దేహంలోని అతిచిన్న ఎముక దేనికి సహాయపడుతుంది?
బయాలజీ
131. నడిచేటప్పుడు, చదివేటప్పుడు, వాహనాలను నడిపేటప్పుడు ఎక్కువగా ఉపయోగపడే కన్నులోని భాగం?
1) అంధచుక్క 2) పోవియా
3) దండకణాలు 4) స్కాలా
132. శరీరంలో అతిపెద్ద అవయవం ఏది?
1) క్లోమం 2) ఊపిరితిత్తులు
3) మూత్రపిండాలు 4) చర్మం
133. జంతువులతో పోలిస్తే మానవులకు ఘ్రాణశక్తి ఎలా ఉంటుంది?
1) తక్కువగా ఉంటుంది
2) ఎక్కువగా ఉంటుంది
3) ఒకేవిధంగా ఉంటుంది
4) అసలు ఘ్రాణశక్తి ఉండదు
134. సమతాస్థితిని కాపాడే జ్ఞానేంద్రియం ఏది?
1) చెవి 2) ముక్కు
3) కన్ను 4) చర్మం
135. మానవ చెవి వినగలిగే పౌనఃపున్యాల సామర్థ్యం ఏది?
1) 10-16 హెర్ట్లు
2) 1-14 హెర్ట్లు
3) 160-250 హెర్ట్లు
4) 6-40,000 హెర్ట్లు
136. చెవి గురించిన అధ్యయనం ఏది?
1) ఓటాలజీ 2) లారింగాలజీ
3) రైనాలజీ 4) డెర్మటాలజీ
137. గ్లకోమా ఏ జ్ఞానేంద్రియానికి సంబంధించిన వ్యాధి? దీనికి గల మరొక పేరు ఏది?
1) కన్ను, నీటి కాసులు
2) కన్ను, కటరాక్ట్
3) చెవి, అస్టిగ్మాటిజం
4) చెవి, కంజెక్టివైటిస్
138. కంటిలోని శంకు కణాలు కలిగి ఉండే వర్ణద్రవ్యకం ఏది?
1) అయోడిన్ 2) లైకాప్సిన్
3) రొడాప్సిన్ 4) పియరాప్సిన్
139. కంటిలోని దండకణాలు కలిగి ఉండే వర్ణక పదార్థం ఏది?
1) అయోడిన్ 2) లైకాప్సిన్
3) రొడాప్సిన్ 4) పియరాప్సిన్
140. లాక్రిమల్ గ్రంథులు ఏ జ్ఞానేంద్రియానికి సంబంధించింది?
1) కన్ను 2) చెవి
3) ముక్కు 4) నాలుక
141. కనుగుడ్డు కదల్చడానికి సహాయపడే కండరాల సంఖ్య ఎంత?
1) 2 2) 4 3) 6 4) 8
142. కంటికి, పుస్తకానికి మధ్య ఉండవలసిన కనీస దూరం సుమారుగా ఎంత?
1) 10 సెంటీమీటర్లు
2) 15 సెంటీమీటర్లు
3) 20 సెంటీమీటర్లు
4) 30 సెంటీమీటర్లు
143. కంటికి, టీవీకి మధ్య ఉండవలసిన కనీస దూరం సుమారుగా ఎంత?
1) 1.5 మీటర్లు 2) 2.0 మీటర్లు
3) 2.5 మీటర్లు 4) 3 మీటర్లు
144. ఒక కన్నుతో ముందుకు, మరొక కన్నుతో వెనుకకు చూడగలిగే జీవి ఏది?
1) కాకి 2) పిచ్చుక
3) ఊసరవెల్ల్లి 4) కోకిల
145. రెండు కళ్లతో ఒకే వస్తువును చూడగలగడాన్ని ఏమంటారు?
1) బైనాక్యులర్ విజన్
2) మోనాక్యులర్ విజన్
3) బై ఆక్యులర్ విజన్
4) ఏదీకాదు
146. నాడీకణం తంత్రికాక్ష త్వచపు విరామ శక్మం సుమారుగా ఎంత?
1) -55 మి.వో 2) -45 మి.వో
3) -70 మి.వో 4) -100 మి.వో
147. నాడీకణ తంత్రికాక్ష త్వచంలో క్రియాశక్మం ఏర్పడటానికి అవసరమైన త్రిషోల్డ్?
1) -45 మి.వో 2) -55 మి.వో
3) -70 మి.వో 4) -90 మి.వో
148. నాడీకణ తంత్రికాక్షం విధ్రువణం దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది?
1) Na+ అంతశ్చలనం
2) Na+ బహిశ్చలనం
3) K+ బహిశ్చలనం
4) K+ అంతఃశ్చలనం
149. ఒక వ్యవసాయదారుడు తన పొలంలో పామును అకస్మాత్తుగా చూశాడు. అతడి హృదయ స్పందన అధికం అయ్యింది. నోరు పొడిబారిపోయింది. అతడి తక్షణ అనుక్రియకు కారణమైన స్రావం?
1) వాసోప్రెసిన్ 2) ఎంటిరోకైనిన్
3) ఆక్సిటోసిన్ 4) అడ్రినాలిన్
150. మెదడులోని ఏ భాగాన్ని తొలగిస్తే వెంటనే మరణం సంభవిస్తుంది?
1) ఘ్రాణ లంబికలు 2) మజ్జాముఖం
3) దృష్టి లంబికలు 4) మస్తిష్కం
151. పొడవైన కపాల నాడి ఏది?
1) అనుభూత నాడి 2) ఆబ్డుసెన్స్ నాడి
3) త్రిధార నాడి 4) వాగస్ నాడి
152. హృదయానికి చేరే సహసహానుభూత నాడిని కత్తిరించినట్లయితే హృదయ స్పందన?
1) ఆగిపోతుంది 2) ఎక్కువ అవుతుంది
3) తక్కువ అవుతుంది
4) ప్రారంభం అవుతుంది.
153. నార్ ఎపినెఫ్రిన్ ప్రభావం దేనిపై ఉంటుంది?
1) రక్తనాళాల విస్పారం
2) శ్వాసనాళికల సడలింపు
3) రెనిన్ స్రావాన్ని తగ్గించడం
4) రక్తనాళాల సడలిక
154. నార్ ఎపినెఫ్రిన్ ఉత్పత్తి ఎక్కడ నుంచి జరుగుతుంది?
1) సహానుభూత నాడీ సంధి పూర్వ తంత్రికాక్షాలు
2) సహానుభూత నాడీ సంధి పర తంత్రికాక్షాలు
3) సహసహానుభూత నాడీసంధి పూర్వ తంత్రికాక్షాలు
4) సహసహానుభూత నాడీసంధి పర తంత్రికాక్షాలు
155. మానవుడిలో కపాలనాడుల సంఖ్య ఎంత?
1) 31 జతలు 2) 37 జతలు
3) 10 జతలు 4) 12 జతలు
156. కుడి చేతి అలవాటు కలవారిలో భాష నేర్చుకొనే నాడీ నియంత్రణ కేంద్రం మెదడులో ఏ భాగంలో ఉంటుంది?
1) ఎడమ మస్తిష్కార్ధగోళం
2) కుడి మస్తిష్కార్ధగోళం
3) కుడి అనుమస్తిష్కార్ధగోళం
4) ఎడమ అనుమస్తిష్కార్ధగోళం
157. మెదడులో కోష్ఠకాలు/కుహరాలు లేని భాగం ఏది?
1) మజ్జాముఖం 2) మస్తిష్కం
3) ద్వారాగోర్ధం 4) అనుమస్తిష్కం
158. మెదడులో ద్రవాభిసరణ, ఉష్ణ నియంత్రణ కేంద్రాలు ఉండే ప్రదేశం?
1) ద్వారాగోర్ధం 2) అధో పర్యంకం
3) మజ్జాముఖం 4) పాన్స్ వెరోలి
159. మెదడు మూలంలో లేని భాగం ఏది?
1) పాన్స్వెరోలి 2) హిప్పోకాంపస్
3) మజ్జాముఖం 4) మధ్యగోర్ధం
160. జీవ వృక్షం అనేది?
1) మజ్జాముఖం 2) ఆర్బోర్ విటే
3) ఆర్గాన్ ఆఫ్ కార్టి 4) పాన్స్వెరోలి
161. మెదడులోని రెండో అతిపెద్ద భాగం ఏది?
1) అనుమస్తిష్కం 2) మధ్యగోర్ధం
3) మజ్జాముఖం 4) మస్తిష్కం
162. తృప్తి, ఆకలి, దప్పిక వంటి చర్యల నియంత్రణ కేంద్రం?
1) అధోపర్యంకం 2) పాన్స్వెరోలి
3) అనుమస్తిష్కం 4) మజ్జాముఖం
163. కుడి, ఎడమ మస్తిష్కార్ధగోళాల మధ్య సమన్వయాన్ని చేకూర్చేది?
1) పాన్స్వెరోలి
2) కార్పస్ కెల్లోసమ్
3) కార్పస్ స్పాంజియోజమ్
4) కార్పస్ లూటియం
164. అనుబంధాస్థి పంజరంలో ఇది ఒక భాగం?
1) మోకాలి చిప్ప
2) అనుకపాల కందం
3) తాలుకీలితం
4) ఒడంటాయిడ్ కీలితం
165. మానవుడి పూర్వాంగంతో సంబంధం లేని కీలు ఏది?
1) మడతబందు కీలు
2) శాడిల్ కీలు
3) సైనార్థ్రోజు 4) కాండైలాయిడ్
166. ఎక్కువ కీళ్లు గల ఎముక ఏది?
1) కపాలం 2) హనువు
3) ఉరోమేఖల 4) శ్రోణి మేఖల
167. మోకాలి కీలు దేనికి ఉదాహరణ?
1) మడతబందు కీలు
2) శాడిల్ కీలు
3) కాండైలాయిడ్ కీలు
4) జారెడు కీలు
168. పరిమిత కదలికను చూపే కీలు?
1) సూదనాలు 2) సైనార్థ్రోజు
3) ఆంఫి ఆర్థ్రోజు 4) గొంఫాజ్
169. అనుబంధాస్థి పంజరంలోని మొత్తం ఎముకల సంఖ్య?
1) 80 2) 62 3) 206
4) 126
170. చరమాంగంలోని మొత్తం ఎముకల సంఖ్య?
1) 28 2) 30 3) 24 4) 36
171. పుర్రెలో పొడవైన, దృఢమైన ఎముక ఏది?
1) హనువు 2) జైగోమాటిక్
3) జంబిక 4) కాంఠిక
172. మానవుడిలో దృఢమైన, పెద్ద కశేరుకం ఏది?
1) కటి కశేరుకం 2) ఉరఃకశేరుకం
3) అక్ష కశేరుకం 4) శీర్షదరం
173. మానవ అక్షాస్థిపంజరంలోని మొత్తం ఎముకల సంఖ్య?
1) 80 2) 120 3) 144 4) 206
174. దేహంలోని అతిచిన్న ఎముక దేనికి సహాయపడుతుంది?
1) సున్నిత భాగాల రక్షణకు
2) ధ్వని తరంగాల ప్రసారానికి
3) ఎర్ర రక్తకణోత్పత్తికి
4) కండరాలు అంటిపెట్టుకోవడానికి సంధి తలాన్ని ఇవ్వడంలో
175. కీళ్లలో యూరికామ్లం స్ఫటికాల రూపంలో సంచితం కావడం వల్ల వచ్చే వ్యాధి?
1) ధనుర్వాతం 2) గౌట్
3) మస్కులార్ డిస్ట్రోపి
4) మయాస్థినియా గ్రావిస్
176. దేహంలో పొడవైన ఎముక ఏది?
1) తొడ ఎముక 2) భుజాస్థి
3) అంతర్జంఘిక 4) కర్ణాంతరాస్థి
177. ముఖభాగంలో అతిచిన్న ఎముక ఏది?
1) హనువు 2) సిరిక
3) తల్వాస్థి 4) అశ్రుకాస్థి
178. సైనోవియల్ ద్రవం ఉండే ప్రదేశం ఏది?
1) మెదడు కోష్ఠకాల్లో
2) స్వేచ్ఛగా కదిలే కీళ్లలో
3) కపాల కుహరంలో
4) వెన్నెముక కేంద్ర కుల్యలో
179. పుర్రెలోని ప్రధాన ఎముక ఏది?
1) సేవకం 2) స్ఫీనకీయం
3) లలాటికాస్థి 4) అనుకపాలాస్థి
180. బొంగరపు కీలు వేటి మధ్య ఉంటుంది?
1) కరభాస్థి- మణిబంధనం
2) అనుకపాల కందాలు- శీర్షదరం
3) రత్ని-అరత్ని
4) ప్రపాదకాస్థికలు-అంగుళ్యాస్థులు
181. ప్రౌఢ మానవుడిలో ఎముకల సంఖ్య ఎంత?
1) 156 2) 280
3) 80 4) 206
182. ఎముకను ఎముకతో కలిపే నిర్మాణం ఏది?
1) లిగమెంట్/సంధిబంధనం
2) శీర్షదరం
3) కరబాస్థి
4) టెండాన్/స్నాయుబంధనం
183. ఎముకను కండరంతో కలిపే నిర్మాణం ఏది?
1) లిగమెంట్/స్నాయుబంధనం
2) శీర్షదరం 3) కరభాస్థి
4) టెండాన్/స్నాయు బంధనం
184. తుంటి కీలు, భుజం కీలుకు మరో పేరు?
1) మడత బందు 2) బంతి గిన్నె
3) జారెడు 4) శాడిల్
185. మోచేయి కీలు, మోకాలి కీలు ఏ రకానికి చెందినది?
1) శాడిల్ కీలు
2) కాండైలాయిడ్ కీలు
3) మడతబందు కీలు
4) బొంగరపు కీలు
186. చెవిలోని మొత్తం ఎముకల సంఖ్య?
1) 26 2) 6 3) 14 4) 8
187. కపాలంలో ఉండే ఎముకల సంఖ్య?
1) 6 2) 7 3) 8 4) 9
188. ముఖంలో ఉండే ఎముకల సంఖ్య?
1) 8 2) 14 3) 26 4) 6
189. మానవుడిలో ఉండే పర్శుకల (పక్కటెముకల సంఖ్య) ఎంత?
1) 12 జతలు 2) 10 జతలు
3) ఒక జత 4) మూడు జతలు
190. తుంటిలో ఉండే ఎముకల సంఖ్య ఎంత?
1) 2 2) 4 3) 6 4) 8
191. కండర సూక్ష్మ తంతువులో ATP జల విశ్లేషణ దేనిలో జరుగుతుంది?
1) ట్రోపోనిన్ 2) ట్రోపోమయోసిన్
3) మయోసిన్ 4) ఏక్టిన్
192. సమ ప్రసారక పట్టీలో నిర్ణీత అంతరాల్లో/వ్యవధుల్లో ఉండే ప్రొటీన్ ఏది?
1) ఏక్టిన్ 2) మయోసిన్
3) ట్రోపోనిన్ 4) మీరోమయోసిన్
193. సార్కోమియర్లో దళసరి, పలుచటి తంతువులు రెండూ ఉండే ప్రాంతం?
1) H- మండలానికి ఇరువైపులా గల A పట్టీ
2) Z- గీతకు ఇరువైపులా I పట్టీ
3) M- గీతకు ఇరువైపులా గల హెన్సన్స్ చక్రిక
4) సమ ప్రసారక పట్టీ
194. కండర సంకోచాన్ని విపులంగా వివరించే సిద్ధాంతం?
1) జారుడు తంతువుల సిద్ధాంతం
2) పర సంకోచ సిద్ధాంతం
3) పూర్వ సంకోచ సిద్ధాంతం
4) సాల్జెల్ సిద్ధాంతం
195. కోరి వలయం దేనికి సంబంధించింది?
1) కొవ్వుల జీవక్రియ
2) ైగ్లెకోజన్ జీవక్రియ
3) ప్రొటీన్ జీవక్రియ
4) యూరియా ఏర్పడటం
- Tags
- body bone
- bone
- smallest bone
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు