International alliances | అంతర్జాతీయ కూటములు
అలీనోద్యమ కూటమి (Non Aligned Movement-NAM)
-1961బెల్గ్రెడ్లో ప్రారంభమైంది.
-ఇందులో 120 దేశాలకు సభ్యత్వం ఉంది. 17 దేశాలు పరీశీలక హోదా కలిగి ఉన్నాయి.
-అలీన విధానం అనే పదాన్ని మొదటిసారిగా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉపయోగించారు.
-రెండో ప్రపంచ యుద్ధానంతరం కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశాలు తమ స్వాతంత్య్రం, సమానత్వం, సాంఘిక న్యాయం కోసం అలీనోద్యమ కూటమిగా ఏర్పడ్డాయి.
-1955లో ఇండోనేషియాలోని బాండుంగ్‌లో జరిగిన సమావేశం దీనికి పునాది అయ్యింది. ఈ ఉద్యమానికి నెహ్రూ, జోసెఫ్ టిటో (యుగోస్లేవియా), అబ్దుల్ నాజర్ (ఈజిప్ట్), సుకర్నో (ఇండోనేషియా) కృషిచేశారు.
-ఇది ప్రతి మూడేండ్లకు ఒకసారి సమావేశమవుతుంది. ఇప్పటివరకు 17 సమావేశాలు జరిగాయి. 17వ సమావేశం 2015లో వెనిజులాలో జరిగింది.
జీ-4 దేశాల కూటమి
-ఐక్యరాజ్య సమితిలోని భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్‌లు కలిసి జీ-4 దేశాల కూటమిగా ఏర్పడ్డాయి.
-ఇది 2004 ప్రారంభమైంది.
ఐబీఎస్ఏ కూటమి
-ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని మూడు ప్రధాన ఆర్థిక వ్యవస్థల కూడిన ఐబీఎస్ఏ 2003లో ఏర్పడింది.
-ఇండియా (I), బ్రెజిల్ (B), దక్షిణాఫ్రికా (SA)లు ఇందులో సభ్యులుగా ఉన్నాయి.
-పేద దేశాల మధ్య సహకారం పెంపొందించడం, సమగ్ర ప్రపంచాభివృద్ధిలో కీలకపాత్ర పోషించడం ఈ కూటమి ప్రధాన ఉద్దేశం.
-2006లో ఈ కూటమి తొలి శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్లో జరిగింది. 7వ శిఖరాగ్ర సమావేశం 2015లో న్యూఢిల్లీలో జరిగింది.
-భారత్‌లో ఇప్పటివరకు రెండు సార్లు (2008, 2015లో) ఈ సమావేశాలు జరిగాయి.
బ్రిక్స్ కూటమి
-ప్రపంచంలో ఆర్థికంగా, వైశాల్యపరంగా అత్యంత శక్తివంతమైన కూటమి అయిన బ్రిక్స్ 2008లో ఏర్పడింది.
-ఇది మొదట బ్రిక్‌గా ఉండేది. 2010లో దక్షిణాఫ్రికా ఈ కూటమిలో చేరడంతో బ్రిక్స్‌గా మారింది.
-మొత్తం సభ్యదేశాలు ఐదు. అవి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా.
-బ్రిక్స్ మొదటి సమావేశం 2009లో రష్యాలోని యెకాటెరిన్బర్గ్లో జరిగింది.
-ఇప్పటివరకు మొత్తం 8 సమావేశాలు జరిగాయి.
-బ్రిక్స్ అనే పదాన్ని తొలిసారిగా అమెరికాకు చెందిన ఆర్థిక సంస్థలు ఉపయోగించాయి.
-ఈ కూటమి ఏర్పడటానికి రష్యా ప్రస్తుత ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన కారకుడు.
సార్క్
-దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్) 1985, డిసెంబర్ 8న ప్రారంభమైంది.
-ఇందులో భారత్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్‌లు సభ్యత్వం కలిగి ఉన్నాయి.
-బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియా ఉర్ రెహమాన్ సూచనతో దక్షిణాసియా సహకార సమాఖ్య ఏర్పాటయ్యింది.
-సార్క్ మొదటి సదస్సు 1985లో ఢాకాలో జరిగింది.
-2006, జూన్ నుంచి కూటమిలో సభ్యదేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్యం కోసం SAFTA (South Asia Free Trade Agreement) అమల్లోకి వచ్చింది.
-సార్క్ సదస్సు ఇప్పటి వరకు 17 సార్లు జరిగింది.
-భారత్ 3 సార్లు ఆతిథ్యమిచ్చింది.
ఒపెక్
-పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలు ఒపెక్ కూటమిగా ఏర్పడ్డాయి.
-ఇది 1960లో ఏర్పడింది.
-ఇందులో 13 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.
-పెట్రోలియం ఉత్పత్తి విధానాలు, ధరల విధానాలను సమర్థవంతంగా రూపొందించి పెట్రోలియం సరఫరాపై నియంత్రణ విధించడం కూటమి ప్రధాన ఉద్దేశం.
-ప్రపంచంలోని మొత్తం చమురు ఉత్పత్తిలో 1/3వ వంతు, చమురు నిల్వల్లో 3/4వ వంతు ఈ దేశాల్లోనే ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు