Stupidity | మూఢత్వంపై సమరం
– భారతదేశ చరిత్ర
పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్
-తమిళనాడులోని ఈరోడ్ సిటీలో 1879, సెప్టెంబర్ 17న పెరియార్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకటప్ప నాయకర్, చిన్మతాయమ్మాళ్.
-అణగారిన కులాల అభ్యుదయానికి నాయకత్వం వహించిన రామస్వామి సమాజంలో బ్రాహ్మణాధిక్యతను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్రాహ్మణేతర వర్గాలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని ఉద్బోధించాడు.
-1914లో ఈరోడ్ నగరపాలక సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన తాగునీటి సౌకర్యం, ఆరోగ్య పథకాలను సమర్థవంతంగా అమలుచేశాడు.
-1919లో మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాడు. కుల ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలుచేయాలని తిరుచిరాపల్లి కాంగ్రెస్ మహాసభలో ఆయన మొదటిసారిగా ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు.
-1921లో నగరంలో మద్యపాన నిషేధ ఉద్యమాన్ని నడిపారు. గాంధీజీ చేపట్టిన మద్యపాన నిషేధ ఉద్యమాన్ని సమర్థిస్తూ తన 500 తాటిచెట్లను కూల్చివేశాడు.
-కేరళలోని వైకోం పట్టణంలో అంటరానితనానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించి ప్రజానాయకుడయ్యాడు.
-పెరియార్ తన భావాలను ప్రచారం చేయడానికి కుడి అరసు (ప్రజారాజ్యం), రివోల్ట్ అనే పత్రికలను ప్రారంభించాడు.
-కాంగ్రెస్‌లో బ్రాహ్మణులదే పైచేయి అని విమర్శించిన ఆయన బ్రాహ్మణేతరులకు ఉద్యోగాలు, శాసనసభ స్థానాల్లో ప్రత్యేకంగా కేటాయింపులు జరపాలని కోరాడు.
-బ్రాహ్మణేతరులపట్ల కాంగ్రెస్ దృక్పథంపై తీవ్రంగా అసంతృప్తి చెంది 1925లో అందులో నుంచి బయటకు వచ్చాడు.
-అప్పటి సామాజిక రాజకీయ స్థితిగతుల్లో అణగారిన కులాల విమోచనకోసం, వారిలో స్వయం గౌరవ భావన, చైతన్యం ప్రబోధించి సామాజిక సమానతను సాధించేందుకు పెరియార్ 1925, డిసెంబర్లో ఆత్మగౌరవ ఉద్యమాన్ని (Self Respect Movement) ప్రారంభించాడు.
-తన పేరు చివరన కులాన్ని సూచిస్తున్న నాయకర్ను తొలగిస్తున్నానని ప్రకటించాడు.
-పురోహితుడు, పెండ్లి తంతులేని నిరాడంబరమైన స్వయం గౌరవ ప్రధానమైన పూలదండల పెండ్లి విధానాన్ని (కుల మతాలకు అతీతంగా పూల దండలు మార్చుకోవడం) దేశంలో ప్రచారం చేశాడు.
-పెరియార్ తన జీవితకాలంలో మలేషియా, గ్రీస్, సోవియట్, పోర్చుగల్, రష్యా, జర్మనీ, ఇంగ్లండ్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, టర్కీ మొదలైన దేశాల్లో పర్యటించి కార్మిక, కర్షక సంఘాలను ఉద్దేశించి ఉపన్యాలు చేశాడు.
-1970, జూన్ 27న పెరియార్‌ను ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో పెరియార్ నూతన యుగానికి ప్రవక్త, ఆగ్నేయాసియా దేశాల సోక్రటీసు, సంఘ సంస్కరణోద్యమానికి తండ్రి, అజ్ఞానం, మూఢనమ్మకాలు, అర్థరహితమైన, నిరాధారమైన ఆచార సంప్రదాయాలకు బద్ద శత్రువుగా అభివర్ణించింది.
డీకే కార్వే (1858-1962)
-గొప్ప విద్యావేత్త, సంఘ సంస్కర్త అయిన దొండో కేశవ్ కార్వే మహారాష్ట్రలోని షేరావలిలో 1858, ఏప్రిల్ 18న జన్మించాడు.
-1892లో పుణేలోని ఫెర్గూసన్ కళాశాలలో ఆచార్య పదవిని స్వీకరించాడు.
-1893లో వితంతు వివాహం చేసుకుని వితంతు వివాహ సమాజాన్ని స్థాపించాడు. 1896లో హిందూ వితంతు భవనాన్ని ప్రారంభించాడు.
-పునర్వివాహం చేసుకున్న స్త్రీలకు కలిగే సంతానం కోసం ఒక వసతి గృహాన్ని ప్రారంభించాడు.
-1916లో బొంబాయిలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడు.
-విరాళాలు సేకరించి 50 గ్రామాల్లో ప్రాథమిక విద్యను బోధించడానికి స్వచ్ఛందంగా పాఠశాలను ప్రారంభించాడు.
-సాంఘిక సంస్కరణోద్యమానికి కార్వే చేసిన విశిష్ట సేవలను గుర్తించిన ప్రభుత్వం 1958లో ఆయనను అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో సత్కరించింది.
కందుకూరి వీరేశలింగం పంతులు
-1848, ఏప్రిల్ 16న రాజమండ్రిలో సుబ్బారాయుడు, పూర్ణమ్మలకు జన్మించాడు.
-తాను నమ్మిన సిద్ధాంతాలను సమర్థవంతంగా ప్రచారం చేసేందుకు వివేకవర్థిని అనే పత్రికను 1874లో రాజమండ్రిలో ప్రారంభించాడు.
-స్త్రీ విద్యను వ్యతిరేకించేవారిని అపహాస్యం చేస్తూ కవిత్వాన్ని చెప్పడమే కాకుండా నాటికలను కూడా రచించాడు.
-తాను రాసిన బ్రహ్మ వివాహం గ్రంథంలో బాల్య వివాహాలను, కన్యాశుల్కాన్ని తీవ్రంగా నిరసించాడు.
-1874, సెప్టెంబర్‌లో ధవళేశ్వరం వద్ద ఒక బాలికల పాఠశాలను స్థాపించాడు. 1881లో రాజమండ్రిలోని ఇన్నీస్‌పేటలో బాలికల పాఠశాలను ప్రారంభించాడు.
-వీటితోపాటు హరిజన పాఠశాలలు, శ్రామికుల కోసం రాత్రి బడులను స్థాపించాడు.
-1880లో వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించి 1881 డిసెంబర్ 11న రాజమండ్రిలో మొదటి వితంతు వివాహాన్ని జరిపించాడు.
-1897లో మద్రాస్‌లో, 1905లో రాజమండ్రిలో వితంతు శరణాలయాలు కట్టించాడు.
-1883లో స్త్రీలకు ప్రత్యేకంగా సతీహితబోధిని అనే మాస పత్రికను ప్రారంభించాడు.
-1905, డిసెంబర్ 15న తాను స్థాపించిన వివిధ సంస్థల నిర్వహణ కోసం హితకారిణి సమాజం అనే కేంద్ర సంస్థను ఏర్పాటుచేశాడు.
రఘుపతి వెంకటరత్నం నాయుడు
-మహిళా విద్యావ్యాప్తికి వెంకటరత్నం నాయుడు కృషిచేశాడు. పీఆర్ కళాశాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించడమే కాకుండా వెనుకబడిన వర్గాలు, పేద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేశాడు.
-బ్రహ్మసమాజంలో చేరి కాకినాడలో బ్రహ్మధర్మ అనే సంస్థను నెలకొల్పాడు.
-1923లో మద్రాస్ శాసనమండలి సభ్యుడిగా ఉన్న సమయంలో మద్యనిషేధం బిల్లు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేశాడు. వేశ్యావృత్తి నిర్మూలనకు కృషి చేశాడు.
-బ్రహ్మ ప్రకాశిక, ఫెలో వర్కర్, పీపుల్స్ ఫ్రెండ్ అనే పత్రికలను ప్రారంభించాడు.
-ఆంధ్ర ప్రాంతంలో శుద్ధి ఉద్యమాన్ని నిర్వహించిన ఆయన మద్రాస్ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశాడు.
-1889లో తన భార్య మరణించడంతో జీవితాంతం తెల్లటి దుస్తులే ధరించాడు. ఈయనను శ్వేతాంబర రుషి అని పిలిచేవారు.
-తన నెలవారీ ఆదాయంలో కొంతభాగం ఉంచుకుని మిగతాది పేద విద్యార్థుల కోసం ఉపయోగించేవాడు. విజ్ఞానాభివృద్ధి కోసం తన గురువైన డా. మిల్లర్ పేరిట మద్రాసు విశ్వవిద్యాలయంలో రూ. 10వేలతో ఒక నిధిని ఏర్పాటు చేశాడు.
పార్శీ ఉద్యమం
-1851లో రహనుమాయ్ మజ్ డయాన్ సభను పార్శీలు ఏర్పాటుచేసుకున్నారు.
-పార్శీలలో సాంఘిక ఉన్నతిని పెంచే చర్యలు, జొరాస్ట్రియన్ మత పవిత్రతను కాపాడటం వీరి లక్ష్యాలు.
-రాస్త్ గోఫ్తార్ అనే పత్రికను నడిపారు.
-దాదాభాయ్ నౌరోజీ, నౌరోజీ ఫర్డోంజి, ఎస్ఎస్ బెంగాలీ, మేడం కామా మొదలైనవారు ఈ సంఘంలో ముఖ్యనాయకులు.
సిక్కు సంస్కరణ ఉద్యమం
-1873లో సింగ్ సభ ఉద్యమం అమృత్‌సర్‌లో ఏర్పడింది.
-సిక్కు కమ్యూనిటీలో ఆధునిక విద్యను వ్యాపింపజేయడం, క్రిస్టియన్ మిషనరీలు, పునరుజ్జీవ హిందూ అంశాల నుంచి సిక్కు మతాన్ని రక్షించుకోవడం ఈ సంస్థ లక్ష్యాలు.
అకాలీ ఉద్యమం
-సిక్కు దేవాలయాలైన గురుద్వారాలలో మొహంతులు అనే పూజారుల ఆధిపత్యానికి నిరసనగా ఈ ఉద్యమం ప్రారంభమైంది.
-సత్యాగ్రహ పూరిత అహింసాయుత విధానాలను అనుసరించి 1922లో సిక్కు గురుద్వారా చట్టం చేసుకుని సిక్కు గురుద్వారా ప్రబంధ కమిటీల (ఎస్జీపీసీ)కు దేవాలయ నిర్వహణను అనుమతించారు.
ముస్లిం సంస్కరణ ఉద్యమాలు
అలీగర్ ఉద్యమం
-ఈ ఉద్య మాన్ని సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ 1875లో ప్రారంభించాడు.
-ఇతడు తహజీబ్ ఉల్ అతలక్ అనే పత్రికను స్థాపించి, యునైటెడ్ పాట్రియాటిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను స్థాపించాడు.
-అలీగర్‌లో మహ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీనా స్థాపించాడు. ఇదే 1920లో అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అయ్యింది.
-ఈయన బ్రిటిష్ విద్యను సైన్సు నేపథ్యంలో ఖురాన్‌ను వ్యాఖ్యానించాడు.
-ముస్లింల విద్యద్వారా ఆధునీకరించబడి ముందుకు పోవాలన్నాడు.
దియోబంద్ ఉద్యమం
-ఈ ఉద్యమాన్ని మహ్మద్ ఖాజిం నటావి 1866లో ధియోబంద్లో ప్రారంభించాడు.
-ఖురాన్‌లోని పవిత్ర అంశాలను ముస్లింలకు బోధించడం, ముస్లింలను ఉన్నతులుగా తీర్చిదిద్దడం, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జిహాద్ స్ఫూర్తిని నింపడం దీని ఆశయాలు.
అహరార్ ఉద్యమం
-ఈ ఉద్యమాన్ని మౌలానా మహ్మద్ అలీ 1910లో ప్రారంభించాడు.
-భారతీయులకు స్వాతంత్య్రం రావాలని తెలిపి, ముస్లిం సోదరులను జాతీయ పోరాటంలో భాగంగా కాంగ్రెస్‌లో చేరాలని పిలుపునిచ్చింది.
అహ్మదీయ ఉద్యమం
-దీన్ని మీర్జా గులాం అహ్మద్ పంజాబ్‌లో ప్రారంభించాడు.
-ఇది క్రిస్టియన్ మిషనరీలకు, ఆర్య సమాజవాదులకు వ్యతిరేకంగా పుట్టింది.
-ఇస్లాం సంఘాన్ని సంస్కరించుకోవాలనే ఆలోచనతో ఏర్పాటయ్యింది.
ముఖ్యాంశాలు
-కలకత్తాలో జేఈడీ బెథోన్ అనేక బాలికల పాఠశాలలను నెలకొల్పాడు.
-మద్రాస్‌లో వేద్ సమాజ్ను కే శ్రీధర్ నాయుడు స్థాపించాడు.
-1863లో అబ్దుల్ లతీఫ్ మహ్మదన్ లిటరరీ సొసైటీని కలకత్తాలో ప్రారంభించాడు.
-యంగ్ బెంగాల్ ఉద్యమం ప్రారంభించిన డిరీజియో ఫ్రెంచి విప్లవం నుంచి స్ఫూర్తిని పొందాడు. ఈస్ట్ ఇండియా అనే పుస్తకాన్ని రాసిన ఈయన ఫస్ట్ నేషనలిస్ట్ పోయెట్ ఆఫ్ ఇండియాగా పిలువబడ్డాడు. పాత సంప్రదాయాలు, హేతుబద్ధత లేని కుల విచక్షణలను ఖండించాడు. దీంతోపాటు బ్రిటిష్ వలసలలో భారతీయ కార్మికులకు మంచి స్థితిగతులను కల్పించాలని కోరాడు.
-సురేంద్రనాథ్ బెనర్జీ యువ బెంగాల్ ఉద్యమ కార్యకర్తలను The Poineers of Modern civilization of Bengal గా కీర్తించాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు