పదసంపదపై పట్టు ఎలా..?

కలడు కలండనెడి వాడు కలడో లేడో అని వాపోతాడు గజరాజు… పోతన భాగవతంలో. ఉన్నావా…., అసలున్నావా అంటూ దేవున్ని నిలదీస్తాడు ఆత్రేయ భక్తతుకారాం సినిమాలో. ఇలాంటి సంశయవాదులు (sceptics/skeptics) ఎప్పుడూ ఉంటారు.
– Bible కథనం ప్రకారం Jesus Christ శిలువ వేసిన (Crucifixion) తర్వాత మూడో రోజు పునరుత్తానం (resurrection) పొందాడు. ఈ విషయాన్ని ఆయన ముఖ్య శిష్యుల్లో (apostles) ఒకడైన సెయింట్ థామస్ (St. Thomas) తొందరగా నమ్మలేదు. తాను స్వయంగా జీసస్‌ను, అతని శరీరంపై శిలువ వేసిన గాయాలు, గుర్తులను చూసిన తర్వాతే నమ్ముతాడు. అలా స్వయంగా ఆధారాలు చూస్తేగాని ఏ విషయాన్ని నమ్మని వారిని doubting Thomas అంటారు. (A person who is sceptical and refuses to believe something without proof)
– దేవుడు కచ్చితంగా ఉన్నాడని నమ్మడం ఈశ్వరవాదం లేదా ఆస్తిక వాదం (Theism: theos god), నమ్మేవారు ఆస్తికులు (Theists). అంతే కచ్చితంగా దేవుడు లేడనే వాదం నిరీశ్వర లేదా నాస్తిక వాదం atheism (Greek: a – without, theos – god), దీన్ని అనుసరించేవారు నిరీశ్వరవాదులు లేదా నాస్తికులు (atheists).
– దేవుడు ఉన్నాడా లేడా అనే అంశం మన తర్కానికి (Logic) అందనిది, అందరానిది కూడా అనుకునేవారు ఆజ్ఞేయ వాదులు (agnostics). ఈ భావనే ఆజ్ఞేయ వాదం (agnosticism – Greek: a – without, gnostos – known).
– దేవుడున్నాడా? లేడా? అని ప్రశ్నిస్తే ఉన్నాడు అంటే theist, లేడు అంటే atheist, ఏమో నాకు తెలియదు (I dont know), నీకు తెలియదు (you dont know) అంటే agnostic.
– గ్రీకు భాషలో gnostos (known) నుంచి వచ్చిన మరికొన్ని పదాలు… Prognose (pro-before, gnosis-knowledge). వైద్య పరిభాషలో (medical terminology) రోగి జబ్బుపై డాక్టర్‌కు ఉన్న అవగాహన prognose. సాధారణంగా అయితే ఊహించి చెప్పడం (fore telling).
– Diagnose (dia-apart, gnosies – known) అంటే కూలంకుషంగా తెలుసుకోవడం (to know thoroughly). ఒక విషయానికి చెందిన భిన్న అంశాలను వేరుచేసి (distinguish) అసలు సంగతిని గ్రహించడం. వైద్యులు రకరకాల పరీక్షల (tests) ద్వారా మూల కారకమైన జబ్బును (disease) శోధించడం diagnosis.
– ఏదైనా విషయాన్ని తెలుసుకునే పద్ధతి లేదా విధానం cognition (cognise – known). అంటే the act of knowing.
– మరచిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకోవడం recognise (re-again, cognise – know).
– మారు వేషాల్లో సంచారం చేసి తమ పాలన (rule) ఎట్లా ఉందని రాజులు తెలుసుకునేవారు. అటువంటి మారువేషం incognito (Latin: in – not, cognitus – known) ఈ incognito పదం లాటిన్ నుంచి Italian ద్వారా ఇంగ్లిష్‌లోకి వచ్చింది.
– గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్రధారి దేవున్ని నిలదీస్తూ నా మనస్సు ఇండిపెండెంట్‌గా సృజించావా లేక డిపెండెంట్‌గా సృజించావా? ఇండిపెండెంట్‌గా అయితే నా ఇష్టం వచ్చిన పనల్లా చేశాను. నువ్వెవరు అడగడానికి? డిపెండెంట్‌గా చేశావా? అలా అయితే నా తప్పొప్పులకు నీదే బాధ్యత! అని అన్నాడు.
– గిరీశం చెప్పిన మొదటి రకం independentగా సృజించడం అంటే లోకాన్ని సృజించడం వరకే దేవుని పని. తర్వాత దాన్ని వదిలివేయడం (Deism). ఎవరి తలరాతలు వారే రాసుకోవాలని deism భావం.
– రెండో రకం అంటే dependentగా సృజించడం Theism. దేవుడు ఈ లోకాన్ని సృష్టించడమే కాదు అనుక్షణం వెన్నంటి బాగోగులు చూస్తుంటాడని theism భావం.
– క్రిస్టియానిటీ (Christianity), ఇస్లాం (Islam), యూదు/జుడాయిజం (Judaism) మొదలైన మతాల లో దేవుడు ఒక్కడే. వారిది ఏక దేవతారాధన Monotheism (Greeks: mono- one, theos- god).
– హిందువుల్లా అనేక రూపాల్లో దేవున్ని పూజించడం బహుదేవతారాధన Polytheism (Gr: Poly-many theos – god). విగ్రహ (idol) రూపంలో దేవున్ని కొలవడం విగ్రహారాధన (idolotry).
– ఏకం సత్ విప్రా బహుధా వదన్తి- సత్యం (దైవం) ఒక్కటే, విజ్ఞులు బహురూపాల్లో పేర్కొంటారు అని బుగ్వేదంలో ఉంది. ఎలాగైతే ఒక భావన (thought) తనకు తాను వ్యక్తపర్చడానికి (manifest) పదాలను (words) ఆలంబనగా చేసుకుంటుందో అలాగే అనంతం (endless), నిరాకారం (formless), సత్య స్వరూపమైన ఈశ్వర తత్వాన్ని సామాన్యులు విగ్రహాల (idols) రూపంలో వ్యక్తపర్చుకుంటారని హిందూమత భావన.
– మతం (religion) అనే పదం religare అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. Religare అంటే బంధించి ఉంచడం (to connect with god/certain beliefs). మతం దైవానికి, కొన్ని విశ్వాసాలకు సంబంధించిన విషయం.
– మతాన్ని విశ్వసించేవారు మతపరమైన కర్మలను క్రమం తప్పకుండా పద్ధతిగా పాటిస్తారు. అందువల్లే religiousగా చేయడం అంటే regularగా చేయడమని అర్థం.
ఉదా: Do these exercises religiously every day (ఈ వ్యాయామాలను క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేయాలి).
– He visits his mother religiously every week (అతను క్రమం తప్పకుండా ప్రతివారం వాళ్ల అమ్మదగ్గరికి వెళ్తాడు).
– ప్రస్తుత వ్యవహారంలో ఒక్క మతం మాత్రమే కాకుండా ఏ విషయంలో అయినా అతివాద (extremist) భావాలను కలిగినవారిని అత్యుత్సాహం (excessive zeal) చూపేవారిని fanatics అంటారు.
ఉదా:
– religious fanatic (మత మౌఢ్యం కలిగినవాడు)
– religious fanaticism (మత మౌఢ్యం)
– exercise fanatic (అతిగా వ్యాయామం చేసేవాడు)
– My friend Raju is an exercise fanatic
– My colleague Srinivas is a cricket fanatic.
– Fanaticను కుదింపు (shot) చేస్తే fan (అభిమాని). అయితే రెండింటికీ తేడా ఉంది. ఒక వ్యక్తి లేదా విషయం మనకు వినోదం (amusement) కానీ, ఆనందం (happiness) కానీ కలిగిస్తే మనం ఆ వ్యక్తికి లేదా విషయానికి అభిమాని (fan) అవుతాం. అంతవరకే పరిమితం కాకుండా, అమితమైన వ్యామోహం (obsession) పెంచుకుని వాటిని ఇష్టపడని వారిని ద్వేషించే స్థాయికి చేరితే మూఢునిగా (fanatic) మారాడని అంటారు.
– లాటిన్ భాషలో fanum అంటే ఆరాధనా స్థలం (holy of holies). దీని నుంచే ఇంగ్లిష్‌లో గుడికి fane అనే పదం వచ్చింది. తన మతం లేదా గుడిపై వ్యామోహం పెంచుకుని అత్యుత్సాహం (excessive enthusiasm) ప్రదర్శించే వారిని fanatics అంటారు.
– Fane అంటే temple అయితే profane అంటే outside the temple (pro-outside; fane- temple). అంటే దైవేతరమైన (nonreligious), లౌకికమైన (secular), అపవిత్రమైన (unholy) విషయాలు. sacred కానివి profane అనుకోవచ్చు.
– భగవంతుడు (god) ఎప్పుడూ మంచినే (good) బోధిస్తాడు. ఒకప్పుడు god అంటే good. దేవునివాక్కు (god spell) మానవులకు శుభ సమాచారం (good news). కాలక్రమంలో god spell gospel (సువార్త)గా మారింది. క్రీస్తు బోధనలు (revelation or teaching) క్రైస్తవ సమాజానికి gospel.
– జీసస్ మాట్లాడిన భాష అరమెయిక్ (aramaic). ఆ భాషలో abba అంటే తండ్రి. ఉర్దూలో కూడా నాన్నని అబ్బా అని పిలుస్తారు. ఇది అరబిక్ నుంచి వచ్చింది. సన్యాసులు (monks) నివసించే ఆశ్రమం లేదా మఠాన్ని monastery అంటారు. దీని అధిపతి abbot. అంటే మఠానికి తండ్రిలాంటివాడు. Abbotకు మూలం పైన పేర్కొన్న abba.
– రోమన్ క్యాథలిక్ చర్చిలకు అధిపతిగా (head) రోమ్ బిషప్ (Bishop of Rome) ఉంటారు. ఆయనను పోప్ (pope) అంటారు. Pope అనే పదం papa (father) అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. క్యాథలిక్ క్రిస్టియన్ సమాజానికి pope తండ్రిలాంటివాడు.
– Pasture (పచ్చిక మైదానం) లాటిన్ భాషలోని pasco నుంచి వచ్చింది. Pasco అంటే to feed (పోషణ ఇచ్చు). జీవరాసుల కడుపు నింపుతుంది కనుక అది pasture.
– Pastures (పచ్చిక మైదానాలు) దగ్గరకు జీవాలను తీసుకుని వెళ్లేవాడు pastor. అంటే కాపరి (shepherd) అన్నమాట. పశుపోషణతో జీవించే సమాజాలను pastoral communities అంటారు.
– అదేవిధంగా చర్చిలో సమావేశమైన భక్తుల కూటమిని (congregation) కాపరిలా నడిపిస్తూ, ధార్మిక పోషణ చేసేవాడే పాస్టర్ (pastor).
– ప్రార్థన తర్వాత (at the end of prayer) క్రిస్టియన్లు ఉచ్ఛరించే ఆమెన్ (Amen) అనే పదం హిబ్రూ (Hebrew) భాష నుంచి వచ్చింది. దానికి నిశ్చయంగా (certainly), సత్యపూర్వకంగా (truely), అట్లే జరుగుగాక (so be it) అర్థాలున్నాయి. ప్రార్థన ఫలితం తప్పకుండా నెరవేరుతుందనే దృఢ సంకల్పాన్ని Amen వ్యక్తపరుస్తుంది.
– సాధారణంగా మనం వీడ్కోలు పలికేటప్పుడు goodbye అంటాం. Good అంటే god. Goodbyeకి మూలం God bye అంటే God be with you ఈశ్వరుడు సదా నిన్ను వెన్నంటి ఉండుగాక అని అర్థం.
– దేశంలో జరుపుకునే అనేక పండుగలకు (festivals) మనకు సెలవులు ఇస్తారు. ఈ Holiday (సెలవు) అనే పదం holyday (పవిత్రమైన రోజు) నుంచి వచ్చింది. పండుగలు holydays కాబట్టి ఆ రోజు మనకు holidays దొరుకుతాయి.
– Holy వంటివే మరో రెండు పదాలు sacred, sanctity. లాటిన్ భాషలో sacre, sacrere అంటే పవిత్రమైనవాడు (sacred person), దైవాంశ సంభూతుడు (godly person). Ocard wilde అనే ఒక మంచి మాట..
– Every saint has a past, every sinner has a future (ప్రతి యోగికీ ఒక గతం ఉంటుంది. ప్రతి పాపికీ ఒక భవిష్యత్తు ఉంటుంది).
– సాధారణంగా వ్యక్తులకు, సంబంధాలకు (persons and relationships) holyness అనే పదం, వస్తువులకు, స్థలాలు, సంఘటనలకు (objects, places and happenings)కు sacredness అనే పదం ఉపయోగిస్తారు.
– గుడి పవిత్రమైనది. మూలవిరాట్టు ఉండే గర్భగుడి అత్యంత పవిత్రమైనది. అందుకే గర్భగుడి sanctum sanctorium (holy of holies).
RELATED ARTICLES
-
Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
-
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
-
Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
-
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
-
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
-
English Grammar | We should all love and respect
Latest Updates
Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
Groups Special – Science | సహజ శక్తి అనంతం … కాలుష్య రహితం.. పర్యావరణ హితం
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
Physics – IIT/NEET Foundation | The acceleration of a body has the direction of
Economy – Groups Special | అండమాన్‌లో అల్పం… దాద్రానగర్‌లో అధికం
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?