రహదారులను మలుపు వద్ద ఏ విధంగా నిర్మిస్తారు?
- యాంత్రిక శాస్త్రం
1. సీలింగ్ ఫ్యాన్‌లో బాల్‌బేరింగ్ పాత్ర ?
ఎ) జారుడు ఘర్షణను తగ్గించడానికి
బి) జారుడు ఘర్షణను దొర్లుడు ఘర్షణగా మార్చడానికి
సి) ఫ్యాన్ తిరిగేటప్పుడు శబ్దం రాకుండా ఉండటానికి
డి) ఫ్యాన్ వేడెక్కకుండా ఉండటానికి
2. గ్రహ చలనాలకు సంబంధించి ‘సూర్య కేంద్రక సిద్ధాంతం’ ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
ఎ) గెలీలియో బి) కోపర్నికస్
సి) టాలమీ డి) టైకోబ్రాహి
3. గ్రహ గమన నియమాలను చెప్పిన శాస్త్రవేత్త?
ఎ) టాలమీ బి) కోపర్నికస్
సి) టూకోబ్రాహి డి) కెప్లర్
4. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య ఆకారం ఏది?
ఎ) వృత్తాకారం బి) దీర్ఘవృత్తాకారం
సి) సర్పిలాకారం డి) పరావలయం
5. దీర్ఘవృత్తానికి ఎన్ని నాభులు ఉంటాయి?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 1
6. గ్రహాల ఆవర్తనా కాలానికి(T), కక్ష్య అర్ధ గురు అక్షానికి (a) మధ్యగల సంబంధం?
ఎ) T బి) T
సి) T2 డి) T2
7. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎంతకాలం పడుతుంది?
ఎ) 27.3 రోజులు బి) 30.4 రోజులు
సి) 28.3 రోజులు డి) 31.1 రోజులు
8. భూమికి సూర్యునికి మధ్య దూరం మారితే ఏమవుతుంది?
ఎ) సంవత్సరంలో రోజుల సంఖ్య మారుతుంది
బి) నెలలో వారాల సంఖ్య మారుతుంది
సి) వారంలో రోజుల సంఖ్య మారుతుంది
డి) రోజులో గంటల సంఖ్య మారుతుంది
9. విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని చెప్పిన శాస్త్రవేత్త?
ఎ) టాలమీ బి) కోపర్నికస్
సి) న్యూటన్ డి) కెప్లర్
10. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం విలువ ఎంత? (న్యూటన్-మీటర్2/కి.గ్రా2లలో)
ఎ) 6.67×1011 బి) 6.25×1018
సి) 6.67×10-11 డి) 6.25×10-18
11. కింది వాటిలో సరైన వాక్యం?
ఎ) ఒక వ్యక్తి భారం భూమిపై ఎక్కువ, చంద్రునిపై తక్కువ
బి) ఒక వ్యక్తి ద్రవ్యరాశి భూమిపై తక్కువ, చంద్రునిపై ఎక్కువ
సి) ఒక వ్యక్తి ద్రవ్యరాశి భూమిపై ఎక్కువ, చంద్రునిపై తక్కువ
డి) ఒక వ్యక్తి భారం భూమిపై తక్కువ, చంద్రునిపై ఎక్కువ
12. చంద్రునిపై గురుత్వ త్వరణం, భూమిపై ఉండే గురుత్వత్వరణంలో ఎన్నో వంతు ఉంటుంది?
ఎ) 4వ వంతు బి) 6వ వంతు
సి) 30వ వంతు డి) రెండూ సమానం
13. గురుత్వత్వరణం విలువ భూమిపై సుమారుగా ఎంత ఉంటుంది?
ఎ) 5 మీ/సె2 బి) 10 మీ/సె2
సి) 9 మీ/సె2 డి) 18 మీ/సె2
14. భూమధ్య రేఖ కంటే ధృవాల వద్ద గురుత్వత్వరణం విలువ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీనికి సరైన కారణం ఏది?
ఎ) ధృవాల వద్ద భూవ్యాసార్ధం తక్కువగా ఉంటుంది
బి) ధృవాల వద్ద భూవ్యాసార్ధం ఎక్కువగా ఉంటుంది
సి) ధృవాలు మంచుతో కప్పబడి ఉంటాయి
డి) బి, సి
15. గురుత్వత్వరణం విషయంలో కింది వాటిలో సరైన వివరణ?
ఎ) భూమి ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్లిన కొద్దీ ‘g’ తగ్గుతుంది
బి) భూమి ఉపరితలం నుంచి లోతుకు వెళ్లిన కొద్దీ ‘g’ తగ్గుతుంది
సి) భూమి కేంద్రం దగ్గర g=0
డి) పైవన్నీ సరైనవే
16. గురుత్వత్వరణం (g)లో మార్పుల వల్ల వస్తువులో జరిగే మార్పునకు ఈ కింది వాటిలో సరైన వాక్యం?
ఎ) ‘g’ తగ్గితే ద్రవ్యరాశి తగ్గుతుంది
బి) ‘g’ తగ్గితే ద్రవ్యరాశి పెరుగుతుంది
సి) ‘g’ తగ్గితే భారం తగ్గుతుంది
డి) ‘g’ తగ్గితే భారం పెరుగుతుంది
17. భూమి నుంచి విసిరిన వస్తువు మళ్లీ భూమిపైకి తిరిగి రాకుండా ఉండటానికి వస్తువుకు అవసరమైన కనీస వేగం?
ఎ) గురుత్వ వేగం బి) పలాయన వేగం
సి) తత్కాల వేగం డి) కక్ష్యావేగం
18. చంద్రుని ఉపరితలం వాతావరణంలో వాయువులు లేకపోవడానికి కారణం?
ఎ) చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం
బి) చంద్రుని పరిమాణం భూమి కంటే తక్కువగా ఉండటం
సి) చంద్రుని కక్ష్యావేగం తక్కువగా ఉండటం
డి) చంద్రునిపై పదార్థాల పలాయన వేగం తక్కువగా ఉండటం
19. భూస్థావర ఉపగ్రహాలకు సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ) భూమికి సాపేక్షంగా ఎప్పుడూ ఒకే స్థానంలో ఉంటాయి
బి) భూమి కేంద్రం నుంచి 42,250 కి.మీ. ఎత్తులో ఉంటాయి
సి) ఆవర్తన కాలం 24 గంటలుగా ఉంటుంది
డి) పైవన్నీ సరైనవే
20. ధృవ ఉపగ్రహాలు భూ ఉపరితలం నుంచి ఎంత ఎత్తులో ఉంటాయి.
ఎ) 700-800 కి.మీ
బి) 100-200 కి.మీ
సి) 18,000 కి.మీ డి) 36,000 కి.మీ
21. ధృవ ఉపగ్రహాల కక్ష్యావర్తన కాలం ఎంత ఉంటుంది?
ఎ) 70-90 నిమిషాలు
బి) 2-6 గంటలు
సి) 10-12 గంటలు
డి) 18-24 గంటలు
22. ప్రకృతిలోని ప్రాథమిక బలాలకు సంబంధించి కింది వాటిలో సరైన ప్రవచనం?
ఎ) గురుత్వాకర్షణ, విద్యుదయస్కాంత బలాలు అనంతంగా వ్యాపిస్తాయి
బి) బలీయ కేంద్రక బలాల వ్యాప్తి దాదాపు ఒక ఫెమ్టోమీటర్
సి) దుర్బల అన్యోన్య చర్యా బలాల వ్యాప్తి ఒక ఫెమ్టోమీటర్ కంటే తక్కువ
డి) పైవన్నీ సరైనవే
23. ఎలక్ట్రాన్లు, పాజిట్రాన్లు, -మీసాన్లు, న్యూట్రినోలను కింది విధంగా సంబోధిస్తారు.
ఎ) లెప్టాన్లు బి) హాడ్రాన్లు
సి) బేరియన్లు డి) బోసాన్లు
24. భూమి, చంద్రుని ఆకర్షించే బలం, చంద్రుడు భూమిని ఆకర్షించే బలాలకు సంబంధించి కింది వాటిలో సరైన వివరణ ఏది?
ఎ) భూమి, చంద్రుని ఆకర్షించే బలం ఎక్కువ
బి) చంద్రునిపై భూమి ఆకర్షణ బలం ఎక్కువ
సి) పౌర్ణమి, అమావాస్యలకు బలాలు
మారుతాయి
డి) రెండూ సమానం
25. గురుత్వాకర్షణ బలం వేటి ఆధారంగా ప్రసారం అవుతుంది?
ఎ) గ్రావిటాన్లు బి) ఫోటాన్లు
సి) పై సింబల్-మీసాన్లు
డి) బోసాన్లు
26. విశ్వాంతరాళంలోని కొన్ని ప్రాంతాలలోకి వెళ్లిన పదార్థం, కాంతి మళ్లీ ఆ ప్రదేశం నుంచి బయటకు రాదు. ఇటువంటి ప్రాంతాలను ఏమంటారు?
ఎ) అరుణ బృహత్తారలు
బి) అశ్వినీ నిహారికలు
సి) న్యూట్రాన్ నక్షత్రాలు
డి) కృష్ణబిలాలు
27. కృష్ణబిలం పరిమాణ క్రమంలో కింద వాటిలో సరైన వరుస ఏది?
1) అరుణ బృహత్తార
2) శ్వేత వామన తార
3) న్యూట్రాన్ నక్షత్రం
4) దేదీప్యమాన నక్షత్రం
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 4, 3
సి) 1, 3, 2, 4 డి) 1, 4, 2, 3
28. ‘సూర్యుని ద్రవ్యరాశి కంటే దాదాపు ఒకటిన్నర రెట్లు ద్రవ్యరాశి ఉన్న శీతల నక్షత్రం, దాని గురుత్వ బలాన్ని అదే నిలబెల్టుకోలేదు’ అని సిద్ధాంతీకరించిన శాస్త్రవేత్త ఎవరు?
ఎ) జాన్ మిషెల్ బి) ష్కార్జ్ చైల్డ్
సి) ఎస్. చంద్రశేఖర్ డి) సి.వి. రామన్
29. వాయు పదార్థంలో పరమాణు కేంద్రకాలు, ఎలక్ట్రాన్లు విడివిడిగా ఉంటే పదార్థ స్థితి?
ఎ) వికర్షణ స్థితి బి) విలోమ స్థితి
సి) ప్రతిలోమ స్థితి డి) ప్లాస్మాస్థితి
30. ఒక నక్షత్రం శ్వేత వామన తారగా రూపొందాలి అంటే ఆ నక్షత్రం తొలి ద్రవ్యరాశి సూర్యుని ద్రవ్యరాశితో పోలిస్తే ఎంత ఉండాలి?
ఎ) పదిరెట్లు
బి) పదిరెట్లకంటే తక్కువ
సి) పదిరెట్ల కంటే ఎక్కువ
డి) సూర్యుని ద్రవ్యరాశి సమానంగా ఉండాలి
31. భూమి వ్యాసం వెంబడి ఒక రంధ్రాన్ని తొలిచి అందులో ఒక బంతిని వేస్తే ఏమవుతుంది?
ఎ) భూమి కేంద్రం వద్దకు వెళ్లి ఆగిపోతుంది
బి) రెండో వైపు నుంచి బయటకు వస్తుంది
సి) మళ్లీ మెదటి వైపునుంచి బయటకు వస్తుంది
డి) ఆ రంధ్రంలో సరళహరాత్మక చలనం చేస్తుంది
32. కండర బలాలకు కారణమైన ప్రాథమిక బలం?
ఎ) గురుత్వాకర్షణ
బి) విద్యుదయస్కాంత బలం
సి) బలమైన కేంద్రక బలం
డి) దుర్బల అన్యోన్య చర్యాబలం
33. భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి కారణమైన ప్రాథమిక బలం?
ఎ) గురుత్వాకర్షణ
బి) విద్యుదయస్కాంత బలం
సి) బలమైన కేంద్రక బలం
డి) దుర్బల అన్యోన్య చర్యాబలం
34. కేంద్రకంలోని రెండు న్యూట్రాన్ల మధ్య పనిచేసే బలం ఏది?
ఎ) గురుత్వాకర్షణ
బి) విద్యుదయస్కాంత బలం
సి) బలమైన కేంద్రక బలం
డి) దుర్బల అన్యోన్య చర్యాబలం
35. సాగదీసిన రబ్బరు బ్యాండును వదిలివేయగానే పూర్వపు ఆకారాన్ని పొందుతుంది. ఈ లక్షణమే?
ఎ) తలతన్యత బి) స్నిగ్ధత
సి) స్థితిస్థాపకత డి) ప్లాస్టిసిటి
36. ఒక అల్యూమినియం తీగను వంచినప్పుడు అది అలాగే ఉండిపోతుంది. పూర్వపు ఆకారాన్ని పొందదు. ఈ లక్షణమే?
ఎ) తలతన్యత బి) స్నిగ్ధత
సి) స్థితిస్థాపకత డి) ప్లాస్టిసిటి
37. ప్రకృతిలో లభించే వస్తువులలో కింద పేర్కొన్న వాటిలో అత్యుత్తమ స్థితిస్థాపక వస్తువు?
ఎ) రాగితీగ బి) క్వార్ట్ తీగ
సి) వెంట్రుకలు డి) రబ్బర్ బ్యాండ్
38. అతి పలుచని రేకులుగా మలచగల పదార్థ ధర్మాన్ని ఏమంటారు?
ఎ) మాలియబిలిటీ బి) డక్టిలిటీ
సి) ససెప్టబిలిటీ డి) పర్మిమబిలిటీ
39. అతి సన్నని తీగలుగా మలచగల పదార్థ ధర్మాన్ని ఏమంటారు?
ఎ) మాలియబిలిటీ బి) డక్టిలిటీ
సి) ససెప్టబిలిటీ డి) పర్మిమబిలిటీ
40. కింది వాటిలో ఉత్తమమైన ‘సాగుడు గుణం’ గల పదార్థం?
ఎ) బంగారం బి) రాగి
సి) అట్యూమినియం డి) జింక్
41. కింది వాటిలో ఉత్తమమైన అఘాతవర్థనీయ పదార్థం?
ఎ) ప్లాటినం బి) అల్యూమినియం
సి) ఇనుము డి) వెండి
42. ఒక రబ్బరు బ్యాండ్‌ను కొన్ని రోజులపాటు సాగదీసి ఉంచి, తరువాత వదిలితే అది తన పూర్వస్థితిని పొందలేదు. దీనికి సరైన కారణం?
ఎ) స్థితిస్థాపత బి) అస్థితిస్థాపత
సి) స్థితిస్థాపక బడలిక
డి) అస్థితిస్థాపక బడలిక
43. కింది వాటిలో అత్యంత ‘అస్థితిస్థాపక’ పదార్థం ఏది?
ఎ) లప్పం(పుట్టి) బి) తుమ్మ జిగురు
సి) థర్మోకోల్ డి) మెత్తని ఇనుము
44. కింది వాటిలో దేనికి స్థితిస్థాపకత ఎక్కువ?
ఎ) రబ్బర్ బి) ఉక్కు
సి) మైనం డి) ప్లాస్టిక్
45. ఒక వస్తువు భ్రమణ చలనంలో ఉన్నప్పుడు, ఆ వస్తువులోని కణాలకు సంబంధించిన సరైన వివరణ?
ఎ) కణాలన్నీ ఒకే దిశలో చలనంలో ఉంటాయి
బి) కణాల చలనం వేరు వేరు బిందువుల వద్ద వేరు వేరు దిశలలో ఉంటుంది
సి) అక్షంపై ఉన్న కణాలకు స్థాన భ్రంశం ఉండదు
డి) బి, సి
46. ఒక పూర్తి భ్రమణంలో ఉండే కోణీయ స్థానభ్రంశం?
ఎ) రేడియన్లు
బి) రేడియన్లు
సి) 2 రేడియన్లు
డి) 4 రేడియన్లు
47. ఫ్యాను వేగాన్ని పెంచే కారకాన్ని ఏమంటారు?
ఎ) బలం
బి) కోణీయ ద్రవ్యవేగం
సి) అపకేంద్రబలం డి) టార్క్
48. ఒక రోజులో గంటల ముల్లు ఎంత కోణం తిరుగుతుంది?
ఎ) రేడియన్లు
బి) 2 రేడియన్లు
సి) 4 రేడియన్లు
డి) 12 రేడియన్లు
49. ఒక రోజులో నిమిషాల ముల్లు ఎన్ని భ్రమణాలు చేస్తుంది?
ఎ) 12 బి) 24 సి) 60 డి) 120
50. రహదారులను మలుపు వద్ద ఏ విధంగా నిర్మిస్తారు?
ఎ) మలుపు తిరిగే వైపు కంటే బయటివైపు తక్కువ ఎత్తులో
బి) మలుపు తిరిగే వైపు కంటే బయటివైపు ఎక్కువ ఎత్తులో
సి) మలుపు తిరిగే వైపు, బయటివైపు సమాన ఎత్తులో
డి) రహదారి రూపకల్పన ఎలాంటి ప్రభావాన్ని చూపించదు
51. వస్తువును వృత్తాకార చలనంలో ఉంచే బలం ఏది?
ఎ) అభికేంద్ర బలం బి) అపకేంద్ర బలం
సి) ఘర్షణ బలం డి) పైవన్నీ
52. భూ ధృవాల వద్ద మంచు కరిగితే ఒక రోజు కాలవ్యవధి ఏమవుతుంది?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మారదు డి) పెరిగి తగ్గుతుంది
53. ఈత కొలనులోకి డ్రైవింగ్ చేసే వ్యక్తి గాల్లో భ్రమణాలు చేయడానికి ఏమి చేస్తాడు?
ఎ) కాళ్లు చేతులను దగ్గరికి ముడుచుకుంటాడు
బి) కాళ్లు చేతులను దూరంగా చాపుతాడు
సి) కాళ్లు దూరంగా చాపి, చేతులను దగ్గరకు ముడుచుకుంటాడు
డి) చేతులను దూరంగా చాపి, కాళ్లను దగ్గరకు ముడుచుకుంటాడు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు