగ్రీలను, G గ్రేడ్లను, C రేడియన్లను సూచిస్తాయి.
-కోణ ప్రమాణాన్ని షష్ఠ్యాంశ మానంలో నుంచి వర్తులామానంలోనికి మార్చాలంటే గుణించాలి.
-ఉదా: 72o ను వర్తులామానంలోనికి మార్చండి.
-సాధన: 72o = 72o x ( 2
-కోణ ప్రమాణాన్ని వర్తులామానంలో నుంచి షష్ఠ్యాంశ మానం లోనికి మార్చాలంటే 180/ గుణించాలి. అంటే ఉన్న చోట 180o రాయాలి.
-ఉదా: ను షష్ఠ్యాంశ మానంలోనికి మార్చండి.
-సాధన: = 180o/5 = 36o
-ఒక లంబకోణ త్రిభుజంలో అల్పకోణమైతే, త్రిభుజ భుజాల నుంచి త్రికోణ నిష్పత్తులు నిర్వచిస్తాము.
-లంబకోణానికి ఎదుటి భుజం = కర్ణం (AC)
– కు ఎదుటి భుజం = ఎదుటి భుజం (AB)
– కు పక్క భుజం = పక్కభుజం (BC) (or) ఆసన్న భుజం
త్రికోణమితీయ నిష్పత్తులు:
-Sin = ఎదుటి భుజం/కర్ణం = AB/AC
-Cos = ఆసన్న భుజం/ కర్ణం = BC/AC
-Tan = ఎదుటి భుజం / ఆసన్న భుజం = AB/BC
-Cosec = కర్ణం / ఎదుటి భుజం = AC/AB
-Sec = కర్ణం / ఆసన్న భుజం = AC/BC
-Cot = ఆసన్న భుజం / ఎదుటి భుజం = BC/AB
-వివిధ కోణాల (0o 900) వద్ద త్రికోణమితీయ నిష్పత్తులు
త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య సంబంధం:
-Cosec (or) sin = 1/cosec (or) sin = 1
-Sec =1/cos (or) cos (or) cos = 1
-Cot =1/tan (or) tan =1/cot (or) tan = 1
-Tan = Sin = sec = sin
= 1/cosec
-Cot = cos =1/sin
=cos
= 1/sin
త్రికోణమితి సర్వ సమీకరణాలు
1. sin2
-Sin2 =1-cos2 =(1+cos
-Cos2 =1-sin2 =(1+sin
2. 1+tan2 = sec2
-Tan2
-Sec2
-(sec
-Sec = 1/sec (or)
-Sec = 1/sec
3. 1+cot2
-Cot2 = cosec2 = (cosec
-Cosec2
-(cosec
-Cosec = 1/cosec (or)
-Cosec = 1/cosec
సంయుక్త కోణాలు
-కొన్ని అల్పకోణాలను సంకలన, వ్యవకలన పరిక్రియల ద్వారా నీకు తెలిసిన త్రికోణమితీయ నిష్పత్తులలోనికి మార్పు చెందించుట.
Sin(A+B)=sinAcosB+cosAsinB
Sin(A-B)=sinAcosB-cosAsinB
Cos(A+B)=cosAcosB-sinAsinB
Cos(A-B)=cosAcosB+sinAsinB
Tan(A+B)=(tanA+tanB)/(1-tanAtanB)
Tan(A-B)=(tanA-tanB)/(1+tanAtanB)
Sin2A=2sinA.cosA
Cos2A=cos2A-sin2A
Tan2A=2tanA/(1-tan2A)
-ఊర్థ్ధ కోణం: పరిశీలన వస్తువు ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఏర్పడే కోణం ఊర్థకోణం.
నిమ్నకోణం: పరిశీలకుడు ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఏర్పడే కోణం నిమ్నకోణం.
గమనిక: ఊర్థ, నిమ్న కోణాలు సమానం. ఎందుకంటే ఇవి ఏకాంతర కోణాలను సూచిస్తాయి.
చూసేవస్తువు, పరిశీలకుని కన్ను (దృష్టి) గుండా గీచిన క్షితిజ సమాంతర రేఖకూ, పరిశీలకుని కంటిని, వస్తువును కలిపే సరళరేఖకూ మధ్యనున్న కోణాన్ని ఊర్థకోణం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు