ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఇలా..
1956 నుంచి 2014కు మధ్యగల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను 2 దశలుగా విభజించవచ్చు.
-మొదటి దశ – 1956 – 83
-రెండవ దశ – 1983 – 2014
-1983 జనవరి 9న ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పాలనకు అడ్డ్డుకట్టపడింది.
నీలం సంజీవరెడ్డి
(1956 నవంబర్ 1 -1960 జనవరి 11) అనంతపురం
-నీలం సంజీవరెడ్డి తన మొదటి మంత్రివర్గాన్ని 13 మందితో (1+12) ఏర్పాటు చేశాడు.
-ఇతని మంత్రివర్గంలోని ప్రముఖులు
-కేవీ రంగారెడ్డి- హోం
-బెజవాడ గోపాలరెడ్డి- ఆర్థిక
-దామోదరం సంజీవయ్య- కార్మిక
-కాసుబ్రహ్మానందరెడ్డి- స్థానిక పాలన
-మందుముల నరసింగరావు- రోడ్లు, భవనాలు
-జేవీ నరసింగరావు- నీటిపారుదల, విద్యుత్
-మెహదీ నవాజ్‌జంగ్-సహకారం, గృహ నిర్మాణం
-కళా వెంకట్రావు- రెవెన్యూ
-బసవరాజు- ప్రణాళికాభివృద్ధి
-పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి- వ్యవసాయం
-పట్టాభి రామారావు- విద్య
-వెంకటరెడ్డి నాయుడు- న్యాయశాఖ
-నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవి 6వ వేలు వంటిదని పేర్కొని ఆ పదవిని ఏర్పాటు చేయడానికి నిరాకరించారు. 1957లో పార్లమెంట్ తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్‌ను తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.
-1958లో 90 మంది సభ్యులతో శాసనమండలి ఏర్పాటయ్యింది.
-దీనికి మొదటి చైర్మన్- మాడపాటి హనుమంతరావు
-1958లో 20 మంది సభ్యులతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి అచ్యుతరెడ్డి నేతృత్వంలో ఏర్పడింది.
-1958లో ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటయ్యింది.
-1959లో ఏపీఎస్ఈబీ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు) ఏర్పడింది.
-1959లో మూడంచెల పంచాయతీరాజ్ విధానం ప్రవేశపెట్టారు.
-1959లో స్వతంత్ర పార్టీ (ఎన్జీ రంగా, రాజాజీలు నెహ్రూ విధానాలకు వ్యతిరేకంగా)ని స్థాపించారు.
-1960లో నీలం సంజీవరెడ్డి జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దీంతో అతను సీఎం పదవికి రాజీనామా చేశాడు.
దామోదరం సంజీవయ్య
(1960 జనవరి 11, 1962 మార్చి 12) కర్నూలు
-ఇతను దేశంలోనే మొదటి హరిజన ముఖ్యమంత్రి. అతి పిన్నవయస్సులో ముఖ్యమంత్రి అయ్యారు. (39 ఏండ్లు)
-ఇతను పెద్దమనుషుల ఒప్పందాన్ని గౌరవిస్తూ 1961లో కేవీ రంగారెడ్డిని ఉప ముఖ్యమంత్రిని చేశారు. హరిజన-గిరిజన చట్టాన్ని తీసుకొచ్చి వారికి కేటాయించిన ఉద్యోగాలను లేదా సీట్లను వారితో మాత్రమే భర్తీ చేసేలా చర్యలు చేపట్టారు.
-1962లో ఇతను జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దీంతో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
-జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్న నీలం సంజీవరెడ్డి మళ్లీ ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాడు.
నీలం సంజీవరెడ్డి (1962 మార్చి 12-1964 ఫిబ్రవరి 20)
-ఇతను పాఠ్యపుస్తకాలను జాతీయీకరణ చేశాడు.
-శాసనసభలో ఇతని బద్ధశత్రువు పిడతల రంగారెడ్డి (కర్నూలు).
-పిడతల రంగారెడ్డికి కర్నూలులో ప్రైవేట్ బస్సురూట్ ఉండేది.
-కోట్ల విజయభాస్కరరెడ్డికి కూడా కర్నూలులో ప్రైవేట్ బస్సు రూట్ ఉండేది.
-పిడతల రంగారెడ్డిని ఆర్థికంగా దెబ్బతీయడానికి నీలం సంజీవరెడ్డి కర్నూలు ప్రైవేట్ బస్రూట్ను జాతీయీకరణ చేశారు.
-దీన్ని ఖండిస్తూ కోట్ల విజయభాస్కరరెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేశారు.
-కర్నూలు ప్రైవేట్ బస్ రూట్ జాతీయీకరణ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
-దీనికి నైతిక బాధ్యత వహిస్తూ నీలం సంజీవరెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి కాసు బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రిగా నామినేట్ చేశారు.
కాసు బ్రహ్మానందరెడ్డి
(1964 ఫిబ్రవరి 211971 సెప్టెంబర్ 30) గుంటూరు
-1966లో తెలుగు ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషగా ప్రకటించారు.
-1966లో విశాఖపట్నంలో ఇనుము-ఉక్కు కర్మాగారం స్థాపించాలని పెద్దఎత్తున ఉద్యమం జరిగింది.
-ఈ సందర్భంగా తెన్నేటి విశ్వనాథం విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇచ్చాడు.
-1967లో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేశారు. (1955లో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయి)
-1966-67లో కాసు బ్రహ్మానందరెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ డీఎస్ రెడ్డిల మధ్య అనేక విభేదాలు చోటుచేసుకున్నాయి.
-కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఉస్మానియా విశ్వ విద్యాలయ వైస్ చాన్స్‌లర్ పదవీ కాలాన్ని 5 నుంచి 3 ఏండ్లకు తగ్గించి డీఎస్ రెడ్డిని వైస్ చాన్స్‌లర్ పదవి నుంచి తొలగించింది.
-దీన్ని వ్యతిరేకిస్తూ దీఎస్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు.
-ప్రభుత్వ ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
-దీంతో డీఎస్ రెడ్డి మళ్లీ వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యాడు. అప్పటి నుంచి ఓయూలో రెండు వర్గాలు బయల్దేరాయి. అవి..
1. కేబీఆర్ వర్గం
2. డీఎస్ రెడ్డి వర్గం
-1968లో ఓయూలో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో కేబీఆర్ వర్గానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడు కాగా, డీఎస్ రెడ్డి వర్గానికి చెందిన మల్లికార్జునరావు కార్యదర్శి అయ్యారు.
-1969లో తెలంగాణ కోసం ఉద్యమం జరిగింది.
-1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి 10 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది.
-1971 సెప్టెంబర్‌లో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
-1969లోనే ఉత్తర కోస్తాలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైంది.
-అప్పటి హోంమంత్రి జలగం వెంగళరావు కఠినంగా వ్యవహరించి నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేశారు.
-1970లో ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు.
-1971లో తెలంగాణకు చెందిన వారిని ముఖ్యమంత్రిని చేయడానికి కేబీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
-దీంతో కరీంనగర్‌కు చెందిన పీవీ నర్సింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు