రాజ్యాంగం ప్రకారం ప్రధాని పదవీకాలం?
1. రాష్ట్రపతి ద్వారా వీటో కాని బిల్లులకు సంబంధించి తప్పుగా ఉన్నది?
1) రాజ్యాంగ సవరణ బిల్లులు
2) ద్రవ్య బిల్లులు
3) ఆస్తుల జాతీయీకరణ బిల్లులు
4) ప్రాథమిక హక్కుల సవరణ బిల్లులు
2. రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ప్రకటించేది?
1) ఉపరాష్ట్రపతి
2) ప్రధానమంత్రి
3) లోక్‌సభ స్పీకర్
4) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
3. కింది వాటిలో రాష్ట్రపతికి లేని వీటో అధికారం?
1) అబ్సల్యూట్ వీటో
2) సస్పెన్సివ్ వీటో
3) క్వాలిఫైడ్ వీటో
4) పాకెట్ వీటో
4. పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన రాష్ట్రపతి అధికారాల్లో తప్పుగా ఉన్నది?
1) ప్రోరోగ్
2) సమ్మన్
3) అడ్జర్న్
4) డిస్సెల్యూషన్
5. రాష్ట్రపతి మహాభియోగ తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు లోక్‌సభ స్పీకర్ ఏర్పాటు చేసే కమిటీలోని సభ్యుల్లో లేనివారు?
1) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
2) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
3) న్యాయ నిపుణుడు
4) భారత ప్రభుత్వ న్యాయాధికారి
6. రాజ్యాంగపరమైన విషయాల్లో రాష్ట్రపతి అత్యున్నత న్యాయస్థానం సలహాలను కోరినప్పుడు ఎంతమంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తన సలహాలను తీర్పు రూపంలో తెలుపుతుంది?
1) ముగ్గురు
2) నలుగురు
3) ఐదుగురు
4) పరిమితిలేదు
7.రాష్ట్రపతి ఎన్నిక వివాదాల పరిష్కారం సుప్రీంకోర్టు ఏ అధికార పరిధి కిందకు వస్తుంది?
1) సలహాపూర్వక అధికార పరిధి
2) ప్రారంభ అధికార పరిధి
3) అప్పిలేట్ అధికార పరిధి
4) రిట్ అధికార పరిధి
8. రాష్ట్రపతి 12 మంది విశిష్ట సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేయడమనే భావనను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) ఆస్ట్రేలియా
2) కెనడా
3) 1935 చట్టం
4) ఐర్లాండ్
9. ద్రవ్యబిల్లులకు రాష్ట్రపతి పూర్వానుమతి అవసరమనే భావనను ఎక్కడ నుంచి గ్రహించారు?
1) ఆస్ట్రేలియా
2) కెనడా
3) 1935 చట్టం
4) ఐర్లాండ్
10.రాష్ట్రపతి దేశంలో అత్యవసర పరిస్థితిని ఎలా విధిస్తారు?
1) క్యాబినెట్ మౌఖిక సలహా మేరకు
2) క్యాబినెట్ రాతపూర్వక సలహా మేరకు
3) ప్రధాని సూచన మేరకు
4) తనే స్వయంగా విధిస్తాడు
11.రాష్ట్రపతి జీతభత్యాలు, ప్రమాణ స్వీకారాల గురించి పేర్కొనే షెడ్యూళ్లు?
1) 2, 3
2) 3, 2
3) 3, 4
4) 2, 4
12. రాష్ట్రపతి బడ్జెట్ స్పీచ్‌ను ఎవరు రూపొందిస్తారు?
1) ప్రధాని
2) క్యాబినెట్
3) రాష్ట్రపతి కార్యదర్శి
4) ప్రధానమంత్రి కార్యాలయం
13. రాష్ట్రపతి తన కార్యనిర్వహణ కార్యకలాపాల్లో భాగంగా చేపట్టే నియామకాలకు సంబంధించి సరికానిది?
1) భారత ప్రధాన న్యాయమూర్తి
2) అడ్వకేట్ జనరల్
3) లెఫ్టినెంట్ గవర్నర్
4) రాష్ట్ర అత్యున్నత న్యాయమూర్తులు
14. రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం పద్దతి గురించి తప్పుగా ఇచ్చినది?
1) తీర్మానాన్ని కేవలం లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి
2) తీర్మానానికి ఉభయసభల్లో అబ్సల్యూట్ మెజారిటీ కావాలి
3) తీర్మానానికి 14 రోజుల ముందస్తు నోటీసు తీసుకోవాలి
4) రాష్ట్రపతిపై విచారణ కోసం న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య కూటమిని ఏర్పాటు చేయాలి
15. రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్స్‌లను …..
1) న్యాయసమీక్షకు గురిచేయవచ్చు
2) న్యాయసమీక్షకు గురిచేయలేం
3) 1 లేదా 2
4) ఏదీకాదు
16. రాష్ట్రపతి న్యాయాధికారాల గురించి తెలిపే అధికరణ?
1) 71
2) 72
3) 74
4) 73
17. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సరికానిది?
1) రాష్ట్రపతి నామినేషన్‌ను 50 మంది ప్రతిపాదించి, 50 మంది బలపర్చాలి
2) జన్మతః గానీ సహజీకృత పద్దతిలో గానీ భారత పౌరసత్వం పొంది ఉండాలి
3) పార్లమెంటుకు ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలు కలిగి ఉండాలి
4) ఎన్నికల్లో కోటా శాతం ఓట్లు పొంది ఉండాలి
18. రాష్ట్రపతి శాసనాధికారాలకు సంబంధించి సరికానిది?
1) పార్లమెంటును సమావేశపరుస్తాడు
2) పార్లమెంటును రద్దుచేస్తాడు
3) ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తాడు
4) ప్రోటెం స్పీకర్‌ను నియమిస్తాడు
19. రాష్ట్రపతి ఏ సందర్భంలో లోక్‌సభకు తాత్కాలిక స్పీకర్‌ను నియమిస్తాడు?
1) స్పీకర్ పదవి ఖాళీ అయినప్పుడు
2) డిప్యూటీ స్పీకర్ ఖాళీ అయినప్పుడు
3) ప్యానెల్ స్పీకర్ పదవి ఖాళీ అయినప్పుడు
4) పైవన్నీ
20. రాష్ట్రపతి న్యాయాధికారాలకు సంబంధించి కముటేషన్ అంటే ….?
1) శిక్ష కాలాన్ని తగ్గించడం
2) శిక్ష స్వరూపాన్ని మార్చడం
3) శిక్షను వాయిదావేయడం
4) క్షమాభిక్ష ప్రసాదించడం
21. రాష్ట్రపతి ఒక బిల్లును పార్లమెంటు పునఃపరిశీలన కోసం వెనక్కు పంపితే?
1) సాధారణ మెజారిటీతో తిరిగి పార్లమెంటు ఆమోదించి పంపాలి
2) అబ్సల్యూట్ మెజారిటీతో తిరిగి పార్లమెంటు ఆమోదించి పంపాలి
3) తిరిగి రాష్ట్రపతి దగ్గరికి పంపాల్సిన అవసరంలేదు
4) బిల్లు రద్దవుతుంది
22. రాష్ట్రపతి జీతభత్యాలను ఏ సందర్భాల్లో కుదించవచ్చు?
1) జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో
2) ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో
3) సైనిక పాలన సమయంలో
4) పై అన్ని సందర్భాల్లో
23. రాష్ట్రపతికి సంబంధించి సరికానిది?
1) రాజ్యాధినేత
2) రాజ్యాంగాధినేత
3) ప్రభుత్వాధినేత
4) దేశ సార్వభౌమాధికారి
24. రాష్ట్రపతి విశ్వాసం మేరకు పదవిలో కొనసాగేవారు?
1) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
2) హైకోర్టు న్యాయమూర్తులు
3) కేంద్రమంత్రి మండలి
4) పై అందరూ
25. రాష్ట్రపతి ఎలక్ట్రోరల్ కాలేజీలో సభ్యులుకాని వారు?
1) ఎన్నికైన ఎమ్మెల్యేలు
2) ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
3) ఎన్నికైన రాజ్యసభ సభ్యులు
4) రాష్ట్ర ఎగువసభ సభ్యులు
26. దేశంలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తొలి ప్రధాని?
1) మొరార్జీ దేశాయ్
2) చరణ్ సింగ్
3) నెహ్రూ
4) వీపీ సింగ్
27. దేశంలో విశ్వాస తీర్మానం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధాని?
1) మొరార్జీ దేశాయ్
2) చరణ్ సింగ్
3) నెహ్రూ
4) వీపీ సింగ్
28. ఒక వ్యక్తి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి?
1) లోక్‌సభ సభ్యుడై ఉండాలి
2) రాజ్యసభ సభ్యుడై ఉండాలి
3) పార్లమెంటు సభ్యత్వం ఉండాలి
4) పార్లమెంటు సభ్యత్వం తప్పనిసరి కాదు
29. కింది వాటిలో ప్రధాని చైర్మన్‌గా వ్యవహరించే సంస్థలకు సంబంధించి తప్పుగా ఉన్నది?
1) జాతీయ సమగ్రతా మండలి
2) జాతీయ జనాభా నియంత్రణ మండలి
3) జాతీయాభివృద్ధి మండలి
4) జాతీయ అధికార భాషా సంఘం
30. ప్రధానమంత్రి కింది ఏ సందర్భంలో పదవిని కోల్పోతాడు?
ఎ. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు
బి. లోక్‌సభలో విశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు
సి. లోక్‌సభలో కోత తీర్మానం నెగ్గినప్పుడు
డి. ధన్యవాద తీర్మానం నెగ్గినప్పుడు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, డి
31. రాజ్యసభలో సుదీర్ఘకాలం పాటు సభా నాయకుడిగా వ్యవహరించిన ప్రధాని?
1) ఇందిరాగాంధీ
2) హెచ్డీ దేవెగౌడ
3) మన్మోహన్ సింగ్
4) వాజ్‌పేయి
32. పార్లమెంటు సభ్యత్వంలేకుండా ప్రధాని అయిన తొలి వ్యక్తి?
1) పీవీ నర్సింహారావు
2) హెచ్డీ దేవెగౌడ
3) వీపీ సింగ్
4) చంద్రశేఖర్
33.రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి పదవీకాలం?
1) ఐదేండ్లు
2) నాలుగేండ్లు
3) ఆరేండ్లు
4) పేర్కొనబడలేదు
34. ప్రధానమంత్రికి సంబంధించి సరికానిది?
1) ప్రభుత్వాధినేత
2) వాస్తవ కార్యనిర్వహణాధికారి
3) క్యాబినెట్ అధినేత
4) పార్లమెంట్ కస్టోడియన్
35. ప్రధానిగా పార్లమెంటు గడప తొక్కని ఏకైక వ్యక్తి?
1) చరణ్ సింగ్
2) ఐకే గుజ్రాల్
3) చంద్రశేఖర్
4) వీపీ సింగ్
36. ఏ ప్రభుత్వ హయాంలో దేశంలో తొలి సంకీర్ణ సర్కార్ ఏర్పడింది?
1) జనతా ప్రభుత్వం
2) డెమొక్రటిక్ ఫ్రంట్
3) నేషనల్ ఫ్రంట్
4) యునైటెడ్ ఫ్రంట్
37. రాజీవ్‌గాంధీకి సంబంధించి తప్పుగా ఇచ్చినది?
1) దేశంలో మొదటితరం అర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు
2) సమాచార, సాంకేతిక విప్లవాన్ని ప్రవేశపెట్టారు
3) వాస్తవిక అలీన విధానాన్ని అమలు చేశారు
4) నూతన జాతీయ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు
38. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన చట్టాలకు సంబంధించి తప్పుగా ఉన్నది?
1) జాతీయ ఆహార భద్రతాచట్టం
2) గృహహింస నిరోధక చట్టం
3) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం
4) జాతీయ బాలల హక్కుల చట్టం
39. భారత ప్రధానుల హయాంలో తీసుకువచ్చిన విధానాలు, చట్టాలను చారిత్రక క్రమంలో అమరిస్తే సరైన జవాబు?
ఎ. ఆపరేషన్ శక్తి
బి. ఆపరేషన్ బ్లూ స్టార్
సి. మండల్ కమిషన్ ఏర్పాటు
డి. లాహోర్ బస్సు యాత్ర
ఇ. ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం
1) ఎ, బి, సి, డి, ఇ
2) సి, బి, ఎ, డి, ఇ
3) ఇ, బి, సి, ఎ, డి
4) సి, ఎ, డి, ఇ, బి
40. కింది వాటిలో ప్రధానమంత్రి ప్రాబల్యం పెరగడానికి కారణమైనవి?
1) పార్టీ యంత్రాంగ గతిశీలక విధానాలు
2) విదేశీవిధానాల రూపకల్పనలో పాత్ర
3) సమ్మోహన నాయకత్వం
4) పార్టీ, ప్రభుత్వంలో అధికార కేంద్రీకరణ
5) పైవన్నీ
41. మంత్రిమండలి ఎంపికలో అంతిమ అధికారం ఎవరిది?
1) రాష్ట్రపతి
2) రాష్ట్రపతి సలహామేరకు ప్రధానమంత్రి
3) ప్రధానమంత్రి
4) ప్రధానమంత్రి సలహామేరకు రాష్ట్రపతి
42. ప్రధానమంత్రిగా తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించిన తర్వాత?
1) ప్రధాని పదవిని కోల్పోతాడు
2) ప్రధాని పదవిని, పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోతాడు
3) పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోతాడు
4) ఏదీకాదు
43. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధ్యక్షుడు ఎవరు?
1) కేంద్ర హోంశాఖ మంత్రి
2) కేంద్ర వాతావరణ శాఖ మంత్రి
3) ప్రధాని
4) కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి
44. సరైన జతను ఎన్నుకోండి?
1. మొరార్జీ దేశాయ్ ఎ. లుక్ ఈస్ట్ పాలసీ
2. పీవీ నర్సింహారావు బి. నిరంతర ప్రణాళికలు
3. వీపీ సింగ్ సి. రాజకీయ పాదయాత్రలు
4. చంద్రశేఖర్ డి. అంతరాష్ట్ర మండలి ఏర్పాటు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
45. రామజన్మభూమి-అయోధ్య విషయంలో బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో అధికారాన్ని కోల్పోయిన ప్రధాని?
1) వీపీ సింగ్
2) దేవెగౌడ
3) వాజ్‌పేయి
4) గుజ్రాల్
46. పీవీ నర్సింహారావు ఆత్మకథ?
1) ఇన్సైడ్
2) ది ఇన్సైడర్
3) ఇన్సైడ్ ది హార్ట్
4) ది ఇంట్రావర్ట్
47. తొలిసారి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన ఐక్యప్రగతిశీల కూటమి ఎన్ని పార్టీల కలయిక?
1) 15
2) 17
3) 16
4) 18
48. మైనార్టీల సంక్షేమానికి 15 సూత్రాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ప్రధాని?
1) ఇందిరాగాంధీ
2) రాజీవ్‌గాంధీ
3) పీవీ నర్సింహారావు
4) మన్మోహన్సింగ్
49. అతి తక్కువమంది లోక్‌సభ సభ్యులను కలిగి ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని?
1) వీపీ సింగ్
2) దేవెగౌడ
3) పీవీ నర్సింహారావు
4) చంద్రశేఖర్
50. కింది వారిలో ఎవరికి భారతరత్న లభించలేదు?
1) గుల్జారీలాల్ నందా
2) మొరార్జీ దేశాయ్
3) వాజ్‌పేయి
4) పీవీ నర్సింహారావు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు