తెలుగు సాహిత్య ప్రక్రియలు-నవల
స్త్రీ ప్రేమలో అర్పణ, పురుష ప్రేమలో ఆక్రమణ ప్రధానం అని తెలిపే నవల
-చింతామణి పత్రిక బహుమతి పొందిన ‘లక్ష్మీసుందరం’ నవలా రచయిత- ఖండవల్లి రామచంవూదుడు. ఇతను రచించిన మరో నవల ధర్మవతీవిలాసం.
-అడవి బాపిరాజు రచించిన నవలలు- నారాయణరావు, తుఫాను, కోనంగి, హిమబిందు, గోన గన్నాడ్డి, అడవి శాంతిశ్రీ.
-కాకతీయుల రాజ్యవైభవాన్ని తెలిపే నవల గోన గన్నాడ్డి.
-శాతవాహనుల కాలంనాటి స్థితిగతులను తెలిపే నవలలు- హిమబిందు, అడవి శాంతిశ్రీ.
-1934లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీలో విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు నవలతో పాటు బహుమతి పొందిన నవల నారాయణరావు.
-1922లో ప్రారంభించి 1945లో పూర్తిచేసిన నవల- హిమబిందు.
-వివేక చంద్రికాక్షిగంథమాలను స్థాపించినవారు- కొమపూరాజు లక్ష్మణరావు
-వేగుచుక్క గ్రంథమాలను స్థాపించినవారు- తాపీ ధర్మారావు, ఎస్ రామానుజస్వామి.
-వివేక చంద్రికా గ్రంథమాల తరఫున నిర్వహించిన నవలల పోటీలో బహుమతి పొందిన నవలలు భోగరాజు నారాయణమూర్తి రచించిన విమలాదేవి, చంద్రగుప్తుడు, అల్లాహోఅక్బర్, ఆంధ్రరాష్ట్రం.
-కపాలకుండల, ఆనందమఠం అనే బెంగాలీ నవలలను తెలుగులోకి అనువదించిన రచయిత- జీవీఎస్ దొరస్వామయ్య. ఈయన 1899లో రాసిన కపాలకుండల తెలుగులో మొదటి అనువాద నవల.
-నోరి నరసింహశాస్త్రి రచించిన నవలలు- నారాయణ భట్టు, రుద్రమదేవి, కవిసార్వభౌముడు, కవిద్వయం, ధూర్జటి.
-కాకతీయుల కాలంనాటి మత, రాజకీయ పరిస్థితులను అద్భుతంగా చిత్రించిన నవల- రుద్రమదేవి.
-మహీధర రామ్మోహనరావు రచించిన నవలలు- రథచక్షికాలు, ఓనమాలు, మృత్యువునీడల్లో, శుభలేఖ, కొల్లాయిగట్టితేనేమి, కత్తుల వంతెన, దావానలం మొదలైనవి.
-పురాణవైర గ్రంథమాల పేరుతో నవలలను రచించిన రచయిత- విశ్వనాథ సత్యనారాయణ. భారతీయ సంస్కక్షుతిని, సనాతన సంప్రదాయిక విలువలను తన రచనల ద్వారా విశ్వనాథ తెలిపారు. ఈయన రచించిన నవలలు వేయిపడగలు, ఏకవీర, చెలియలికట్ట, స్వర్గానికి నిచ్చెనలు, తెరచిరాజు, బద్దెన్న సేనాని, పులుల సత్యాక్షిగహం, మా బాబు మొదలైనవి.
-విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవలిక (చిన్న నవల)- పరీక్ష
-ఇతిహాస ప్రధానమైన నవల వేయిపడగలు. ఈ నవలలోని ప్రధాన పాత్రలు ధర్మారావు, గిరిక, పసరిక. ఈ నవలను సహవూస్ఫణ్ పేరుతో పీవీ నరసింహారావు హిందీలోకి అనువదించారు.
-ప్రేమికుల మనస్తత్వంలో ప్రేమకు, ధర్మానికి మధ్య జరిగే సంఘర్షణను చిత్రీకరించే నవల- ఏకవీర. ఈ నవలలోని ప్రధాన పాత్రలు కుట్టాన్, వీరభూపతి, ఏకవీర, మీనాక్షి.
-1925-47 మధ్య స్వాతంవూత్యోద్యమ చరివూతకు దర్పణం పట్టే నవల- అతడు-ఆమె. ఈ నవల రచయిత ఉప్పల లక్ష్మణరావు. ఈ నవలలోని కథంతా దినచర్యలాగా కొనసాగుతుంది.
-వెర్రిపడగలు నవలను రచించినవారు- ముక్కాముల నాగభూషణం.
-మొక్కపాటి నరసింహశాస్త్రి రచించిన హాస్య ప్రధాన నవల- బారిస్టర్ పార్వతీశం. పార్వతీశం మొగుల్తూరు నుంచి లండన్ ప్రయాణించడం ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం.
-స్త్రీవాద దృక్పథంతో చలం రచించిన నవలలు- శశిరేఖ, మైదానం, మాకర్మమిట్లా కాలింది, కన్నీటి కాలువ, దైవమిచ్చిన భార్య, బ్రాహ్మణీకం, అమీనా, జీవితాదర్శం.
-1921లో చలం రచించిన తొలి నవల శశిరేఖ. 1948లో రచించిన చివరి నవల జీవితాదర్శం.
-వివాహం కాకపోయినా స్త్రీపురుషులిద్దరూ భార్యాభర్తలుగా ఉండవచ్చు అన్న భావాన్ని తెలిపే నవల శశిరేఖ.
-1922లో చలం రచించిన నవల దైవమిచ్చినభార్య. ఇది ప్రేమకు, చట్టానికి మధ్య నలిగిపోయి స్త్రీ చేసే ఆక్రందన ప్రధాన కథ గల నవల. వైవాహికనీతి పట్ల, పురుషాధిక్యత పట్ల స్త్రీ తిరుగుబాటు ప్రధాన కథాంశంగల నవల దైవమిచ్చినభార్య.
-స్త్రీ ప్రేమలో అర్పణ ప్రధానమైతే, పురుష ప్రేమలో ఆక్రమణ ప్రధానం అని తెలిపే నవల- మైదానం (మై+దానం). ఈ నవలలోని ప్రధాన పాత్రలు అమీర్, రాజేశ్వరి.
-మైదానం నవలలోని భావాలను వ్యతిరేకిస్తూ విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవల చెలియలికట్ట.
-1924లో ప్రారంభించి 1942లో చలం పూర్తిచేసిన నవల- అమీనా. స్వేచ్ఛకు ప్రతీకగా చెప్పుకోదగ్గ నవల ఇది. ఈ నవల చైతన్యవూసవంతిలా కొనసాగుతుంది. ఈ నవలను అమీనాకు అంకితమిచ్చాడు చలం.
-1922లో శేషభట్టరు వెంకటరామానుజాచార్యులు రచించిన నవల- ప్రాకృతదాంపత్యం.
-వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామం నుంచి 1922లో తెనుగు పత్రిక స్థాపించి ఆరేండ్లు విజయవంతంగా నడిపిన రచయితలు- ఒద్దిరాజు సోదరులు.
-ఒద్దిరాజు సోదరుల్లో ఒకరైన సీతారామచంవూదరావు 1918లో రచించిన చారివూతక నవల రుద్రమదేవి. ఈయన రచించిన ఇతర నవలలు- శౌర్యశక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసం అనే చారివూతక నవలలు. స్త్రీ సాహసం, ముక్తలవ అనే సాంఘిక నవలలు.
-కొమపూరాజు లక్ష్మణరావు నడిపే విజ్ఞాన చంద్రికామండలి వారి బంగారు పతకాన్ని పొందిన నవల- రుద్రమదేవి.
-ఒద్దిరాజు సోదరుల్లో ఇంకొకరైన రాఘవ రంగారావు రచించిన చారివూతక నవలలు- వరాహముద్ర, వీరావేశం.
-నెల్లూరు మనుమసిద్ది రాజు రాజ్యం కోల్పోగా తిక్కన గణపతిదేవుని సహాయంతో తిరిగి అతన్ని సింహాసనమెక్కించే ఇతివృత్తం గల నవల వీరావేశం.
-ఒద్దిరాజు సోదరుల రచనల ప్రభావం చేత చారివూతక నవలలను రచించినవారు నోరి నరసింహశాస్త్రి.
-విజ్ఞాన ప్రచారిణీ క్షిగంథమాల స్థాపకులు- ఒద్దిరాజు సోదరులు.
-సురవరం ప్రతాపడ్డి రచించిన నవలలు- శుద్ధాంతకాంత, ఆరెవీరులు. పూర్తిగా రాసిన నవల ఆరెవీరులు.
-1930లో పైడిమర్రి వెంకటసుబ్బారావు రచించిన నవల- కాలభైరవుడు. ప్రతిజ్ఞ రచయిత- పైడిమర్రి. ఈయన నల్లగొండ జిల్లాకు చెందినవారు.
-నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన సయ్యద్ అలీ, అజ్మతుల్లా సోదరులు 1945-60 మధ్యకాలంలో రచించిన నవలలు- సుశీల, సుజాత, మణి, రంపరాకాసి, జాహ్నవి.
-సోమయాజుల లక్ష్మీనరసింహశాస్త్రి నవల- గిరిజ.
-‘ఎగిరే పళ్లాలు’ అనే నవల రచయిత- చివలూరి లక్ష్మీనరసింహాచార్యులు.
-యం.డి. చైతన్య పేరుతో ప్రసిద్ధిచెందిన మహ్మద్ అబ్దుల్లా రచించిన నవలలు- శిథిల గుహలు, సత్యభామ శపథం, మౌన మహారణ్యం, కాల్గరల్స్, రేపటి డైరీ.
-బొల్లిముంత శివరామశర్మ రచించిన నవల- మృత్యుంజయులు. ఇది తెలంగాణ పోరాట నేపథ్యంలో వెలువడిన తొలి నవల.
-వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన నవలలు- ప్రజల మనిషి, గంగు. ఈయన కలం పేరు ధర్మరాజు. ప్రజల మనిషి నవలలో ప్రధానపావూతలు- కంఠీరవం, కొమరయ్య, రాంభూపాల్రావు.
-ప్రజల మనిషి నవలకు సీక్వెల్గా రాసిన నవల గంగు.
-దాశరథి కృష్ణమాచార్యులు రచించిన నవల- అమరశిల్పి జక్కన.
-దాశరథి రంగాచార్యులు తెలంగాణ పోరాటాన్ని చిత్రిస్తూ రచించిన నవలలు- చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జనపదం, పావని, రానున్నది ఏది నిజం, మానవత, శరతల్పం మొదలైనవి.
-ఉర్దూ భాషలో రుస్వాయి రచించిన ఉమ్రావ్జాన్ అదా అనే నవలను, ఇంగ్లిష్లో భవానీభట్టాచార్యులు రచించిన ‘హీ హూ రైడ్స్ ద టైగర్’ అనే నవలను తెలుగులోకి అనువదించిన రచయిత- దాశరథి రంగాచార్యులు.
-తెలంగాణలో 1935 నాటి ఫ్యూడల్ వ్యవస్థను చిత్రించిన నవల- చిల్లరదేవుళ్లు. ఈ నవలలో ప్రధానపావూతలు- రామిడ్డి, వెంకవూటావు, నిజామొద్దీన్.
-త్రిపురనేని గోపీచంద్ రచించిన నవలలు- అసమర్థుని జీవయాత్ర, పరివర్తన, పిల్లతెమ్మర, గడియపడని తలుపులు, మెరుపుల మరకలు, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా మొదలైనవి.
-అసమర్థుని జీవయావూతలో కథానాయకుడు సీతారామారావు. పలాయనవాదం, పరాజయవాదంగల నవల- అసమర్థుని జీవయాత్ర.
-ప్రతిదానికి ఎందుకు అని ప్రశ్నించుకునే పాత్రగల నవల- అసమర్థుని జీవయాత్ర.
-1963లో కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి పొందిన గోపీచంద్ నవల- పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా.
-‘మెరుపుల మరకలు’లో ప్రధాన పాత్ర- ఉషారాణి.
-చైతన్య స్రవంతి ధోరణిలో బుచ్చిబాబు రచించిన నవల- చివరకు మిగిలేది. ఈ నవలకు బుచ్చిబాబు మొదట పెట్టిన పేరు ఏకాంతం.
-ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఈడిపస్ కాంప్లెక్స్ ప్రభావం గల నవల చివరకు మిగిలేది. ఇందులో పాత్రలు – దయానిధి,కోమలి, అమృతం మొదలైనవి. వృత్తిరీత్యా వైద్యుడైన పాత్ర దయానిధి. హామ్లెట్తో పోల్చదగిన పాత్ర ఇది.
-ఏకాంతం నవలకు చివరకు మిగిలేది అనుపేరు పెట్టిన రచయిత – ఆచంట జానకీరాం
-నీతి-అవినీతి, సంఘం-వ్యక్తి,అనుభవాల మధ్య జరిగే ఘర్షణను తెలిపేది- చివరకు మిగిలేది
-ఒకవైపు వ్యక్తి మానసిక సంఘర్షణను, మరోవైపు సాంఘిక సంఘర్షణను, వేరొక వైపు మానవజాతి సంఘర్షణను చిత్రించు మనోవైజ్ఞానిక నవల చివరకు మిగిలేది. ఈ నవలపై పరిశోధన చేసిన వారు – కాత్యాయనీ విద్మహే
-జీవీ కృష్ణారావు రచించిన నవల – కీలుబొమ్మలు
-రాచకొండ విశ్వనాథశాస్త్రి రచించిన నవలలు – అల్పజీవి, రాజు – మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త, సొమ్ములు పోనాయండి మొదలగునవి. అల్పజీవిలో ప్రధానపాత్ర – సుబ్బయ్య
-శ్రీశ్రీ, జేమ్స్జాయిస్ల ప్రభావం గల నవల – అల్పజీవి
-వ్యక్తిత్వం లేని మనిషి నవలా రచయిత – కొమ్మూరి వేణుగోపాలరావు
-ఆర్ఎస్ సుదర్శనం రచించిన నవలలు – మళ్లీ వసంతం, సంసారవృక్షం
-కొడవగంటి కుటుంబరావు రచించిన నవలలు – చదువు, అనుభవం, ఆత్మజన్మ, ప్రేమించిన మనిషి, కొత్తకోడలు, కొత్త అల్లుడు, తార, తిమింగలం, మారిన జీవితం, ఎండమావులు, వారసత్వం
-ఆంధ్రవూపదేశ్ సాహిత్య అకాడమి బహుమతి పొందిన కొడవగంటి నవల – తార
-బలివాడ కాంతారావు రచించిన నవలలు – గోడమీది బొమ్మ, సుగుణ, దగాపడిన తమ్ముడు, పుణ్యభూమి
-వడ్డెర చండీదాస్ రచించిన నవలలు – హిమజ్వాల, అనుక్షణిక
-మల్లాది వసుంధర రచించిన నవలలు – తంజావూరు పతనం, సప్తవర్ణి, దూరపుకొండలు, నరమేధం
-భువనవిజయం నవల రచయిత – ధూళిపాల శ్రీరామమూర్తి
-కాకర్ల నరసింహం రచించిన నవలలు – కనకాభిషేకం, రఘునాథరాయలు
-శారద పేరుతో నటరాజన్ రచించిన నవలలు – మంచి -చెడు, అపస్వరాలు, ఏది సత్యం
-తొలి తెలుగు నవలా రచయిత – జయంతి సూరమ్మ. ఈమె రచించిన నవల – సుదక్షిణా చరిత్ర
-పులుగుర్తి లక్ష్మీనరసమాంబ రచించిన నవలలు – సుభద్ర,యోగీశ్వరి, అన్నపూర్ణ.
మాదిరి ప్రశ్నలు
1. కుట్టాన్, వీరభూపతి, మీనాక్షి పాత్రలు గల నవల?
1) హిమబిందు 2) ఏకవీర
3) వేయిపడగలు 4) అల్పజీవి
2. కింది వాటిలో చలం రచించిన నవల?
1) శశిరేఖ 2) మైదానం
3) దైవమిచ్చిన భార్య 4) పైవన్నీ
3. ఒద్దిరాజు సీతారామచంవూదరావు రచించిన నవల?
1) రుద్రమదేవి 2) గోన గన్నాడ్డి
3) శ్రీనాథుడు 4) హిమబిందు
4. కాలభైరవుడు నవల రచయిత?
1) ఒద్దిరాజు సీతారామచంవూదరావు
2) విశ్వనాథ సత్యనారాయణ
3) పైడిమర్రి వెంకటసుబ్బారావు
4) సురవరం ప్రతాపడ్డి
5. ‘కంఠీరవం’ ప్రధానపాత్ర గల నవల?
1) చిల్లరదేవుళ్లు 2) మాలపల్లి
3) గంగు 4) ప్రజలమనిషి
6. ‘చిల్లరదేవుళ్లు’ నవల రచయిత?
1) దాశరథి కృష్ణమాచార్యులు
2) దాశరథి రంగాచార్యులు 3) నవీన్
4) వట్టికోట ఆళ్వారుస్వామి
జవాబులు : 1) 2 2) 4 3) 1 4) 3 5) 4 6) 2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు