కమ్యూనికేషన్స్‌కు సాంకేతికత సాయం
ఐసీటీ
సమాచార ప్రసార సాంకేతిక రంగంలో నూతన పోకడలు
మొబైల్ ఫోన్ టెక్నాలజీ – వివిధ తరాలు (సివిల్ సర్వీసెస్ – 2010)
– మొబైల్‌ఫోన్ లేదా సెల్‌ఫోన్ లేదా హ్యాండ్ఫోన్ మరింత సంక్షిప్తంగా మొబైల్ లేదా సెల్ లేదా ఫోన్‌గా పేర్కొనే ఈ పరికరం ప్రధానంగా రేడియో ఫ్రీక్వెన్సీ లింక్ ఆధారంగా, ఫోన్‌కాల్స్ చేయడం, అందుకోవడానికి ఉద్దేశించిన ఒక పోర్టబుల్ పరికరం.
– ఈ రేడియో ఫ్రీక్వెన్సీ లింక్ ఆధారంగా మొబైల్‌ఫోన్ ఆపరేటర్‌కు వినియోగదారులకు మధ్య Public Switched Telephone Network అనే అనుసంధానం సాధ్యపడుతుంది.
– ఆధునిక మొబైల్ ఫోన్లలో సెల్యులార్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ వినియోగించబడుతున్నందున వీటినే సెల్యులార్ టెలిఫోన్ లేదా సెల్‌ఫోన్లుగా పిలుస్తున్నాం.
– ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంవల్ల ప్రారంభంలో కేవలం ఫోన్‌కాల్స్ చేయడానికి, అందుకోవడానికి పరిమితమైన లేదా టెక్ట్స్ మెసేజింగ్, ఎంఎంఎస్, ఈ-మెయిల్, ఇంటర్నెట్ సదుపాయాల స్వల్ప- శ్రేణి నిస్తంత్రి సమాచా ర ప్రసారాలు (ఉదా: బ్లూటూత్, ఇన్ఫ్రారెడ్). వ్యాపార అనువర్తనాలు, వీడియోగేమ్లతోపాటు డిజిటల్ ఫొటోగ్రఫీ వంటి పలు సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.
– ప్రాథమిక ప్రయోజనాలకే పరిమితమైన వాటిని ఫీచర్ఫోన్లుగా వ్యవహరిస్తుండగా, పైన పేర్కొన్న వాటితోపాటుగా మరిన్ని కంప్యూటింగ్ సదుపాయాలు అందించే వాటిని స్మార్ట్ఫోన్లుగా వ్యవహరిస్తున్నాం.
– మొదటి మొబైల్‌ఫోన్‌ను మోటరోలా కంపెనీకి చెందిన జాన్ ఎఫ్ మిచెల్, మార్టిన్ కూపర్లు 1973లో ఆవిష్కరించారు. ఇది దాదాపు 2 కిలోల బరువు ఉండేది.
– జపాన్‌కు చెందిన నిప్పన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ (ఎన్టీటీ) కంపెనీ 1979లో ప్రపంచపు మొదటి సెల్యులార్ నెట్‌వర్క్‌ను అందించింది.
– Dyna Tac soox (1983) వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చిన మొదటి మొబైల్గా గుర్తింపుపొందింది. దీన్ని మోటరోలా ఆవిష్కరించింది.
– 1983 నుంచి 2014 వరకు ప్రపంచవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు 7 బిలియన్లకు పైగా పెరగగా, వీటిలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో (2016 గణాంకాల ప్రకారం) సామ్సంగ్, ఆపిల్, హువావే కంపెనీలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.
– ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వీటి వాటా 78 శాతం
– ఫీచర్‌ఫోన్ మార్కెట్లో అత్యధిక వాటా సామ్సంగ్, నోకి యా, అల్కాటెల్లదే. ఈ క్రమంలో మొబైల్‌ఫోన్ సాంకేతికతను వివిధ జనరేషన్లుగా విభజించి పరిశీలించాలి.
ఐదోతరం మొబైల్ సాంకేతికత
– డేటా చార్జీలు తగ్గడం వల్ల మరింత మంది వినియోగదారులకు సేవలు లభ్యమవుతాయి.
– ఇది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) వారితో అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్నది.
– 4జీ ఎల్టీఈ సాంకేతికతకు దీటైన ప్రత్యామ్నాయం! ఇది ప్రస్తుతం ఉన్న వాణిజ్య, వినియోగదారులకు అవసరమైన సాంకేతిక డిమాండ్‌ను తీర్చగలదు.
– 5జీ రాకతో ఉపాధి రంగం అభివృద్ధి చెందుతుంది. డిజిటల్ ఎకానమీ సాయంతో మరెంతో మంది సాంకేతిక నిపుణులకు నాణ్యమైన ఉపాధికి దారి చూపగలదు.
– ప్రస్తుతమున్న డేటా బదిలీ వేగం 20 రెట్లు (4జీతో పోలి స్తే) పెరగడంతో, మెరుగైన సాఫ్ట్వేర్ సేవలను, డ్రైవర్ ర హిత కార్లకు అవసరమైన నావిగేషన్ వంటి సదుపాయాలను అందించవచ్చు.
– ఐఓటీ వంటి వాటి సాయంతో కృత్రిమ మేధస్సు ఆధారం గా స్మార్ట్ డివైస్ నుంచి మన చుట్టూ ఉన్న పలు ఉపకరణాలను సులభంగా నియంత్రించవచ్చు. ఫలితంగా శక్తి ఆదాను పొందగలం.
సవాళ్లు
– భారత్ వంటి దేశాల్లో మెరుగైన అంతర్జాల, సర్వీస్ ప్రొవైడర్ల సేవల లేమి, మౌలిక వసతుల కొరత ప్రధాన అవరోధాలుగా ఉండనున్నాయి.
– పూర్తిస్థాయిలో 5జీకి మారడానికి అవసరమైన బలమైన బ్లాక్‌హోల్ నెట్వర్క్ భారత్‌లో లేదు.
– 5జీ సేవలకు అవసరమైన బ్యాండ్ విడ్త్ కొరత తీరలేదు.
– భారత్‌లో నేటికీ పూర్తిగా 4జీ సేవలు లభ్యంకాని పరిస్థితి.
– మారుమూల ప్రాంతాల్లో ప్రజలు 2జీ, 3జీ హ్యాండ్సెట్ల మీదనే ఆధారపడుతున్న పరిస్థితుల్లో వారిని 4జీ, 5జీల వైపునకు మరల్చడం సర్వీస్ ప్రొవైడర్లకు అదనపు భారమవుతుంది .
పరిష్కార మార్గాలు
– దేశ ప్రధాని చేతుల మీదుగా 2015, జూలై 1న ఆవిష్కృతమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశంలో సమాచార ప్రసార కార్యక్రమాల అమలులోని సవాళ్లను తీర్చగలదనడంలో సందేహం లేదు.
– డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టిన భారత్‌నెట్, స్టార్ట ప్ ఇండియా, మేకిన్ ఇండియా, ఈ-క్రాంతి వంటివి దేశం లో ఇంటర్నెట్, మొబైల్ మౌలిక వసతుల కల్పనకు దోహ దం చేసేవే.
– దేశంలో వేగవంతమైన అంతర్జాల సేవల కల్పనకు ఇస్రో సహకారంతో జీశాట్-19, జీశాట్-29 ఉపగ్రహాలను వరుసగా 2017, జూన్ 5, 2018, నవంబర్ 14న జీఎస్ఎల్వీ మార్క్-3 వాహక నౌక ద్వారా ప్రయోగించారు. వీటికి అదనంగా ఏరియన్-5 రాకెట్ ద్వారా జీశాట్- 11ను (దీన్ని బిగ్బర్డ్గా వ్యవహరిస్తారు) 2018, డిసెంబర్ 5న కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు.
– పై నాలుగు ఉపగ్రహాల సాయంతో సెకనుకు 100 గిగా బైట్ల వేగాన్ని అందుకోబోతున్నాం. వీటిద్వారా ఓఎఫ్సీ ద్వారా అంతర్జాల సౌకర్యాలు అందించలేని మారుమూల ప్రాంతాలకు సైతం వేగవంతమైన అంతర్జాల సదుపాయాన్ని అందించవచ్చు.
– జీశాట్-11 ద్వారా 16 జీబీపీఎస్, జీశాట్-20 ద్వారా 70 జీబీపీఎస్ ఇంటర్నెట్ వేగాన్ని అందుకోవచ్చు.
జీరో జనరేషన్- ఓజీ
– ప్రీ సెల్యులార్ జనరేషన్గా పరిగణించే ఈ తరంలో ప్రధానంగా పుష్ టు టాక్ (పీటీటీ). మొబైల్ టెలిఫోన్ సర్వీస్ (ఎంటీఎస్). ఇంప్రూవ్డ్ మొబైల్ టెలిఫోన్ సర్వీస్ (ఐఎంటీఎస్). అడ్వాన్స్డ్ మొబైల్ టెలిఫోన్ సిస్టం (ఏఎంటీఎస్) అనే సాంకేతికతలను వాడారు.
– వీటిని ప్రధానంగా రక్షకభటులు, రవాణా రంగాలు విరివిగా వాడేవి.
– జీరో జనరేషన్లో ప్రధానంగా అనలాగ్ రేడియో సిగ్నళ్ల ఆధారంగా పనిచేసే మొబైల్ రేడియో టెలిఫోన్ పరికరాలను నౌకలు, రైళ్లలో వినియోగించడానికి బెల్సిస్టమ్స్ సంస్థ రూపొందించేది.
– ఈ పరికరాలను కేవలం ఏకకాలంలో కాల్స్ చేసుకోవడానికి, అందుకోవడానికి మాత్రమే వాడేవారు.
మొదటితరం- 1జీ
– ఈ మొబైల్ సమాచార ప్రసారాలు 1979లో ప్రారంభమై 1980లలో విస్తృతంగా వాడుకలోకి వచ్చాయి.
– ఈ తరంలో అనలాగ్ రేడియో సిగ్నళ్లను టెలికమ్యూనికేషన్స్ కోసం వాడారు.
రెండోతరం- 2జీ
– Global system for mobile Communicatons (GSM) ప్రమాణాలతో వాణిజ్యపరం గా 1991లో ఫిన్లాండ్లో రేడియోలింజా (ప్రస్తుతం దీన్ని ఎలిసా ఓయ్జ్గా పరిగణిస్తున్నారు) కంపెనీ ద్వారా 2జీ సేవ లు ప్రారంభమయ్యాయి.
– డిజిటల్ రేడియో సిగ్నళ్ల రూపంలో ప్రారంభమైన ఈ సెల్యులార్ సర్వీసుల కాలంలోనే 2.5G, 2.75G పేర్లతో వరుసగా..
GPRS (General Packet Radio Services),EDGE (Enhanced Data Ralis for GSM Evilution) డేటా సేవలు ప్రారంభమయ్యాయి.
– ఫలితంగా మరింత సమర్థవంతమైన, భద్రతతో కూడిన (Encrypted) SMS, MMS సర్వీసులు ప్రారంభమయ్యాయి.
– ఈ తరం నుంచే టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ (TDMA), కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ (CD MA) వంటి సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
– జీపీఆర్ఎస్ సర్వీసుల్లో డేటా బదిలీ వేగం 50k bits/ secon కాగా EDGE సర్వీసుల్లో ఈ వేగం 1M bits/s
– EDGE సర్వీసులను AT & T కంపెనీ 2003లో యునైటెడ్ స్టేట్స్లో ప్రారంభించింది.
మూడోతరం- 3జీ
– ఈ సేవలను NTT Docomo సంస్థ జపాన్‌లో 1998లో ప్రారంభించగా 2001 నుంచి విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి.
– 200 k bits/secon వేగంతో డాటా బదిలీ జరుగుతుండటంతో నాణ్యమైన నిస్తంత్రి విధానంలో వాయిస్ సేవలు, మొబైల్లోనే అంతర్జాలం అందుబాటు, అదేవిధంగా ఫిక్స్డ్ వైర్లెస్ ఇంటర్నెట్ యాక్సెస్, వీడియో కాల్స్, మొబైల్ టీవీ సాంకేతికతలు విశ్వవ్యాప్తమయ్యాయి.
– ఇదే క్రమంలో 3.5జీ రూపంలో HSPA (High Speed Packet Access), Long Term Evolution (LTE) సాంకేతికతలు రూపుదిద్దుకున్నాయి. ఇదే కాలక్రమంలో 4జీ సర్వీసులుగా రూపాంతరం చెందాయి.
– 3జీ సర్వీసుల కాలంలోనే మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చి, మొబైల్ మోడెమ్, స్మార్ట్‌ఫోన్స్ శకం ప్రారంభమైంది.
– జీపీఎస్, లొకేషన్ ఆధారిత సేవలు, టెలీమెడిసిన్, వీడియో కాన్ఫరెన్స్, వీడియో ఆన్ డిమాండ్లు నిత్యకృత్యమయ్యాయి.
నాలుగోతరం- 4జీ
– ఈ తరాన్నే బ్రాడ్‌బ్యాండ్ సెల్యులార్ నెట్వర్క్ టెక్నాలజీగా పరిగణిస్తారు.
– 4జీ రాకతో డేటా బదిలీ వేగం అమాంతం 100 M bit/ secon నుంచి 1 G bits/ seconకు పెరిగిపోయింది. సాంప్రదాయ వైర్డ్ టెక్నాలజీల్లో కూడా ఈ తరహా వేగం సాధ్యంకాకపోవడం గమనార్హం.
– ఈ వేగంతో మొబైల్ వెబ్ వినియోగం, గేమింగ్ సర్వీసులు, ఐపీ టెలిఫోనీ, హైడెఫినిషన్ మొబైల్ టీవీ, వీడియో కాన్ఫరెన్సింగ్, 3డి టెలివిజన్ వంటి సాంకేతికతలు సాధ్యమయ్యాయి.
– ఎల్టీఈ పేరిట 4జి సేవలు, వాణిజ్యపరంగా 2009 నుంచి ఓస్లో, నార్వే, స్టాక్‌హోమ్, స్వీడన్లలో ప్రారంభమయ్యాయి.
– 4జీ తరంలోనే మరింత విస్తృతమైన మరొక సర్వీ సు- క్లౌడ్ కంప్యూటింగ్
– స్మార్ట్‌హోమ్స్, స్మార్ట్‌సిటీస్, ఐఓటీ వంటి అధునాతన సౌకర్యాల దిశగా పలు కంపెనీలు పరిశోధనలు సాగిస్తూ మానవ జీవితాన్ని మరింత సులభసాధ్యం చేసే దిశగా అడుగులు పడుతుండటం గమనార్హం.
ఐదోతరం- 5జీ
– భవిష్యత్ సమాచార ప్రసార సాంకేతికతలను సమూలంగా మార్చివేసే ఈతరం సేవలు 2020 నుంచి ప్రారంభించడానికి భారత్ వంటి దేశాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి.
– 4జీని మించిన ప్రమాణాలను ఐదోతరం మొబైల్ సాంకేతికతలో వినియోగిస్తుండటం గమనార్హం.
– ఎన్జీఎంఎన్ అలయన్స్ లేదా నెక్ట్స్ జనరేషన్ మొబైల్ నెట్‌వర్క్‌ల అలయన్స్ వారి ప్రకారం 5జీ ప్రమాణాలు కింది విధంగా ఉండనున్నాయి.
1. వేల సంఖ్యలోని వినియోగదారులకు డేటా బదిలీ వేగాన్ని ఏకకాలంలో 10 mb/secon కంటే మించి అందించగా…
2. ఒకే కార్యాలయ సిబ్బందికి ఏకకాలం 1 Gb/s డేటా బదిలీ వేగాన్ని అందించడం.
3. వందల నుంచి వేల సంఖ్యలో కనెక్షన్లు అందించినా నెట్వర్క్ వేగం మందగించకుండా చూడటం.
4. 4జీని మించిన నాణ్యతతో కూడిన స్పెక్ట్రం సామర్థ్యాన్ని నెలకొల్పుట
5. మారుమూల ప్రాంతాల వారికి సైతం కవరేజీ అందించడం
6. ఎల్టీఈలో ఉన్న అంతరాలను సమూలంగా తొలిగించడం
– 5జి రాకతో డేటా బదిలీ వేగం 4జీతో పోలిస్తే 20 రెట్లు అధికంగా ఉంటుంది.
– 5జీ రాకతో భారత్‌లో మొబైల్ సేవల మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించిన భారత్‌నెట్ వంటి కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి.
– డౌన్లోడ్ వేగం పెరిగి, సమయం గణనీయంగా తగ్గడం వల్ల మొబైల్ ఉపకరణాల బ్యాటరీ జీవితకాలం పెరుగుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు