Current Affairs | PSLV-C55 / టెలియోస్-2 ప్రయోగం విజయవంతం
PSLV-C55 / టెలియోస్-2 ప్రయోగం విజయవంతం
- ఈ రాకెట్‌ను 2023, ఏప్రిల్ 22న విజయవంతంగా ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 2.20కి ఈ ప్రయోగం విజయవంతంగా నిర్వహించారు.
- ఈ రాకెట్ ప్రయోగం కోసం 2023 ఏప్రిల్ 21న మధ్యాహ్నం 1:19 గం.లకు కౌంట్‌డౌన్ ప్రారంభించగా అది సుమారు 25:30 గం.లు కొనసాగింది.
- ఈ ప్రయోగం NSIL (New Space India Limited) ద్వారా నిర్వహించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన వాణిజ్య ప్రయోగం.
- ఈ రాకెట్ ద్వారా టెలియోస్-2, ల్యుమిలైట్-4 అనే ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. టెలియోస్-2, ల్యుమిలైట్-4 ఉపగ్రహాలు సింగపూర్‌కి చెందినవి.
- ఈ ఉపగ్రహాలతో పాటు POEM-2 కూడా శాస్త్రీయ ప్రయోగాల కోసం ఉపయోగించారు.
టెలియోస్-2 - ఈ ఉపగ్రహం బరువు-741 కిలోలు
- ఈ ఉపగ్రహాన్ని సింగపూర్ ప్రభుత్వం తరఫున DSTA, ST ఇంజినీరింగ్‌ల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా అభివృద్ధి చేశారు.
- DSTA-Defence Science and Technology Agency
- ఈ ఉపగ్రహం పని ప్రారంభించడం మొదలు పెడితే సింగపూర్ ప్రభుత్వ సంస్థల ఇమేజింగ్ అవసరాలకు సహకరిస్తుంది.
- ఇది సింథటిక్ అపెర్చర్ రాడార్‌ను తీసుకెళ్లింది. ఇది అన్ని వాతావరణాలతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా 1 M ఫుల్ సోలార్మెట్రిక్ రిజల్యూషన్‌తో ఇమేజింగ్ చేయగలదు.
- రాకెట్ ప్రయోగించిన 19 నిమిషాల్లో ఈ ఉపగ్రహాన్ని 586 కి.మీ కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ల్యుమిలైట్-4 - ఈ ఉపగ్రహం బరువు-16 కిలోలు
- దీన్ని సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం ‘శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్’, A Star ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫోకామ్ రీసెర్చ్ I2R లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
- ఇది అధిక పనితీరు గల స్పేస్-బోర్న్ వెరీ హై ఫ్రీక్వెన్సి (VHF) డేటా ఎక్సేంజ్ సిస్టమ్ సాంకేతిక ప్రదర్శన కోసం అభివృద్ధి చేసిన అధునాతన 12U ఉపగ్రహం.
- ఇది సింగపూర్ ఇ-నావిగేషన్ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకొంది.
- ఈ రెండు ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి చేరిన తర్వాత ఇస్రో ఇప్పటి POEM-2 వరకు పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 424 కి చేరింది.
- POEM అంటే PSLV ఆర్బిటల్ ఎక్స్పరిమెంట్ మాడ్యూల్
- ఇందులో రాకెట్ నాలుగో దశ వేరు చేయకుండా ఉన్న 7 పేలోడ్ల ద్వారా శాస్త్రీయ ప్రయోగాలు చేయడానికి కక్ష్యలో ఉంటుంది.
POEM తీసుకెళ్లిన 7 పేలోడ్లు
1. ARIS-2, 2. Pilot ఈ రెండు ఇస్రోకు సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ (IIST) కి చెందినది.
3. ARKA 200 – ఇది బెంగళూరుకి చెందిన బెల్లాట్రిక్స్ సంస్థకు చెందినది.
4. STAR BERRY- ఇది బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌కి చెందినది.
5. DSOL, 6. DSOD-3U, 7. DSOD-6U ఈ మూడు ఉపగ్రహాలు హైదరాబాద్‌లో ఉన్న ధృవ్ స్పేస్ అనే సంస్థకు చెందినవి. DSOD- Dhruva Space Orbital Deployer - IIST ను 2007లో ఏర్పాటు చేయగా దీని ప్రధాన కార్యాలయం తిరువనంతపురంలో ఉంది. IIAను 1971లో ఏర్పాటు చేశారు.
- హైదరాబాద్‌లోని ధృవ్ స్పేస్‌ను 2012లో సంజయ్ శ్రీకాంత్ నెక్కంటి ఏర్పాటు చేశారు.
- ఈ PSLV-C55 రాకెట్ ప్రయోగం PSLV రాకెట్‌కు 57వ ప్రయోగం. కాగా ఇది 55వ విజయం. అందుకే దీన్ని విజయాలను గుర్తిస్తూ ఈ రాకెట్‌ను ఇస్రో ‘పని గుర్రం’(Work Horse) అని పిలుస్తున్నారు.
- ఈ PSLV-C55 రాకెట్ ప్రయోగం PSLV-CA (కోర్-అలోన్) వేరియంట్ 16వ ప్రయోగం. కోర్-అలోన్ వేరియంట్ అంటే PSLV రాకెట్లలో తేలికైనది. అదనపు తోపు (Thrust) ఇవ్వడానికి స్ట్రాప్-ఆన్ బూస్టర్లు ఉండవు.
PSLV-C55 రాకెట్
- ఎత్తు-44.4 మీటర్లు, బరువు-228.355 టన్నులు, దశలు-4
- మొదటి, మూడో దశల్లో ఘన రూప ఇంధనాన్ని వాడుతారు. రెండో, నాలుగో దశల్లో ద్రవరూప ఇంధనాన్ని వాడుతారు.
- మొదటి దశలో హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీ బ్యూటాడీన్ (HTPB) ను ఇంధనంగా వాడతారు. రెండో దశలో UH25+N2O4 ను ఇంధనంగా వాడతారు.
- UH25 అంటే- 75% అన్ సిమ్మిట్రికల్ డై మిథైల్ హైడ్రజీన్+25% హైడ్రజీన్ హైడ్రేట్
- N2O4 అంటే- డై నైట్రోజన్ టెట్రాక్సైడ్
- నాలుగో దశలో MMH+MON3ను ఇంధనంగా వాడతారు.
- MMH అంటే మోనో మిథైన్ హైడ్రజీన్
- MON అంటే మిక్స్డ్ ఆక్సైడ్స్ నైట్రోజన్
- PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్
- దీన్ని తొలిసారి 1993, సెప్టెంబర్ 20న ప్రయోగించారు. ఇది విఫలమైంది.
LVM3-M3/వన్‌వెబ్ ఇండియా-2 మిషన్ విజయవంతం
- ఈ ప్రయోగానికి 2023 మార్చి 25న ఉదయం 8 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మొత్తం 24.30 గంటలు కొనసాగింది.
- 2023 మార్చి 26న విజయవంతంగా ప్రయోగించారు.
- ఈ రాకెట్‌ను తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం/షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు.
- ఈ రాకెట్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలు-36
- ఈ ఉపగ్రహాల మొత్తం బరువు-5805 కిలోలు
- ఒక్కొక్క ఉపగ్రహం సరాసరి బరువు-150 కిలోలు
- ఉపగ్రహాలను 450 కి.మీ వృత్తాకార కక్ష్యలో 87.40 వంపుతో విజయవంతంగా ప్రవేశపెట్టింది.
- రాకెట్ ప్రయోగించిన 9 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యను చేరుకోగా 17వ నిమిషం నుంచి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే పరిస్థితులు సాధించి 20వ నిమిషం నుంచి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం ప్రారంభించింది.
- ఉపగ్రహాలు ఒకదానికొకటి ఢీకొనకుండా నిర్దేశిత సమయాంతరాల్లో వాటిని విడిచిపెట్టింది.
- 36 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు 9 దశల్లో 1.27 గంటల సమయం పట్టింది.
- ఈ 36 ఉపగ్రహాలు యూకేకి చెందిన నెట్వర్క్ యాక్సెస్ కంపెనీ వన్‌వెబ్‌కి చెందినవి. ఇవి సమాచార ఉపగ్రహాలు (కమ్యూనికేషన్ శాటిలైట్స్)
- వన్‌వెబ్ సంస్థ ఉపగ్రహాలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించడం ఇది రెండోసారి. గతంలో ఇదే LVM3 రాకెట్ ద్వారా 2022 అక్టోబర్ 23న 36 ఉపగ్రహాలను పంపింది.
- ఈ ప్రయోగాలు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వాణిజ్య సంస్థ అయిన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) ద్వారా నిర్వహించారు.
- వన్‌వెబ్, NSIL లు మొదటి ప్రయోగం కోసం 2022 ఏప్రిల్ 20న ఒప్పందం కుదుర్చుకున్నాయి. వన్‌వెబ్ అనేది 2012లో గ్రెగ్ నైలర్చే స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది.
- వన్‌వెబ్‌లో భారత్‌కు చెందిన భారతీ ఎంటర్ప్రైజెస్ సర్వీసెస్ (ఎయిర్టెల్) ప్రధాన పెట్టుబడిదారు, వాటాదారుగా ఉంది.
- వన్‌వెబ్‌లో ఎర్త్ ఆర్బిట్ లో 648 ఉపగ్రహాలను కూటమిగా ప్రవేశపెట్టి వాటి ద్వారా గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను అందించే సంస్థ. ఇది ప్రపంచంలో ప్రతి చోటా ప్రభుత్వాలు, వ్యాపారాలు, కమ్యూనిటీల కోసం హైస్పీడ్, తక్కువ జాప్యంతో కూడిన అనుసంధానత ఇస్తుంది.
- ఇది వన్‌వెబ్ 18వ ప్రయోగం, దీంతో ఈ సంస్థ మొత్తం 618 ఉపగ్రహాలు పంపింది.
GSLV-మార్క్ 3 రాకెట్ పేరు మార్పు
- భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) GSLV-మార్క్ 3 రాకెట్ పేరును LVM3 (లాంచ్ వెహికల్ మార్క్ 3) అని పేరు మార్చింది. ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లో చేర్చినప్పుడు ఆ పనిని సులభంగా గుర్తించడం కోసం పేరును మార్చింది.
- పేరు మార్చిన తర్వాత ఇది రెండో ప్రయోగం కాగా మొత్తంగా ఆరవది. LVM3 రాకెట్ బరువు దృష్ట్యా దీన్ని బాహుబలి, ఫ్యాట్ బాయ్ అని పిలుస్తారు.
LVM3 ప్రయోగాలు
1. GSLV-X ప్రయోగం: 2014 డిసెంబర్, 14: క్రూ మాడ్యూల్
2. GSLV MK III-D1 ప్రయోగం: 2017, జూన్ 5: జీశాట్-19 ఉపగ్రహం
3. GSLV MK III-D2 ప్రయోగం: 2018, నవంబర్ 14: జీశాట్-29 ఉపగ్రహం
4. GSLV MK III-M1 ప్రయోగం: 2019, జూలై 22: చంద్రయాన్-II
5. LVM3-M2 : ప్రయోగం: 2022, అక్టోబర్ 23: వన్‌వెబ్ 36 ఉపగ్రహాలు
6. LVM3-M3 ప్రయోగం: 2023, మార్చి 26: వన్‌వెబ్ 36 ఉపగ్రహాలు - పై ఆరు ప్రయోగాలు వరుసగా విజయం సాధించాయి.
LVM3 రాకెట్ - ఈ రాకెట్ పొడవు-43.5 మీటర్లు
- బరువు- 643 టన్నులు
- దశలు – మూడు
- స్ట్రాపాన్ మోటార్స్: 2X S200 (ఘనరూప దశ) : ఇంధనం: HTPB
- కోర్ స్టేజ్ : L110 (ద్రవరూప దశ) : ఇంధనం : UH25+N2O4
- ఎగువ/ మూడో దశ : C25 (క్రయోజెనిక్ దశ) : ఇంధనం: ద్రవరూప హైడ్రోజన్+ద్రవరూప ఆక్సిజన్
SSLV-D2 రాకెట్ ప్రయోగం విజయవంతం
- SSLV- Small Satellite Launch Vehicle
- దీన్ని 2023 ఫిబ్రవరి 10న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి విజయవంతంగా ప్రయోగించారు.
- దీని ద్వారా మూడు ఉపగ్రహాలు పంపారు.
1. EOS-07 2. ఆజాదీ శాట్-2
3. జానుస్-1 - మూడు ఉపగ్రహాల మొత్తం బరువు- 176.5 కిలోలు
- మిషన్ జీవిత కాలం – సంవత్సరం
- EOS-07 అనేది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. దీని బరువు 156.3 కిలోలు కాగా దీన్ని బెంగళూరులోని UR శాటిలైట్ సెంటర్ తయారు చేసింది.
- ఆజాదీ శాట్-2 ఉపగ్రహం రేడియో కమ్యూనికేషన్ సామర్థ్యం కలిగి ఉండి, అంతరిక్షంలో రేడియేషన్ స్థాయిలను కొలవడానికి ఉపయోగపడుతుంది.
- ఆజాదీ శాట్-2ను చెన్నైలోని స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ సహకారంతో దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 750 మంది బాలికలు తయారు చేశారు.
- జానుస్-1 ఉపగ్రహం అమెరికాలోని అంటారిస్కి చెందినది. ఇది SSLV రాకెట్‌కు రెండో ప్రయోగం. దీని ప్రయోగం 2022 ఆగస్టు 7న చేయగా అది విఫలమైంది.
- లో ఎర్త్ ఆర్బిట్‌లోకి లాంచ్ ఆన్ డిమాండ్ బేసిస్‌పై 500 కిలోల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి SSLV ని ఉపయోగిస్తారు. ఇది మూడు ఘనరూప దశలు కలిగి ఉంటుంది.
గగన్ యాన్ క్రూ మాడ్యూల్ రికవరీ ట్రయల్స్ - 2023, ఫిబ్రవరి 7న ఇస్రో, ఇండియన్ నేవీతో కలిసి కేరళలోని కొచ్చిలో భారత నావికా దళానికి చెందిన వాటర్ సర్వైవల్ టెస్ట్ ఫెసిలిటీలో క్రూ మాడ్యూల్ ప్రారంభ రికవరీ ట్రయల్స్‌ను నిర్వహించింది.
- భారత ప్రభుత్వ ఏజెన్సీల భాగస్వామ్యంతో భారత జలాల్లో చేపట్టనున్న గగన్‌యాన్ మిషన్ కోసం క్రూ మాడ్యూల్ రికవరీ ఆపరేషన్ తయారీలో భాగంగా ఈ ట్రయల్స్ భారత నావికా దళం నిర్వహించింది.
- ట్రయల్స్ కోసం నిజమైన క్రూ మాడ్యూల్ ద్రవ్యరాశి, గురుత్వాకర్షణ కేంద్రం, బాహ్య కొలతలు, బాహ్యాలను అనుకరించే క్రూ మాడ్యూల్ రికవరీ మోడల్ ఉపయోగించారు.
ఆదిత్య-L1 మిషన్ కోసం VELC పేలోడ్ అందజేత - 2023 జనవరి 26న బెంగళూరు సమీపంలో హోసాకోట్‌లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్యాంపస్‌లో జరిగిన వేడుకలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆదిత్య-L1 మిషన్ కోసం తయారు చేసిన విజిబుల్ ఎమిషన్, కరోనాగ్రాఫ్ పేలోడ్‌ను అందజేసింది.
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. VELC పేలోడ్ CREST క్యాంపస్‌లో రూపొందించారు.
- ఆదిత్య-L1 ప్రస్తుత డైరెక్టర్- నిగర్ షాజీ
- ఆదిత్య-L1 అనేది సూర్యుని గురించి అధ్యయనం చేసే మొదటి భారతీయ మిషన్
- సూర్యుని ఉపరితలం కేవలం 60000C కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కరోనా ఉష్ణోగ్రత మిలియన్ డిగ్రీలకు ఎలా చేరుకోగలదో పరిష్కరించడానికి డేటాను సేకరించడం VELC లక్ష్యం.
- VELC 90 కిలోల బరువు కలిగి ఉంటుంది.
- ఆదిత్య-L1 మిషన్‌లో మొత్తం 7 పేలోడ్స్ ఉంటాయి. దీనిని 2023 జూన్/జూలైలో ప్రయోగించనున్నారు.
- ఆదిత్య-L1 మిషన్‌ను సూర్య-భూమి వ్యవస్థ మొదటి లాగ్రాంజియన్ పాయింట్ అయిన L1 కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అంటే L1 కక్ష్య సూర్యుడిని నిరంతరం చూసేందుకు ఆదిత్య-L1 అనుమతిస్తుంది.
ఆదిత్య-L1 లో పేలోడ్స్
1. VELC- Visible Emission Line Coronagraph
2. SUIT- Solar Ultraviolet Imaging Telescope
3. SOLEXS- Solar Low Energy X-ray Spectrometer
4. HEL1OS – High Energy L1 Orbiting X-ray Spevtromerer
5. ASPEX- Aditya Solar Wind Particle Experiment
6. PAPA- Plasma Analyser Package For Aditya
7. Advanced Tri-axial High Reso lution Digital Mnagnetometers - రెండు రోజుల జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ ‘న్యూ డెవలప్మెంట్స్ ఇన్ పాలిమెరిక్ మెటీరియల్స్ (DPM 2023)-2023 కేరళలోని తిరువనంతపురంలో జరిగింది.
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కీల్ వికారాబాద్
- Tags
- Current Affairs
- PSLV C55
- SSLV
- TSPSC
Previous article
Indian Navy Recruitment | ఇండియన్ నేవీలో 372 ఛార్జ్‌మెన్ పోస్టులు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






