682,189,457 సంఖ్యలో పది మిలియన్ల స్థానంలోని అంకె?
- 5 వ తేదీ తరువాయి
37. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు గెలుపొందిన సీట్లకు సంబంధించి సరికానిది గుర్తించండి?
1) భారత జాతీయ కాంగ్రెస్- 364
2) కమ్యూనిస్టులు, దాని మిత్రపక్షాలు-23
3) సోషలిస్టులు-6
4) కిసాన్ మజ్ధూర్ ప్రజాపార్టీ-9
38. ప్రస్తుతం దేశంలో లోక్‌సభ, విధానసభల సభ్యుల సంఖ్యను ఏ సంవత్సర జనాభా గణాంకాల ఆధారంగా నిర్దేశించారు?
1) 1971 2) 1991
3) 2001 4) 2011
39. రాష్ట్రపతిని ఎన్నుకొనే ‘Electoral College’ సభ్యులుగా ఎవరుంటారు?
1) లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు
2) రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు
3) రాష్ర్టాల విధాన సభలకు ఎన్నికైన సభ్యులు
4) పైవన్నీ సరైనవే
40. పార్లమెంట్ సమావేశాలకు ఉండాల్సిన కోరం ఎంత?
1) 1/3 వంతు 2) 1/10 వంతు
3) 2/3 వంతు 4) 2/5 వంతు
41. భారత ప్రభుత్వ నిర్ణయాలన్ని ఎవరి పేరుమీద జరుగుతాయి?
1) పార్లమెంట్ 2) రాష్ట్రపతి
3) ప్రధానమంత్రి 4) ప్రజలు
42. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 3 రకాల అధికారాల విభజనకు సంబంధించి సరికానిది ఏది?
1) కేంద్రజాబితా- 97 అంశాలు
2) రాష్ట్రజాబితా- 66 అంశాలు
3) ఉమ్మడి జాబితా- 47 అంశాలు
4) అవశిష్ట జాబితా-12 అంశాలు
43. షాజహాన్ శేషజీవితం ఎక్కడ గడిపాడు?
1) ఎర్రకోట 2) ఆగ్రా జైలు
3) ఫతేపూర్ సిక్రి 4) ఎర్రవాడ జైలు
44. అస్సాంను జయించిన మొఘల్ చక్రవర్తి?
1) ఔరంగజేబు 2) షాజహాన్
3) అక్బర్ 4) జహంగీర్
45. మొగలుల అధికారాన్ని ధిక్కరించిన రాజపుత్రులు?
1) రణతంభోర్ పాలకులు
2) చిత్తోడ్ పాలకులు
3) మార్వాక్ పాలకులు
4) అంబర్ పాలకులు
46. అబుల్ ఫజల్ ఏ విధానం అమలుపర్చేందుకు అక్బర్‌కు సహకరించాడు?
1) మున్సబ్‌దారీ విధానం
2) నాయంకర విధానం
3) సుల్హా ఇ-కుల్
4) ఇబాదత్‌ఖానా
47. ఫతేపూర్‌సిక్రి ఏ నగరం సమీపంలో కలదు?
1) ఢాకా 2) ఆగ్రా
3) ఢిల్లీ 4) జోథ్‌పూర్
48. మొగలులు ఏ ప్రాంతానికి చెందినవారు?
1) ఉత్తర ఆసియా 2) పశ్చిమ ఆసియా
3) దక్షిణ ఆసియా 4) మధ్య ఆసియా
49. కింది వారిలో సుల్హ్-ఇ- కుల్ విధానం నుంచి వైదొలగిన మొగల్ చక్రవర్తి?
1) బాబర్ 2) హుమాయిన్
3) జహంగీర్ 4) ఔరంగజేబు
50. బాబర్ ఢిల్లీని ఆక్రమించుకున్న సంవత్సరం?
1) క్రీ.శ 1504 2) క్రీ.శ 1516
3) క్రీ.శ 1520 4) క్రీ.శ 1526
51. హుమాయిన్కు సహకరించిన పర్షియా రాజు?
1) మొదటి ఖాసీం 2) సఫాదిద్షా
3) హరూన్ 4) మహ్మద్‌బీన్ ఖాసీం
52. అక్బర్ పరిపాలనా కాలం?
1) క్రీ.శ 1509-1529
2) క్రీ.శ 1526-1530
3) క్రీ.శ 1556-1605
4) క్రీ.శ 1605-1627
53. బాబర్ ఎవరిని ఓడించి ఢిల్లీలో మొగల్ రాజ్యస్థాపన చేశాడు?
1) మహ్మద్‌బీన్ తుగ్లక్
2) ఇబ్రహీంలోడీ
3) హేమూ 4) రాణాసంగ్రామ్సింహ్
54. ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించిన
సంవత్సరం?
1) క్రీ.శ 1684 2) క్రీ.శ 1685
3) క్రీ.శ 1686 4) క్రీ.శ 1687
55. రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొగల్ యువరాజు?
1) అక్బర్ 2) హుమాయిన్
3) జహంగీర్ 4) ఔరంగజేబు
56. జబ్త్ రెవెన్యూ విధానాన్ని రూపొందించిన అక్బర్ రెవెన్యూ మంత్రి?
1) రాజా బీర్బల్
2) రాజా తోడర్మల్
3) రాజా పురందర్ దాస్
4) రాజా భగవాన్‌దాస్
57. కింది వారిలో మల్కీభరాముడుగా పేరుగాంచినది?
1) కులీకుతుబ్ షా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) మహ్మద్ కులీకుతుబ్ షా
4) అబుల్ హసన్ తానీషా
58. హైదరాబాద్ నగర వాస్తు శిల్పి?
1) హజరత్ హుస్సేన్ షావలి
2) మహ్మద్ కులీ కుతుబ్‌షా
3) మీర్ మోమిన్ అస్త్రబాదీ
4) అబ్దుల్ రజాక్
59. కింది వాటిలో మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్మాణం కానిది?
1) పురానాపూల్ వంతెన 2) చార్మినార్
3) జామా మసీద్
4) హైదరాబాద్ నగరం
60. హయత్ భక్షీ బేగం పేరు మీదుగా ఏర్పడినది?
1) హుస్సేన్‌సాగర్ 2) ఉస్మాన్‌సాగర్
3) మాసాబ్‌ట్యాంక్ 4) హయత్సాగర్
61. 1687లో గోల్కొండను ఆక్రమించిన మొగల్ చక్రవర్తి?
1) షాజహాన్ 2) జహంగీర్
3) అక్బర్ 4) ఔరంగజేబు
62. కుతుబ్ షాహీల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా దేనికి ప్రసిద్ధి చెందినవి?
1) ఆయుధాలు 2) ఆహార ధాన్యాలు
3) వజ్రాలు 4) వాస్తు శిల్పం
63. కంచర్ల గోపన్నను జైలులో పెట్టిన గోల్కొండ సుల్తాన్ ఎవరు?
1) అబ్దుల్లా కుతుబ్
2) అబుల్ హసన్ తానీషా
3) మహ్మద్ కులీ కుతుబ్ షా
4) కులీ కుతుబ్ షా
64. హుస్సేన్‌సాగర్ ఎవరి కాలంలో నిర్మించారు?
1) సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా
2) అబ్దుల్లా కుతుబ్ షా
3) అబుల్ హసన్ తానీషా
4) జంషీద్ కులీ
65. దక్కన్ ఉర్దూ భాష ఎవరి కాలంలో గ్రాంథిక భాష హోదా పొందింది?
1) ఇబ్రహీం కులీ కుతుబ్ షా
2) అబుల్ హసన్ తానీషా
3) మహ్మద్ కులీ కుతుబ్ షా
4) మహ్మద్ కుతుబ్ షా
66. హుస్సేన్ సాగర్ నిర్మించిన సంవత్సరం?
1) 1558 2) 1560
3) 1562 4) 1564
67. బాబర్ ఢిల్లీని ఆక్రమించుకున్న సంవత్సరం?
1) సా.శ 1504 2) సా.శ 1516
3) సా.శ 1520 4) సా.శ 1526
68. 1908లో మూసీనది వరదలు తీవ్రంగా
వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు చేపట్టిన నిజాం రాజు?
1) మహబూబ్ అలీఖాన్
2) మీర్ ఉస్మాన్ అలీఖాన్
3) మహారాణా ప్రతాప్
4) నాసీరుద్దౌలా
69. బాబర్ ఎవరిని ఓడించి ఢిల్లీలో మొగల్ రాజ్యస్థాపన చేశాడు?
1) మహ్మద్ బీన్ తుగ్లక్
2) ఇబ్రహీంలోడీ
3) మహారాణా ప్రతాప్
4) రాణా సంగ్రామ్ సింహ్
70. హుమాయున్ను ఓడించి ఇరాన్‌కు పారద్రోలినది?
1) షేర్‌ఖాన్ 2) సికిందర్ షా
3) హేము 4) సంగ్రామ్ సింహ్
71. అసఫియా గ్రంథాలయాన్ని నిర్మించినది?
1) మీర్ ఉస్మాన్ అలీఖాన్
2) మీర్ మహబూబ్ అలీఖాన్
3) సిరాజుద్దౌలా
4) నిజాం- ఉల్- ముల్క్
72. పరిశిష్ట పర్వం గ్రంథకర్త ఎవరు?
1) హేమచంద్రుడు 2) వ్యాస పూజ్యుడు
3) సోమదేవసూరి 4) పంప
73. ఔరంగజేబు మొగల్ సామ్రాజ్యంలో విలీనం చేసిన దక్కన్ రాజ్యాలు?
1) బీజాపూర్ 2) గోల్కొండ
3) అహ్మద్‌నగర్ 4) 1, 2
74. ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినది ఎవరు?
1) శివాజీ 2) గురుతేజ్ బహుదూర్
3) కుమారుడు అక్బర్
4) 1, 2, 3
75. మొగలుల అధికారాన్ని ధిక్కరించిన రాజపుత్రులు?
1) రణతంబోర్ పాలకులు
2) చిత్తోఢ్ పాలకులు
3) మార్వార్ పాలకులు
4) అంబర్ పాలకులు
76. రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొగల్ యువరాజులు?
1) జహంగీర్ 2) అక్బర్
3) షాజహాన్ 4) 1, 3
77. షాజహాన్ తల్లి?
1) అంబర్ రాకుమార్తె
2) మేవాఢ్ రాణి
3) జోథ్‌పూర్ యువరాణి
4) జైసల్మీర్ రాకుమార్తె
78. అజంతా గుహంలోని 10వ గుహలో ఉన్న చిత్రం ఏది?
1) శ్వేతగజం 2) నల్లరాణులు
3) ధ్యానబుద్ధుడు 4) బోధిసత్వుడు
79. 485ను దగ్గరి పదుల స్థానానికి సవరించి రాస్తే?
1) 490 2) 480
3) 482 4) 450
80. 324ని దగ్గరి పదుల స్థానానికి సవరించి రాస్తే ?
1) 320 2) 330
3) 322 4) 340
81. 489ని దగ్గరి వందల స్థానానికి సవరించి రాస్తే ?
1) 400 2) 500
3) 480 4) 490
82. 1455ని దగ్గరి వేల స్థానానికి సవరించి రాస్తే?
1) 1000 2) 2000
3) 1400 4) 1450
83. 682, 189, 457 సంఖ్యలో పది మిలియన్ల స్థానంలో గల అంకె?
1) 6 2) 8 3) 2 4) 3
84. 7634 సంఖ్యలో 6 స్థాన విలువ, ముఖ విలువల మొత్తం?
1) 660 2) 606 3) 600 4) 60
85. 8086=A వేలు + B వందలు+ C పదులు+D ఒకట్లు, C గడిలో ఉండాల్సిన అంకె?
1) 0 2) 80 3) 8 4) 6
86. 5672ని రాయడంలో 7ని వేల స్థానంలోను, 5ని పదుల స్థానంలో మార్చి రాస్తే ఏర్పడే సంఖ్య?
1) 6752 2) 2756
3) 7652 4) 5672
87. 473240092 సంఖ్యలో మిలియన్ల స్థానంలో గల సంఖ్యకు వందల స్థానంలో గల సంఖ్యకు గల తేడా ఏమిటి?
1) 2 2) 4 3) 3 4) 0
88. 44687, 4645, 44670, 44602 ల్లో అతి చిన్న సంఖ్య ఏది?
1) 44687 2) 44645
3) 44670 4) 44602
89. 375, 1475, 15951, 4713 సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాస్తే వచ్చే 3వ సంఖ్య?
1) 375 2) 15951
3) 4713 4) 1475
90. 1876, 89715, 89705, 89524 సంఖ్యలను అవరోహణ క్రమంలో రాస్తే వచ్చే 2వ సంఖ్య ఏది?
1) 89715 2) 89524
3) 89705 4) 1876
91. 30304 దీనికి సంబంధించి సరైనది?
1) 3వేలు, 3 వందలు, 4 ఒకట్లు
2) 3 పదివేలు, 3వేలు, 4 ఒకట్లు
3) 3 లక్షలు, 3 వందలు, 4 ఒకట్లు
4) 3 పదివేలు, 3 వందలు, 4 ఒకట్లు
92. పద్నాలుగు వేల అరవై నాలుగును అంకెల్లో రాస్తే?
1) 14640 2) 1400064
3) 64014 4) 14064
93. 4, 0, 3, 7లతో ఏర్పడే అతిచిన్న నాలుగు అంకెల సంఖ్య?
1) 3407 2) 3470
3) 3047 4) 3740
94. నాలగు అంకెల అతి చిన్న సంఖ్య?
1) 1111 2) 9999
3) 1234 4) 1000
95. నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్య?
1) 9876 2) 9999
3) 9989 4) 1000
96. 256ని సమీప వందల స్థానానికి సవరించి రాస్తే?
1) 200 2) 250 3) 300 4) 400
97. 5078ని విస్తరించి రాస్తే?
1) 5000+700+8 2) 500+70+8
3) 5000+70+80 4) 5000+70+8
98. 20000+ 50ని కలిపితే వచ్చే సంఖ్య?
1) 2050 2) 20050
3) 20500 4) ఏదీకాదు
99. అయిదంకెల సంఖ్యలన్నిటిలో అతిపెద్ద సంఖ్యకు ఒకటి కలిపితే వచ్చే సంఖ్య?
1) 99999 2) 10000
3) 100000 4) 9999
100. ఒక లక్ష ఎన్ని వందలకు సమానం?
1) 100 2) 1000
3) 10000 4) 100000
101. ఒక వెయ్యి ఎన్ని లక్షలకు సమానం?
1) 10 2) 0.001
3) 100 4) 0.01
102. 1 కోటిలో గల సున్నాల సంఖ్య?
1) 8 2) 7 3) 6 4) 5
103. 1 కోటి కింది వాటిలో దేనికి సమానం?
1) 100 లక్షలు 2) 10, 000 వేలు
3) 1 లక్ష వందలు 4) పైవన్నీ సరైనవే
104. అరవై కోట్ల అరవై లక్షల అరవై వేల ఆరు వందలను అంకెల్లో రాస్తే?
1) 60,66,60,600
2) 60,60,60,600
3) 60, 60, 60,060
4) 60, 06,60,060
105. ఒక మిలియన్ అంటే?
1) వేయి వేలు 2) పది లక్షలు
3) 1 4) 1, 2
106. ఒక బిలియన్ అంటే?
1) వెయ్యి మిలియన్లు 2) వంద కోట్లు
3) 2 సరైంది కాదు 4) 1, 2 సరైనవి
107. 302179468 సంఖ్యలో మిలియన్ల స్థానంలో గల అంకె?
1) 1 2) 2 3) 0 4) 7
108. 472320118 సంఖ్యలో ఎన్ని మిలియన్లు ఉన్నాయి?
1) 2 2) 72 3) 472 4) ఏదీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు