సాకర్ బంతిని పోలి ఉండే బక్మినిస్టర్ పుల్లరిన్ ఫార్ములా?
అలోహాలు
1. ఆవర్తన పట్టికలోని మొదటి మూలకమైన హైడ్రోజన్, ఆక్సిజన్‌తో ఏర్పరిచే సమ్మేళనం?
ఎ) నీరు
బి) హైడ్రోజన్ పెరాక్సైడ్
సి) ఎ, బి డి) ఏదీకాదు
2. సార్వత్రిక ద్రావణి ఏది?
ఎ) నీరు బి) క్లోరోఫాం
సి) ఈథర్ డి) బెంజీన్
3. ఐస్‌కు సంబంధించిన సరైన వాక్యాలేవి?
1. ఐస్ సంయోజనీయ స్ఫటికం
2. నీరు ఐస్‌గా మారినప్పుడు వ్యాకోచిస్తుంది
3. నీటిపై ఐస్ తేలుతుంది
4. ఐస్‌కు ఉప్పు కలిపితే 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత లభిస్తుంది
ఎ) 2 బి) 2, 3 సి) 1, 2, 3 డి) అన్నీ
4. నీటిని క్రిమిరహితంగా చేసే ప్రక్రియలు?
1. బ్లీచింగ్ పౌడర్ కలపడం
2. క్లోరినీకరణం చేయడం
3. అతినీలలోహిత కిరణాలకు గురిచేయడం
4. ఓజోనీకరణం చేయడం
5. ఫ్లోరినీకరణం
ఎ) 1, 5 బి) 1, 2, 5
సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
5. కఠిన జలాన్ని వేడి చేసే పాత్రను అంటుకొనే పెలుసుల్లో ఉండే పదార్థాలు?
ఎ) కాల్షియం కార్బోనేట్
బి) మెగ్నీషియం కార్బోనేట్
సి) సోడియం కార్బోనేట్ డి) ఎ, బి
6. నీటిని విద్యుద్విశ్లేషణ చేసి విడగొడితే లభించే మూలకాలు?
ఎ) ఆక్సిజన్, నైట్రోజన్
బి) ఆక్సిజన్, హైడ్రోజన్
సి) కార్బన్, హైడ్రోజన్
డి) ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్
7. స్వచ్ఛమైన నీరు?
ఎ) వర్షపునీరు బి) నది నీరు
సి) బావినీరు డి) సముద్రపు నీరు
8. ఓడ నది నీటి నుంచి సముద్రపు నీటిలో ప్రవేశించినప్పుడు?
ఎ) మునుగుతుంది బి) పైకితేలుతుంది
సి) మార్పు ఉండదు
డి) తలకిందులైపోతుంది
9. లవణాలతో కూడిన సముద్రజలం నుంచి స్వచ్ఛమైన నీటిని పొందే విధానం?
1. వడపోత 2. స్వేదనం
3. స్ఫటికీకరణం 4. తిరోగామి ద్రవాభిసరణం
ఎ) 1, 3 బి) 2, 3
సి) 2, 4 డి) అన్నీ
10. నీటి బిందువుల గోళాకృతికి కారణం?
ఎ) స్నిగ్ధత బి) తలతన్యత
సి) వక్రీభవన గుణకం
డి) ద్రవాలు ఏవైనా అలాగే ఉంటాయి
11. బీకర్లోని నీటిలో మంచుముక్క కరిగినప్పుడు నీటి స్థాయి?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మారదు
డి) మొదట పెరిగి తరువాత తగ్గుతుంది
12. నీటికి గరిష్ఠ సాంద్రత ఉండే ఉష్ణోగ్రత?
ఎ) 00C బి) 40C సి) 1000C డి) 250C
13. నీటిని 00 నుంచి 100లకు వేడిచేసినప్పుడు నీటి పరిమాణం?
ఎ) నెమ్మదిగా పెరుగుతుంది
బి) నెమ్మదిగా తగ్గుతుంది
సి) మొదట పెరిగి తరువాత తగ్గుతుంది
డి) మొదట తగ్గి తరువాత పెరుగుతుంది
14. నీరు ఆవిరి అయ్యే ఉష్ణోగ్రత?
ఎ) 00C బి) 273 K
సి) 373 K డి) 2730C
15. నీటి తాత్కాలిక కాఠిన్యతకు కారణమైన కాల్షియం, మెగ్నీషియం లవణాలు?
ఎ) బైకార్బోనేట్లు బి) క్లోరైడ్లు
సి) సల్ఫేట్లు డి) కార్బోనేట్లు
16. నీటి శాశ్వత కాఠిన్యతకు కారణమైన కాల్షియం, మెగ్నీషియం లవణాలు?
ఎ) బైకార్బోనేట్లు బి) క్లోరైడ్లు
సి) సల్ఫేట్లు డి) బి, సి
17. నీటిని మరిగిస్తే తొలగిపోయేది?
ఎ) తాత్కాలిక కాఠిన్యత మాత్రమే
బి) శాశ్వత కాఠిన్యత మాత్రమే
సి) ఎ, బి డి) ఏదీకాదు
18. నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించే పద్ధతి?
ఎ) మరిగించడం
బి) లైమ్ వాటర్ కలిపి వేడిచేయడం
సి) మెంబ్రేన్ ద్వారా పంపించడం
డి) అన్నీ
19. నిశ్చితం (ఎ) – మట్టి పాత్రలలో నీరు చల్లగా ఉంటుంది.
కారణం (ఆర్) – నీటి నుంచి ఉష్ణాన్ని
గ్రహిస్తూ మట్టి కుండలకు గల సూక్ష్మ
రంధ్రాల ద్వారా నీరు ఆవిరి అవుతుంది
ఎ) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు (ఆర్) సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు (ఆర్) సరైన వివరణ కాదు
సి) (ఎ) సరైనది కానీ (ఆర్) సరైనది కాదు
డి) (ఎ) సరైనది కాదు కానీ (ఆర్) సరైనది
20. నిశ్చితం (ఎ) – పెట్రోల్ మంటలను నీటితో ఆర్పడం కష్టం
కారణం (ఆర్) – సాంద్రత తక్కువగా ఉండటం వల్ల పెట్రోల్ నీటిపై తేలుతుంది
ఎ) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు (ఆర్) సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు (ఆర్) సరైన వివరణ కాదు
సి) (ఎ) సరైనది కానీ (ఆర్) సరైనది కాదు
డి) (ఎ) సరైనది కాదు కానీ (ఆర్) సరైనది
21. నీటిని హైడ్రోజన్ ఏ రూపంగా పరిగణించవచ్చు?
ఎ) ఆక్సైడ్ బి) క్లోరైడ్
సి) సల్ఫైడ్ డి) ఫ్లోరైడ్
22. సరైన వాక్యాలు గుర్తించండి.
1. సాధారణ నీటి ఫార్ములా H2O
2. నీరు ఐస్‌గా మారినా, బాష్పంగా మారినా అది భౌతిక మార్పుగానే పరిగణించాలి
3. భారజలం అంటే బురదనీరు
4. భారజలం ఫార్ములా D2O
ఎ) 1 బి) 1, 2
సి) 1, 2, 3 డి) 1, 2, 4
23. నీటిని చల్లబరిచినప్పుడు ఎలా గడ్డకడుతుంది?
ఎ) పైనుంచి కిందికి
బి) కింది నుంచి పైకి
సి) మధ్య నుంచి కిందికి, ఆ తరువాత పైకి
డి) మొత్తం ఒకేసారి
24. పర్వతాలపై నీరు సాధారణ ఉష్ణోగ్రత కంటే ఏ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది?
ఎ) తక్కువ బి) ఎక్కువ
సి) 1000 C
డి) పర్వత స్వభావంపై ఆధారపడుతుంది
25. పర్వతాలపై వంట చేయడం ఎప్పుడు మేలుగా ఉంటుంది?
ఎ) తెరిచి ఉంచిన పాత్రలో
బి) ప్రెషర్ కుక్కర్లో
సి) మూసి ఉంచిన పాత్రలో
డి) ఎలాగైనా ఒకటే
26. భూమిలోని నీటిని మొక్కలు ఎలా గ్రహిస్తాయి?
ఎ) కేశనాళికీయత బి) ద్రవాభిసరణం
సి) తిరోగామి ద్రవాభిసరణం
డి) స్వేదనం
27. నూనెల మంటలను ఆర్పడానికి ఏది సరైనది?
ఎ) నీరు బి) ఆల్కహాల్
సి) కార్బన్ డై ఆక్సైడ్ డి) బెంజిన్
28. అత్యధిక వక్రీభవన గుణకం కలిగింది?
ఎ) గ్రాఫైట్ బి) కోక్
సి) డైమండ్ డి) కోల్
29. గాయాలను కడిగేందుకు ఉపయోగించే యాంటీసెప్టిక్ మందు పెర్‌హైడ్రాల్ అనేది?
ఎ) 30 శాతం ఫార్మాల్డిహైడ్
బి) 30 శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్
సి) 30 శాతం డెటాల్
డి) 30 శాతం ఫినాల్
30. తెరచి ఉన్న పుస్తక ఆకృతి కింది వాటిలో దేనికి ఉంటుంది?
ఎ) నీరు బి) హైడ్రోజన్ పెరాక్సైడ్
సి) అమ్మోనియా
డి) ఏదీకాదు
31. ‘వర్చువల్ వాటర్’ అంటే?
ఎ) ఒయాసిస్సులోని నీరు
బి) చమురుబావులలోని నీరు
సి) వస్తువులు, పంటల ఉత్పత్తిలో
వినియోగించే నీటి పరిమాణం
డి) మనిషి లేదా జంతు శరీరంలో ఉండే నీటి పరిమాణం
32. సాంద్రతపరంగా ఏ నీటిలో ఈతకొట్టడం తేలిక?
ఎ) నది నీటిలో
బి) స్విమ్మింగ్ పూల్ నీటిలో
సి) సముద్రపు నీటిలో
డి) కాలువ నీటిలో
33. భారజలం అనేది?
ఎ) డ్యుటీరియం ఆక్సైడ్
బి) సముద్రపు నీరు
సి) ఉప్పు నీరు డి) వర్షపునీరు
34. నీటిలో ఎక్కువగా కరిగే పదార్థమేది?
ఎ) కర్పూరం
బి) సోడియం కార్బోనేట్
సి) చక్కెర డి) బేరియం సల్ఫేట్
35. కార్బన్ స్ఫటిక రూపాంతరాలు ఏవి?
1. గ్రాఫైట్ 2. డైమండ్
3. ఫుల్లరిన్ 4. కోక్
ఎ) 4 బి) 1, 4
సి) 1, 2, 3 డి) అన్నీ
36. ఏ బొగ్గులో కార్బన్ శాతం గరిష్ఠం?
ఎ) లిగ్నైట్ బి) బిట్యుమినన్
సి) ఆంథ్రసైట్ డి) పీట్
37. డైమండ్ ప్రకాశవంతంగా మెరవడానికి కారణం ఏమిటి?
ఎ) సంపూర్ణాంతర పరావర్తనం
బి) వక్రీభవనం
సి) రంగు డి) సానపెట్టడం
38. కింది వాటిలో సరైనది?
1. CO తటస్థ ఆక్సైడ్
2. CO విషపూరితం
3. CO గ్రీన్హౌస్ వాయువు
4. CO2 వల్ల ఆమ్ల వర్షాలు సంభవిస్తాయి
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1, 3 డి) అన్నీ
39. కింది వాటిలో సరైనది ఏది?
1. CO దహనశీల వాయువు
2. CO2 దహనశీల వాయువు
3. మంటలను ఆర్పడానికి CO2ను ఉపయోగిస్తారు
4. శీతల పానీయాల్లో CO2 ఉంటుంది
ఎ) 1, 3, 4 బి) 2, 3, 4
సి) 1, 2, 3 డి) అన్నీ
40. కార్బోనేట్లను, బైకార్బోనేట్లను సజల ఆమ్లంతో చర్య జరిపిస్తే విడుదలయ్యే వాయువు ఏది?
ఎ) CO2 బి) CO
సి) N2O డి) CL2
41. ఇసుక, క్వార్ట్జ్ల రసాయన నామం?
ఎ) సిలికాన్ బి) సిలికాన్ డై ఆక్సైడ్
సి) సోడియం సలికేట్
డి) సిలికాన్ కార్బైడ్
42. రాళ్లలోని ముఖ్యమైన మూలకం?
ఎ) కార్బన్ బి) సిలికాన్
సి) ఐరన్ డి) పాస్ఫరస్
43. పొడి అగ్నిమాపక పరికరాలలో ఉండేది?
ఎ) ఇసుక బి) ఇసుక + సున్నం
సి) ఇసుక + బేకింగ్ సోడా
డి) ఇసుక + వాషింగ్ సోడా
44. బక్మినిస్టర్ ఫుల్లరిన్‌లో లభించేపరమాణువులు?
ఎ) నైట్రోజన్ బి) సల్ఫర్
సి) పాస్ఫరస్ డి) కార్బన్
45. సహజ సిద్ధంగా లభించే కఠిన పదార్థం?
ఎ) గ్రాఫైట్ బి) డైమండ్
సి) టంగ్స్టన్ డి) ఐరన్
46. లెడ్పెన్సిల్లో ఉపయోగించే పదార్థం ఏది?
ఎ) లెడ్ బి) ఐరన్
సి) గ్రాఫైట్ డి) డైమండ్
47. గాజును కోయడానికి ఉపయోగించే పదార్థం ఏది?
ఎ) గ్రాఫైట్ బి) డైమండ్
సి) స్టీల్ డి) టంగ్స్టన్
48. సాకర్ బంతిని పోలి ఉండే బక్మినిస్టర్ పుల్లరిన్ ఫార్ములా?
ఎ) C60H120 బి) C60
సి) C60H122 డి) C100
49. అనార్ట్ర ఘటం (డ్రై సెల్)లో ఎలక్ట్రోడ్‌గా ఉపయోగించే పదార్థం ఏది?
ఎ) డైమండ్ బి) గ్రాఫైట్
సి) సల్ఫర్ డి) పాస్ఫరస్
50. కార్బన్ రూపాంతం కానిది ఏది?
ఎ) గ్రాఫైట్ బి) డైమండ్
సి) ఎముకుల బొగ్గు డి) కాంపర్
51. మోటార్ వాహనాల పొగలో ఎక్కువగా ఉండే విషవాయువు ఏది?
ఎ) CO బి) CO2
సి) N2 డి) SO2
52. CO2 విడుదలయ్యే ప్రక్రియ?
ఎ) శ్వాసక్రియ బి) దహన క్రియ
సి) కిణ్వ ప్రక్రియ డి) అన్నీ
53. నిశ్చితం (ఎ) – CO2 విషవాయువు కారణం (ఆర్) – CO2ను పీల్చినప్పుడు
శ్వాసక్రియ సరిగా జరగనందువల్ల ప్రాణహాని కలుగుతుంది
ఎ) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు (ఆర్) సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు (ఆర్) సరైన వివరణ కాదు
సి) (ఎ) సరైనది కానీ (ఆర్) సరైనది కాదు
డి) (ఎ) సరైనది కాదు కానీ (ఆర్) సరైనది
54. ఘన కార్బన్ డై ఆక్సైడ్‌కు గల మరోపేరు?
ఎ) పొడి మంచు బి) తడి మంచు
సి) ద్రవ మంచు డి) హిమీకరణ మంచు
55. జతపరచండి.
ఎ. రిఫ్రిజిరెంట్ 1. కాల్షియం పాస్ఫేట్
బి. లాఫింగ్ గ్యాస్ 2. కాల్షియం డై
హైడ్రోజన్ పాస్ఫేట్
సి. ట్రిపుల్సూపర్ పాస్ఫేట్
3. ద్రవ అమోనియా డి. వాటర్ గ్లాస్ 4. నైట్రస్ ఆక్సైడ్
5. సోడియం సిలికేట్
ఎ) ఎ-1, బి-4, సి-3, డి-4
బి) ఎ-3, బి-4, సి-1, డి-5
సి) ఎ-3, బి-4, సి-1, డి-2
డి) ఎ-3, బి-4, సి-4, డి-5
56. కార్బన్ డై ఆక్సైడ్?
1. నీటిలో కరిగి కార్బోనికామ్లాన్ని ఏర్పరుస్తుంది
2. ఆమ్లస్వభావం కారణంగా తడి నీలి లిట్మస్ ఎరుపుగా మారుస్తుంది
3. సున్నపు తేట (కాల్షియం హైడ్రాక్సైడ్)ను పాలలా మారుస్తుంది
4. కిరణజన్య సంయోగ క్రియలో పిండి పదార్థం తయారీకి అవసరం
ఎ) 1, 3 బి) 1, 3, 4
సి) 2, 3, 4 డి) అన్నీ
57. దృఢత్వం గల మృదువైన మూలకం?
ఎ) కార్బన్ బి) పాస్ఫరస్
సి) సిలికాన్ డి) జెర్మేనియం
58. నిశ్చితం (ఎ)- కార్బన్ మోనాక్సైడ్ దహనశీల వాయువు కారణం (ఆర్)- కార్బన్ డై ఆక్సైడ్ దహనశీలి కాదు, దహన దోహదకారి కాదు.
ఎ) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు, (ఆర్) సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు, (ఆర్) సరైన వివరణ కాదు
సి) (ఎ) సరైనది కానీ (ఆర్) సరైనది కాదు
డి) (ఎ) సరైనది కాదు కానీ (ఆర్) సరైనది
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు