మానవాభివృద్ధి నివేదికలో మన స్థానమెంత?
జీవన ప్రమాణ సూచీని వాస్తవ తలసరి ఆదాయం ద్వారా గణిస్తారు. అమెరికన్ డాలర్లలో కొనుగోలు శక్తితో సమానత, పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ఆధారంగా లెక్కిస్తారు. పీపీపీ కనిష్ఠ విలువ 100 డాలర్లు, గరిష్ఠ విలువ 40,000 డాలర్లు.
– ప్రతి ఏడాది ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్-UNDP (ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం) హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్-HDI (మానవాభివృద్ధి సూచిక)ను ప్రచురిస్తుంది. గత ఏడాది ప్రచురించిన 160 పేజీల నివేదికలో ఆరు అధ్యాయాలున్నాయి. యువతకు అవకాశాలు కల్పించాలి అనే ఇతివృత్తంతో 2017, సెప్టెంబర్ 14న UNDP అడ్మినిస్ట్రేటర్ అచిమ్ స్టీనర్ విడుదల చేసిన నివేదికలో భారత్ 130వ స్థానంలో నిలిచింది. 2016తో పోల్చితే ఒక్క స్థానమే మెరుగుపడినప్పటికీ ఆసియాలో అభివృద్ధికి మారుపేరుగా భారత్ నిలిచింది. అత్యుత్తమ అభివృద్ధితో నార్వే ప్రథమ స్థానంలో ఉండగా.. నైగర్ చివరలో 189వ స్థానంలో ఉంది. మొత్తం 193 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల్లో 189 దేశాలను పరిగణనలోకి తీసుకుని స్పష్టమైన అంచనాలతో ఈ నివేదికను రూపొందించారు.
– స్థూల జాతీయ తలసరి ఆదాయం ఆధారంగా జీవన ప్రమాణాన్ని, ఆయుర్ధాయం ఆధారంగా ఆరోగ్యాన్ని, పాఠశాల విద్య ఆధారంగా విద్యను అంచనావేసి ఐక్యరాజ్య సమితి HDI నివేదికను రూపొందిస్తుంది. ఈ మూడు అంశాల ఆధారంగా ఆయా దేశాలు సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుని వాటికి 0 నుంచి 1 వరకు పాయింట్లు ఇస్తారు. మానవాభివృద్ధి సూచిక ధ్యేయం ప్రతి మనిషి లెక్కలోకి రావాలి. పేద-ధనిక తేడా లేకుండా ప్రతి ప్రాణి సమానం. ప్రస్తుత కాలంలో స్థూల జాతీయోత్పత్తికి ప్రత్యామ్నాయంగా మానవాభివృద్ధి సూచికను ఆధారం చేసుకుని ఒక దేశ ఆర్థికాభివృద్ధిని అంచనా వేస్తున్నారు. విద్య, ఆరోగ్యం, సగటు జీవితకాలం, శిశు మరణాలు, పేదరికం వంటి జీవన ప్రమాణాలు మానవాభివృద్ధి సూచిక రూపకల్పనకు ప్రాతిపదికలు. ఒక దేశం మానవాభివృద్ధిలో సాధించిన సగటు పురోభివృద్ధిని మానవాభివృద్ధి సూచిక తెలియజేస్తుంది.
– మహబూబ్ ఉల్హక్ (పాకిస్థాన్) రూపొందించిన హెచ్‌డీఐ ఆధారంగా యూఎన్‌డీపీలో ఈ మానవాభివృద్ధి సూచికను ప్రవేశపెట్టారు.
– ప్రజల ఎంపికలను విస్తృతం చేయడంతోపాటు, ప్రజా శ్రేయస్సును పెంపొందించే క్రమాన్ని మానవాభివృద్ధిగా మహబూబ్ ఉల్హక్ పేర్కొన్నారు. మానవాభివృద్ధి సూచిక రూపకల్పనలో అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ (1998) అందుకున్న అమర్త్యసేన్ భావాలు కనిపిస్తాయి.
– మానవాభివృద్ధి సూచిక మూడు రకాలైన మానవాభివృద్ధి సంబంధ ప్రాథమిక సగటు అంశాలను లెక్కిస్తుంది.
– దీర్ఘకాలిక ఆరోగ్యవంతమైన ఆయుర్ధాయాన్ని అంచనా వేస్తుంది.
– పరిజ్ఞానం, వయోజన విద్య ద్వారా 2/3 వంతు భారత్వం ఇచ్చి అంచనా వేసి 1/3 వంతు భారత్వం స్థూల విద్యార్థుల నిష్పత్తి ద్వారా లెక్కిస్తారు.
– ఉన్నత జీవన ప్రమాణాన్ని అమెరికా డాలర్లతో స్థూల దేశీయ తలసరి ఉత్పత్తి ద్వారా అంచనా వేస్తారు. దీన్ని పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ఆధారంగా గణిస్తారు. పీపీపీనే అమెరికన్ డాలర్లలో కొనుగోలు శక్తి సమానత అంటారు.
– మానవాభివృద్ధి సూచికను లెక్కించే ముందు మూడు అంశాల్లో ప్రతిదానికి ఒక దిశను నిర్ణయించి ప్రతి సూచికకు కనిష్ఠ గరిష్ఠ విలువలు లెక్కిస్తారు.
– ప్రతి అంశం ప్రదర్శనను 0 నుంచి 100 మధ్య విలువలు ఇచ్చి లెక్కగడుతారు.
మానవాభివృద్ధి సూచీ (HDI)
– ఆయుర్ధాయం సూచీ పుట్టినప్పటి నుంచి గణిస్తారు. దీనిలో తీసుకునే విలువలు కనిష్ఠం 25, గరిష్ఠం 100.
అక్షరాస్యత సూచీ
(ఎడ్యుకేషనల్ అటెయిన్మెంట్ ఇండెక్స్-EAI)
1. వయోజన అక్షరాస్యతకు 2/3 వంతు విలువ ఇస్తారు.
2. ఉమ్మడి నమోదు నిష్పత్తి 1/3 వంతు విలువ ఇస్తారు.
3. పై రెండింటికి కూడా కనిష్ఠ విలువ 0 శాతం, గరిష్ఠ విలువ 100 శాతంగా తీసుకుంటారు.
జీవన ప్రమాణ సూచీ (స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-SLI)
– జీవన ప్రమాణ సూచీని వాస్తవ తలసరి ఆదాయం ద్వారా గణిస్తారు. అమెరికన్ డాలర్లలో కొనుగోలు శక్తితో సమానత, పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ఆధారంగా లెక్కిస్తారు. పీపీపీ కనిష్ఠ విలువ 100 డాలర్లు, గరిష్ఠ విలువ 40,000 డాలర్లు.
– హెచ్‌డీఐ-0 విలువ అతి తక్కువ స్థితిని సూచిస్తుంది.
– హెచ్‌డీఐ-1 విలువ ఎక్కువ స్థితిని సూచిస్తుంది.
– హెచ్‌డీఐ-2010 రిపోర్టులో కొత్తగా మూడు సూచీలు ప్రవేశపెట్టారు.
1. అసమానతలు మిళితమైన మానవాభివృద్ధి సూచీ (ది ఇనీక్వాలిటీ అడ్జెస్టెడ్)
2. లింగ సంబంధిత అసమానత సూచీ (ది జెండర్ ఇనీక్వాలిటీ ఇండెక్స్)
3. బహుముఖ పేదరిక సూచీ.
– 2014లో మానవాభివృద్ధి నివేదిక తొలిసారిగా స్త్రీ, పురుష అభివృద్ధి సూచీ (జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్)ని రూపొందించినది. ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల మధ్య తారతమ్యతను లెక్కించింది.
– మన దేశంలో మానవాభివృద్ధి సూచీని నీతి ఆయోగ్ (గతంలో ప్రణాళిక సంఘం) రూపొందిస్తుంది. నీతి ఆయోగ్ హెచ్‌డీఐ తీసుకునే అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక రూపొందిస్తుంది.
– దేశంలో తొలిసారి మానవాభివృద్ధి సూచీని రూపొందించిన రాష్ట్రం మధ్యప్రదేశ్.
వివిధ ఏడాదుల్లో మానవాభివృద్ధి సూచీ
1981- 0.320
1991- 0.381
2001- 0.472
2017- 0.640
– ప్రపంచవ్యాప్తంగా మానవాభివృద్ధి మూడు రెట్లు అయ్యింది. 1990లో 500 కోట్లు ఉన్న జనాభా 2017 నాటికి 750 కోట్లకు పెరిగింది. తక్కువ అభివృద్ధి చెందుతున్న వారు 300 కోట్ల నుంచి 92.6 కోట్లకు తగ్గారు. అంటే 1990లో 60 శాతం ఉన్న వారు ప్రస్తుతం 12 శాతానికి తగ్గారు. ఎక్కువ, అతి ఎక్కువ అభివృద్ధి చెందినవారు 120 కోట్ల నుంచి మూడు రెట్లు పెరిగి 380 కోట్లకు చేరారు.
– ఆయుర్ధాయం, తలసరి ఆదాయం,
ఎక్కువ మంది చదువుకోవడంవల్ల ప్రపంచవ్యాప్తంగా హెచ్‌డీఐ విలువ 22 శాతం పెరిగింది. తలసరి ఆదాయం 27 ఏండ్లలో ఏకంగా 266 శాతం పెరిగింది.
– హెచ్‌డీఐ విలువ తక్కువగా ఉన్న దేశాల్లో 60 ఏండ్లు జీవిస్తారని అంచనావేయగా, అధిక హెచ్‌డీఐ ఉన్న దేశాల్లో 80 ఏండ్లు జీవిస్తారని అంచనావేశారు.
మానవాభివృద్ధి సూచీలో భారత్
– దక్షిణాసియాలో అన్ని దేశాల సగటు హెచ్‌డీఐ 0.638 అయితే, భారత్‌ది మాత్రం 0.640గా ఉంది.
– 1990లో భారతీయ హెచ్‌డీఐ విలువ 0.427 ఉండగా 2017 నాటికి అది 0.640కు పెరిగింది.
– 1990లో భారతీయుల ఆయుఃప్రమాణం 57.9 ఏండ్లు ఉంటే, 2017 నాటికి ఏకంగా 11 ఏండ్లు పెరిగి 70 ఏండ్లకు చేరువైంది. ప్రస్తుతం మన భారతీయుల ఆయుఃప్రమాణం 68.8 ఏండ్లు, పురుషుల ఆయుఃప్రమాణం 67.3 ఏండ్లు, స్త్రీల ఆయుఃప్రమాణం 70.4 ఏండ్లు.
– 1990లో తలసరి ఆదాయం రూ. 1,29,957 కాగా, 2017 నాటికి రూ.4,58,083కు చేరుకుంది. పురుషుల తలసరి ఆదాయం రూ.7,01,509 ఉండగా స్త్రీల తలసరి ఆదాయం రూ.1,96,269.
– దేశంలో మాతృమరణాల నిష్పత్తి ప్రతి లక్ష మందికి 1.74
– శిశు జననాల రేటు 23.1 శాతం.
– పార్లమెంటులో మహిళల శాతం 11.6
– సగటున పాఠశాల విద్య మూడేండ్ల నుంచి రెట్టింపై 6.4 ఏండ్లకు చేరుకుంది. పాఠశాల విద్య వయస్సులవారీగా బాలికలకు 12.9, బాలురకు 11.9
– అన్ని విషయాల్లో ముందంజలో ఉన్న భారత్ లింగసమానత్వం విషయంలో చాలా వెనుకబడి ఉన్నది. ఈ విషయంలో అంతర్జాతీయ సగటు కంటే భారత సగటు 26.8 శాతం తక్కువగా ఉన్నది.
– లింగ సమానత్వ సూచీలో భారత్ 160 దేశాల్లో 127వ స్థానంలో ఉన్నది.
– మాధ్యమిక విద్య చదివిన వారిలో పురుషులు 64 శాతం ఉండగా, స్త్రీలు 39 శాతం మాత్రమే ఉన్నారు.
– శ్రామిక శక్తిలో పురుషుల వాటా 78.8 శాతం ఉండగా, మహిళల వాటా 27.2 శాతం మాత్రమే ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు