శివన్న గూడెం వాటర్‌షెడ్‌ను ఎక్కడ నిర్మించారు?
1. అజెండా-2030 అని దేన్ని పిలుస్తారు?
1) సహస్రాభివృద్ధి లక్ష్యాలు
2) యూఎన్ఓ సుస్థిరాభివృద్ధి
3) యూఎన్ఓ అభివృద్ధి లక్ష్యాలు
4) పర్యావరణాభివృద్ధి లక్ష్యాలు
2. సత్వర సాగునీటి లబ్ధి పథకంను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1996-97 2) 1997-98
3) 1998-99 4) 2000-01
3. ఏ రంగంలో వృద్ధి పెంచేందుకు రాష్ర్టాలకు కృషి వికాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు?
1) సాంకేతిక రంగం 2) ప్రభుత్వరంగం
3) ప్రైవేటురంగం 4) వ్యవసాయరంగం
4. సేంద్రీయ వ్యవసాయ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
1) సర్ ఆల్బర్ట్ హోవార్గ్
2) సర్ ఆల్బర్ట్ హిమ్మింగ్
3) రాక్హుడ్ ఆల్బర్ట్ 4) రాబర్ట్ వాట్సన్
5. దేశంలో 1953, 1955లో బయోగ్యాస్‌ను ఏ పేరుతో ప్రారంభించారు?
1) గ్రామ్ సురక్ష 2) గావ్సంపద్
3) పశుసంపద 4) గ్రామలక్ష్మి
6. ఒక భౌగోళిక ప్రాంతంలో అందుబాటులో ఉండే ప్రతి ఒక్క నీటిబొట్టును వృధా కానివ్వకుండా వినియోగంలోకి తీసుకురావడానికి ఉద్దేశించిన పథకం?
1) జల చట్రం 2) వాటర్‌షెడ్
3) సాగర్ సిరులు 4) నీరు-మీరు
7. శివన్నగూడెం వాటర్‌షెడ్‌ను ఎక్కడ నిర్మించారు?
1) నల్లగొండ- తెలంగాణ
2) కర్నూలు- ఆంధ్రప్రదేశ్
3) అన్నామలై- తమిళనాడు
4) జైసల్మేర్- రాజస్థాన్
8. హిమాలయాల్లో ఆవరణ వ్యవస్థ పరిరక్షణకు, పశువులను మేపడాన్ని నియంత్రించడానికి చేపట్టిన పథకం?
1) ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
2) హిమాలయన్ వాటర్‌షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
3) రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్
4) పైవన్నీ
9. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2007 జనవరి 2) 2008 జనవరి
3) 2009 జనవరి 4) 2010 జనవరి
10. వయోజనులకు విద్యను అందించడానికి 2009లో ప్రారంభించిన పథకం?
1) సాక్షర భారత్
2) సర్వశిక్ష అభియాన్
3) కిషోర్ శక్తి యోజన 4) వయోజన విద్య
11. సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడానికి ఏ ప్లాను 2006లో అనుమతించారు?
1) నేషనల్ ఈ గవర్నెన్స్ 2) ఈ-ఇండియా
3) ఈ-పరిపాలన 4) ఈ-గ్రాంట్స్
12. ప్రపంచీకరణ ప్రకిర్యకు సంబంధించి దేశ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసందానం చేయాలని చెప్పిన భారత ఆర్థికవేత్త?
1) నరసింహం 2) అమర్థ్యసేన్
3) జగదీష్ భగవత్
4) రుఘురామ్ రాజన్
13. కిందివాటిలో రెండో తరం ఆర్థిక సంస్కరణలు ఏవి?
1) కార్మిక సంస్కరణలు
2) వ్యవసాయ సంస్కరణలు
3) సంస్కరణలను రాష్ర్టాలకు విస్తరించడం
4) పైవన్నీ
14. కేంద్ర ప్రభుత్వం జాతీయ పెట్టుబడి నిధిని ఎప్పుడు ప్రవేశపెట్టింది?
1) 2005, నవంబర్ 3 2) 2008, ఏప్రిల్ 4
3) 2006, అక్టోబర్ 8 4) 2005, నవంబర్ 10
15. భారతదేశ నూతన ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా పరిగణించబడే వ్యక్తి?
1) మొరార్జీ దేశాయ్ 2) రంగరాజన్
3) ప్రణబ్‌ముఖర్జి 4) మన్మోహన్సింగ్
16. కిందివాటిలో నూతన ఆర్థిక విధానానికి సంబంధించని అంశం ఏది?
1) కోశరంగ సంస్కరణలు
2) వ్యవసాయ సంస్కరణలు
3) కార్మిక సంస్కరణలు
4) జనాభా విధానం
17. నూతన విదేశీ వర్తక విధానం ద్వారా ఏర్పాటు చేసిన కొత్త పథకం?
1) జన్‌ధన్ యోజన
2) విశేషకృషి ఉపాధి యోజన
3) కృషి సించయీ యోజన
4) ప్రధానమంత్రి బీమా యోజన
18. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటి నుంచి నేటి వరకు మొత్తం పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా స్థితి?
1) పెరుగుతున్నది 2) స్థిరంగా ఉంది
3) తగ్గుతున్నది
4) మొదట పెరిగి తర్వాత తగ్గింది
19. బ్యాంకింగ్‌రంగ సంస్థల పనితీరుతోపాటు వాటి సామర్థ్య పెంపుకోసం సిఫార్సులు ఇవ్వాల్సిందిగా ఎవరి అధ్యక్షతన విత్త విధాన కమిటీని నియమించారు?
1) ఎం నరసింహం 2) సీ రంగరాజన్
3) జీవీ రామకృష్ణ 4) భగవత్
20. ఇటీవలి కాలంలో ప్రపంచీకరణకు దోహదపడేవి?
1) ఇంటర్నెట్ 2) వరల్డ్‌వైడ్ వెబ్
3) రవాణా, కమ్యూనికేషన్ 4) పైవన్నీ
21. 1996లో స్థాపించిన పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్‌కు అధ్యక్షుడు ఎవరు?
1) ఆర్‌హెచ్ పాలిటీ 2) జీవీ రామకృష్ణ
3) సీ రంగరాజన్ 4) విజయ్ కేల్కర్
22. నగదు బదిలీ పథకం ఏ ప్రణాళికా కాలంలో అమలు చేశారు?
1) 12వ ప్రణాళిక 2) 11వ ప్రణాళిక
3) 10వ ప్రణాళిక 4) 9వ ప్రణాళిక
23. ఏ ప్రణాళికలో ఇంధన రంగానికి నిధులు అధికంగా కేటాయించలేదు?
1) 7వ ప్రణాళిక 2) 9వ ప్రణాళిక
3) 8వ ప్రణాళిక 4) 6వ ప్రణాళిక
24. నాలుగో ప్రణాళికకు సంబంధించి సరైనది?
1) ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చారు
2) బంగ్లాదేశ్ నూతన దేశంగా ఏర్పడింది
3) పనికి ఆహార పథకం కార్యక్రమం అమలయ్యింది
4) జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని జాతీయం చేశారు, కేంద్రరాష్ట్ర ప్రణాళికలను వేరు చేశారు
25. మాంటెక్‌సింగ్ అహ్లూవాలియాకు సంబంధించి సరైనది?
ఎ. 11వ పంచవర్ష ప్రణాళికకు డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించారు
బి. 12వ పంచవర్ష ప్రణాళికకు డిప్యూటీ చైర్మన్‌గా వ్యహరించారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
26. జవహర్లాల్ నెహ్రూ ప్రణాళికల్లో దేని అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు?
1) వర్తక వాణిజ్యాలు
2) చిన్నతరహా పరిశ్రమలు
3) ఉపాధి కల్పన
4) భారీ, మౌలిక పరిశ్రమలు
27. ప్రణాళిక సంఘం తన లక్ష్యాలు, సామాజిక సిద్ధాంతాలను ఎక్కడి నుంచి గ్రహించింది?
1) ఎస్ఎన్ అగర్వాల్ రూపొందించిన గాంధేయ ప్రణాళిక నుంచి
2) ప్రజా ప్రణాళిక నుంచి
3) రాజ్యాంగ ఆదేశిక సూత్రాల నుంచి
4) ప్రణాళిక సంఘం చార్టర్ నుంచి
28. ప్లానింగ్ ఫర్ యాన్ ఎక్స్‌పాండింగ్ ఎకానమీ అనే గ్రంథాన్ని రచించినవారు ?
1) సీఎన్ వకీల్, సీఆర్ బ్రహ్మానందం
2) అశోక్ మిత్ర
3) జే భాగవతి, ఎస్ చక్రవర్తి
4) ప్రమోద్ బర్థన్
29. భారత ప్రణాళికల లక్ష్యమైన సామాజిక న్యాయం రెండు కోణాలను కలిగి ఉంది. అవి ఏవి?
1) జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, మెరుగైన ఉపాధి అవకాశాలు
2) రైతు కూలీల స్థితిగతులను మెరుగుపరచడం, వెట్టిచాకిరీ రద్దు
3) అత్యంత పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సంపదలో అసమానతలను తగ్గించడం
4) పైవన్నీ
30. వెనుకబడిన దేశాలకు నిరంతర ప్రణాళిక (రోలింగ్ ప్లాన్) మంచిదని సూచించిన ఆర్థివేత్త?
1) గున్నార్ మిర్ధల్ 2) డబ్ల్యూఎం లెవీస్
3) ఆర్ నర్క్స్ 4) ఏ శామ్యూల్సన్
31. ఇండియన్ విజన్-2020ని రూపొందించినవారు?
1) రంగరాజన్ 2) అహ్లూవాలియా
3) శ్యామ్‌ప్రసాద్ గుప్తా 4) అబ్దుల్ కలాం
32. 2020 నాటికి వ్యవసాయరంగం కల్పించే ఉపాధి శాతం ఎంత ఉంటుందని ఇండియా విజన్- 2020 ప్రకటించింది?
1) 40 2) 50 3) 60 4) 35
33. బ్రిటిష్‌వారు అత్యధికంగా మూలధనాన్ని ఏ రంగంపై వెచ్చించారు?
1) వ్యవసాయం 2) పరిశ్రమలు
3) చేతివృత్తులు 4) మౌలిక వసతులు
34. కిందివాటిలో దేని సేద్యం విస్తీర్ణం త్వరితంగా క్షీణించిపోతున్నది?
1) పత్తి 2) చెరుకు
3) జనపనార 4) తేయాకు
35. సహకార వ్యవసాయాన్ని సిఫార్సు చేసిన వ్యవసాయ సంస్కరణల కమిటీ (1949)కి నాయకత్వం వహించినవారు?
1) శ్రీమాన్ నారాయణ 2) జేసీ కుమారప్ప
3) జేకే మెహతా 4) విద్యాబెన్ షా
36. మన దేశంలో మొదటి భూ అభివృద్ధి బ్యాంకును ఎప్పుడు, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
1) 1912, గుజరాత్ 2) 1924, బీహార్
3) 1904, రాజస్థాన్ 4) 1920, పంజాబ్
37. వ్యవసాయరంగంలో రుణాల మూంజూరీ కోసం ఏర్పాటైన కమిటీ ఏది?
1) నిజలింగప్ప కమిటీ
2) ఏఎం ఖుస్రూ కమిటీ
3) సతీష్ చంద్ర కమిటీ 4) రాజ్ కమిటీ
38. అగ్మార్క్ అనేది?
1) గుడ్ల ఉత్పత్తికి సంబంధించిన సహకార సంస్థ
2) నియంత్రిత వ్యవసాయ మార్కెట్
3) రైతుల సహకార సంస్థ
4) గుడ్లు, నెయ్యి, తేనే తదితర వ్యవసాయోత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించే ముద్ర
39. సహకార మార్కెటింగ్ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం?
1) ప్రతి రైతుపై బరువు తగ్గుతుంది
2) పెద్ద ఎత్తున అమ్మకాలు జరపడం వల్ల అందుకయ్యే వ్యయం ఆదా చేయవచ్చు
3) ప్రతి రైతు మార్కెట్లో అమ్ముకోవచ్చు
4) రైతులు వినియోగదారులను వెతుక్కుంటూ వెళ్లాల్సిన శ్రమ తప్పుతుంది
40. వ్యవసాయ ఆదాయపు పన్నుని ఏ కమిటీ సిఫారసు చేసింది?
1) రాజ్ కమిటీ
2) హనుమంతరావు కమిటీ
3) జైన్ కమిటీ
4) వెంగళరావు కమిటీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు