Telangana History | రేకపల్లి తిరుగుబాటు ఎవరి నాయకత్వంలో జరిగింది?
గతవారం తరువాయి..
368. కింది వాటిలో ఏ ఆలయాన్ని శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా పరిగణిస్తారు?
a) త్రిపురాంతకం b) ఉమామహేశ్వరం
c) అలంపురం d) సిద్ధవటం
జవాబు: (b)
వివరణ: త్రిపురాంతకం శ్రీశైలానికి తూర్పు ద్వారం. అలంపురం పశ్చిమద్వారం, సిద్ధవటం దక్షిణ ద్వారం.
369. భూదాన ఉద్యమం ప్రారంభానికి ముందు ఆచార్య వినోబా భావే 1951లో ఏ సమావేశం కోసం హైదరాబాద్ వచ్చారు?
a) సర్వోదయ b) గ్రామోదయ
c) స్వరాజ్య d) జాతీయ కాంగ్రెస్
జవాబు: (a)
వివరణ: సర్వోదయ సమావేశాల కోసం వినోబా శివరాంపల్లికి వచ్చారు. ఈ సందర్భంలోనే దేశంలో భూసమస్య పరిష్కారానికి భూదానం స్వీకరించే పద్ధతి బాగుంటుందని ఆలోచన చేశారు.
370. వినోబా భావేకు భూదాన ఉద్యమలో భాగంగా పోచంపల్లికి చెందిన భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి ఎన్ని ఎకరాల పొలం దానంగా ఇచ్చారు?
a) 1,000 ఎకరాలు b) 500 ఎకరాలు
c) 100 ఎకరాలు d) 200 ఎకరాలు
జవాబు: (c)
371. ‘తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు 50 వేల సైన్యం చేయని పనిని, ఒక బక్కచిక్కిన మనిషి చేస్తున్నారు’ అని వినోబా మీద ఎవరు వ్యాఖ్యానించారు?
a) బూర్గుల రామకృష్ణారావు
b) జవహర్లాల్ నెహ్రూ
c) సర్దార్ వల్లభాయ్ పటేల్
d) డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
జవాబు: (b)
372. భూదానోద్యమం ఏ సంవత్సరంలో మొదలైంది?
a) 1950 b) 1952
c) 1951 d) 1949
జవాబు: (c)
వివరణ: 1951 ఏప్రిల్‌లో భూదాన ఉద్యమానికి అంకురార్పణ జరిగింది.
373. వినోబా సవాలు మేరకు పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లాలో భూ సేకరణ చేపట్టి, పూర్తిచేసిన నాయకుడు ఎవరు?
a) బూర్గుల రామకృష్ణారావు
b) మందుముల నరసింగరావు
c) రాజా రామేశ్వరరావు
d) పల్లెర్ల హనుమంతరావు జవాబు: (d)
374. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలను ఎవరు ప్రారంభించారు?
a) వినోబా భావే
b) బూర్గుల రామకృష్ణారావు
c) జవహర్లాల్ నెహ్రూ
d) కొండా వెంకటరంగారెడ్డి జవాబు: (c)
375. మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు జిల్లాలను ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ‘ఆంధ్ర మహాసభ’ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
a) 1913 b) 1914
c) 1915 d) 1912
జవాబు: (a)
వివరణ: మొదటి ఆంధ్ర మహాసభ బాపట్లలో జరిగింది. దీనికి బయ్యా నరసింహేశ్వర శర్మ అధ్యక్షత వహించారు.
376. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ముందు హైదరాబాద్ రాష్ట్ర హోం మంత్రిగా ఎవరు ఉన్నారు?
a) శంకర రావ్ దేవ్
b) దిగంబర రావ్ గోవింద రావ్ బిందూ
c) కొండా వెంకటరంగారెడ్డి
d) శ్రీనివాసరావ్ అఖెలీకర్ జవాబు: (b)
వివరణ: హోంతోపాటు న్యాయ, పునరావాస శాఖలు కూడా దిగంబరరావ్ బిందూ చేతిలోనే ఉన్నాయి. శ్రీనివాసరావ్ అఖెలీకర్ డిప్యూటీ హోం మంత్రిగా ఉన్నారు.
377. 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్ (ఓరుగల్లు)ను ఆక్రమించుకున్న తర్వాత, ఆ నగరానికి ఏమని పేరుపెట్టాడు?
a) దౌలతాబాద్ b) సుల్తానాబాద్
c) సుల్తాన్పూర్ d) దౌలత్‌పూర్
జవాబు: (c)
378. కింది వారిలో ‘ద ట్రావెల్స్’ అనే రచన ఎవరిది?
a) ఇబన్బటూటా b) మార్కోపోలో
c) నికోలో కాంటి d) రాబర్ట్ స్యూయెల్
జవాబు: (b)
379. తూర్పు చాళుక్య రాజు దానార్ణవుని మాగల్లు (క్రీ.శ. 956) శాసనంలో ప్రస్తావించిన కాకతీయ పాలకుడు ఎవరు?
a) కాకర్త్య గుండన
b) కాకర్త్య వెన్నభూపతి
c) మొదటి బేతరాజు d) దుర్గరాజు
జవాబు: (a)
380. కాకర్త్య గుండన ఎవరి చేతిలో మరణించాడు?
a) దంతిదుర్గుడు
b) విరియాల ఎర్రభూపతి
c) చాళుక్య సోమేశ్వరుడు
d) మహాదేవుడు జవాబు: (b)
381. సామంత పాలన నుంచి స్వతంత్ర పాలకుడిగా ప్రకటించుకున్న తొలి కాకతీయ పాలకుడు?
a) మొదటి బేతరాజు
b) మొదటి ప్రోలరాజు
c) రెండో ప్రోలరాజు d) రుద్రదేవుడు
జవాబు: (d)
382. కుతుబ్‌షాహీల కాలానికి సంబంధించి ‘రిసాలా మిక్దరీయ’ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
a) మహమ్మద్ కులీకుతుబ్‌షా
b) మీర్ మహమ్మద్ మోమిన్ అస్ర్తాబాది
c) అమీర్ తబతబా అహ్సాన్
d) ఇబ్రహీం కుతుబ్‌షా జవాబు: (b)
383. అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో మహమ్మద్ సయ్యద్ మీర్‌జుమ్లా కర్ణాటక మీద దాడులు చేసినప్పుడు చంద్రగిరి పాలకుడు ఎవరు?
a) శ్రీరంగరాయలు
b) వెంకటపతిరాయలు
c) రఘునాథనాయకుడు
d) విశ్వనాథనాయకుడు జవాబు: (a)
384. ఎవరి కాలంలో కుతుబ్‌షాహీ రాజ్యం మొగలులకు సామంతరాజ్యంగా మారిపోయింది?
a) మహమ్మద్ కుతుబ్‌షా
b) అబుల్ హసన్ తానీషా
c) అబ్దుల్లా కుతుబ్‌షా
d) మహమ్మద్ కులీకుతుబ్‌షా
జవాబు: (c)
385. అబుల్ హసన్ తానీషా, శివాజీ మధ్య సంధి ఏ సంవత్సరంలో జరిగింది?
a) 1674 b) 1675
c) 1678 d) 1676
జవాబు: (d)
వివరణ: అక్కన్న, మాదన్న ప్రోద్బలంతో సంధి జరిగింది. అయితే సంధి షరతులను శివాజీ గౌరవించలేదు. దీంతో అక్కన్న, మాదన్న మీద సర్దారులు, సైన్యంలో వ్యతిరేకత ఏర్పడింది.
386. ఔరంగజేబ్ గోల్కొండ ఆక్రమణకు సంబంధించి కింది వివరాలను పరిశీలించండి.
1. ఔరంగజేబ్ గోల్కొండను 1685లో ఆక్రమించుకున్నాడు
2. మొగలులు అబ్దుల్లా పానికి లంచం ఇచ్చి కోట లోపలికి ప్రవేశించారు
3. అబ్దుల్ రజాక్ లారీ మొగలులతో వీరోచితంగా పోరాడాడు
పై వాటిలో సరైనవి?
a) 1, 2 b) 2, 3
c) 1, 2, 3 d) 1, 3
జవాబు: (b)
వివరణ: ఔరంగజేబ్ గోల్కొండను 1687లో ఆక్రమించుకున్నాడు.
387. అబుల్ హసన్ తానీషాను ఎక్కడ సమాధి చేశారు?
a) అహ్మద్‌నగర్ b) ఔరంగాబాద్
c) గోల్కొండ దగ్గర్లోని కుతుబ్‌షాహీ సమాధులు
d) ఖుల్దాబాద్ జవాబు: (d)
388. 1860లో రాంజీ గోండు తిరుగుబాటును అణచివేసి, ఆయనను బంధించిన బ్రిటిష్ అధికారి ఎవరు?
a) కల్నల్ రాబర్ట్ b) జాన్ నికల్సన్
c) హ్యూరోజ్ d) నీల్ మెకంజీ
జవాబు: (a)
389. 1879లో గొడ్డలి పన్నుకు వ్యతిరేకంగా ఏ గ్రామ ప్రజలు తిరుగుబాటు చేశారు?
a) భద్రాచలం b) రేకపల్లి
c) ఇల్లందు d) పాల్వంచ
జవాబు: (b)
390. రేకపల్లి తిరుగుబాటు ఎవరి నాయకత్వంలో జరిగింది?
a) కర్రు తమ్మన్నదొర b) కొర్ర మల్లయ్య
c) అంబుల్ రెడ్డి d) భూపతిదేవ్
జవాబు: (c)
391. కింది వాటిలో సరోజినీ నాయుడు రచన కానిది ఏది?
a) గోల్డెన్ త్రెషోల్డ్ b) ద బ్రోకెన్ వింగ్
c) ద బర్డ్ ఆఫ్ టైం d) కాబూలీవాలా
జవాబు: (d)
వివరణ: కాబూలీవాలా కథ రవీంద్రనాథ్ ఠాగూర్ రచన. కాగా ‘ద లేడీ ఆఫ్ ద లేక్’, ‘ద సెప్టర్డ్ ఫ్లూట్’ సరోజినీదేవి ఇతర రచనలు.
392. ఏ కుతుబ్‌షాహీ పాలకుడు రచించిన గీతాలను ‘కులీయత్ కులీ’ పేరుతో సంకలనం చేశారు?
a) కులీ కుతుబ్‌షా
b) జంషీద్ కులీకుతుబ్‌షా
c) ఇబ్రహీం కులీకుతుబ్‌షా
d) మహమ్మద్ కులీకుతుబ్‌షా
జవాబు: (d)
వివరణ: మహమ్మద్ కులీకుతుబ్‌షా ‘మాని’ అనే కలంపేరుతో రచనలు చేశాడు.
393. కుతుబ్‌షాహీల కాలపు రచనల్లో ‘మిజానుత్ తబాయి కుతుబ్‌షాహీ’ అనే గ్రంథం దేనికి సంబంధించింది?
a) వాస్తు శాస్త్రం b) జ్యోతిష్యం
c) వైద్యశాస్త్రం d) తూనికలు, కొలతలు
జవాబు: (c)
394. కుతుబ్‌షాహీల కాలంలో తూనికలు, కొలతల మీద మీర్ మహమ్మద్ మోమిన్ రచించిన పుస్తకం ఏది?
a) మిజానుత్ తబాయి కుతుబ్‌షాహీ
b) రిసాలా మిక్దరీయ
c) కులీయత్ కులీ d) తబఖాత్ ఎ నాసిరి
జవాబు: (b)
395. కాకతీయ రాజుల్లో ‘విక్రమచక్రి’ అనే బిరుదు ఎవరికి ఉంది?
a) రెండో బేతరాజు
b) మొదటి ప్రోలరాజు
c) మొదటి రుద్రదేవుడు
d) గణపతిదేవుడు జవాబు: (a)
396. మొదటి ప్రోలరాజుకు అనుమకొండ ‘విషయం’ను ఎవరు ప్రసాదించారు?
a) రాష్ట్రకూటరాజు మూడో కృష్ణుడు
b) కల్యాణి చాళుక్య సోమేశ్వరుడు
c) తూర్పు చాళుక్య దానార్ణవుడు
d) చోళరాజు మొదటి రాజేంద్రుడు
జవాబు: (b)
397. ఇబ్రహీం కులీకుతుబ్‌షా భాగమతి అనే హిందూ స్త్రీని పెండ్లి చేసుకున్నట్లు తెలుపుతున్న కావ్యం?
a) వైజయంతీ విలాసం
b) సుగ్రీవ విజయం
c) నిరంకుశోపాఖ్యానం
d) తపతీ సంవరణోపాఖ్యానం
జవాబు: (d)
వివరణ: తపతీ సంవరణోపాఖ్యానాన్ని రచించింది అద్దంకి గంగాధర కవి. ఈ కావ్యాన్ని ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితం ఇచ్చాడు.
398. కింది వాటిలో మహమ్మద్ కులీకుతుబ్‌షా కాలపు నిర్మాణం కానిది ఏది?
a) మక్కా మసీదు b) చార్మినార్
c) బాద్షాహీ ఆషుర్ ఖానా
d) దారుల్ షిఫా జవాబు: (a)
వివరణ: మక్కా మసీదు నిర్మాణం 1613లో మహమ్మద్ కుతుబ్‌షా కాలంలో మొదలైంది. దీని నిర్మాణం కోసం మక్కా నుంచి మట్టి, గంధం, మహమ్మద్ ప్రవక్త వెంట్రుక మొదలైన అవశేషాలను తెప్పించారు. దీన్ని మొగల్ చక్రవర్తి ఔరంగజేబు 1694లో పూర్తిచేశాడు. ఇది కుతుబ్‌షాహీ సామ్రాజ్యంలో అతిపెద్ద మసీదు.
399. కింది నిర్మాణాల్లో దేనికి ‘బైతుల్ అతీఖ్’ అనే మారుపేరు ఉంది?
a) చార్మినార్ b) బాద్షాహీ ఆషుర్ ఖానా
c) అమన్ మహల్ d) మక్కా మసీదు
జవాబు: (d)
400. రుద్రమదేవి నుంచి మందరం (మల్కాపురం) గ్రామాన్ని అగ్రహారంగా పొందిన శైవాచార్యుడు ఎవరు?
a) రామేశ్వర పండితుడు
b) విశ్వేశ్వర శంభు
c) పాల్కురికి సోమనాథుడు
d) మల్లికార్జున పండితారాధ్యుడు
జవాబు: (b)
401. అ(హ)నుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించిన కాకతీయ ప్రధానమంత్రి ఎవరు?
a) రేచర్ల రుద్రుడు
b) బెండపూడి అన్నయ మంత్రి
c) వెల్లంకి గంగాధరుడు
d) యుగంధర మంత్రి జవాబు: (c)
వివరణ: వెల్లంకి గంగాధరుడు మొదటి రుద్రదేవుడి దగ్గర ప్రధానమంత్రి.
402. కాకతీయుల కాలానికి సంబంధించి కింది పదాలను పరిశీలించండి.
1. నకరం: వర్తక సంఘం
2. మహాజనులు: వైశ్యుల కుల సంస్థ (సమయం)
3. కాంపులు: పంటకాపుల సంఘం
4. బలింజ సెట్టులు: అన్ని వర్గాల ప్రజల వర్తక సంఘం
పై వాటిలో సరికాని జతలు ఎన్ని?
a) 2 b) 1 c) 4 d) 3
జవాబు: (a)
వివరణ: మహాజనులు అంటే బ్రాహ్మణుల కులసంస్థ (సమయం, సంఘం).
403. మీర్ ఆలం చెరువు నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించిన ఇంజినీరు ఎవరు?
a) హెన్రీ రస్సెల్ b) విలియం పామర్
c) సర్ ఆర్థర్ కాటన్ d) అలీ నవాజ్ జంగ్
జవాబు: (a)
వివరణ: మీర్ ఆలం చెరువును మీర్ ఆలం ఖాన్ బహదూర్ నిర్మించాడు.
404. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనా కాలానికి సంబంధించి ‘జిరత్’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
a) ఆర్థిక శాఖ b) విద్యా శాఖ
c) వ్యవసాయ శాఖ d) శాంతిభద్రతలు
వివరణ: (c)
వివరణ: నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1913లో ‘జిరత్’ పేరుతో వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. దీనికి జాన్ హెన్రీని పర్యవేక్షణ అధికారిగా నియమించాడు.
405. హైదరాబాద్ నగర పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కింది సంస్థలు, సంవత్సరాలను జతపరచండి.
A. జిందా తిలిస్మాత్ 1. 1925
B. చార్మినార్ సిగరెట్ 2. 1930
C. వజీర్ సుల్తాన్ టొబాకో 3. 1942
D. ఆల్విన్ మెటల్ ఇండస్ట్రీస్ 4. 1920
a) A-1, B-2, C-3, D-4
b) A-4, B-1, C-2, D-3
c) A-4, B-2, C-1, D-3
d) A-2, B-1, C-3, D-4
జవాబు: (b)
406. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ను ఎప్పుడు స్థాపించారు?
a) 1914 b) 1924
c) 1935 d) 1941
జవాబు: (d)
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు