దగాపడ్డ తెలంగాణ అని ఏ సభకు పేరుపెట్టారు ?

1. 2006, ఆగస్టు 22న లెఫ్ట్‌ఫ్రంట్‌తో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తే మేము ఎలా అడ్డుకోగలుగుతామని కాంగ్రెస్‌ను నిలదీసిన పార్టీ ? (2)
1) సీపీఐ 2) సీపీఐ(ఎం)
3) సీపీఐ (ఎం. ఎల్) న్యూడెమక్రసీ
4) సీపీఐ (ఎం.ఎల్) జనశక్తి
2. బోగస్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు పొంది పార్లమెంట్ ఎక్చ్సేంజీల్లో బోగస్ రిజిస్ట్రేషన్ చేసుకొని డీఎస్సీలో అక్రమంగా స్థానికేతరులు తెలంగాణ ఉద్యోగాలు సంపాదించారని గిర్గ్లానీ కమిషన్ ఏ చాప్టర్లో పేర్కొంది ?
1) చాప్టర్-10 2) చాప్టర్- 11
3) చాప్టర్ – 12 4) చాప్టర్-13
3. గిర్గ్లానీ కమిషన్ రాష్ట్రపతి ఉత్తర్వులను పరిశీలించి, ఉద్యోగరంగంలో స్థానికులకు జరిగిన నష్టాన్ని, మొత్తంగా రాష్ట్రపతి ఉత్తర్వులను ఎన్ని రకాలుగా ఉల్లంఘించినట్లు నిర్ధారించింది ? (1)
1) 18 2) 19 3) 21 4) 23
4. ప్రభుత్వ అధికారిక సమాచారం ఆధారంగా తెలంగాణకు సాగునీటి రంగంలో జరిగిన అన్యాయంపై 1991లో ఒక నివేదికను సమర్పించిందెవరు ? (1)
1) వెలిచాల జగపతిరావు 2) కే జానారెడ్డి
3) ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి 4) జీవన్‌రెడ్డి
5. 1991లో ఏర్పడిన తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా ఎన్నికయిందెవరు ? (3)
1) వెలిచాల జగపతిరావు 2) నర్సింహారెడ్డి
3) కే జానారెడ్డి 4) ఎవరూ కాదు
6. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గుర్తిస్తూ 1996, సెప్టెంబర్‌లో హైదరాబాద్ వికేకవర్ధిని కళాశాలలో తెలంగాణపై సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ? (3)
1) గద్దర్ 2) కె.జయశంకర్
3) పాశం యాదగిరి 4) నందిని సిధారెడ్డి
7. 1996, నవంబర్ 1న హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రకాశం హాల్లో తెలంగాణ సంఘర్షణ సమితి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సదస్సు ఎవరి అధ్యక్షతన జరిగింది ?(2)
1) పాశం యాదగిరి 2) కే ప్రభాకర్ రెడ్డి
3) వీ జగపతిరావు 4) డీ జనార్దన్‌రావు
8. దగాపడ్డ తెలంగాణ అని ఏ సభకు పేరుపెట్టారు ?(4)
1) హైదరాబాద్ 2) సూర్యాపేట
3) వరంగల్ 4) భువనగిరి
9. 1997, ఆగస్టు 11న సూర్యాపేట మహాసభ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ? (2)
1) ఆకుల భూమయ్య 2) మారోజు వీరన్న
3) సుదర్శన్ 4) ఐలయ్య
10. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార పార్టీ శాసన సభ్యుడు డీ ప్రణయ్ భాస్కర్ తెలంగాణ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షను గురించి మాట్లాడినందుకు తెలంగాణ అనే పదం వాడకూడదు, దాని స్థానంలో వెనుకబడిన ప్రాంతం అని పేర్కొనాలని రూలింగ్ ఇచ్చిన స్పీకర్? (1)
1) యనమల రామకృష్ణుడు 2) దేవేందర్ గౌడ్
3) మాధవరెడ్డి 4) ఎవరూకాదు
11. నాటి తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను నేటి ఆధునిక యువతకు చాటిచెప్పే ఉద్దేశంతో టీఆర్ఎస్ నిజాం కాలేజీ గ్రౌండ్లో తెలంగాణ సంబురాలు ఎప్పుడు నిర్వహించింది? (1)
1) 2007, మార్చి 23-27
2) 2007, మార్చి 27-30
3) 2008 మార్చి 23-27
4) 2008 మార్చి 27-30
12. కిందివాటిని జతపర్చండి? (1)
1) ప్రొఫెసర్ జయశంకర్ ఎ) దగాపడ్డ తెలంగాణ
2) ఇన్నయ్య బి) నీళ్లు నిజాలు
3) విద్యాసాగర్‌రావు సి) తెలంగాణలో ఏం
జరుగుతుంది
4) వాగీశ్ డి) తెలంగాణ
విఫలాంధ్రప్రదేశ్
5) ఎన్ వేణుగోపాల్ ఇ) లేచి నిలిచిన తెలంగాణ
1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి, 5-ఇ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి, 5-ఇ
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-ఇ, 5-సి
13. తెలంగాణ దుర్భర పరిస్థితులకు అద్దం పడుతూ ప్రాంతీయ స్పృహతో కూడిన కవిత్వాన్ని తెలంగాణ కవులు వెలువరించిన వాటిని సరైనవి గుర్తించండి? (4)
ఎ) పొక్కిలి – జూలూరు గౌరీశంకర్
బి) మత్తడి – సుంకిరెడ్డి, సురేంద్రరాజు
సి) కరువు – మల్లేశం, లక్ష్మయ్య
డి) జూలుస్ – 2012, జిగర్ – 2013 – ఎన్ జగన్‌రెడ్డి
ఇ) పడావు – వడ్డెబోయిన శ్రీనివాస్
1) ఎ, సి, ఇ, బి 2) ఎ, సి, డి
3) బి, డి 4) పైవన్నీ సరైనవే
14. పొలమారిన పాలమూరు కవిత రాసిందెవరు? (1)
1) కాశీం 2) వడ్డెబోయిన శ్రీనివాస్
3) జూలూరు గౌరీశంకర్ 4) కర్ర ఎల్లారెడ్డి
15. తెలంగాణ సాహిత్యానికి అద్దం పడుతూ తెలంగాణ రచయితల వేదిక పత్రికను వెలువరించినది? (3)
1) సింగిడి 2) మన తెలంగాణ
3) సోయి 4) నడుస్తున్న తెలంగాణ
16. తెలంగాణ రచయితల సంఘం ఏ తెలంగాణ సాహిత్య పత్రికను వెలువరించినది? (1)
1) సింగిడి 2) సోయి
3) మన తెలంగాణ 4) నడుస్తున్న తెలంగాణ
17. మన తెలంగాణ బులెటిన్ వెలువరించిందెవరు? (2)
1) కాశీం 2) కర్ర ఎల్లారెడ్డి
3) జూలూరు గౌరీశంకర్ 4) పైవారందరూ

18. ధూం ధాం అంటే? (4)
1) ధూం అంటే అల, ధాం అంటే అరుపు
2) ధూం అంటే జడి, ధాం అంటే శబ్దం
3) ధూం అంటే అలజడి, ధాం అంటే శక్తి
4) ధూం అంటే అలజడి, ధాం అంటే శబ్దం
19. ప్రజా కళలకు పుట్టినిల్లయిన తెలంగాణ ప్రజా కళలను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ధూం ధాం మొదటగా ఏ రోజున జరిగింది? (1)
1) 2002 సెప్టెంబర్ 30 2) 2003 సెప్టెంబర్ 30
3) 2004 సెప్టెంబర్ 30 4) 2005 సెప్టెంబర్ 30
20. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా? ఇండియా పాకిస్థానోలే ఇనుప కంచె పడుతుందా? అని పాడిన కళాకారుడు? (3)
1) అందెశ్రీ 2) గోరటి వెంకన్న
3) గద్దర్ 4) రసమయి బాలకిషన్
21. అరుణోదయ కళాకారులు సంతోష్ నేతృత్వంలో ఏ నృత్యం వేలాదిమందిన ఆకర్షించింది? (2)
1) ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా!
2) ఆడుదాం డప్పుల్ల దరువెయ్యరా పల్లె తెలంగాణ పాట పాడరా
3) బొంబాయి వోతున్న అమ్మా మాయమ్మ
4) చూడ చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి
22. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రగతిశీల మహిళా సమాఖ్య, తెలంగాణ మహిళా జాక్ సంయుక్తంగా హైదరాబాద్‌లో తెలంగాణ మహిళా ధూం ధాంను ఎప్పుడు నిర్వహించారు? (3)
1) 2012, డిసెంబర్ 22 2) 2012, మార్చి 8
3) 2013, మార్చి 8 4) 2013, డిసెంబర్ 20
23. 2011, జూలై 26న ఏ కళాకారులు నిర్వహించిన పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌తో చేపట్టిన డప్పు దరువు కళాప్రదర్శనకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు తరలివచ్చారు? (1)
1) అరుణోదయ కళాకారులు 2) జననాట్య మండలి
3) ప్రజానాట్య మండలి 4) పైవన్నీ
24. విద్యార్థులు 2010 జనవరి 3న తలపెట్టిన విద్యార్థి గర్జనకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే, విద్యార్థుల తరఫున హైకోర్టులో పిటిషన్ వేసి అనుమతి ఇప్పించిన జేఏసీ (4)
1) రాజకీయ జేఏసీ 2) ఉద్యోగ సంఘాల జేఏసీ
3) తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం జేఏసీ
4) న్యాయవాదుల జేఏసీ
25. తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల పునర్నిర్మాణం ఎలా జరగాలో తెలంగాణ సమాలోచన పేరుతో పుస్తకాన్ని ప్రచురించిన వారు? (2)
1) తెలంగాణ జర్నలిస్టుల ఫోరం
2) తెలంగాణ విద్యావంతుల వేదిక
3) తెలంగాణ రిసోర్స్ సెంటర్
4) తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్
26. ఆరుసూత్రాల పథకానికి చట్టబద్దత కల్పించేందుకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతికి ప్రత్యేక అధికారం ఇచ్చారు? (1)
1) 32వ 2) 33వ 3) 42వ 4) 44వ
27. ఆర్టికల్ 371 (డి) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని జోన్లు ఏవి? (4)
1) 1, 2 2) 2, 3 3) 4, 5 4) 5, 6
28. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిరసనగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన రాజీనామాను ఎప్పుడు గవర్నర్ ఆమోదించారు? (3)
1) 2014, ఫిబ్రవరి 19 2) 2014 ఫిబ్రవరి 20
3) 2014 ఫిబ్రవరి 21 4) 2014 ఫిబ్రవరి 22

233795_Untitled 32
29. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ రోజున దీక్ష ప్రారంభించారు? (2)
1) 2009 అక్టోబర్ 9 2) 2009 నవంబర్ 29
3) 2009 డిసెంబర్ 6 4) 2009 డిసెంబర్ 7
30. కేంద్రం తెలంగాణను సాగదీస్తుండటంతో ఇక లాభం లేదని భావించిన కేసీఆర్, ఆలె నరేంద్ర ఏ రోజున తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి యూపీఏ నుంచి బయటికొచ్చారు? (3)
1) 2006 మే 6 2) 2006 మే 22
3) 2006 ఆగస్టు 22 4) 2006 ఆగస్టు 24
31. టీఆర్ఎస్ 2003 జనవరి 6న హైదరాబాద్ నడిబొడ్డున ఏ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది? (3)
1) తెలంగాణ పోరు 2) తెలంగాణ పోరు గర్జన
3) తెలంగాణ గర్జన 4) తెలంగాణ పోరు కేక
32. తెలంగాణ గొంతును ఢిల్లీలో వినిపించాలని టీఆర్ఎస్ హైదరాబాద్ నుంచి ఢీల్లీ దాకా నిర్వహించిన భారీ కారు ర్యాలీ ఏ రోజున ఢిల్లీకి చేరింది? (1)
1) 2003 మార్చి 27 2) 2003 మార్చి 28
3) 2003 మార్చి 29 4) ఏదీ కాదు
ఎస్. మహేశ్ పీజీటీ, బొమ్మలరామారం ,నల్లగొండ
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు