బి. వర్షపు నీరు భూమిని చేరిన తర్వాత అల్ప ఉష్ణోగ్రత వల్ల మంచు కణాలుగా మారడం 2. రైమ్
సి. అతి ఎత్తులో ఉన్న మేఘాలు అత్యంత చల్లగా ఉండి, మేఘాల పైభాగంలో ఏర్పడే అవపాతం
3. తుంపర
డి. నేల మీద ఉన్న పచ్చ గడ్డి పెరకల మీద జరిగే ద్రవీభవనం
4. తుషారం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-1, బి-4, సి-2, డి-3
2. అనిశ్చిత వాక్యం (ఏ): చిరపుంజి (మాసిన్గ్రామ్)లో వర్షపాతం ఎక్కువ కారణం (ఆర్): ఇది హిమాలయ పర్వతాలకు పవనాభిముఖ దిశలో ఉండటం
1) ఏ సరైనది, ఆర్ సరైనది. ఏకు ఆర్ సరైనవివరణ కాదు
2) ఏ సరికాదు, ఆర్ సరికాదు
3) ఏ, ఆర్లు రెండూ సరికాదు
4) ఏ, ఆర్లు రెండూ సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ
3. కిందివాటిలో సరికాని జత.
1) సుందాట్రెంచ్- హిందూ మహాసముద్రం
2) సముద్రపు విశాల అంచు- ఆర్కిటిక్ మహాసముద్రం
3) సముద్ర భూతల స్వరూపాలను తెలుసుకునే పరికరం- అంగస్
4) అత్యధిక జలభాగం ఉన్నది- ఉత్తరార్ధగోళం
4. కిందివాటిని జతపర్చండి.
ఎ. ఏంజెల్ జలపాతం
1. మాండవి నది
బి. విక్టోరియా జలపాతం
2. గాజా నది
సి. దూద్‌సాగర్ జలపాతం
3. టుగెలా నది
డి. టుగెలా జలపాతం
4. జాంబేజీ నది
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-4, బి-1, సి-3, డి-2
4) ఎ-4, బి-2, సి-1, డి-3
5. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. నైలు నది- టాంజానియా, ఉగాండా, సూడాన్, ఈజిప్టు దేశాల్లో ప్రవహిస్తుంది
బి. బ్రహ్మపుత్ర నది- టిబెట్, చైనా, భారత్, బంగ్లాదేశ్ దేశాల్లో ప్రవహిస్తుంది
సి. వోల్గా నది- రష్యా, జర్మనీ దేశాల్లో ప్రవహిస్తుంది
డి. మిసిసిపి నది- కెనడా, అమెరికా (అలస్కా) దేశాల్లో ప్రవహిస్తుంది
1) ఎ, బి, సిలు సరైనవి, డి సరికానిది
2) ఎ, బి, సిలు సరికాదు, డి సరైనది
3) ఎ, బిలు సరైనవి, సి, డిలు సరికాదు
4) ఎ, బిలు సరికాదు, సి,డిలు సరైనవి
6. కింది తెగలు, ప్రదేశాలను జతపర్చండి.
ఎ. సైమైట్స్
1. పశ్చిమ ఆస్ట్రేలియా
బి. పపువాన్స్
2. తూర్పు ఆఫ్రికా
సి. కికుయూ
3. న్యూగినియా
డి. బిండిబూ
4. ఇథియోపియా
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
7. కిందివాటిలో సరికాని జత.
1) మాజినాట్లైన్- ఇది ఫ్రాన్స్, జర్మనీల మధ్య సరిహద్దు రేఖ
2) 49వ ప్యారలల్ రేఖ- ఇది అమెరికా, కెనడా మధ్య సరిహద్దు రేఖ
3) డ్యురాండ్ రేఖ- ఇది భారత్, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య సరిహద్దు రేఖ
4) హిడన్‌బర్గ్ రేఖ- ఇది జర్మనీ, ఫ్రాన్స్‌ల మధ్య సరిహద్దు రేఖ
8. ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ అనేది వేటిమధ్య సరాసరి దూరం?
1) భూమి, చంద్రులు
2) భుమి, సూర్యుడు
3) సూర్యుడు, చంద్రుడు
4) బుధుడు, సూర్యుడు
9. భూమి నుంచి చంద్రుని ఉపరితలాన్ని ఎంత శాతం చూడవచ్చు.
1) 65 శాతం కంటే ఎక్కువ
2) 40 శాతం వరకు
3) 59 శాతం వరకు
4) 75 శాతం కంటే తక్కువ
10. సూర్యపుటం అనేది కింది ఏ కారకాలపై ఆధారపడదు?
ఎ. ఉపరితల ఉష్ణోగ్రత
బి. సౌరస్థిరాంకం
సి. భూభ్రమణం
డి. పగటి కాలం
1) ఎ, సి
2) బి, డి
3) ఎ, బి, సి
4) సి, డి
11. కిందివాటిలో సెడిమెంటరీ శిలలు ఏవి?
ఎ. లైమ్‌స్టోన్
బి. బసాల్ట్
సి. షేల్
డి. గ్రానైట్
ఇ. క్వార్టెజ్
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) సి, డి, ఇ
12. రూపాంతర శిలలు దేని నుంచి ఏర్పడుతాయి?
1) అవక్షేప శిలలు
2) అగ్నిశిలలు
3) అవక్షేప, అగ్నిశిలల వల్ల
4) ఏదీకాదు
13. కిందివాటిలో కాఫీ పండించడానికి అవసరమైన కారకాలు ఏవి?
ఎ. అధిక ఉష్ణోగ్రత
బి. అధిక (కాంతివంతమైన సూర్యుడు)
సి. అధిక ఎత్తు
డి. నీడ
1) ఎ, సి
2) ఎ, డి
3) బి, సి
4) ఎ, బి, డి
14. పరిశ్రమల్లో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ ఏది?
1) చక్కెర పరిశ్రమ
2) తేయాకు శుద్దీకరణ
3) ఐరన్, స్టీలు పరిశ్రమ
4) పత్తి పరిశ్రమ
15. ట్రోపోస్పియర్ మందం ఎప్పుడు పెరుగుతుంది?
1) శీతాకాలం
2) శరత్ కాలం
3) వేసవి కాలం
4) వసంత కాలం
16. వాతావరణంలోని ఏ పొర ఇంచుమించు క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతకు సమానంగా ఉంటుంది?
1) స్ట్రాటో ఆవరణం
2) ట్రోపో ఆవరణం
3) ట్రోపోపాస్
4) పైవన్నీ
17. డోల్ డ్రమ్ బెల్ట్ ఎక్కడ ఉంది?
1) మకర రేఖ పైన
2) కర్కటరేఖపై
3) భూమధ్యరేఖ వద్ద
4) ధృవాల వద్ద
18. పచ్చల ద్వీపం (ఎమరాల్డ్ ఐలాండ్) అని పేరుగాంచినది?
1) ఆస్ట్రేలియా
2) బ్రిటన్
3) సిసిలీ
4) ఐర్లాండ్
19. ఆసియాలో అతి పొడవైన నది?
1) గంగానది
2) బ్రహ్మపుత్ర నది
3) హొయాంగ్ హో
4) యాంగ్ట్జీ
20. ఐరోపా-భారతదేశానికి మధ్య మార్గాన్ని తగ్గించిన కాలువ?
1) బహింగ్హమ్ కాలువ
2) రాజస్థాన్ కాలువ
3) పనామా కాలువ
4) సూయజ్ కాలువ
21. ఆసియాలో ప్రఖ్యాతిగాంచిన ఏ సరస్సు ఉత్తరతీరం అత్యధిక విలువైన రాగి నిధులతో సమృద్ధిగా ఉంటూ C- ఆకారంలో కనిపిస్తున్నది.
1) రష్యాలోని బైకాల్ సరస్సు
2) కాంబోడియాలోని టోన్ లిసప్ సరస్సు
3) కజకిస్తాన్‌లోని బల్కాష్ సరస్సు
4) భారత్‌లోని చిల్క సరస్సు
22. కిందివాటిలో సరికాని జత
1) ఆఫ్రికా- స్టెప్పీలు
2) ఆస్ట్రేలియా- డౌనులు
3) హంగెరీ- పుస్తాజ్
4) దక్షిణ అమెరికా- పంపాలు
23. హిందూ మహాసముద్ర ద్వీపంలో డిగో గార్షియా మిలిటరీ స్థావరం కలిగి ఉన్న దేశం?
1) రష్యా
2) అమెరికా
3) చైనా
4) ఇంగ్లండ్
24. సాధారణంగా మహా సముద్రాల్లో చేపలు, చమురు, సహజవాయువు నిక్షేపాలు దేనికి పరిమితమై ఉంటాయి?
1) ఖండతీరపు అంచు
2) ఖండతీరపు వాలు
3) అగాధదరులు
4) రిడ్జ్‌లు
25. కింది ఏ జత ఖండాలు దాదాపు పరిపూర్ణమైన జిగ్సా పూరకాలుగా కనిపిస్తాయి?
1) ఆసియా, ఆఫ్రికా
2) ఆసియా, ఐరోపా
3) దక్షిణాఫ్రికా, ఆఫ్రికా
4) ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా
26. దేన్ని కొలవడానికి కెల్విన్ స్కేల్‌ను ఉపయోగిస్తారు?
1) ఉష్ణోగ్రత
2) కాంతి శక్తి
3) ధ్వని తీవ్రత
4) ఉష్ణశక్తి
27. ఉష్ణమండల ఎడారులు లేని ఖండం?
1) ఆస్ట్రేలియా
2) యూరప్
3) అంటార్కిటికా
4) దక్షిణ అమెరికా
28. అమెరికాలో మూడు రాష్ర్టాలను ఆవరించి ఉన్న నేషనల్ పార్క్ ఏది?
1) కాలిఫోర్నియా
2) సిలికాన్ వ్యాలీ
3) ఫినిక్స్
4) యెల్లో స్టోన్
29. ప్రతి గ్రహణం మళ్లీ అదేవిధంగా ఏర్పడటానికి పట్టే సమయం?
1) 10 ఏండ్ల 10 రోజులు
2) 18 ఏండ్ల 10 రోజులు
3) 16 ఏండ్ల 10 రోజులు
4) 16 ఏండ్ల 12 రోజులు
30. గ్రహణం క్రమంగా అంతమయ్యే క్రమంలో సూర్యుని ఉపరితల అంచు ప్రకాశవంతంగా కనబడటాన్ని ఏమంటారు?
1) బెయిలీస్ బీడ్స్
2) రవి నీచ
3) రవి ఉచ్ఛ
4) డైమండ్ రింగ్
31. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అధికంగా ఉన్న గ్రహం?
1) బుధుడు
2) శుక్రుడు
3) శని
4) గురుడు
32. కిందివాటిలో గ్రీన్హౌస్ వాయువు కానిది?
1) మీథేన్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) నైట్రస్ ఆక్సైడ్
4) ఆక్సిజన్
33. ఆకాశంలో నీలిరంగుకు కారణమయ్యే ప్రక్రియ?
1) కాంతి వక్రీభవనం
2) కాంతి వివర్తనం
3) కాంతి పరిక్షేపణం
4) కాంతి పరావర్తనం
34. ప్రపంచంలో అత్యంత పొడవైన జలసంధి?
1) టార్టార్
2) పాక్
3) డేవిస్
4) బారో
35. హిమనీ నద క్రమక్షయ భూస్వరూపాలు కానివి?
1) ఫయోర్డ్స్
2) U ఆకారపు లోయ
3) టారెన్స్
4) స్టాలక్ టైట్
36.ఎండిపోతూ నశించిపోతున్నదని పేర్కొంటున్న సముద్రం?
1) కాస్పియన్
2) మృత
3) ఎర్ర
4) పసుపు
37. ఏ ఖండాన్ని ల్యాండ్ ఆఫ్ సూపర్లేటివ్స్ అంటారు?
1) ఉత్తర అమెరికా
2) దక్షిణ అమెరికా
3) ఆఫ్రికా
4) ఆసియా
38. కర్కటరేఖ, భూమధ్యరేఖ, మకర రేఖ ప్రయాణించే ఏకైక ఖండం?
1) ఆసియా
2) ఆస్ట్రేలియా
3) ఆఫ్రికా
4) ఉత్తర అమెరికా
39. ఉత్తర అమెరికా క్రీడా ప్రాంగణం అని దేన్ని పిలుస్తారు?
1) కెనడా
2) అలస్కా
3) కాలిఫోర్నియా
4) గ్రీన్లాండ్
40. ప్రపంచ నీటివనరుల దినోత్సవం?
1) జూలై 15
2) జూన్ 22
3) మార్చి 22
4) మే 21