ఆదేశిక సూత్రాల్లో కొత్తగా చేర్చిన ప్రకరణ? ( ఇండియన్ పాలిటీ )
1. రాజ్యాంగంలో నిర్దేశిక నియమాలను ఎక్కడ పొందుపర్చారు? (1)
1) ఆర్టికల్ 36 నుంచి 51 వరకు, పార్ట్-4
2) ఆర్టికల్ 36 నుంచి 51 వరకు, పార్ట్-4 ఏ
3) ఆర్టికల్ 12 నుంచి 35 వరకు, పార్ట్-3
4) ఆర్టికల్ 13 నుంచి 35 వరకు, పార్ట్-5
2. రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? (4)
1) అమెరికా 2) రష్యా 3) స్పెయిన్ 4) ఐర్లాండ్
3. కిందివాటిలో సరైన దానిని గుర్తించండి. (3)
ఎ. నిర్దేశిక నియమాల ముఖ్యలక్ష్యం సంక్షేమ రాజ్యస్థాపన
బి. నిర్దేశిక నియమాలు ప్రభుత్వ విధానాలు రూపొందించడంలో దిక్సూచిగా ఉపయోగపడుతాయి
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏవీకాదు
4. నిర్దేశిక నియమాలను భారత ప్రభుత్వం నిజాయితీగా అమలుచేస్తే భారతదేశం భూలోక స్వర్గం అవుతుందని పేర్కొన్నది ఎవరు? (2)
1) అంబేద్కర్ 2) ఎంసీ చాగ్లా
3) బీఎన్ రావు 4) కేసీ వేర్
5. సరైనదానిని గుర్తించండి. (4)
ఎ. ఆదేశిక సూత్రాలు జమ్ముకశ్మీర్ రాష్ర్టానికి కూడా వర్తిస్తాయి
బి. ఆదేశిక సూత్రాల అమలువల్ల కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది
సి. ఆదేశిక సూత్రాలు అహేతుకంగా ఏర్పాటు చేయబడ్డాయి
డి. ఆదేశిక సూత్రాల రక్షణ బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది
1) ఎ, బి, డి 2) బి, సి, డి 3) పైవన్నీ 4) ఎ, బి, సి
6. నిర్దేశిక నియమాల లక్షణాలకు సంబంధించినవి గుర్తించండి. (4)
ఎ. ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు
బి. ఆదేశిక సూత్రాలు రాజకీయ స్వాతంత్య్రాన్ని కలిగిస్తాయి
సి. ఆదేశిక సూత్రాలు, ప్రభుత్వాల సౌకర్యాలకు అనుగుణంగా అమలుపరుస్తాయి
డి. ఆదేశిక సూత్రాలు సుపరిపాలనకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి 3) బి, సి, డి 4) ఎ, సి, డి
7. ఆదేశిక సూత్రాల్లో ఇప్పటివరకు అమలుకు నోచుకోని అంశం? (1)
1) ఉమ్మడి న్యాయ స్మృతి
2) మత్తు పానియాల నిషేధం
3) ఉచిత న్యాయ సహాయం అందించడం
4) గోవధ నిషేధం
8. నిర్దేశిక నియమాలను వసతి లేనప్పుడు ఒక బ్యాంక్ చెల్లించే చెక్కుల వంటివని అభివర్నించిందెవరు? (3)
1) ఎంసీ చాగ్లా 2) అంబేద్కర్ 3) కేటీ షా 4) బీఎన్ రావ్
9. ఉదారవాద నియమాలకు సంబంధించని అధికరణ ఏది? (2)
ఎ. ఆర్టికల్ 44 బి. ఆర్టికల్ 48
సి. ఆర్టికల్ 43 డి. ఆర్టికల్ 49
1) ఎ, సి 2) ఎ, డి, బి 3) బి, సి 4) పైవన్నీ
10. ఉమ్మడి న్యాయ స్మృతిని గురించి పేర్కొనే ప్రకరణ ఏది? (2)
1) ఆర్టికల్ 43 2) ఆర్టికల్ 44
3) ఆర్టికల్ 45 4) ఆర్టికల్ 46
11. మాతృక రాజ్యాంగంలో పొందుపర్చని ఆదేశిక సూత్రాలు ఏవి? (3)
ఎ. సమాన న్యాయాన్ని, పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం (ఆర్టికల్ 39-ఎ)
బి. పరిశ్రమల నిర్వహణలో కార్మికులు పాల్గొనేటట్లుగా చేయడం (ఆర్టికల్ 43-ఎ)
సి. పరిసరాలను రక్షించడం, అభివృద్ధి పర్చడం, అడవులను, వన్యప్రాణులను పరిరక్షించడం (ఆర్టికల్ 48-ఎ)
డి. ఆరేండ్లు నిండేవరకు బాలబాలికలకు ప్రీ స్కూల్ సేవలు అందించాలి. (ఆర్టికల్ 45)
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి 3) ఎ, బి, సి 4) డి
12. కింది వాటిలో సామ్యవాద నియమాలకు సంబంధించిన ఆదేశిక సూత్రాలు గుర్తించండి. (4)
ఎ. ఉచిత న్యాయ సహాయాన్ని పేదలకు అందించడం (ఆర్టికల్ 139-ఎ)
బి. ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చడంలో రాజ్యం కృషి చేయాలి (ఆర్టికల్ 47)
సి. ఆరోగ్యానికి హాని కలిగించే మత్తుపానియాలను రాజ్యం నిషేధించాలి (ఆర్టికల్ 47)
డి. గోవులను, ఇతర పాడి పశువులను, పెంపుడు జంతువులను వధించడం నిషేధం
ఇ. స్త్రీ పురుషులకు సమానమైన పనికి సమాన వేతనం లభింపచేయడం (ఆర్టికల్ 39-డి)
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, సి, డి, ఇ 4) ఎ, బి, ఇ
13. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల జాబితాలో ఎన్ని సూత్రాలను చేర్చారు? (3)
1) 5 2) 6 3) 4 4) 3
14. సరైన దానిని గుర్తించండి. (3)
ఎ. 45వ అధికరణాన్ని అమలుచేయడానికి 86వ రాజ్యాంగ సవరణ చట్టం- 2002 చేశారు.
బి. 44వ రాజ్యాంగ సవరణ చట్టం-1978 ద్వారా రాజ్యం ఆదాయంలో, హోదా, సౌకర్యాలలో అసమానతలు తగ్గించడానికి కృషి చేయాలి అనే సూత్రాన్ని నిర్దేశిక నియమాల్లో చేర్చారు.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏవీకాదు
15. కింద పేర్కొన్న నిర్దేశిక నియమాల్లో గాంధేయ సూత్రాల్లో పేర్కొనని నియమం ఏది? (4)
ఎ. గ్రామ స్వరాజ్ కోసం రాజ్యం చర్యలు తీసుకోవాలి (ఆర్టికల్ 40)
బి. సహకార సంఘాల స్వచ్ఛంద ఏర్పాటుకు రాజ్యం కృషి చేయాలి (ఆర్టికల్ 43-బి)
సి. వ్యవసాయం, పశుపోషణ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి
డి. జాతీయ ప్రాముఖ్యత గల చారిత్రక ప్రదేశాలను లేదా కళాత్మక అంశాలను పరిరక్షించాలి (ఆర్టికల్ 49)
ఇ. పనిచేసే హక్కు, విద్య నేర్చుకునే హక్కు, ఉద్యోగం, ముసలితనం, అనారోగ్యం, అంగవైకల్యం కలిగిన సందర్భాల్లో రాజ్యం సహకరించాలి.
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి, ఇ
3) ఎ, బి, సి, డి, 4) సి, డి, ఇ
16. ఆదేశిక సూత్రాల్లో ఇటీవల చేర్చిన ప్రకరణ ఏది? (1)
1) ఆర్టికల్ 43-బి 2) ఆర్టికల్ 48-ఎ
3) ఆర్టికల్ 43-ఎ 4) ఆర్టికల్ 42
17. నిర్దేశిక నియమాలు శాసన వ్యవస్థకు కరదీపిక లాంటివని వ్యాఖ్యానించిందెవరు? (2)
1) బీఎన్ రావు 2) ఎంసీ సెతల్వాడ్
3) ఆస్టిన్ 4) కేసీ వేర్
18. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి అంతరాత్మ వంటివని ఎవరు పేర్కొన్నారు? (3)
1) అంబేద్కర్ 2) ఎంసీ చాగ్లా
3) గ్రాన్విల్ ఆస్టిన్ 4) ఎల్ఎం సింఘ్వీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు