Self-employment scheme | పట్టణ పేదల స్వయం ఉపాధి పథకం

-ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం ఏడో ప్రణాళికలో భాగంగా 1986లో ప్రారంభించింది.
-పట్టణ పేదల స్వయం ఉపాధిని కల్పించి అభివృద్ధిలోకి తీసుకురావడమే దీని లక్ష్యం.
-ఇందుకు సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలను అందించడం ముఖ్యోద్దేశం.
-ప్రధానంగా పట్టణ పేదల్లో తగిన వృత్తి నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు/సంఘాలను గుర్తించి సూక్ష్మ సంస్థలను ఏర్పాటు చేసుకొనేందుకు ఆర్థికంగా సహాయం అందించి స్వయం ఉపాధిని పొందేలా చేయడం.
-అంతేకాకుండా సాంకేతిక, మార్కెటింగ్ లాంటి ఇతర సహకార సేవలను అందించడం కోసం మద్దతును ఇచ్చి పేదల జీవన అవసరాలను సులభతరం చేయడం.
-పట్టణ నిరుపేదలకు తక్కువ సమయంలో చిన్న వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించడం.
-ఈ పథకం కింద మహిళలను 30 శాతం తక్కువ కాకుండా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
-ఎస్సీ, ఎస్టీల ఎంపికకు వారి పట్టణ జనాభా నిష్పత్తి మేరకు 3 రిజర్వేషన్ల ప్రకారం ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.
-మైనార్టీలకు కనీసం 15 శాతం ఆర్థికలక్ష్యాలను సాధించేందుకు నిధులను కేటాయించడం.
-లబ్ధిదారుడికి ముందుగానే ప్రభుత్వం వద్ద నమోదైన స్వచ్ఛంద సంస్థ ద్వారా అవసరమైన నైపుణ్య శిక్షణను ఇప్పించి సరిఫికెట్లు అందిస్తారు.
-ఇక రుణ సదుపాయం లక్ష నుంచి పది లక్షల వరకు యూనిట్ పరిమితిని బట్టి అందిస్తారు.
-లబ్ధిదారులు తీసుకున్న రుణాలను ఐదు నుంచి ఏడేండ్లలోగా చెల్లించాలి.
Latest Updates
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు
మరో 532 టీచర్ల పరస్పర బదిలీలు
త్వరలో ఏఈ నోటిఫికేషన్
గైర్హాజరైన వారు మళ్లీ పరీక్షలు రాయొచ్చు
18 నుంచి వెబ్సైట్లో ఐసెట్ హాల్టికెట్లు
అగ్రికల్చరల్ యూనివర్సిటీలో తాత్కాలిక పోస్టుల భర్తీ
గురుకుల క్రీడా పాఠశాలల్లోప్రవేశాలు
రైల్టెల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ఉద్యోగాలు
Start observing your ecosystem for answers