ఖనిజాధారిత పరిశ్రమలు
– ఖనిజాలను ఉపయోగించుకుని పనిచేసే పరిశ్రమను ఖనిజాధారిత పరిశ్రమలు అంటారు.
– తెలంగాణలోని ప్రధాన ఖనిజాధారిత పరిశ్రమలు 1) ఇనుము-ఉక్కు పరిశ్రమ 2) సిమెంట్ పరిశ్రమ 3) రాతినార పరిశ్రమ 4) బొగ్గు పరిశ్రమ 5) అల్యూమినియం పరిశ్రమ
ఇనుము-ఉక్కు పరిశ్రమ
– దేశంలోని మొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ- పాల్వంచ (1980)
– రాష్ట్రంలో స్పాంజ్ ఐరన్ పరిశ్రమల సంఖ్య- 15
– దేశంలో మొదటి ఐరన్, స్టీల్ కర్మాగారం- పోర్ట్నోవా (1832, చెన్నై)
– దీన్ని 1866లో మూసివేశారు.
– ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న అతి పురాతన ఇనుము-ఉక్కు కర్మాగారం లేదా దేశంలో ప్రైవేట్ రంగంలో మొదటిసారిగా ఏర్పడిన ఇనుము-ఉక్కు కర్మాగారం- టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (TISCO)- జంషెడ్పూర్ (జార్ఖండ్)
– ఈ కర్మాగారాన్ని 1907, ఆగస్టు 26న జంషెడ్జీ దొరాబ్జీ టాటా (జేఆర్డీ టాటా) స్థాపించారు.
– దీనిలో దుక్క ఇనుము (పిగ్ ఐరన్) ఉత్పత్తి 1911లో, ఉక్కు ఉత్పత్తి 1912లో ప్రారంభమైంది.
నోట్: దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం ప్రారంభించిన ఇనుము-ఉక్కు కర్మాగారాలు1) టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (టీఐఎస్సీవో)- జంషెడ్పూర్ (1907)
2) ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (ఐఐఎస్‌సీవో)-బర్న్‌పూర్ (పశ్చిమబెంగాల్-1919)
3) విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (వీఐఎస్సీవో)- భద్రావతి (కర్ణాటక)
– దేశంలో స్వాతంత్య్రానంతరం ప్రారంభించిన ఇనుము-ఉక్కు పరిశ్రమలు
1) దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం- దుర్గాపూర్ (పశ్చిమబెంగాల్-1959లో బ్రిటన్ సహాయంతో)
2) రూర్కెలా ఉక్కు కర్మాగారం- రూర్కెలా (ఒడిశా-1959లో జర్మనీ సహాయంతో)
3) భిలాయ్ ఉక్కు కర్మాగారం- భిలాయ్ (1959లో రష్యా సహకారంతో)
4) బొకారో ఉక్కు కర్మాగారం- బొకారో (జార్ఖండ్- 1964లో రష్యా సహకారంతో). ఇది దేశంలో అత్యంత పెద్ద కర్మాగారం.
5) విశాఖపట్నం ఉక్కు కర్మాగారం- విశాఖపట్నం (ఏపీ-1982లో రష్యా సహాయంతో).
– ఇది దేశ తీరప్రాంతంలోని ఏకైక స్టీల్ ప్లాంట్
సిమెంట్ పరిశ్రమ
– సిమెంట్ పరిశ్రమకు ప్రధాన ముడి పదార్థం- సున్నపురాయి.
– ఇది తెలంగాణలో అధికంగా లభిస్తుంది.
– సిమెంట్ పరిశ్రమలు ముఖ్యంగా మంచిర్యాల, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి.
రాతినార పరిశ్రమ (ఆస్బెస్టాస్)
– హైదరాబాద్ ఆస్బెస్టాస్ పరిశ్రమ- సనత్‌నగర్ (1949)
– ఇండియన్ హ్యూమ్ పైప్ ఫ్యాక్టరీ- అజమాబాద్ (హైదరాబాద్)
బొగ్గు పరిశ్రమ
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)
– దీని ప్రధాన కార్యాలయం- కొత్తగూడెం (భద్రాద్రికొత్తగూడెం)
– ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలతో తెలంగాణలో నడిచే, బొగ్గును ఉత్పత్తిచేసే ప్రభుత్వరంగ బొగ్గు మైనింగ్ కంపెనీ.
– ఈ పరిశ్రమలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా- 48.9, 51. మిగిలిన వాటాను ప్రైవేట్ వ్యక్తులు కలిగి ఉన్నారు.
– 1774లో వారన్ హేస్టింగ్స్ అనుమతితో సాంబార్, వాట్లీల ద్వారా మొదటిసారి తవ్వకాలు జరిగాయి.
– 1871లో భద్రాద్రికొత్తగూడెం ఇల్లెందులో జీఎస్ఐకు చెందిన డా. కింగ్ తవ్వకాలు జరిపారు.
– దీనికి మొదట 1886లో హైదరాబాద్ దక్కన్ అని పేరు పెట్టారు. దీన్ని ప్రైవేట్ బ్రిటిష్ కంపెనీ 1886లో నెలకొల్పింది.
– 1920లో దీన్ని హైదరాబాద్ నిజాం కొనుగోలుచేశాడు. తరువాత దీని పేరును SCCLగా మార్చారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం దీన్ని జాతీయం చేసింది.
– 1956 నుంచి దీన్ని రాష్ట్రస్థాయి పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌గా పరిగణిస్తున్నారు.
– తెలంగాణలో ఇల్లెందు వద్ద మొదటిసారిగా బొగ్గును కనుగొన్నారు.
– ప్రస్తుతం సింగరేణి ఆరు జిల్లాల్లో విస్తరించింది. అవి..
1) ఖమ్మం
2) భద్రాద్రి కొత్తగూడెం
3) జయశంకర్ భూపాలపల్లి
4) పెద్దపల్లి
5) మంచిర్యాల
6) కుమ్రంభీం ఆసిఫాబాద్
– దీనిలో పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బొగ్గు అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది.
– సింగరేణి ఆధ్వర్యంలో 16 ఓపెన్ కాస్ట్ గనులు, 30 భూగర్భ గనుల్లో తవ్వకాలు చేపడుతున్నారు. ఇవన్నీ గోదావరి తీరం వెంట విస్తరించి ఉన్నాయి.
సింగరేణి పొందిన అవార్డులు
– గోల్డెన్ పీకాక్ అవార్డు- 2005
– ఇది దేశంలోని ప్రతిష్ఠాత్మక అవార్డు.
– నేషనల్ ైఫ్లెయాష్ యుటిలైజేషన్ అవార్డు- 2005
– పర్యావరణ పరిరక్షణకు పాటించిన పద్ధతులపై విడుదల చేసిన పుస్తకం- ఎకోఫ్రెండ్లీ కోల్ మైనింగ్ ది సింగరేణి అప్రోచ్
– ఎకో సమ్మాన్ అవార్డు
– ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్- ఎన్ శ్రీధర్
– సింగరేణి ఆధ్వర్యంలో ప్రైవేట్ సెక్టార్లో రాష్ట్రంలో బొగ్గును తవ్వితీసే సంస్థ- జేవీఆర్ (జలగం వెంగళరావు). దీని ప్రధాన కార్యాలయం- సత్తుపల్లి (ఖమ్మం)
నోట్: దక్షిణ భారతదేశంలో బొగ్గును తవ్వితీసే ఏకైక సంస్థ సింగరేణి.
– తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, కేరళలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల బొగ్గు అవసరాలను సింగరేణి కాలరీస్ తీరుస్తున్నది.
– సిమెంట్, స్పాంజ్ ఐరన్, ఫార్మస్యూటికల్, రసాయన ఎరువుల కర్మాగారాలకు కూడా అవసరమైన బొగ్గును ఈ సంస్థ సరఫరా చేస్తుంది.
రసాయన ఎరువుల పరిశ్రమ
– ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐ)
– దేశంలో దీని యూనిట్లు మొత్తం నాలుగు ఉన్నాయి. అవి.. 1) సింద్రి
2) రామగుండం (తెలంగాణ)
3) తాల్చేర్
4) గోరఖ్‌పూర్
– పెద్దపల్లి జిల్లా రామగుండంలో 1980లో దీన్ని స్థాపించారు. ఇటీవల దీన్ని పునరుద్ధరించారు.
నోట్: దేశంలో మొదటి ఎరువుల కర్మాగారం స్థాపించిన ప్రదేశం- రాణిపేట్ (తమిళనాడు-1906)
– 1951లో జార్ఖండ్‌లోని సింద్రిలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలోప్రముఖ సిమెంట్ ఫ్యాక్టరీలు
1) అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ (ఏసీసీ)- మంచిర్యాల (1958). ఇది తెలంగాణలో మొదటి సిమెంట్ పరిశ్రమ.
2) కేశోరాం సిమెంట్స్- బసంత్‌నగర్ (పెద్దపల్లి-1969)
3) దక్కన్ సిమెంట్స్- హుజూర్నగర్ (సూర్యాపేట-1979). ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సిమెంట్ పరిశ్రమ
4) మహా సిమెంట్స్- మేళ్లచెరువు (సూర్యాపేట)
5) నాగార్జున సిమెంట్స్- కేతేపల్లి (నల్లగొండ)
6) రాశి సిమెంట్స్ కార్పొరేషన్- వాడపల్లి (నల్లగొండ)
7) సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- తాండూరు (వికారాబాద్)
– తెలంగాణలోని సిమెంట్ పరిశ్రమల సంఖ్య- 21
– రాష్ట్రంలో అధిక సిమెంట్ పరిశ్రమలుగల జిల్లా- నల్లగొండ
నోట్: దేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమను 1904లో చెన్నైలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీన్ని మూసివేశారు.
– పూర్తిస్థాయిలో 1912లో గుజరాత్ పోర్బందర్లో ఏర్పాటుచేశారు.
– సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న రాష్ర్టాలు- ఏపీ, తమిళనాడు
– సిమెంట్‌ను అధికంగా వినియోగిస్తున్న రాష్ర్టాలు- మహారాష్ట్ర, మధ్యప్రదేశ్
ఇంజినీరింగ్ ఆధారిత పరిశ్రమలు
1) ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)
– ఇది ప్రస్తుతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉంది.
– ఇక్కడ టీవీలు, కంప్యూటర్లు, కమ్యూనికేషన్ పరికరాలు తయారవుతాయి.
2) హిందుస్థాన్ మిషన్ టూల్స్ (హెచ్ఎంటీ)
– దేశంలో ఇవి మొత్తం 6 యూనిట్లు ఉన్నాయి.
– తెలంగాణలో పాత రంగారెడ్డి జిల్లాలో ఒక యూనిట్ ఉంది.
– ఇది గడియారాలు, బల్బులు, బోర్వెల్ విడిభాగాలు తయారు చేస్తుంది.
3) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)
– దేశంలోని మొత్తం యూనిట్లు- 6
– 1963లో సంగారెడ్డి జిల్లాలో స్థాపించారు.
– ఇది టర్బైన్లు, జనరేటర్లు, సర్క్యూట్లు, బ్రేకర్లు తయారుచేస్తుంది.
4) హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)
– దీని యూనిట్లు దేశంలో మొత్తం 6 ఉన్నాయి.
– తెలంగాణలో పాత రంగారెడ్డి జిల్లాలో 1965లో స్థాపించారు.
– ఇది విమానాలకు సంబంధించిన విడిభాగాలను తయారుచేస్తుంది.5) హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్)
– దీని యూనిట్లు దేశంలో రెండు ఉన్నాయి.
– తెలంగాణలో పాత రంగారెడ్డి జిల్లాలో ఉంది.
– ఇక్కడ కేబుల్ వైర్‌ను తయారుచేస్తారు.
6) మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని)
– దీన్ని 1973లో రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు.
– ఇక్కడ మిశ్రమలోహాలు (టైటానియం వంటివి) తయారవుతాయి.
7) భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)
– ఇది సంగారెడ్డి జిల్లాలో ఉంది.
– ఇక్కడ క్షిపణుల తయారీ కేంద్రం ఉంది.
8) ఆల్విన్
– ఇది రంగారెడ్డి జిల్లాలో ఉంది.
– ఇక్కడ వాచీలు, రిఫ్రిజిరేటర్లు, బస్సుబాడీలు, బ్యాలె ట్ బాక్సులు మొదలైనవి తయారవుతాయి.
9) ప్రాగాటూల్స్
– ఇది సంగారెడ్డి జిల్లాలో ఉంది.
– ఇక్కడ రక్షణ విభాగం ప్రత్యేక భాగాలు తయారవుతాయి.
10) న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ)
– ఇది హైదరాబాద్‌లో ఉంది.
– ఇది యురేనియాన్ని శుద్ధి చేస్తుంది.
11) ఎలక్ట్రోలక్స్ విభాగం
– ఇది హైదరాబాద్‌లో ఉంది.
– ఇక్కడ రిఫ్రిజిరేటర్లు, ఉక్కు ఫర్నిచర్, గ్యాస్ సిలెండర్లు తయారుచేస్తారు.
12) భారజల ప్లాంట్
– ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉంది.
– ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్లో వాడే భారజలం (డ్యుటీరియం ఆక్సైడ్ (D2O)ను తయారుచేస్తారు.
– ఇది న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా ఉపయోగపడుతుంది.