మత ప్రాతిపదికన రిజర్వ్ అయిన అసెంబ్లీ సీటు ఏ రాష్ట్రంలో ఉంది? (పాలిటీ)
1. భారత్‌లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు
బి. మంత్రి మండలికి సమష్టిగా గవర్నర్ బాధ్యత వహిస్తారు
సి. రాష్ట్ర పాలనకు సంబంధించి మంత్రిమండలి తీసుకున్న అన్ని నిర్ణయాలను శాసన వ్యవస్థ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి గవర్నర్‌కు తెలియజేయాలి
డి. రాష్ట్ర గవర్నర్ కోరితే ఒక మంత్రి తీసుకున్న ఆ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మంత్రిమండలి పరిశీలన కోసం సమర్పించాలి
1) ఎ, బి, సి, డి 2) డి
3) ఎ, సి, డి 4) ఎ, సి
2. కింది స్టేట్మెంట్ను పరిశీలించండి?
భారత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మై Vs భారత యూనియన్ కేసులో గవర్నర్, మంత్రులు, ముఖ్యమంత్రిని తొలగించవచ్చు అని తీర్పు చెప్పింది
ఎ. ముఖ్యమంత్రి శాసనసభలో విశ్వాసాన్ని కోల్పోయినట్లు భావించినప్పుడు
బి. శాసనసభలో మంత్రి మండలి విశ్వాస పరీక్షను ప్రవేశపెట్టాలని భావించినప్పుడు
సి. మంత్రులు శాసనసభ విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు
డి. మంత్రిమండలికి వ్యతిరేకంగా వచ్చిన సెన్సర్ మోషన్ని మంత్రులు వ్యతిరేకించినప్పుడు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) సి, డి
3. గవర్నర్‌గా ఒక వ్యక్తి ఎన్నిసార్లు నియామకం కావచ్చు?
1) ఒకసారి 2) రెండు సార్లు
3) మూడు సార్లు 4) ఎన్ని సార్లెనా
4. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ సందర్భాల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేసే హక్కు ఉండదు?
1) ముఖ్యమంత్రి కూడా పోటీలో ఉంటే
2) రాష్ట్ర శాసనసభలో తన బలాన్ని ఇంకా నిరూపించుకోవాల్సి ఉంటే
3) రాష్ట్ర విధానమండలి సభ్యుడైతే
4) ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయితే
5. ఏయే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కూడా లోకాయుక్త చట్టం పరిధిలోకి వస్తారు?
1) పశ్చిమ బెంగాల్, కేరళ
2) గుజరాత్, మహారాష్ట్ర
3) మధ్యప్రదేశ్, ఒడిశా
4) రాజస్థాన్, కర్ణాటక
6. గవర్నర్‌కు సంబంధించి సరైన అధికరణను జతపర్చండి?
అధికరణ అంశం
ఎ. 155 1. గవర్నర్ నియామకం
బి. 156 2. గవర్నర్ ప్రమాణ స్వీకారం
సి. 159 3. గవర్నర్ పదవీకాలం
డి. 157 4. అర్హతలు
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
7. రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయడం ద్వారా విధాన పరిషత్తు ఏర్పాటు, రద్దు చేయాలంటే?
1) శాసనసభకు హాజరై ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో 2/3 వంతు మెజారిటీ కన్నా తగ్గకూడదు
2) శాసనసభకు హాజరై ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో 1/3 వంతు మెజారిటీ కన్నా తగ్గకూడదు
3) శాసనసభ మొత్తం సభ్యుల్లో మెజారిటీ హాజరై ఓటింగ్‌లో పాల్గొని 2/3వంతు మెజారిటీ కన్నా తగ్గకుండా తీర్మానిస్తే..
4) శాసనసభ సాధారణ మెజారిటీతో
8. రాష్ట్ర శాసన పరిషత్తును రద్దు లేదా ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
1) పార్లమెంటు సిఫారసు మేరకు రాష్ట్రపతికి
2) సంబంధిత రాష్ట్ర శాసనసభకు
3) సాధారణ శాసనం ద్వారా పార్లమెంటుకు
4) సంబంధిత రాష్ట్రశాసన సభ సిఫారసు మేరకు పార్లమెంటు
9.జతపర్చండి
అధికరణ అంశం
ఎ. 170 1. విధాన సభల నిర్మాణం
బి. 333 2. ఆంగ్లో- ఇండియన్ల నియామకం
సి. 169 3. విధాన పరిషత్తు ఏర్పాటు/రద్దు
1) ఎ-1, బి-3, సి-2
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-1, బి-2, సి-3
4) ఎ-3, బి-1, సి-2
10. రాష్ట్ర శాసనసభలో ఏ రాజకీయ పక్షానికి సరైన మెజారిటీ రానప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికకు గవర్నర్ ప్రధానంగా పరిశీలించాల్సిన విషయం?
1) స్థిరమైన మెజారిటీ పొందే అవకాశమున్న యోగ్యుడైన వ్యక్తిని వెతకడం
2) రాష్ట్ర శాసనసభలో అతిపెద్ద రాజకీయ పార్టీ
3) అతి పెద్దదైన అనేక పార్టీల కూటమి
4) పార్టీ కార్యక్రమాలు దాని సభ్యుల విధేయత
11. కింది ప్రవచనాలు పరిశీలించండి.
‘ఆర్టికల్ 356’ ప్రకారం ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ఒక సంవత్సరం మించి కొనసాగించాలంటే
ఎ. సంబంధిత రాష్ట్రంలో తీవ్రమైన పరిస్థితులున్నాయని ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ధారించాలి
బి. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని గవర్నర్ నిర్ధారించాలి
సి. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘం నిర్ధారించాలి
డి. స్వతంత్ర పరిశోధన ద్వారా తెలుసుకొని, రాష్ట్రంలో తీవ్ర పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్రపతి సంతృప్తి చెందాలి
పై ప్రవచనాల్లో ఏది నిజం?
1) ఎ 2) బి, సి 3) సి 4) ఎ, డి
12. USAలో అవశిష్టాధికారాలు లేదా రిజర్వు అధికారాలు?
1) ఫెడరల్ ప్రభుత్వానికి ఉంటాయి
2) రాష్ట్రాలకు ఉంటాయి
3) సక్రమంగా నిర్వచించలేదు
4) స్థానిక ప్రభుత్వాలకు ఉంటాయి
13. ఆదాయపు పన్నుకు సంబంధించి కింది వాటిలో సరైనది?
1) కేంద్రం విధించి వసూలు చేసి కేంద్ర, రాష్ట్రాల మధ్య పంచుతుంది
2) కేంద్రమే విధించి, వసూలు చేసి మొత్తం కేంద్రం అనుభవిస్తుంది
3) కేంద్రం విధించి, వసూలు చేసి రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది
4) కేవలం ఆదాయపు పన్నుపై విధించిన సర్‌ఛార్జ్‌ను మాత్రమే కేంద్రరాష్ట్రాలు పంచుకుంటాయి
14. రాష్ట్ర శాసన వ్యవస్థల నుంచి దామాషా ప్రాతినిధ్య ప్రాతిపదికమీద రాజ్యసభ సభ్యులను ఎన్నుకొనే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) అమెరికా 2) ఆస్ట్రేలియా
3) దక్షిణాఫ్రికా 4) ఐర్లాండ్
15. ఒక రాష్ట్ర విధాన పరిషత్ సభ్యుల గరిష్ఠ సంఖ్య ఎంతకు మించకూడదు?
1) రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్య లో 1/2 శాతం
2) రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్య లో 2/3 శాతం
3) రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్య లో 1/3 శాతం
4) రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్య లో 1/4శాతం
16. దేశంలో రాష్ట్ర గవర్నర్ ఎవరికి బాధ్యత వహిస్తాడు?
1) రాష్ట్ర శాసన వ్యవస్థ 2) రాష్ట్రపతి
3) రాష్ట్ర శాసన సభ 4) మంత్రి మండలి
17. శాసన పరిషత్తును రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతి?
1) రద్దుకు రాజ్యసభ ఒక తీర్మానం ఆమోదించాలి
2) రాజ్యాంగంలో నిర్ణయించిన విధంగా ప్రత్యేక మెజారిటీతో ఆ మేరకు రాష్ట్రశాసన సభ ఒక తీర్మానం ఆమోదించాలి
3) శాసన పరిషత్తును రద్దు చేస్తూ పార్లమెంటు శాసనం చేయాలి
4) బిల్లు విషయంలో సాధారణ మెజారిటీతో రాష్ట్రశాసన సభ ఒక తీర్మానం ఆమోదించాలి
18. కింది వాటిలో కేంద్రం చేత విధించబడి రాష్ట్రాలు వసూలు చేసే పన్నులు ఏవి?
1) స్టాంప్ డ్యూటీలు
2) ప్రయాణికుల సామగ్రిపై పన్ను
3) ఎస్టేట్ డ్యూటీ
4) పత్రికలపై పన్ను
19.జతపర్చండి
అధికరణ అంశం
ఎ. 221 1. హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు
బి. 222 2. న్యాయమూర్తుల బదిలీలు
సి. 223 3. తాత్కాలిక ప్రధాన
న్యాయమూర్తి
1) ఎ-1, బి-3, సి-2
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-1, బి-2, సి-3
4) ఎ-2, బి-1, సి-3
20. ఏ రాష్ట్రంలో మతం ప్రాతిపదికన శాసనసభలో రిజర్వ్ అయిన స్థానం ఉంది?
1) గోవా 2) సిక్కిం
3) మిజోరం 4) జమ్ముకశ్మీర్
21. కింది స్టేట్మెంట్లలో దేశంలోని రాష్ట్రాల ఫైనాన్స్ కమిషన్‌కు సంబంధించి సరైన అంశం కానిది ఏది?
1) 74వ రాజ్యాంగ సవరణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు, మున్సిపాలిటీల్లో ఫైనాన్స్ పొజిషన్ రివ్వ్యూ
2) రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్, చైర్మన్‌ను నామినేట్ చేసే విషయంలో ముఖ్యమంత్రిది నిర్ణయం కీలకం
3) రాష్ట్రంలోని అంశాలు, మున్సిపాలిటీల్లో ఫైనాన్స్ కమిషన్ అంశాల వివరణ
4) రాష్ట్ర సంఘటిత నిధి నుంచి పంచాయతీలకు వచ్చే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్‌లను ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది
22. కింది స్టేట్మెంట్లలో సరైనది?
1) రాజ్యాంగ పరిషత్తును 1946లో రాష్ట్ర శాసన సభలు ఎన్నుకొన్నాయి
2) జవహర్లాల్ నెహ్రూ, ఎంఏ జిన్నా, సర్ధార్ వల్లభాయ్ పటేల్ రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు
3) రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జనవరి 1947లో జరిగింది
4) రాజ్యాంగం జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది
23. భారత్‌లో అడ్వకేట్ జనరల్‌కు సంబంధించి సరైనది?
ఎ. భారత రాష్ట్రపతి నియమిస్తారు
బి. రాష్ట్ర శాసనసభ ప్రొసిడింగ్స్‌లో పాల్గొంటారు
సి. వేతనాన్ని భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు
డి. న్యాయపరమైన విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తారు
1) బి, డి 2) సి
3) ఎ 4) ఎ, బి, సి, డి
24. కింది వాటిలో ఏ విషయమై 2000 జనవరిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల స్టాండింగ్ కమిటీ దేశమంతా ఒకే విధమైన పన్ను విధించాలని సిఫారసు చేసింది?
1) విలువ ఆధారిత సుంకం
2) అమ్మకపు పన్ను
3) స్టాంపు, రిజిస్ట్రేషన్ సుంకం
4) వ్యవసాయ ఆదాయపు పన్ను
25. కింది ఏ అంశాల సవరణకు సగానికి తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభలు ఆమోదం తెలపాలి?
ఎ. రాష్ట్రపతి ఎన్నిక విధానం
బి. పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యం
సి. 7వ షెడ్యూల్లోని ఏ అంశానికి సంబంధించినదైనా
డి. రాష్ట్ర శాసనమండలి రద్దు
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
26. గవర్నర్ నియామకానికి కావాల్సిన అర్హతల్లో తప్పుగా ఉన్నది గుర్తించండి?
1) భారత పౌరుడై ఉండాలి
2) 30 సంవత్సరాలకు తక్కువ ఉండకూడదు
3) పార్లమెంటులో, రాష్ట్ర శాసన సభల్లో సభ్యుడై ఉండకూడదు
4) ఆదాయం లభించే ఏ ఇతర పదవి కలిగి ఉండకూడదు
27. రాష్ట్రశాసన సభ ఆమోదించిన బిల్లును గవర్నర్ తన దగ్గర రిజర్వు చేసుకున్నప్పుడు?
1) అతన్ని తొలగించవచ్చు
2) అతడు దాన్ని రాష్ట్రపతికి పంపవచ్చు
3) అపరిమిత కాలం ఆ బిల్లును పెండింగ్ పెట్టవచ్చు
4) సమయం తీసుకొని ఆ బిల్లుకు ఆమోదాన్ని తెలుపవచ్చు
28. రాష్ట్ర కార్యనిర్వహణాధిపతి ఎవరు?
1) గవర్నర్ 2) ముఖ్యమంత్రి
3) రాష్ట్ర క్యాబినెట్
4) రాష్ట్ర శాసనమండలి
29. గవర్నర్‌ను సాధారణంగా ఎక్కడి నుంచి తీసుకుంటారు?
1) ఆ రాష్ట్రం నుంచి
2) ఇతర రాష్ట్రం నుంచి
3) అక్కడి జోన్ నుంచి
4) మెజారిటీ పార్టీ నుంచి
30. రాష్ట్ర శాసన వ్యవస్థలో ఎగువ సభలో ఇతర సభ్యులతో పాటు?
1) ఉపాధ్యాయుల నియోజకగణం ద్వారా ఎన్నికైన వారు పన్నెండో వంతు, పురపాలక సంఘాల ద్వారా ఎన్నికైన వారు మూడో వంతు, రిజిస్టర్డ్ పట్టభద్రుల ద్వారా ఎన్నికైన వారు పన్నెండో వంతు మంది సభ్యులు ఉంటారు
2) రిజిస్టర్ పట్టభద్రుల ద్వారా ఎన్నికైన వారు పన్నెండు, మహిళల ద్వారా ఎన్నికైన వారు పన్నెండు, కార్మిక సంఘాలు, సహకార సంస్థల ద్వారా ఎన్నికైన వారు మూడో వంతు సభ్యులు ఉంటారు
3) మహిళల ద్వారా ఎన్నికైన వారు పన్నెండు, పురపాలక సంఘాలు, ఇతర స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన వారు పన్నెండు, ఉపాధ్యాయ నియోజకగణం ద్వారా ఎన్నికైన వారు మూడో వంతు సభ్యులు ఉంటారు
4) ప్రజలు నేరుగా ఎన్నుకునే వారు మూడో వంతు, రిజిస్టర్డ్ పట్టభద్రుల ద్వారా ఎన్నికైన వారు పన్నెండు, సహకార బ్యాంకులు, మహిళా సంఘాలు ఇతర సహకార సంస్థలు ఎన్నుకున్న వారు పన్నెండో వంతు సభ్యులు ఉంటారు
31. భారత యూనియన్ నుంచి రాష్ట్రం ఏర్పాటును నిషేధించిన చట్టం?
1) 16వ సవరణ చట్టం 1963
2) 22వ సవరణ చట్టం 1969
3) 29వ సవరణ చట్టం 1972
4) 35వ సవరణ చట్టం 1974
32. దేశంలో ఏదైనా రాష్ట్ర శాసన వ్యవస్థలో ఆ రాష్ట్రంలోని హైకోర్టు పరిధి?
1) పెరుగుతుంది
2) పరిమితంగా ఉంటుంది
3) రద్దవుతుంది
4) పెరగదు, పరిమితం కాదు, రద్దు కాదు
33. దేశంలోని రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఏర్పాటు లేదా రద్దు?
1) రాష్ట్ర గవర్నర్ అనుమతితో రాష్ట్రపతి చేస్తాడు
2) పార్లమెంటు చేస్తుంది
3) రాష్ట్ర శాసనసభ తీర్మానంపై పార్లమెంట్లో
4) రాష్ట్ర మంత్రుల కోరిక మేరకు గవర్నర్
సమాధానాలు
1-3, 2-2, 3-4, 4-3, 5-2, 6-1, 7-3, 8-4, 9-3, 10-1, 11-3, 12-2, 13-1, 14-2, 15-3, 16-2, 17-2, 18-1, 19-3, 20-1, 21-2, 22-1, 23-1, 24-2, 25-1, 26-2 , 27-1, 28-1, 29-2, 30-1, 31-1, 32-4, 33-3,
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు