Polity | మినర్వామిల్స్ కేసును సుప్రీంకోర్టు ఎప్పుడు పరిష్కరించింది?
1. 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చిన భాషలు?
1) కొంకణి, సింథి
2) మణిపురి, సింథి
3) నేపాలి, కొంకణి, మణిపురి
4) సింథి, నేపాలి
2. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించిన సవరణ?
1) 85వ రాజ్యాంగ సవరణ
2) 83వ రాజ్యాంగ సవరణ
3) 92వ రాజ్యాంగ సవరణ
4) 77వ రాజ్యాంగ సవరణ
3. 1985లో చేసిన 52వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది?
1) పార్టీ ఫిరాయింపుల నిరోధానికి
2) పంచాయతీ రాజ్ సంస్థలకు
3) కొత్త రాష్ర్టాల ఏర్పాటుకు
4) ఏదీకాదు
4. భారత రాజ్యాంగం 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 వర్తించని రాష్ట్రం?
1) మిజోరం 2) గోవా
3) లక్షద్వీప్ 4) పాండిచ్చేరి
5. భారత రాజ్యాంగంలో 62వ రాజ్యాంగ సవరణ దేనికి వర్తిస్తుంది?
1) నగర పాలికలు
2) పంచాయతీరాజ్
3) షెడ్యూల్డ్ కులాలు/ తెగలకు సీట్ల రిజర్వేషన్
4) పైవేవీ కావు
6. కింది రాజ్యాంగ సవరణ చట్టాల్లో దేని ప్రకారం భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో 4 భాషలను చేర్చడమైంది?
1) 90వ రాజ్యాంగ సవరణ చట్టం
2) 91వ రాజ్యాంగ సవరణ చట్టం
3) 92వ రాజ్యాంగ సవరణ చట్టం
4) 93వ రాజ్యాంగ సవరణ చట్టం
7. 99వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది?
1) జాతీయ న్యాయ నియామకాలు కమిషన్
2) వస్తువులు. సేవలు చట్టం
3) సహకార సంఘాలు
4) ఏవీకావు
8. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినది?
1) ఆరు సూత్రాల పథకం
2) ఏడు సూత్రాల పథకం
3) ఎనిమిది సూత్రాల పథకం
4) తొమ్మిది సూత్రాల పథకం
9. కిందివాటిలో సరికానిది?
1) 4వ శీర్షికను రాజ్యాంగ విధాన ఆదేశిక సూత్రాల చర్య అనే విధంగా సవరించారు
2) దేశంలో లభించే సహజవనరులను సక్రమంగా వినియోగించుకోవాలి
3) 48Aను నిబంధనను కొత్తగా ఏర్పాటు చేశారు
4) 47Aను రాజ్యాంగంలోకి కొత్తగా చేర్చారు
10. భారత రాజ్యాంగం ఏ సంవత్సరం వరకు భారతదేశాన్ని సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్రంగా కొనసాగించింది?
1) 1962 2) 1972
3) 1974 4) 1976
11. కిందివాటిలో 93వ రాజ్యాంగ సవరణకు సంబంధించినది ఏది?
1) వెనుకబడిన తరగతులకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ అమలు
2) 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత ప్రాథమిక విద్యనందించడం
3) మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం పోస్టులు రిజర్వు చేయడం
4) కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ర్టాల్లో పార్లమెంటరీ సీట్లను ఎక్కువగా కేటాయించడం
12. 79వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది?
1) సమాచార సాంకేతిక శాస్త్రం
2) పెట్టుబడి మార్కెట్లలోకి విదేశీ కంపెనీలకు అనుమతివ్వడం
3) చట్ట సభల్లో మహిళలకు 33 శాతం సీట్లకు రిజర్వేషన్ కల్పించడం
4) చట్టసభల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు పొడిగించడం
13. 85వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది?
1) క్యారీ ఫార్వార్డ్ సూత్రం
2) ప్రారంభ దశలో రిజర్వేషన్
3) ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్
4) సాంఘికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్
14. రాజ్యాంగానికి మొదటి సవరణ కింది వాటిలో దేనికి సంబంధించినది?
1) రాష్ట్రపతి ఎన్నికల్లో
2) ప్రధాన మంత్రి ఎన్నికలో
3) ప్రాథమిక హక్కుల్లో
4) ఆదేశిక సూత్రాలు
15. కింది వాటిలో సరిగ్గా జత పరచనిది ఏది?
1) అనుషంగిక పద్ధతి
2) సాధారణ పద్ధతి
3) స్వయం నిర్దేశిత పద్ధతి
4) ప్రతిక్షేపన పద్ధతి
16. ఎక్కువ పర్యాయాలు సవరించిన రాజ్యాంగంలోని అంశాలు?
1) ఆస్తి వివాదాలు
2) రాష్ట్రపతి పాలన విధింపు
3) ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పొడిగింపు
4) పైవన్నీ
17. కింది వాటిలో సరికానిది ఏది?
1) ప్రాథమిక హక్కులు పవిత్రమైనవి- ఏకే గోపాలన్ కేసు
2) ప్రాథమిక హక్కులు రాజ్యాంగ సారాంశం -కేశవానంద భారతి కేసు
3) ప్రాథమిక హక్కులు రాజ్యాంగ తత్వం -మేనకాగాంధీ కేసు
4) పైవన్నీ
18. కిందివాటిలో సరికానిది?
1) ఇందిరా సహాని కేసు 1992లో సమన్యాయపాలనకు సంబంధించినది
2) ఇందిరా సహాని కేసు 1992లో స్వతంత్ర న్యాయ వ్యవస్థకు సంబంధించినది
3) కుమార్ పద్మప్రసాద్ కేసు 1992లో స్వతంత్ర న్యాయవ్యవస్థకు సంబంధించింది
4) రంగనాథ్ కేసు 1993 ఐక్యత, సమగ్రత, సమన్యాయపాలనకు సంబంధించినది
19. సుప్రీంకోర్టు కొట్టివేసిన రాజ్యాంగ సవరణ కానిది?
1) 22వ రాజ్యాంగ సవరణ
2) 42వ రాజ్యాంగ సవరణ
3) 32వ రాజ్యాంగ సవరణ
4) 25వ రాజ్యాంగ సవరణ
20. కింది వాటిలో సరైనది?
1) సాధారణ సవరణ పద్ధతి – అదృఢ రాజ్యాంగం
2) ప్రత్యేక సవరణ పద్ధతి – పాక్షిక దృఢ రాజ్యాంగం
3) ప్రత్యేక సవరణ పద్ధతి, రాష్ర్టాల అమలు నిర్వహించుకోగల దృఢ రాజ్యాంగం
4) పైవన్నీ సరైనవే
21. రాజ్యాంగ సవరణ పద్ధతికి సంబంధించి సరికానిది?
1) సవరణ అంటే కొత్త ప్రకరణలను చేర్చడం, ఉన్న ప్రకరణలను తొలగించడం, పూర్తిగా తొలగించడం, మార్పులు చేయడం
2) రాజ్యాంగాలను సాధారణ మెజారిటీతోగాని, ప్రత్యేక మెజారిటీతోగానీ సవరించాలి
3) రాజ్యాంగాన్ని రెండు పద్ధతుల ద్వారా సవరిస్తారు
4) రాజ్యాంగ సవరణ విధానాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు
22. కింది వాటిలో రాజ్యాంగ పద్ధతికి సంబంధించి సరికానిది?
1) రాజ్యాంగ సవరణ విధానాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించారు
2) రాజ్యాంగ సవరణ పద్ధతిని రాజ్యాంగంలో 20వ భాగంలో 368 ప్రకరణలో చేర్చారు
3) రాజ్యాంగ ప్రకరణలను 3 రకాలుగా వర్గీకరించారు
4) 2/4వ వంతుతో రాజ్యాంగ సవరణ చేస్తారు
23. రాజ్యాంగాన్ని సవరించే పద్ధతుల్లో సరికానిది?
1) పార్లమెంట్ సాధారణ మెజారిటీతో
2) పార్లమెంట్ అత్యధిక మెజారిటీతో
3) పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీ
4) పార్లమెంట్లోని సగం రాష్ర్టాల సభల ఆమోద సవరణ పద్ధతి
24. కింది వాటిలో సరికానిది?
1) ప్రకరణ 368లోని అంశాలను ఇప్పటి వరకు 2 పర్యాయాలు సవరించారు
2) 24వ రాజ్యాంగ సవరణ ద్వారా (1971)
3) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా (1976)
4) 368లో 8 సబ్ క్లాజ్లున్నాయి
25. మినర్వామిల్స్ కేసును సుప్రీంకోర్టు ఎప్పుడు పరిష్కరించింది?
1) 1980 2) 1982
3) 1984 4) 1985
26. సాధారణ మెజారిటీ పద్ధతి గురించి సరికానిది?
1) సాధారణ మెజారిటీ పద్ధతిని ఆర్టికల్ 368లో ప్రస్తావించలేదు
2) సాధారణ మెజారిటీ అంటే హాజరై ఓటేసిన వారిలో సగం కంటే ఎక్కువ ఉండాలి
3) సాధారణ మెజారిటీ ద్వారా జరిగే సవరణలను రాజ్యాంగ సవరణలుగా పరిగణించారు
4) రాష్ట్రపతి ఎన్నికల విధానాన్ని ఈ పద్ధతి ద్వారా సవరించవచ్చు
27. కింది వాటిలో సాధారణ పద్ధతిగా సవరించని అంశం?
1) నియోజకవర్గాల పునర్ విభజన (82వ ప్రకరణ)
2) రాష్ర్టాలకు పార్లమెంట్లో ప్రాతినిథ్యం (80, 81వ ప్రకరణ )
3) కొత్త రాష్ర్టాలను ఏర్పాటు చేయడం
4) భారత పౌరసత్వంలో మార్పులు
28. కింది వాటిలో సాధారణ పద్ధతిలో సవరించని అంశం?
1) హైకోర్టు, సుప్రీంకోర్టులకు సంబంధించిన అంశాలు (214, 124)
2) కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన (239)
3) సుప్రీంకోర్టు పరిధికి సంబంధించిన అంశాలు (139)
4) 6వ షెడ్యూల్లోని అంశాలు
29. పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో సవరించిన అంశాల్లో సరైనది?
1) మొదటి పద్ధతి, మూడో పద్ధతిలో పేర్కోని అంశాలు
2) రాజ్యాంగంలోని 4వ భాగంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాలు
3) ప్రాథమిక హక్కులు
4) పైవన్నీ సరైనవే
30. రాజ్యాంగ సవరణ పద్ధతి నియమ నిబంధనల్లో సరైనది?
1) రాజ్యాంగ సరవణ బిల్లును మంత్రిగాని, సాధారణ సభ్యుడుగాని ప్రతిపాదించవచ్చు
2) రాష్ట్రపతి పూర్వ అనుమతి అవసరం లేదు
3) రాజ్యాంగ సవరణ బిల్లును ఏ సభలోనైన పార్లమెంటులో ప్రవేశ పెట్టవచ్చు
4) పైవన్నీ సరైనవే
31. కింది వాటిలో సరికానిది?
1) రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి
2) ఈ విషయాన్ని 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు
3) చట్టం అమల్లోనికి వచ్చిన రోజు నుంచి రాజ్యాంగాన్ని సవరించినట్లు పరిగణిస్తారు
4) రాజ్యాంగ సవరణ న్యాయసమీక్షకు లోబడనవసరం లేదు
32. కింది వాటిలో సరైనది?
1) రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకే పరిమితం చేయడం తప్పు
2) రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రత్యేక సభ ఉండకపోవడం తప్పు
3) రాష్ర్టాల భాగస్వామ్యం తక్కువగా ఉండటం తప్పు
4) పైవన్నీ
33. రాజ్యాంగ సవరణ పద్ధతి క్లిష్టంగా బయటకు కనిపించినా అది కేవలం విశిష్టతకు నిదర్శనం అన్న రాజనీతి శాస్త్రవేత్త?
1) గ్రాన్వెల్ ఆస్టిన్ 2) కేసీ వేర్
3) అంబేద్కర్
4) హెచ్.జె. లాస్కీ
34. కింది వాటిలో సరైనది?
1) 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేశారు?
2) మొదటి రాజ్యాంగ సవరణ శంకరీ ప్రసాద్ VS యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చేశారు
3) 1971లో 24వ రాజ్యాంగ సవరణ చేశారు
4) పైవన్నీ సరైనవే
35. కేశవానంద భారతి కేసులో సరైనది ఏది?
1) కేశవానంద భారతికేసు 1973లో సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చింది
2) 1975లో 39వ రాజ్యాంగ సవరణ లోక్సభ స్పీకర్ వివాదాన్ని సమీక్షించారు
3) పైరెండూ సరైనవే
4) పైవేవీకాదు
36. సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో తీర్పుల తర్వాత కింది అంశాలను మౌలిక నిర్మాణంలో అంతరభాగంగా క్రోడీకరించింది?
1) రాజ్యాంగ ఆధిక్యత
2) రాజ్యాంగ లౌకికత్వం
3) రాజ్యాంగ సమాఖ్య స్వరూపం
4) పైవన్నీ
37. కింది వాటిలో సరికానిది?
1) 1920 జనవరి నాటికి రాజ్యాంగానికి 10 సవరణలు చేశారు
2) 2020 జనవరి నాటికి 104 పర్యాయాలు రాజ్యాంగాన్ని సవరించారు
3) జీఎస్టీ బిల్లును 122 సవరణ ద్వారా ప్రతిపాదించారు
4) కాని ఇది 101 సవరణగా మారింది
38. కేశవానంద భారతి కేసు 1973లో మౌలిక నిర్మాణంలోకి వచ్చే అంశాలు
1) రాజ్యాంగ ఆధిక్యత
2) వ్యక్తి గౌరవం, స్వేచ్ఛ
3) ప్రవేశికలోని ఆశయాలు
4) పైవన్నీ
39. కిందివాటిలో సరైనది ఏది?
1) రాజ్యాంగం అమలులోనికి వచ్చి 50 సం.లు పూర్తయిన తర్వాత రాజ్యాంగాన్ని పున:సమీక్షించారు.
2) 2000 ఫిబ్రవరి 22న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వెంకటా చలయ్య అధ్యక్షతన 10 మంది సభ్యులతో
కమిటీని నియమించారు
3) ఈ కమిషన్ 2002 మార్చి 11న నివేదికను సమర్పించింది
4) పైవన్నీ సరైనవే
40. ప్రాథమిక హక్కులలో కొత్తగా చేర్చిన అంశాలు ?
1) ప్రాథమిక హక్కులలో కొత్తగా 7 అంశాలను చేర్చారు
2) భారతదేశం వదిలి వెళ్లేందుకు తిరిగి వచ్చేందుకు హక్కును కల్పించారు
3) సత్వర న్యాయాన్ని పొందేందుకు కోర్టులు అవకాశాన్ని కల్పించాలి
4) పైవన్నీ
సమాధానాలు
1-3 2-4 3-1 4-1
5-3 6-3 7-1 8-1
9-3 10-4 11-1 12-4
13-1 14-3 15-4 16-1
17-3 18-2 19-1 20-4
21-4 22-4 23-2 24-4
25-1 26-4 27-2 28-1
29-4 30-4 31-4 32-4
33-1 34-4 35-1 36-4
37-1 38-4 39-4 40-4
ఆంజనేయులు
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు