అష్ట సూత్రాలు.. అమలు కాని ఒప్పందాలు
- తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం
- 1969 తెలంగాణ ఉద్యమం
- పెద్దమనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతానికి కల్పించిన రక్షణలు అమలు కాకపోవడం వల్ల తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ముల్కీల స్థానంలో నియమితులైన నాన్ ముల్కీ (ఆంధ్ర) ఉద్యోగులను తొలగించడంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం విజయం సాధించింది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డులో గల ఉద్యోగాలు తెలంగాణ రక్షణల కిందకు, ముల్కీ నిబంధనల కిందకు రావని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 1968 జూలై 10ని ‘తెలంగాణ పరిరక్షణ దినం’గా పాటించారు.
విద్యార్థుల పాత్ర
- ఖమ్మం జిల్లా గాంధీచౌక్ వద్ద రవీంద్రనాథ్ నిరవధిక దీక్ష ప్రారంభించారు. ఓయూలో విద్యార్థులు 2 వర్గాలుగా చీలారు.
1. తెలంగాణ పరిరక్షణల సమితి: ఇది కాసుబ్రహ్మానందరెడ్డి వర్గం. దీనికి మదన్ మోహన్ అనే విద్యార్థి నాయకుడు అధ్యక్షత వహించాడు.
2. తెలంగాణ కార్యాచరణ సమితి: ఇది మర్రి చెన్నారెడ్డి వర్గం. దీనికి విద్యార్థి నాయకుడైన మల్లికార్జునరావు అధ్యక్షత వహించాడు.
ఎన్జీవోల పాత్ర
- 1969లో కాసుబ్రహ్మానంద రెడ్డి తెలంగాణ వారి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ప్రసంగించారు. ఇందుకు ఎన్జీవో సంఘ నాయకుడిగా ఉన్న కె.ఆర్. ఆమోస్‌ను తొలగించారు.
తెలంగాణ ప్రజా సమితి - 1969లో తెలంగాణ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పడింది. దీనికి మదన్మోహన్ అధ్యక్షుడు. మల్లికార్జున్, మదన్మోహన్ వంటి విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. వీరి అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అచ్చుతరెడ్డి, అంజయ్య, మానిక్రావ్, హషిమ్ సత్యాగ్రహాల్లో పాల్గొన్నారు. తెలంగాణవాదుల అసంతృప్తిని తొలగించటానికి ఇందిరాగాంధీ అష్టసూత్ర పథకాన్ని ఏప్రిల్ 11న ప్రకటించింది.
- కేవీ రంగారెడ్డి బానిస బతుకు కంటే మరణమే మేలు అని తెలంగాణవాదుల్లో ఉద్యమకాంక్షను రగిలించాడు. చార్మినార్ నుంచి రాజ్‌భవన్ వరకు (1969 మే 1న) ఊరేగింపు జరిగే సమయంలో పోలీసు కాల్పుల్లో విద్యార్థి నాయకుడు ఉపేందర్‌రావు మరణించాడు.
- ప్రత్యేక తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రిపదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని 1969లో ఏర్పాటు చేశారు.
మర్రి చెన్నారెడ్డి పాత్ర - 1967 అసెంబ్లీ ఎన్నికల్లో వందేమాతరం రామచంద్రరావుపై గెలిచాడు. తెలంగాణ ఉద్యమంలోకి అడుగు పెట్టినప్పటికి తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడిగా మదన్మోహన్ ఉన్నాడు. ఇందిరాగాంధీ 1969 సెప్టెంబర్‌లో తెలంగాణకు సానుకూలంగా స్పందించడం వల్ల విద్యార్థులు తరగతులకు హాజరు కావాలనే ప్రకటనలపై మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున్ సంతకాలు చేశారు. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వల్ల ప్రజలల్లో వచ్చిన అసంతృప్తికి పంచసూత్ర పథకం ప్రకటించారు.
- తెలంగాణ నుంచి పీవీ నరసింహరావు 1971లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ముల్కీ నిబంధనలు కచ్చితంగా అమలు చేశాడు. ఆంధ్రా ఉద్యోగులు ముల్కీ నిబంధనలపై హైకోర్టులో కేసు వేశారు.
- హైకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించగా పీవీ నరసింహరావు సుప్రీంకోర్టు పునఃపరిశీలనకు పంపాడు. దీంతో ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధం కాదని 1972లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిబంధనల గురించి నర్సింగరావు అనే న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈ తీర్పు అనంతరం ఆంధ్రాలో జైఆంధ్ర ఉద్యమం ప్రారంభించారు. దీనికి మొదటగా కాకాని వెంకటరత్నం నాయకత్వం వహించారు. ఇతడు 1972 డిసెంబర్ 25న మరణించాడు. ఇతని మరణం తర్వాత బి.వి.సుబ్బారెడ్డి, వసంత నాగేశ్వరరావు ఉద్యమానికి నాయకత్వం వహించారు.
- 1972 డిసెంబర్ 31న ఆంధ్ర కాంగ్రెస్ నాయకుల తిరుపతి సమావేశానికి బి.వి.సుబ్బారెడ్డి అధ్యక్షత వహించాడు. జై ఆంధ్ర ఉద్యమ ప్రభావంతో 1973 జనవరి 17న తన సీఎం పదవికి పీవీ నరసింహారావు రాజీనామా చేశారు. జనవరి 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ సమయంలో ఖండూభాయ్ దేశాయ్ గవర్నర్‌గా ఉన్నారు. సలహాదారులుగా హెచ్‌సీ శరీన్, వి.కె.రావ్ ఉన్నారు. హెచ్‌సీ శరీన్ తన పరిపాలన అనుభవంతో జై ఆంధ్ర ఉద్యమ తీవ్రతను తగ్గించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల పథకం ప్రకటించింది. 1973 అక్టోబర్1న 6 సూత్రాల పథకాన్ని ఆంధ్రా కాంగ్రెస్ కార్యాచరణ కమిటీ ఆమోదించింది.
- 1973 డిసెంబర్ 10న రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. 1973 డిసెంబర్లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 6 సూత్రాలు చేర్చారు. చట్టప్రకారం 371(డి), 371(ఇ) చేర్చబడ్డాయి. రాష్ట్రపతి ఉత్తర్వును 1975 అక్టోబర్ 18న జారీ చేశారు. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 1975 అక్టోబర్ 20న జీవో 674ను జారీ చేసింది. ఈ జీవో 674 ఉద్యోగ నియామకాల్లో పాటించాల్సిన అంశాలను తెలుపుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ర్టాన్ని 6 జోన్లుగా విభజించారు.
తెలంగాణ జనసభ - ఇది 1985 ఫిబ్రవరి 27న ఏర్పడింది. దీనికి సత్యనారాయణ అధ్యక్షుడు. 1987 భూపతి కృష్ణమూర్తి అధ్యక్షతన తెలంగాణ ప్రజాసమితి మరలా ఆవిర్భవించింది.
- తెలంగాణ ఫోరం- జానారెడ్డి: జానారెడ్డి కన్వీనర్‌గా తెలంగాణ ఫోరం 1990లో ఏర్పాటు చేశారు.
- తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (టీఎల్‌ఎస్వో)
- ఇది విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోసం ఏర్పాటైంది. 6 సూత్రాల పథకం అమల్లో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. 6 సూత్రాల ప్రకారం విద్యాసంస్థల్లో స్థానికులకు 85 శాతం సీట్లు, ఓపెన్ కాంపిటీషన్ కోటా కింద 15 శాతం సీట్లు కేటాయించాలి.
జై తెలంగాణ పార్టీ
- 1997లో ఇంద్రారెడ్డి దీన్ని స్థాపించారు. ఈ పార్టీని రాజశేఖర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
- తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం: చిన్నారెడ్డి కన్వీనర్‌గా తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం ఏర్పాటు చేశాడు.
కుమార్ లలిత్ కమిటీ: ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల వివరాలు, తెలంగాణ మిగులు నిధులపై ఈ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి వేశారు. - జస్టిస్ భార్గవ కమిటీ: తెలంగాణ మిగులు నిధులపై 1969 ఏప్రిల్ 22న నియమించారు.
వాంఛూ కమిటీ: ఈ కమిటీ 1969లో ఏర్పడింది. ముల్కీ నిబంధనలు కొనసాగించటానికి రాజ్యాంగ సవరణ విషయంలో సూచనలు ఇవ్వటానికి ఈ కమిటీ ఏర్పాటు చేశారు.
జయభారత్‌రెడ్డి, సుందరేషన్ కమిటీ: ఈ కమిటీల ఆధారంగా 1985 డిసెంబర్ 30న 610 జీవో వెలువడింది. 610 జీవో 1986 మార్చి 31లోపు అమలు కావాలని ఆ జీవోలో ఉంది. 1976 అక్టోబర్ నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన తెలంగాణేతరులందరిని 1986 మార్చి 31 నాటికి వెనుకకు పంపాలి.
జీఎం గిర్గ్లాని కమిటీ: 2001 జూన్‌లో ఏర్పాటు చేశారు. 610 జీవో అమలును పరిశీలించటానికి గిర్గ్లానీ కమిటీ ఏర్పాటు చేశారు.
ప్రణబ్ ముఖర్జి కమిటీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో విస్తృత అంగీకారం కోసం 2005లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ప్రణబ్ ముఖర్జి అధ్యక్షుడు. రఘువంశ ప్రసాద్, దయానిధి మారన్ సభ్యులుగా ఉన్నారు.
శ్రీకృష్ణ కమిటీ: 2010 ఫిబ్రవరి 3న కేంద్రం ప్రకటించింది. జస్టిస్ శ్రీకృష్ణ దీనికి అధ్యక్షుడుగా, వి.కె. దుగ్గల్ కార్యదర్శిగా, రవిందర్కౌర్ (ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్), రణబీర్ సింగ్ (నల్సార్ వ్యవస్థాపక డైరెక్టర్), అబూసలే షరీఫ్ (ఆర్థికవేత్త) సభ్యులుగా ఉన్నారు. 2010 డిసెంబర్ 30న కేంద్ర హోంశాఖకు నివేదికను సమర్పించింది. నివేదికలో 9 చాప్టర్లు, 505 పేజీలు ఉన్నాయి. ముఖ్యంగా 6 ప్రతిపాదనలు చేసింది.
1. ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగా పరిగణించి కేంద్రం సాయంతో రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవడం.
2. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం
3. హైదరాబాద్ రాజధానిగా రాయల తెలంగాణ
4. ప్రత్యేక తెలంగాణ, గుంటూరు, కర్నూలు, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని మండలాలను కలిపి హైదరాబాద్‌ను పెద్ద కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం
5. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
6.ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి రాజ్యాంగబద్ధ రక్షణ కల్పించడం రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచడం.
- 8వ అధ్యాయం బహిర్గతమై నిజామాబాద్ మాజీ ఎంపీ నారాయణరెడ్డి కోర్టులో కేసు వేశారు. 2011 మార్చి 23న హైకోర్టు న్యాయమూర్తి ఎల్.నర్సింహారెడ్డి 8వ అధ్యాయంలోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శల్లో బహిర్గతం చేయమని తీర్పు ఇచ్చారు.
- 2013 జూలై 30న హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించింది.
- 2013 ఆగస్టు 5న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైనట్లు పార్లమెంట్లో చిదంబరం ప్రకటించారు.
- 2013 ఆగస్టు 26న విభజన కమిటీ ఏర్పాటు చేశారు. ఎ.కె.ఆంటోని అధ్యక్షుడిగా, దిగ్విజయ్‌సింగ్, వీరప్పమొయిలి, అహ్మద్ పటేల్ సభ్యులుగా ఉన్నారు. 2013 అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించింది.
జీవోఎం ఏర్పాటు
- 2013 అక్టోబర్ 8న రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోని చైర్మన్‌గా కేంద్ర మంత్రులతో జీవోఎం ఏర్పాటైంది. సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, వీరప్పమొయిలి, జైరాం రమేష్, గులాంనబీ ఆజాద్ సభ్యులుగా ఉన్నారు.
- 2013 డిసెంబర్ 5న తెలంగాణ ముసాయిదా బిల్లు-2013ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
- 2013 డిసెంబర్ 12న బిల్లు రాష్ర్టానికి చేరింది. బిల్లుపై అభిప్రాయం తెలపటానికి రాష్ట్రపతి 6 వారాల సమయం ఇవ్వగా దానిపై డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క చర్చ ప్రారంభించారు. కాని ముఖ్యమంత్రి బిల్లుపై చర్చ మొదలు కాలేదని పేర్కొన్నారు.
- అక్బరుద్దీన్ (ఎంఐఎం నేత) అడిగిన ప్రశ్నకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ 2014 జనవరి 6న చర్చ ప్రారంభమైనట్లు ప్రకటించారు.
- 2014 జనవరి 8న బిల్లుపై రాష్ట్ర శాసనసభలో తొలి ప్రసంగం చేసిన ముఖ్యమంత్రి నిబంధన 77 కింద బిల్లును వెనక్కి పంపాలని స్పీకర్‌కు తీర్మాన నోటీసు ఇచ్చారు.
- రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పంపిన బిల్లుపై శాసనసభ అభిప్రాయాలు మాత్రమే తెలపాలి. కాని బిల్లును తిరస్కరించే, వెనక్కి పంపే అధికారం అసెంబ్లీకి లేదు.
- 2014 జనవరి 30న సభలో 87 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. మిగిలినవాళ్లు వాళ్ల అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇచ్చారు. దీంతో సభ్యుల అభిప్రాయం రికార్డు అయ్యింది. బిల్లుపై చర్చ ముగిసిందని ప్రకటించారు.
- రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును తిప్పి పంపటానికి ముఖ్యమంత్రి ఇచ్చిన 77 తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు.
- 2014 ఫిబ్రవరి 4న రాష్ట్ర అసెంబ్లీ పంపిన అభిప్రాయాలకు జీవోఎం ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరి 7న తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2014 ఫిబ్రవరి 9న బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరుకుంది.
- 2014 ఫిబ్రవరి 13న హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే రాష్ట్ర పునర్ విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును 2014 ఫిబ్రవరి 18న ఆమోదించారు. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టారు.
జీబీకే పబ్లికేషన్స్ హైదరాబాద్, 9959361278
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






