Governor Generals | 1857 వరకు…గవర్నర్ జనరల్స్
భారతదేశ చరిత్ర జాన్ ఆడమ్స్ (1823)
-ప్రింటింగ్ ప్రెస్‌లను స్థాపించడానికి లైసెన్సులను తప్పనిసరి చేశారు.
-తొలి ప్రెస్ ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ జనరల్.
లార్డ్ అమెరెస్ట్ (1823- 1828)
-ఇతని కాలంలో మొదటి బర్మా యుద్ధం జరిగింది.
-మొగల్ చక్రవర్తి అక్బర్-2తో సమానంగా గుర్తించబడిన మొదటి గవర్నర్ జనరల్.
విలియం బెంటింక్ (1828- 1835)
-బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్న విలియ బెంటింక్ 1833 చార్టర్ చట్టం ప్రకారం మొదటి భారత గవర్నర్ జనరల్‌గా మారాడు.
-దుష్పరిపాలన పేరిట మైసూరు, కూర్గు, సెంట్రల్ కచ్చర్లను ఆక్రమించాడు.
-అధికార భాషలుగా పర్షియన్, వెర్నాక్యులర్ భాషలను గుర్తించాడు.
-ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతవాసుల సౌలభ్యం కోసం ప్రత్యేక సదర్ నిజామత్, సదర్ దివానీ అదాలత్‌లను అలహాబాద్‌లో ఏర్పరిచాడు.
-కారన్‌వాలీస్ ప్రవేశపెట్టిన అప్పీల్, సర్క్యూట్ ప్రొవిన్షియల్ కోర్టులను 1831లో రద్దు పరిచాడు.
-థగ్గులను అణచివేశాడు. ఇందుకోసం 1831లో కల్నల్ విలియం స్లీమ్యాన్ సేవలు ఉపయోగించుకున్నాడు. దాదాపు 1500 మంది థగ్గులను అరెస్టు చేశాడు.
-రాజపుత్రుల్లో శిశుహత్యలను అణచివేయడానికి తీవ్రంగా కృషి చేశాడు.
-విలియం బెంటింక్ 1829లో సతీసహగమనాన్ని నిషేధించి, సతిని ప్రోత్సహించడం నేరంగా ప్రకటించాడు.
-పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీని ఏర్పాటు చేసి దాని అధ్యక్షులుగా మెకాలేను నియమించాడు.
-శారీరక రూపు రేఖల్లో భారతీయులు గాను, భావాల్లో ఇంగ్లిషు వారిగా వ్యవహరించే వారిని తయారు చేయడమే బ్రిటిష్ విద్యావిధాన లక్ష్యమని మెకాలే ప్రకటించాడు.
-మెకాలే నివేదిక ప్రకారం బోధనా భాషగా ఇంగ్లిష్‌ను 1835 నుంచి ప్రవేశపెట్టాడు. ఉన్నత న్యాయస్థానాల్లో పర్షియన్ భాష స్థానంలో ఇంగ్లిషును అధికార భాషగా ప్రవేశపెట్టాడు.
-ఈ విధంగా భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని గవర్నర్ జనరల్ విలియం ప్రవేశపెట్టాడు.
సర్ చార్లెస్ మెట్కాఫ్ (1835-1836)
-ఇతను 1835లో ప్రెస్ లా (పత్రికా చట్టం) ప్రవేశపెట్టాడు.
-ఈ చట్టం భారతదేశ ప్రెస్‌లపై గల వివిధ నిబంధనలను తొలగించింది. దాంతో ఈయనను భారతీయ పత్రికా విమోచనకారి అన్నారు.
లార్డ్ ఆక్లాండ్(1836-1843)
-ఇతడు యాత్రికుల పన్నును రద్దు చేశాడు.
-ఇతని నాయకత్వంలో మొదటి అఫ్గన్ యుద్ధం జరిగింది. బ్రిటన్ దాదాపుగా ఓడిపోయి పేరు ప్రఖ్యాతలను కోల్పోయింది.
లార్డ్ ఎలెన్‌బరో(1842-1844)
-ఇతను అప్గన్ యుద్ధానికి ముగింపు తెచ్చాడు. 1843లో సింధ్‌ను ఆక్రమించాడు.
-సింధూప్రాంతంలో కంపెనీ పాలకుడిగా సర్ చార్లెస్ నేపియర్‌ను నియమించాడు.
లార్డ్ హార్టింజ్ (1844-1848)
-ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంగ్లిష్ విద్యనభ్యసించిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు.
-చోటా నాగ్‌పూర్, ఒరిస్సా ప్రాంతంలోని ఖోండోలు అనే తెగల ప్రజలు నరబలిని పాటించేవారు. దాన్ని నిలిపి వేయించాడు.
-ఇతని కాలంలో మొదటి సిక్కు యుద్ధం జరిగింది. ఈ యుద్ధం లాహోర్(1846) సంధితో ముగిసింది.
లార్డ్ డల్హౌసి (1848-1856)
-ఇతను 1848లో రాజ్య సంక్రమణ విధానం ప్రవేశపెట్టాడు.
-దీనిని అనుసరించి 1848లో సతారా, 1849లో జైపూర్, సంబల్పూర్, 1850లో భగత్, 1852లో ఉదయ్‌పూర్, 1853లో ఝాన్సీ, 1854లో నాగ్‌పూర్‌లను ఆక్రమించి బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు.
-దుష్పరిపాలన పేరుతో 1853లో బీరార్, 1856లో జోధ్ను ఆక్రమించాడు.
-ఇతని కాలంలో రెండో-ఆంగ్లో సిక్కు, రెండో ఆంగ్లో-బర్మా యుద్ధాలు జరిగాయి. సిక్కులను ఓడించి మొత్తం పంజాబ్‌ను ఆక్రమించుకున్నాడు. బర్మా యుద్ధంలో గెలుపొంది దిగువ బర్మాను ఆక్రమించాడు.
-కొత్తగా జయించిన ప్రాంతాల్లో కేంద్రీకృత పరిపాలన ప్రవేశపెట్టారు. దీనినే బాన్ రెగ్యులేషన్ సిస్టమ్ అని అన్నారు.
-డల్హౌసీ రాజవంశీకుల బిరుదులను, పింఛన్లను రద్దు చేశాడు. పీష్వా బాజీరావు-II మరాణానంతరం అతని దత్తత కుమారుడైన దోండూ పండిట్ (నానాసాహెబ్)కు పింఛను ఇవ్వలేదు. అంతేగాక మొగల్ చక్రవర్తి అనే బిరుదును మొగలులకు లేకుండా చేయాలని ప్రయత్నించాడు.
-ఇతను 1853లో వాయవ్య ప్రాంతంలో ధామ్సోనియం సిస్టమ్ అనే విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాడు. అనంతరం 1854లో విద్యావిధానంపై ఉడ్స్ కమిటీని వేశాడు. ఈ కమిటీని భారతదేశ విద్యావిధానంలో మాగ్నాకార్టా అంటారు.
-డల్హౌసీ 1856లో వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రవేశపెట్టాడు.
-డల్హౌసీ బెంగాల్ పరిపాలనను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పజెప్పాడు.
-ఇతని పరిపాలనా కాలంలో రూర్కీ ఇంజినీరింగ్ కళాశాలను నెలకొల్పాడు.
-ఇతను 1853లో రైల్వేలకు పునాది రాయి వేశాడు. మొట్టమొదటి రైల్వేలైన్ బాంబే నుంచి థానే వరకు వేయించాడు.
-ఇతని కాలంలో ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ వ్యవస్థ ప్రారంభమైంది. ఈ డిపార్ట్మెంట్కు సూపరింటెండెంట్ ఓ షాంగ్నెస్సేను నియమించాడు.
-ఈ విధంగా డల్హౌసీ భారతదేశంలో రైల్వేలు, తంతి వ్యవస్థల పితామహుడిగా పేరుగాంచాడు.
-డల్హౌసీ ఆధునిక తపాలా విధానానికి పునాది వేశాడు. 1854లో పోస్టాఫీసు చట్టాన్ని జారీ చేశాడు.
-ఇతను ప్రజాపనుల శాఖ లేదా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశాడు. ఇది సైనిక శాఖ ఆధ్వర్యంలో పనిచేసేది.
-డల్హౌసీ కలకత్తాలో ఒక వ్యవసాయ కళాశాలను స్థాపించాడు.
-ఇతని కాలంలో కరాచీ, కలకత్తా, బొంబాయి రేవులు అభివృద్ధి చెందాయి.
-ఇతని పరిపాలనను కమిటీల పరిపాలన అనేవారు.
1857 సిపాయిల తిరుగుబాటు
-ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు ఒక ముఖ్య చారిత్రక ఘట్టం. వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్‌వారు 1740 దశకం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. సామ్రాజ్య విస్తరణకు వారు ఉపయోగించిన కుటిలనీతి, బలప్రయోగం వంటి విధానాలను ప్రజలు ప్రతిఘటిస్తూ వచ్చారు. ఇలాంటి ప్రతిఘటనలో 1857 తిరుగుబాటు ప్రధానమైనది. ఇది భారత స్వాతంత్య్రోద్యమానికి నాంది పలికిందని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.
తిరుగుబాటు కారణాలు
-1857 తిరుగుబాటు అనేక ఏండ్లుగా పేరుకుపోయిన, బలమైన కారణాల ఫలితంగా సంభవించింది. దీనికిగల కారణాలను రాజకీయ, సాంఘిక, మత, ఆర్థిక, సైనిక కారణాలుగా విభజించవచ్చు.
రాజకీయ కారణాలు
-ఈశ్వరీప్రసాద్ అనే చరిత్రకారుడు రాసినట్లు డల్హౌసీ భారతదేశంలోని రాజ కుటుంబాలను తుడిచివేసి, దానితో చారిత్రక, ఆర్థిక విధానాల్లో కలిగించిన మార్పులు తీవ్ర అసంతృప్తికి కారణాలై ఈ గొప్ప తిరుగుబాటును లేవదీశాయి. డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం, సంస్థానాధీశులందరిలోనూ అనుమానాలను, ఆందోళనలను రేకెత్తించింది. దత్తత చేసుకొనే అధికారం, హిందూ రాజులకు నిరాకరించారు. డల్హౌసీ ఈ సిద్ధాంతాన్ని అమలు చేసి సతారా, జైపూర్, సంబల్పూర్, భగత్, ఉదయ్‌పూర్, ఝాన్సీ, నాగ్‌పూర్ మొదలైన సంస్థానాలను ఆక్రమించుకొన్నాడు. ఆర్కాట్ నవాబు, తంజావూరు రాజుల బిరుదులు హరించారు. బాజీరావు పీష్వాకు ఇచ్చే భరణం, అతని దత్తకుమారుడికి నిరాకరించారు. బ్రిటిష్ వారికి మిక్కిలి విధేయులైన సంస్థానాధిపతులు కూడా భవిష్యత్తులో కొనసాగుతారన్న నమ్మకం లేకపోయింది. ఆక్రమణలు రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల కాదని అవి నైతిక విలువలు విడనాడటం వల్లనేనని అనేక మంది భావించారు. మొగల్ చక్రవర్తి నివాసాన్ని ఎర్రకోట నుంచి కుతుబ్‌మినార్ దగ్గరకు మార్చాలని, బహదూర్షా తర్వాత మొగల్ చక్రవర్తి బిరుదును రద్దు చేయాలని డల్హౌసీ ప్రతిపాదించాడు. డల్హౌసీ అయోధ్యను ఆక్రమించడంలో అనేకమంది ప్రభువులు, అధికారులు, సైనికులు అసంతృప్తితో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి అవకాశం కోసం ఎదురు చూశారు.
సాంఘిక, మత కారణాలు
-రాజకీయ అన్యాయాన్ని కొంతవరకు భరించినా సాంఘిక, అసమానత, మత పీడన ప్రజలు భరించలేనివి. అవి సరాసరి వారి హృదయాలను స్పందంపజేయటమే ఇందుకు కారణం. సతీసహగమనం, బాల్యవివాహాలను రద్దుపరిచి, వితంతు వివాహాలను చట్టబద్ధం చేయడంవల్ల బ్రిటిష్ వారి ఈ చర్యలు సాధారణ భారతీయుడికి తన సాంఘిక జీవనం కదిలించినట్లు భ్రమించారు. క్రైస్తవ మిషనరీలు హిందువులను, ముస్లింలను తమ మతంలోకి మార్చారు. వారి హిందు, ఇస్లాం మతాలను బహిరంగంగా విమర్శించారు. కంపెనీ డైరెక్టర్ల అధ్యక్షుడైన మాంజెల్స్ పార్లమెంట్లో కింది విధంగా ప్రకటించాడు.
-భారతదేశం ఒక చివర నుంచి మరొక చివరి వరకు క్రైస్తవ పతాకం విజయవంతంగా ఎగురడం కోసం దేవుడు హిందుస్థాన్ సామ్రాజ్య విస్తరణను ఇంగ్ల్లండ్కు అప్పగించాడు. మిషనరీలకు అనేక సౌకర్యాలను కల్పించాడు. 1856లో గవర్నర్ జనరల్‌గా వచ్చిన లార్డ్ కానింగ్‌ను భారతీయులను క్రైస్తవ మతానికి మార్పిడి చేయడం కోసం ప్రత్యేకంగా నియమించారనే వదంతి వ్యాపించింది. 1856లో ప్రవేశపెట్టిన ఒక చట్టం ప్రకారం మతం మార్చుకున్నంత మాత్రాన తండ్రి ఆస్తికి తనయుడు అధికారం కోల్పోడని తెలియజేసింది. తంతి, ఆవిరి నౌకలు, రైల్వేలు ప్రవేశపెట్టడం కూడా ప్రజల్లో అనుమానాలను రేకిత్తించాయి. వారి మతాన్ని కించపర్చడం కోసం పరోక్షంగా చేసే ప్రయత్నాలని వారు భావించారు. పాశ్చాత్య విద్యావ్యాప్తి జాతీయ విలువలను మార్చింది. పండితులు, మౌల్వీల పలుకుబడి అవసరం తగ్గింది. వారు తమ మతం, ఆచార వ్యవహారాలు ఆపదలో ఉన్నాయని భావించారు. అయితే, వారికి ప్రజల సహకార సానుభూతులు లేకపోలేదు. సామాన్య ప్రజానీకం కూడా బ్రిటిషు వారు తమ సాంఘిక, మత విషయాల్లో అనవసర జోక్యం చేసుకొన్నారనే భావంతో నివసించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు