Science & technology | జ్ఞానాన్ని పంచి.. అభివృద్ధిని పెంచి
భారత సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్
దేశంలో శాస్త్రసాంకేతిక పరిశోధనలకు తగిన ప్రోత్సాహాన్నిచ్చే విజ్ఞాన గనిగా నవీన భారతాన్ని ఆవిష్కరించే ప్రధానమైన శాస్త్రీయ సంస్థగా ISCA అవతరించింది. దీని ఏర్పాటులో ప్రొ. జే ఎల్ సైమన్సన్, ప్రొ. పీ ఎస్ మెక్మెహన్లు కృషి చేశారు. పనితీరులో ఇది బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్‌ను పోలి ఉంది.
- దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చే కోణంలో భారత సైన్స్ కాంగ్రెస్ (Indian Science Congress Association- ISCA) ఏర్పాటైంది. దీన్ని 1914 లో కలకత్తాలో ఏర్పాటు చేశారు.
ప్రధాన లక్ష్యాలు
1. దేశంలో విజ్ఞానశాస్ర్తాన్ని అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం .
2. దేశంలో ప్రతి సంవత్సరం ఎంపిక చేసిన ప్రదేశాల్లో సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించేలా చూడటం.
3. అవసరమైన, ఆవశ్యకమైన శాస్త్రసాంకేతిక అంశాలను, ప్రొసీడింగ్స్, జర్నల్స్ రూపంలో అందుబాటులోకి తేవడం, అవసరమైన శాస్త్ర సంబంధ లావాదేవీలు, విచారణలు నిర్వహించడం.
4. దేశంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన నిధుల సేకరణను చేపట్టడం, అసోసియేషన్‌కు సంబంధించిన స్థిర, చరాస్తుల లావాదేవీలు సక్రమంగా నిర్వర్తించడం.
- పై లక్ష్యాల సాధనకు అవసరమైన చర్యలను సందర్భానుసారంగా చేపట్టడం.
- దేశ ప్రజలకు అవసరమైన శాస్త్రీయ స్పృహను అందించే భారత సైన్స్ కాంగ్రెస్ తన విధుల నిర్వహణలో భారత శాస్త్రసాంకేతిక విభాగం (Department of Science and Technology) ఆధీనంలో పనిచేస్తుంది. 1914లో ప్రారంభమై, దేశ ప్రజలకు శాస్త్రసాంకేతిక రంగం అందించే ఫలాలను సామాన్య ప్రజానీకానికి సైతం అందించే లక్ష్యంతో పనిచేస్తున్న అత్యంత ప్రముఖమైన సంస్థ.
- దీని సమావేశాలు ప్రతి సంవత్సరం జనవరి మొదటివారంలో నిర్వహిస్తారు. దీనిలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు, నిపుణులు, శాస్త్రవేత్తలు, పాలనాదక్షులు, విధాన నిర్ణేతలు, వివిధ శాస్త్ర సంస్థల నిర్వాహకులు పాల్గొని తగిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అవి అమలయ్యేలా చర్యలు తీసుకొంటారు.
- భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో దేశానికి చెందిన శాస్త్రవేత్తలే కాకుండా విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు సైతం పాల్గొంటున్నారు. వీరి పరస్పర సహకారాన్ని దేశాభివృద్ధిలోవినియోగించుకోవడానికి సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఒక వారధిలా పనిచేస్తుంది.
- దీన్ని 1860 సొసైటీల చట్టం (Societies Act) XXI కింద, 21093/139, 1953-54 ప్రకారం రిజిస్టర్ చేయడమైనది. దేశంలోని సామాన్య ప్రజానీకంలో శాస్త్రీయ సృ్పహను పెంపొందించే దృష్టితో భారత సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ పనిచేస్తుంది.
ఉద్దేశం
1. ఇటీవల కాలంలో శాస్త్రసాంకేతికతలో జరిగిన అభివృద్ధి, సమాజంపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రజలకు వివరించడం.
2. పాఠశాలలు, కళాశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించి శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి పరచడానికి అవసరమైన కేంద్రాలను రూపొందించడం.
3. దేశ, విదేశ శాస్త్రవేత్తలు తమ ఆలోచనలు పంచుకొనేందుకు తగిన వేదికలను
కల్పించడం.
విధులు (Functions)
1. ప్రపంచవ్యాప్తంగా వివిధ శాస్త్రవేత్తలను ఒకచోట కలిసి శాస్త్రసాంకేతిక రంగాల్లో తమ ఆవిష్కరణలను గురించి, నూతన పోకడలను చర్చించుకొనేందుకు ఒక వేదికను ఏర్పరుస్తుంది.
2. శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధికి, జాతీయ శాస్త్రీయ విధానాలు (National Science Policies) రూపొందించడం.
3. ప్రతి సంవత్సరం జరిగే సమావేశాలకు దేశ, విదేశీ శాస్త్రవేత్తలను, సాంకేతిక నిపుణులను, విధాన నిర్ణేతలను, పరిపాలనాధికారులను ఆహ్వానించి, ఆయా సమావేశాలపై నిర్ణయించిన నేపథ్యంపై ఆహ్వానితుల నుంచి ప్రసంగాలను, ఉపన్యాసాలను, పరిశోధనా పత్రాలను ఆహ్వానిస్తుంది.
4. శాస్త్ర విజ్ఞానం పురోభివృద్ధికి విదేశీ విద్యాసంస్థలు, అసోసియేషన్లతో ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకొని ఆసక్తిగల అంశాలపై పురోగతి సాధించడం.
5. అంశాలవారీగా, దేశవ్యాప్తంగా, శాస్త్రీయ విజ్ఞాన అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం.
6. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి, విభిన్న రంగాల్లో భారత సైన్స్ కాంగ్రెన్స్ అసోసియేషన్ ‘యువ శాస్త్రవేత్తలు’ అవార్డులను ప్రవేశపెట్టింది.
7. Everymans Science పేరు మీద శాస్త్రీయ, విజ్ఞాన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచురించడం.
8. శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించిన వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేసి ప్రోత్సహించడం.
- తొలినాళ్లలో 105 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ అసోసియేషన్ తన కార్యక్రమాల ద్వారా ఆకర్షితులైన ఔత్సాహికుల చేరికతో 2012 నాటికి 20 వేల మంది సభ్యులతో ఒక బలమైన వ్యవస్థగా అవతరచింది. ప్రస్తుతం దీనిలో 30 వేల మందికి సభ్యత్వం కలదు. మొదటి సమావేశంలో కేవలం 35 పరిశోధనా పత్రాలు సమర్పించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1000కి పైగా పెరగడం గమనార్హం.
- ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారతీయ శాస్త్రవేత్తలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి భారత సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఒక వేదికగా పనిచేస్తుంది. పారదర్శకత, మేధావులకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం, శాస్త్రసాంకేతిక సమగ్రాభివృద్ధికి, సమర్థమైన పర్యవేక్షక సంస్థల ఏర్పాటు లక్ష్యంగా ఈ అసోసియేషన్ పనిచేస్తోంది.
- శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధికి ప్రధాన సమస్య అవినీతి. దీన్ని విస్మరించలేనిదిగా అసోసియేషన్
గుర్తించండి. - 99వ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశాల సందర్భంగా ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ భారత్‌లో శాస్త్రీయ విజ్ఞాన రంగంలోని పరిస్థితులపై మాట్లాడుతూ ‘దేశంలో నవకల్పనలు, సృజనాత్మక పని అంశాలకు సంబంధించి పలు సమస్యలను రూపుమాపడానికి యుద్ధప్రాతిపదికన పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అన్నారు.
భారత సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ముఖ్య సమావేశాలు
- మొదటి సమావేశం (1914) – Asiatic Society, కలకత్తా ప్రాంగణంలో సైన్స్ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగింది. జస్టిస్ అశుతోష్ ముఖర్జీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దేశంలోని ఔత్సాహికులైన 105 మంది శాస్త్రవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం, మానవజాతిశాస్త్రం, భూగర్భశాస్త్రం, భౌతిక, జంతుశాస్ర్తాలకు సంబంధించి సుమారు 35 పరిశోధనా పత్రాలు ఈ సమావేశాల్లో సమర్పించబడ్డాయి.
- రజతోత్సవ సమావేశాలు (1938) – Lord Ruther of Nelson అధ్యక్షతన కలకత్తాలో ఈ సమావేశం జరగాల్సి ఉండగా ఆయన అకాల మరణంతో Sir James Hopwood Jeans అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ రజతోత్సవ సమావేశంలో విదేశీ శాస్త్రవేత్తలకు కూడా భారత సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని తొలిసారిగా ప్రతిపాదించడమైంది.
గమనిక – 1947 నుంచి విదేశీ శాస్త్రవేత్తలను సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశాల్లో ప్రాతినిధ్యం వహించడానికి ఆహ్వానిస్తున్నారు. వీరి ప్రాతినిధ్యాన్ని భారత ప్రభుత్వాన్ని శాస్త్రసాంకేతిక విభాగం అనుమతితో కల్పిస్తున్నారు. ఈ ఆచారం నేటికీ కొనసాగుతుంది. - స్వర్ణోత్సవ సమావేశాలు (1963) – భారత సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్స్వర్ణోత్సవాలు అక్టోబర్‌లో ఢిల్లీలో
జరిగాయి. ప్రొ. D.S. కొఠారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో రెండు ప్రచురణలు అందుబాటులోకి తెచ్చారు.
అవి –
1. A short history of the Indian Science Congress Association and
2. Fifty years of science in India (శాస్త్రీయ రంగంలోని ఒక్కో శాఖపై చేసిన సమీక్షల సమాహారం) - వజ్రోత్సవ సమావేశాలు (1973) – అసోసియేషన్ ప్రారంభమై 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశాలు జరిగాయి. చండీగఢ్‌లో జరిగిన ఈ సమావేశాలకు డా. ఎస్ భగవంతం అధ్యక్షత వహించారు. ఈ సమావేశాల్లో రెండు ప్రత్యేక ప్రచురణలను అందుబాటులోకి తేవడం జరిగింది.
1. A Decade Indian Science Congress Association (1963-72 సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అధ్యక్షుల జీవిత విశేషాలు)
2. A Decade of Science in India (1963-72) - Platinum Jubliee (1988)- భారత సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశాలు జరిగాయి. పుణెలో జరిగిన ఈ సమావేశాలకు ప్రొ. CNR Rao అధ్యక్షత వహించారు. ప్లాటినం జూబ్లీ సమావేశాల సందర్భంగా ఒక ప్రత్యేక కరపత్రం ‘Indian Science Congress Assosiation- Growth & Activities’ పేరుతో ప్రచురించారు. గత సంవత్సరాల్లో జరిగిన అసోసియేషన్ కార్యక్రమాలను ప్రముఖంగా పేర్కొంటూ దీనిలో పొందుపరిచారు.
- ప్రధాన కార్యక్రమాలు –
1. ప్లాటినం జూబ్లీ సందర్భంగా ప్రత్యేక ప్రచురణను అందుబాటులోకి తేవడం.
2. భారత సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్‌కు సంబంధించిన అధ్యక్షుల ఫలకాలను ప్రదర్శించడం.
3. ప్లాటినం జూబ్లీ ఉద్దేశించిన ప్రసంగాలను, సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశాల్లో అందుబాటులో ఉంచడం.
4. శాస్త్రీయ విజ్ఞాన స్పృహను పెంపొందించడానికి, శాస్త్రీయ విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, అసోసియేషన్ ఇటీవల చేపట్టిన కార్యక్రమాలను మరింత విస్తృతపరచడం.
ప్రాక్టీస్ బిట్స్
1. కింది వాటిలో సంచార పరిక్రియ వ్యవస్థలు?
1. ఆండ్రాయిడ్ (Android)
2. బడా (BADA)
3. ఐవోఎస్ (IOS)
4. సింబియన్ (Symbian)
ఎ) 1, 2 బి) 3, 4
సి) 1, 2, 3 డి) పైవన్నీ
2. కింది వాటిలో EDGE గురించి సరైనది.
1. Enhanced Data Rates for GSM Evolution
2. ఇది అధిక వేగంతో సమాచారాన్ని బదిలీ చేస్తుంది
3. ఇది అభివృద్ధి చేసిన GPRS వ్యవస్థ
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) పైవన్నీ
3. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. ఆప్టికల్ కంప్యూటర్ అనేది గణన కోసం దృశ్య కాంతి (లేదా) పరారుణ కిరణాలను ఉపయోగించుకుంటుంది
2. ఫోటాన్లు ఎలక్ట్రాన్ల కంటే తక్కువ ఉష్ణాన్ని ఉద్గారిస్తాయి
3. ఆప్టికల్ కంప్యూటింగ్ విధానాన్ని ఉపయోగించి అధిక వేగంతో పనిచేసే కంప్యూటర్లు తయారు చేయవచ్చు
ఎ) 1, 2 బి) 2, 3
సి) పైవన్నీ డి) పైవేవీ కావు
4. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
1. ప్లాస్మా డిస్ల్పేలో తెరపై ఉన్న ప్రతి విభాగం ఆవేశ పూరిత వాయు అయానులను కలిగి ఉంటుంది
2. Liquid Crystal Display పలుచని, చదునైన ఎలక్ట్రానిక్ తెర
3. ప్లాస్మా డిస్లే శక్తి వినియోగంలో LCD కంటే అధిక దక్షతను కలిగి ఉంటుంది
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) పైవన్నీ
5. కింది వాటిలో ERNET గురించి సరైన వాక్యాలు?
1. దీని విస్తృత రూపం Education and Research Network
2. ERNET ఇండియా అనేది భారత మానవ వనరుల, అభివృద్ధి మంత్రిత్వ శాఖలో స్వతంత్ర విభాగం
3. ERNET ఇండియా ఆరోగ్య, ఉన్నత విద్య వ్యవసాయ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలకు సంబంధించి దాదాపు 1300 సంస్థలకు
సేవలను అందిస్తుంది
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) పైవన్నీ
జవాబులు
1-డి, 2-డి, 3-సి, 4-ఎ, 5-సి
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు