అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తి ? (సైన్స్ & టెక్నాలజీ)
1. భారతదేశంలో పురాతనమైన పారామిలటరీ ఫోర్స్ ఏది?
1) సీ.ఆర్.పీ.ఎఫ్ 2) బీ.ఎస్.ఎఫ్
3) ఆర్.పీ.ఎఫ్ 4) అస్సాం రైఫిల్స్
2. స్పేస్ ఎక్స్ నిర్వహించిన అంతరిక్షయానంలో ఎంతమంది వ్యోమగాములు రోదసిలోకి వెళ్లారు?
1) ముగ్గురు 2) ఇద్దరు
3) నలుగురు 4) ఒక్కరు
3. ఇటీవల ఏ దేశాలు మొట్టమొదటిసారిగా రూపొందించిన ఉపగ్రహాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని జపాన్‌కు చెందిన కిబో మాడ్యూల్ ద్వారా కక్ష్యలోకి చేరాయి?
1) శ్రీలంక, నేపాల్
2) శ్రీలంక, భూటాన్
3) నేపాల్, బంగ్లాదేశ్
4) బంగ్లాదేశ్, భూటాన్
4. అత్యంత అధునాతన జలాంతర్గామి నుంచి ప్రయోగించే JL-3 ఖండాంతర క్షిపణి (SLBM)ని జూన్ 2న విజయవంతంగా ప్రయోగించిన దేశం?
1) భారతదేశం 2) అమెరికా
3) చైనా 4) రష్యా
5. కెన్నెడి స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది?
1) ఫ్లోరిడా 2) న్యూజెర్సీ
3) న్యూయార్క్ 4) చికాగో
6. ఇటీవల రక్షణ మంత్రి నౌకాదళంలో ప్రవేశపెట్టిన ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ ఏ సంస్థ తయారు చేసింది?
1) డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ సంస్థ
2) దసాల్ట్ ఎలివేషన్ సంస్థ
3) స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ
4) మజ్గావ్ డాక్ సంస్థ
7. భూమికి 2 వేల కి.మీ. ఎత్తు వరకు ఉండే కక్ష్యను ఏమంటారు?
1) భూ నిమ్న కక్ష్య
2) భూ అంతిమ కక్ష్య
3) భూ మధ్యమ కక్ష్య
4) భూ ప్రథమ కక్ష్య
8. ఎవరి జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ నవంబర్ 11న న్సీలో వాయుసేనకు స్వదేశీ హెలికాప్టర్లు అప్పగించారు?
1) దుర్గాబాయ్ దేశ్‌ముఖ్
2) కస్తూర్బా గాంధీ
3) రాణీ లక్ష్మీబాయ్
4) సరోజినీ నాయుడు
9. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రూపొందించిన కార్యక్రమం ఏమిటి?
1) స్వచ్ఛ అభియాన్
2) జియో వి-3.0 (భువన్ పంచాయత్)
3) జియో వి-2.0 4) జియో వి-1.0
10. అమెరికా ఎంహెచ్-60 ఆర్ అనే ఎన్ని హెలికాప్టర్లను భారత్‌కు అప్పగించింది?
1) 4 2) 2 3) 3 4) 1
11. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2లో ఎన్ని పరిశోధన పరికరాలు ఉన్నాయి?
1) 13 2) 12 3) 14 4) 18
12. ఇస్రో చంద్రయాన్-2 ద్వారా చంద్రుడిపైకి వేటిని పంపింది?
1) రోవర్ 2) ఆర్బిటర్
3) లాండర్లు 4) పైవన్నీ
13. చంద్రునిపై పరిశోధనల కోసం ఇస్రో ఏ ఉపగ్రహాన్ని సూర్యుడి పైకి పంపనుంది?
1) ఆదిత్య-L2 2) ఆదిత్య-L1
3) ఆదిత్య-L4 4) ఆదిత్య-L3
14. భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం మానవసహిత ఉపగ్రహం గగన్‌యాన్ కోసం అదనపు శిక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) తమిళనాడు 2) కర్ణాటక
3) ఒడిశా 4) మహారాష్ట్ర
15. ఇటీవల 41 సంవత్సరాలుగా భారత నావికాదళ సేవల నుంచి ఉపసంహరించుకున్న వాహక నౌక?
1) INS అరిహంత్ 2) INS రాజ్‌పుత్
3) INS విక్రాంత్ 4) INS జల ఉషా
16. అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన గెన్నెడి పడల్క అనే వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు?
1) అమెరికా 2) చైనా
3) రష్యా 4) జపాన్
17. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
1) శ్రీకాకుళం 2) నెల్లూరు
3) విజయనగరం 4) విశాఖపట్నం
18. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏ నగరంలో ఉంది?
1) బెంగళూరు 2) చెన్నై
3) హైదరాబాద్ 4) బొంబాయి(ముంబై)
19. సౌరకుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహమైన గనిమెడ్ ఏ గ్రహపు ఉపగ్రహం?
1) బృహస్పతి 2) శని
3) అంగారకుడు 4) బుధుడు
20. షేన్ కొంబరో అనే వ్యోమగామి క్యాబేజి రకానికి చెందిన ఏ మొక్కను ఐఎస్ఎస్లో నాటినట్లు నాసా ప్రకటించింది?
1) జింజిబర్ 2) సోలనమ్
3) ఒర్తిజా 4) లెట్యూస్
21. దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రయోగించిన జీశాట్-31 సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించింది?
1) ఏరియన్-5 (రాకెట్ VA-247)
2) ఏరియన్-7 (రాకెట్ VA-247)
3) ఏరియన్-5 (రాకెట్ VA-231)
4) ఏరియన్-7 (రాకెట్ VA-231)
22. గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించే కృత్రిమ మేధ పరికరాన్ని అభివృద్ధి చేసింది?
1) IIT- మద్రాస్ పరిశోధకులు
2) IIT- ఢిల్లీ పరిశోధకులు
3) IIT- కోల్‌కతా పరిశోధకులు
4) IIT- గోరఖ్‌పూర్ పరిశోధకులు
23. 25 MW ఫ్లోటింగ్ సోలార్ పీవి ప్రాజెక్ట్‌ను ఏ పథకంలో ఏర్పాటు చేశారు?
1) మేక్ ఇన్ ఇండియా
2) ఆత్మనిర్భర్ భారత్
3) స్కిల్ ఇండియా 4) ఫ్లెక్సిబిలైజేషన్
24. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన దీర్ఘశ్రేణి సబ్ సోనిక్ క్రూయిజ్ క్షపణి ‘నిర్భయ్’ను భారత్ చాందీపూర్ సమీపంలో ఉన్న సమీకృత పరీక్షా వేదిక నుంచి ప్రయోగించారు. ఈ క్షిపణి మ్యాక్ వేగం ఎంత?
1) 0.1 2) 0.3 3) 0.4 4) 0.7
25. ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేల ఆధారంగా ఇంటర్నెట్ వినియోగంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
1) రెండవ 2) మొదటి
3) నాల్గవ 4) మూడవ
26. ‘ది బాంగ్ ఈ-4’ స్పేస్ క్రాఫ్ట్‌ను చంద్రుడిపై ప్రయోగించిన దేశం?
1) జపాన్ 2) జర్మనీ
3) చైనా 4) శ్రీలంక
27. క్యూరియాసిటీ అనే అంతరిక్ష నౌకను ‘నాసా’ పరిశోధన కోసం ఏ గ్రహంపైకి పంపింది?
1) అంగారకుడు 2) బుధుడు
3) శుక్రుడు 4) గురుడు
28. జీన్ ఎడిటింగ్ చేసి ఇద్దరు చిన్నారులను సృష్టించిన శాస్త్రవేత్త హీ జియాన్ కుయ్పై ఏ దేశం నిషేధం విధించింది?
1) చైనా 2) అమెరికా
3) జపాన్ 4) ఆస్ట్రేలియా
29. భారతదేశం ప్రయోగించిన మొదటి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్?
1) జీశాట్-29 2) పీఎస్ఎల్వీ-సి2
3) మెట్శాట్-1 4) ఇన్సాట్-2ఎ
30. స్వదేశి పరిజ్ఞానంతో తయారైన తొలియుద్ధ విమాన వాహక నౌక?
1) విక్రాంత్ 2) రాజ్‌పుత్
3) జలాశ్వ 4) వజ్ర
31. భారత్ క్రయోజనిక్ ఇంజిన్లను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది?
1) అమెరికా 2) రష్యా
3) చైనా 4) ఫ్రాన్స్
32. జీఎస్ఎల్వీ లో క్రయోజినిక్ ఇంజిన్‌ను ఏ దశలో ఉపయోగిస్తారు?
1) రెండవ దశ 2) నాల్గవ దశ
3) మూడవ దశ 4) మొదటి దశ
33. కింది వాటిలో పీఎస్ఎల్వి-సి42కి సంబంధించి సరైనది?
1) దీనిని 2018 సెప్టెంబర్ 16న ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు
2) ఈ వాహక నౌక బ్రిటన్‌కు చెందిన నోవాసర్, ఎస్ 1-4 ఉపగ్రహాలను భూమధ్యరేఖకు 97.80 డిగ్రీల వాలులో 140 డిగ్రీల దిశాంశంపై సూర్య సమతాస్థితి కక్ష్యలో ప్రవేశపెట్టింది
3) బ్రిటన్‌కు చెందిన సరే శాటిలైట్ టెక్నాలజీస్, ఇస్రో, వాణిజ్య విభాగమైన యాంత్రిక్స్ కార్పొరేషన్ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మేరకు ఈ ఉపగ్రహాలను ప్రయోగించారు
4) పైవన్నీ సరైనవే
34. సూర్యుడికి దగ్గరలో ఉన్న మరో ఉపగ్రహం (సూపర్ ఎర్త్)ను ఏ దేశ ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
1) చైనా 2) అమెరికా
3) జపాన్ 4) బ్రిటన్
35. ఇస్రో 2022 నాటికి గగన్ యాన్‌ను ఏ లాంచ్ వెహికల్ ద్వారా అంతరిక్షంలోకి పంపాలని భావిస్తుంది?
1) GSLVMK-II
2) GSLVMK-III
3) GSLVMK-IV
4) GSLVMK-V
36. ఏ దేశం తన మొదటి ఉపగ్రహం మొమమ్మద్-6 ని ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది?
1) బంగ్లాదేశ్ 2) అఫ్గానిస్థాన్
3) మొరాకో 4) పాకిస్థాన్
37. వాతావరణ అధ్యయనం కోసం అంతరిక్షంలోకి పంపిన మేఘాట్రోపిక్ శాటిలైట్‌ను భారత్ ఏ దేశంతో సంయుక్తంగా నిర్మించింది?
1) ఫ్రాన్స్ 2) రష్యా
3) అమెరికా 4) జపాన్
38. 2024 నాటికి భారతీయ రైతులకు అందుబాటులోకి రావచ్చని భావిస్తున్న అధిక దిగుబడి వచ్చే వరి బియ్యం రకం?
1) పీఎం బియ్యం 2) సీఎం బియ్యం
3) జీఎం బియ్యం 4) డీఎం బియ్యం
39. భారతదేశ నాల్గవ తరానికి చెందిన వాహక నౌక ?
1) జిఎస్ఎల్వి 2) పీఎస్ఎల్వీ
3) ఇన్శాట్ 4) జీశాట్
40. 12 కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు దేనికోసం ఉపయోగిస్తారు?
1) కమ్యూనికేషన్ 2) డీటీహెచ్
3) టీవీ ప్రసారాలు
4) వాతావరణ అంచనా
41. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) జూన్ 11 2) మే 11
3) మార్చి 11 4) ఆగస్టు 11
42. పీఎస్ఎల్వీలోని ఏ దశను ‘వికాస్’ అంటారు?
1) మొదటి 2) మూడవ
3) నాల్గవ 4) రెండవ
43. ఐదు దశల వాహక నౌక?
1) ఎస్ఎల్వీ-3 2) ఎస్ఎల్వీ
3) పీఎస్ఎల్వీ 4) జీఎస్ఎల్వీ
44. భారతదేశం తన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను 1975 ఏప్రిల్ 19న ఎక్కడి నుంచి అంతరిక్షంలోకి పంపింది?
1) బైకనూర్ 2) శ్రీహరికోట
3) ఫ్రెంచ్ గయానా 4) తుంబా
45. భారతదేశపు తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం?
1) ఆర్యభట్ట 2) భాస్కర-1
3) రోహిణి 4) ఇన్శాట్
46. భారతదేశపు మొట్టమొదటి వాతావరణ అధ్యయన ఉపగ్రహం ‘మెట్శాట్’కు ఎవరి పేరు పెట్టారు?
1) సతీష్ ధావన్ 2) రాకేశ్ శర్మ
3) కల్పన చావ్లా 4) విక్రం సారాభాయ్
47. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి అంతరిక్ష యాత్రికుడు?
1) అలెన్ షెపర్డ్ (అమెరికా)
2) నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (అమెరికా)
3) యూరీ గగారిన్ (రష్యా)
4) రాకేష్ శర్మ (భారత్)
48. అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తి?
1) మార్షల్ టిటో
2) అలెక్సీ ఎ లినోవ్
3) ఎడ్వర్డ్ హెచ్.వైట్
4) ఎడ్విన్ ఇ.ఆల్డ్రిన్
49. గ్రహాల చలనాన్ని కనుగొన్నది?
1) కెప్లర్ 2) లివింగ్స్టన్
3) గిల్లెట్ 4) పాల్ ముల్లర్
50. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తొలి చైర్మన్?
1) డా. హెచ్.జె భాభా
2) సతీష్ ధావన్
3) డా. విక్రం సారాభాయ్
4) జి. మాధవన్ నాయర్
51. క్రయోజనిక్ ఇంజెన్‌లో ఇంధనంగా ఉపయోగపడేది?
1) ద్రవ ఆక్సిజన్ 2) ద్రవ హైడ్రోజన్
3) ఘనరూప గ్యాస్ పెల్లెట్స్
4) సహజ యురేనియం
52. పాడైపోయిన జలంతర్గామి, అందులోని సిబ్బందిని రక్షించడంతో పాటు రహస్య మిషన్లను సమర్దవంతంగా నిర్వహించే డీప్ సబ్ మెరైన్స్ రెస్క్యూ వెహికల్?
1) ఐఎన్ఎస్ నిస్తార్
2) ఐఎన్ఎస్ అరిహంత్
3) ఐఎన్ఎస్ జలాశ్వ
4) ఐఎన్ఎస్ సర్వేక్షణ్
53. పూర్తిగా స్వదేశంలో నిర్మించిన ‘అరిహంత్’ అర్థం?
1) శత్రువుల నాశని 2) రక్షణ కవచం
3) విపత్తు సహాయం 4) 2, 3
54. ఏ జాతి గేదె మొదటి ఐవీఎఫ్ దూడకు జన్మనిచ్చింది?
1) మురా 2) బన్నీ
3) జెర్సీ 4) పైవేవీకాదు
55. భారత సైనికా దశాల పశ్చిమ కమాండ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) ఉద్దంపూర్ 2) లక్నో
3) చండీగఢ్ 4) న్యూఢిల్లీ
56. భారతదేశం ఏ సంవత్సరంలో నావికాదళంలో అణు జలాంతర్గాములను ప్రవేశపెట్టింది ?
1) 1988 2) 1989
3) 1990 4) 1991
57. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్ 2) న్యూఢిల్లీ
3) ఖడక్వాస్లా 4) మౌంట్ అబూ
58. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
1) డెహ్రాడూన్ 2) మౌంట్ అబూ
3) ముస్సోరి 4) ఉద్దంపూర్
59. ఎయిర్‌ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ ఎక్కడ ఉంది?
1) బెంగళూరు 2) హైదరాబాద్
3) కోయంబత్తూరు 4) కిర్కి
60. సెంట్రల్ రిజర్వు పోలీస్ సర్వీస్ ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1945 2) 1947
3) 1939 4) 1950
జవాబులు
1.1 2.2 3.2 4.3 5.1 6.4 7.1 8.3 9.2 10.3 11.3 12.4 13.2 14.2 15.2 16.3 17.2 18.1 19.1 20.4 21.1 22.2 23.4 24.4
25.1 26.3 27.1 28.1 29.2 30.1 31.2 32.3 33.4 34.4 35.2 36.3 37.1 38.3 39.1 40.2 41.2 42.1 43.2 44.1
45.2 46.3 47.3 48.2 49.1 50.3 51.2 52.1 53.1 54.2 55.3 56.1 57.3 58.1 59.3 60.3
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు