జాతీయాదాయ అంచనాలు ఎలా ఉంటాయి?
వ్యక్తిగత ఆదాయం/ వ్యష్టి ఆదాయం (Personal Income): జాతీయ ఆదాయం నుంచి పంచబడని కంపెనీ లాభాలు తీసివేసి, కంపెనీ చెల్లించే సాంఘిక విరాళాలు, కార్పొరేషన్ పన్నులను మినహాయించి, పనిచేయకుండానే వ్యక్తులకు లభించే బదిలీ చెల్లింపులను, ప్రభుత్వం వ్యక్తులకు చెల్లించే వడ్డీ చెల్లింపులను కలపగా లభించేదే వ్యష్టి ఆదాయం.
–వ్యక్తిగత ఆదాయం(PI) = NI జాతీయం ఆదాయం – పంచబడని కంపెనీ లాభాలు (UCD) – సాంఘిక విరాళాలు (SD) – కార్పొరేషన్ పన్నులు (CIT) + బదిలీ చెల్లింపులు (TP) + వడ్డీ చెల్లింపులు (IP)
= (NNP- IT+S) – UCP- SD- CIT+TP+IP
= GNP- D-IT+S-UCP-SD-CIT+TP+IP
= GDP+ (X-M)+(R-P)-D-IT+S-UCP-SD-
CIT+TP+ IP
PI= C+I+G+(X-M)+ (R-P)-D-IT+S-UCP-
SD-CIT+TP+IP
బదిలీ చెల్లింపులు = నిరుద్యోగ భృతి + వృద్ధాప్య పింఛన్లు
వ్యయార్హ ఆదాయం (Disposable Income -DI)
-వ్యష్టి ఆదాయం నుంచి వ్యష్టి పన్నులను మినహాయించగా లభించేదే వ్యయార్హ ఆదాయం. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి డిమాండ్ పెరగాలంటే ప్రజల వద్ద వ్యయార్హ ఆదాయం పెరగాలని ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు జేఎం కీన్స్ పేర్కొన్నారు.
DI = వ్యష్టి ఆదాయం (PI) – వ్యష్టి పన్నులు (PT)
DI = (PI)-(PT)
= (C+I+G+(X-M)+(R-P)-D-IT+S-UCP-SD-CIT+TP+IP)-(PT)
తలసరి ఆదాయం (Percapita Income -PCI)
-ప్రజల జీవనప్రమాణాన్ని తెలియజేసే జాతీయ ఆదాయ భావనే తలసరి ఆదాయం. జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగించగా వచ్చేది తలసరి ఆదాయం.
PCI =జాతీయ ఆదాయం (NI)/జనాభా
నిజ జాతీయ ఆదాయం (Real National Income)
-నిజ జాతీయ ఆదాయం
= ప్రస్తుత సంవత్సర ఉత్పత్తి X ఆధార సంవత్సర ధర
నామ మాత్రపు జాతీయ ఆదాయం (Naminal National Income- NNI)
-నామ మాత్రపు జాతీయ ఆదాయం
= ప్రస్తుత సంవత్సర ఉత్పత్తి X ప్రస్తుత సంవత్సర ధర
ధరల సూచీ (Price Index)
ధరల సూచీ= నామమాత్రపు జాతీయ ఆదాయం/నిజ జాతీయాదాయం
నిజ తలసరి ఆదాయం (Real Per Capita Income)
నిజ తలసరి ఆదాయం =నిజ జాతీయ ఆదాయం/జనాభా
-ఆర్థిక వ్యవస్థలో నిజ జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవాలంటే ఆధార సంవత్సరమైనా అందుబాటులో ఉండాలి లేదా ధరల సూచీ అయినా అందుబాటులో ఉండాలి. కాబట్టి ఆధార సంవత్సరం ముఖ్య ఉద్దేశం నిజ జాతీయాన్ని తెలుసుకోవడం. అదే విధంగా ధరల సూచీ ముఖ్య ఉద్దేశం కూడా నిజ జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవడమే. ఒకవేళ ధరల పెరుగుదల చోటు చేసుకున్నట్లయితే ధరల సూచీ పెరుగుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణానికి, ధరల సూచీకి అనులోమ సంబంధం ఉంటుంది.
-ప్రపంచంలో తలసరి ఆదాయంలో స్విట్జర్లాండ్ ప్రథమ స్థానంలో ఉంది.
-ఏ దేశ జాతీయ ఆదాయం 1000 బిలయన్ డాలర్లు (ట్రిలియన్) దాటుతుందో ఆ దేశాలను ట్రిలియన్ డాలర్ క్లబ్ (TDC)లో సభ్యులుగా గుర్తిస్తారు. TDC లు దాటిన దేశాల్లో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, ఇండియా 11వ స్థానంలో ఉంది. దేశంలో లక్ష కోట్ల ఆదాయ పరిధిని ప్రథమంగా ముఖేష్ అంబానీ అధిగమించగా, తర్వాత అనిల్ అంబానీ అధిగమించారు.
-సీఎస్ఓ ప్రకారం GSDP (Gross State Domestic Product)ని సత్వరంగా పెంచుకుంటున్న రాష్ర్టాలు ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, గుజరాత్ అయితే దీనికి వ్యతిరేకంగా GSDPని నెమ్మదిగా పెంచుకుంటున్న రాష్ర్టాలు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా ఉన్నాయి.
పొదుపు – పెట్టుబడి
-ప్రస్తుతం ప్రభుత్వరంగం 31.7 శాతం, ప్రైవేటురంగం 29.7 శాతం పొదుపులను కలిగి ఉన్నాయి. అంటే పొదుపుల్లో ప్రైవేటురంగం ప్రభుత్వరంగాన్ని అధిగమించింది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కుటుంబాలు 23.7 శాతం కలిగి ఉండగా, కార్పొరేటురంగం 6 శాతం కలిగి ఉన్నాయి. అంటే భారత ఆర్థిక వ్యవస్థలో అత్యధిక పొదుపులు ప్రైవేటురంగంలో ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేటురంగంలో కుటుంబాలు పొదుపులో ఆధిక్యతను కలిగి ఉన్నాయి.
స్థూల మూలధన సంచయనం
-సీఎస్ఓ ప్రకారం జాతీయ ఆదాయంలో ప్రభుత్వరంగం వాటా 22.3 శాతంగా ఉంది. స్థూల మూలధన సంచయనం (Gross Fixed Capital Formation- GFCF (యంత్రసామగ్రి))లో ప్రైవేటు రంగం వాటా 77.32 శాతంగా ఉండగా, ప్రభుత్వరంగం వాటా 22.68 శాతం కలిగి ఉంది. కాబట్టి యంత్రాలు, ఆదాయంలో ప్రైవేటురంగం అజమాయిషీ ఉంది.
-ప్రజల వినియోగంలో ఆహారం, శీతలపానీయాలపై అత్యధికంగా 42.1 శాతం ఖర్చు చేస్తున్నారు. ఆ తర్వాత స్థానాల్లో రవాణా 18.4 శాతం, అద్దె, ఇంధనం, విద్యుత్పైన 10 శాతం వెచ్చిస్తున్నారు. దేశంలో అధిక జనాభావల్ల ఆహారం, పానీయాలపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.
-భారత ఆర్థిక వ్యవస్థలో సీఎస్వో ప్రకారం తలసరి ఆదాయం వృద్ధి ఎక్కువగా ఉండి, తలసరి వినియోగ వృద్ధిరేటు తక్కువగా నమోదు కావడంవల్ల దేశంలో పొదుపులు పెరుగుతున్నాయి. ఆ పొదుపు పెట్టుబడిగా మారి వస్తురాశిని పెంచుతుంది.
-ఆదాయ ప్రవాహ వృత్తం (Circular blow of Income): ఒక ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, సప్లయ్లు సమానంగా ఉండాలని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అంటే వస్తువులను కొనుగోలు చేసే కుటుంబాలు (సమిష్టి డిమాండ్), వస్తువులను సరఫరా చేసే సంస్థల (సమిష్టి సప్లయ్) మధ్య సంతులనం చోటుచేసుకున్నప్పుడే ఆర్థికవ్యవస్థలో హెచ్చుతగ్గులు (ద్రవ్యోల్బణం, మాంద్యం) రావడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఆదాయ ప్రవాహ వృత్తం నిరంతరం ప్రవాహాన్ని కలిగి ఉండాలి.
జాతీయ ఆదాయ గణనలో సమస్యలు:
దేశంలో 93 శాతం కార్మికవర్గం అసంఘటితరంగంలో ఉన్నారు. అదేవిధంగా స్వయం వినియోగం కోసం రైతాంగం కొంత ఉత్పత్తిని తమ వద్ద అంటిపెట్టుకుంటున్నారు. అంటే ప్రభుత్వానికి దీనికి సంబంధించిన సమాచారం రావడంలేదు. అదేవిధంగా కొందరు అనేక రకాల పనులు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. అలాంటి ఆదాయాన్ని కూడా ప్రభుత్వం తెలుసుకోలేక పోతున్నది. విదేశీ సంస్థల ఉత్పత్తిని జాతీయ ఆదాయంలో తీసుకున్నా.. వారు లాభాలను తమ దేశాలకు తీసుకెళ్లడం వల్ల జాతీయ ఆదాయం పెద్ద మొత్తంలో నమోదైనా ప్రజలకు ఉపయోగపడటం లేదు. అధిక సంఖ్యలో ఉన్న ప్రైవేటు సంస్థలు గణాంకాలు నిర్వహించడం లేదు. దీనికి ముఖ్య కారణం పన్నులు చెల్లించాల్సి వస్తుందనే భయం. అదేవిధంగా నైపుణ్యం ఉన్న ఉద్యోగి బృందం గణాంకాలు నిర్వహించడం లేదనేది కూడా ఒక విమర్శ. జాతీయ ఆదాయం ఒక ప్రవాహమే కానీ నిల్వ కాదు.
-వినియోగం, పెట్టుబడి, ప్రభుత్వ కొనుగోళ్లు, నికర లాభాలు వంటివి అంతిమ ఉత్పత్తి భావనలో ఉండే ప్రధానాంశాలు.
-ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం పనితీరును విశ్లేషించడంలో ఆర్థికవేత్తలకు జాతీయ ఆదాయ అంచనాలు ఉపయోగపడుతాయి.
-ఒక దేశ స్థూల ఆర్థిక కార్యకలాపాల స్థాయిని, వాటిలో జరిగే మార్పులను స్థూల జాతీయోత్పత్తి అంచనాలు వివరిస్తాయి.
-ఒకే దేశంలో ఆదాయ పెరుగుదల, పంపిణీ, సంక్షేమాన్ని అంచనా వేయడానికి తలసరి ఆదాయ అంచనాలు ఉపయోగపడుతాయి.
-నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వృద్ధి వంటి గొప్ప సమస్యలను ఎదుర్కోవడానికి జాతీయ ఆదాయ భావన మీద ఆధారపడటం అనివార్యమని శామ్యూల్సన్ అనే ఆర్థికవేత్త తెలిపాడు.
-కేంద్ర గణాంక సంస్థ 1954 నుంచి జాతీయాదాయాన్ని మదింపు చేస్తున్నది.
-కేంద్ర గణాంక సంస్థ (సీఎస్ఓ) ప్రస్తుతం జాతీయాదాయాన్ని మదింపు చేయడానికి 2011-12ను ఆధార సంవత్సరంగా ఉపయోగిస్తున్నది.
-జాతీయాదాయాన్ని అంచనావేయడానికి సీఎస్ఓ భారత ఆర్థిక వ్యవస్థను మూడు రకాలుగా విభజించాలి.
1. ప్రాథమికరంగం
2. ద్వితీయరంగం
3. తృతీయరంగం
-కేంద్ర గణాంక సంస్థ తయారుచేసే జాతీయాదాయ అంచనాలు మనకు మూడు శ్రేణుల్లో లభిస్తున్నాయి.
1. సంప్రదాయిక శ్రేణులు
2. సవరించిన శ్రేణులు
3. నవ్యశ్రేణులు
-కేంద్ర గణాంక సంస్థ సంప్రదాయిక శ్రేణుల్లో జాతీయ ఆదాయాన్ని మదింపు చేయడానికి ఆర్థికవ్యవస్థను 13 రంగాలుగా విభజించింది.
-జాతీయాదాయాన్ని లెక్కించే విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా వచ్చిన జాతీయాదాయ వివరాలను సవరించే శ్రేణులు అంటారు.
-జాతీయాదాయాన్ని నిర్ణయించే ముఖ్య కారకాలు – ప్రకృతి వనరులు, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, బ్యాంకింగ్, విద్యాప్రమాణాలు, రవాణా సౌకర్యాలు.
-భారతదేశంలో జాతీయాదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో తొలిసారిగా 1931-32లో వీకేఆర్వీ రావు లెక్కగట్టారు.
ఉత్పత్తికారకాల ధరకు, మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసం
-ఉత్పత్తికారకాల ధరకు ప్రభుత్వం విధించే పరోక్ష, ప్రత్యక్ష పన్నుల భారం, విక్రయదారుడి లాభం కలిస్తే మార్కెట్ ధర వస్తుంది.
-ఉత్పత్తి పద్ధతిలో లెక్కించే వస్తువులు, సేవలను స్థూలంగా నాలుగు రకాలుగా వర్గీకరించారు.
1. వినియోగ వస్తువులు
2. స్థూల దేశీయ ప్రైవేటు పెట్టుబడులు
3. ప్రభుత్వరంగ ఉత్పత్తులు
4. నికర ఎగుమతులు
-భారత్లో అధికారికంగా మొదటిసారిగా జాతీయాదాయాన్ని 1948-49లో లెక్కగట్టారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు