Telangana History | సైనిక సహకారం.. నిజాం అలీఖాన్ అంగీకారం
అసఫ్జాహీలు
- భారతదేశ చరిత్రలో నిజాం రాజ్యస్థాపన ఒక కీలకమైన ఘట్టం అని చరిత్రకారుల అభిప్రాయం.
- వీరు దాదాపు 2 శతాబ్దాలపాటు (1724-1948) 224 సంవత్సరాలు పరిపాలించారు. దక్కన్ ప్రాంతాన్ని ఐక్యం చేసి పాలించారు.
- నిజాం వంశీయులు తాము తొలి ఖలీఫా అయిన అయి-లూకార్ సంతతివారమని ప్రకటించుకున్నారు.
- అసఫ్జాహీలు టర్కీలోని తురాని వంశానికి చెందినవారు.
- అసఫ్జాహి రాజ్య స్థాపకుడు నిజాం ఉల్‌ముల్క్ (మీర్ కమ్రుద్దీన్ ఖాన్)
- నిజాం ఉల్-ముల్క్ తాతపేరు అలుత్ఖాన్ ఇతడు షాజహాన్ కొలువులో ఉద్యోగం పొందాడు.
- నిజాం ఉల్ ముల్క్ తండ్రిపేరు- షాబుద్దిన్ ఖాన్ ఇతడు ఔరంగజేబు కొలువులో ఉద్యోగం పొందాడు.
- నిజాం ఉల్ ముల్క్ 1671లో ఆగ్రాలో జన్మించాడు.
- ఇతడు (మీర్ కమ్రుద్దీన్ ఖాన్) 1687లో కుతుబ్‌షాహీ రాజ్యాన్ని లేదా గోల్కొండ రాజ్యాన్ని మొగల్ రాజ్యంలో కలుపుటకు ఔరంగజేబుకు సహకరించి, ఔరంగజేబు నుంచి చిన్ ఖిల్ ఇచ్ ఖాన్ అనే బిరుదును పొందాడు.
- చిన్ ఖిల్ ఇచ్ ఖాన్ అంటే కర్ర కత్తి సాము వీరుడు అని అర్థం.
- మీర్ కమ్రుద్దిన్ ఖాన్ తన రాజకీయ జీవితాన్ని 1690లో ఔరంగజేబు కాలంలో 4000 గుర్రాలకు మున్సబ్దార్గా ప్రారంభించాడు.
- బహదూర్ షా కాలంలో అయోధ్యకు సుబేదార్ అయ్యాడు (1717)
- మీర్ ఫరూఖ్షియార్- 1713లో దక్కన్కు మీర్ కమ్రుద్దీన్ఖాన్ను – సుబేదారుగా చేసి 7000 ‘మన్సబ్దారులకు’ అధిపతిని చేశాడు.
- ఫరూఖ్షియార్ మీర్ కమ్రుద్దీన్ ఖాన్‌కు ఫతేసింగ్, నిజాం ఉల్‌ముల్క్ అనే బిరుదు లిచ్చాడు.
- 1715లో దక్కన్ నుంచి ముషీరాబాద్‌కు నిజాం ఉల్ ముల్క్‌ను బదిలీ చేశారు.
- మహ్మద్ షా రంగేలి- నిజాం ఉల్ ముల్క్కు అసఫ్‌జా బిరుదును ఇచ్చాడు.
- ఢిల్లీ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన సయ్యద్ సోదరులను అంతం చేయడానికి మొగల్ చక్రవర్తి రంగేలికి నిజాం ఉల్ ముల్క్ సహాయం అందించాడు.
- దీనితో రంగేలి 8000 మున్సబ్‌దారులకు అధిపతిని చేసి అసఫ్జాని పిలిచారు.
- అందుకే నిజాం వంశీయులను అసఫ్జాహీలు అంటారు.
- 1720-22 వరకు నిజాం ఉల్‌ముల్క్ 2వసారి దక్కన్కు గవర్నర్‌గా పనిచేశాడు.
- 1722-24 మధ్యకాలంలో మొగల్ సామ్రాజ్య ప్రధాన మంత్రిగా పనిచేసాడు
- మహ్మద్ షా రంగేలి మద్యానికి, మగువలకు బానిస అయ్యాడు. పాలనను గాలికి వదిలేశాడు. ఈ విషయాన్ని గమనించిన బహరున్ -ఉల్-ముల్క్ 1722లో ‘పైరాజాబాద్’ రాజధానిగా అవద్ రాజ్యాన్ని స్థాపించాడు.
- నిజాం-ఉల్-ముల్క్ ఔరంగాబాద్ రాజధానిగా అసఫ్‌జాహీ నిజాం రాజ్యాన్ని స్థాపించాడు (1724).
- 1724లో ముబారిజ్‌ఖాన్‌ను – షిక్కార్ ఖేడ్ యుద్ధంలో ఓడించి అసఫ్‌జాహీ వంశానికి అంకురార్పణ చేశాడు.
- నిజాం-ఉల్-ముల్క్ 1724 జూలై 31న సింహసనాన్నిఅదిష్టించాడు.
- తాను రాజైనా కూడా – నేను దక్కన్ సుబేదారును మాత్రమే అని మొగల్ల పేరుతో మరాఠీలపై యుద్ధాలు చేసి ఓటమిపాలయ్యాడు. (1728-1738) అవి.
- 1728-పాల్కేడ్ ఈ యుద్ధంలో ఓడి మరాఠిలతో ముసిగావ్ సంధి చేసుకున్నాడు.
- ఈ సంధి ప్రకారం 4వ వంతు చౌతు, 1/10 వంతు సర్ఫేస్ఖాస్ పన్నులను చెల్లించటానికి ఒప్పకున్నాడు.
- 1738-భోపాల్ యుద్ధంలో ఓడి ‘దురాయి సరాయి’ సంధి చేసుకున్నాడు.
- తన కుమారుడు నాజర్‌జంగ్ దాడి చేయగా, ఆ దాడిని తిప్పి కొట్టాడు.
- ఇతని కలంపేరు -షాబీర్ (నిజాం-ఉల్-ముల్క్)
- 1789లో కర్నాల్ యుద్ధంలో పర్షియారాజు -నాదిర్ష చేతిలో ఓడి మహమ్మద్ షా రంగేలి ఢిల్లీ వదిలి పారిపోయాడు. దీనితో మహ్మద్ షా రంగేలిని రక్షించటానికి నిజాం ఉల్ ముల్క్ ఢిల్లీ వెళ్లాడు .
- నాదిర్షాకు, మహ్మద్‌షా రంగేలి మధ్య ఒప్పందాన్ని కుదిర్చాడు. ఈ ఒప్పందం ప్రకారం – కోహినూర్ వజ్రం నెమలి సింహాసనం నాదిర్షాకు ఇచ్చాడని ట్రావర్నియార్ ఆనే ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి పేర్కొన్నాడు.
- 1748లో అఫ్గాన్ పాలకుడు అహ్మద్ షాఅబ్దాలోని దాడిని రంగేలి ఎదుర్కొన్నాడు. ఈ దాడి సమయంలో రంగేలిని రక్షించడానికి నిజాం ఉల్ ముల్క్- ఢిల్లీకి బయలుదేరి బుహరాన్పూర్ వద్ద అనారోగ్యం పాలై మరణించాడు.
నాజర్‌జంగ్
- 1748లో నిజాం -ఉల్-ముల్క్ మరణం తర్వాత అతని కుమారుడైన నాజర్‌జంగ్ రాజు అయ్యాడు
- ఇతడికి మొగల్ చక్రవర్తి నిజాం-ఉద్-దౌలా అనే బిరుదును ఇచ్చాడు.
- ఇతడికి తన మేనల్లుడు అయినా ముజఫర్ జంగ్‌తో యుద్దం ప్రారంభమైంది. ఈ ఘర్షణలో ఆంగ్లేయులు నాజర్ జంగ్కు మద్దతు ఇవ్వగా ఫ్రెంచ్‌వారు ముజఫర్‌జంగ్‌ను సమర్థించారు. ఇది ఆంగ్లేయులకు, ఫ్రెంచ్‌వారికి మధ్య 2వ కర్ణాటక యుద్ధానికి దారితీసింది.
- ముజఫర్ జంగ్‌ను ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే కడప కర్నూల్ మధ్య ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హిమయత్ ఖాన్ సహకరించారు.
- హిమయత్ ఖాన్ నాజర్ జంగ్‌ను డిండి అనే ప్రాంతంలో 1950 డిసెంబర్ 10న హత్య చేశాడు.
ముజఫర్ జంగ్ (1750-51)
- ఫ్రెంచ్ వారి మద్దతులో ముజఫర్ జంగ్ హైదరాబాద్ సింహసనాన్ని అధిష్టించాడు.
- ఫ్రెంచ్ వారి సమయంతో అధికారంలోనికి వచ్చిన ముజఫర్ జంగ్ ఫ్రెంచ్ గవర్నర్ అయిన డూప్లేకు- డూప్జంగ్, జాఫర్ జంగ్ బిరుదులు ఇచ్చాడు.
- డూప్లే భార్యకు జహనారా బేగం బిరుదును ఇచ్చాడు.
- కర్నూల్ నవాబు- హిమయత్ ఖాన్ తనకు కూడా నజరానాలు ఇవ్వమని ముజఫర్ జంగ్‌ను అడిగాడు. దీనికి ముజఫర్ జంగ్ తిరస్కరించాడు. దీనితో హిమయత్ ఖాన్ కడప జిల్లాలోని రాయిచోటికి సమీపంలోని లక్కిరెడ్డిపల్లి వద్ద ముజఫర్‌జంగ్‌ను హత్య చేశాడు.
- దీనితో అతని 40 రోజుల పాలన అంతమైంది.
సలాబత్ జంగ్
- ముజఫర్ జంగ్ తర్వాత నిజాం ఉల్ ముల్క్ మరొక కుమారుడైన సలాబత్‌జంగ్ ఫ్రెంచ్ సేనాని బుస్సీ సహకారంతో సలాబత్ జంగ్ అధికారంలోకి వచ్చాడు.
- దీనికి ప్రతిఫలంగా సలాబత్ జంగ్ ఫ్రెంచ్ వారికి 2 లక్షల రూపాయలు ఇచ్చాడు
- ఔరంగాబాద్ సంధి ప్రకారం సలాబత్ జంగ్ ఉత్తర సర్కారులు అయిన
1) శ్రీకాకుళం 2) రాజమండ్రి
3) ఏలూరు
4) గుంటూరు ఫ్రెంచి వారికి ఇచ్చాడు. - ఉత్తర సర్కారులను ఫ్రెంచి వారికి ఇవ్వడంతో అనేక మంది జమీందార్లు తిరుగుబాట్లు ప్రారంభించారు.
- శ్రీకాకుళం జమీందార్ ఇబ్రహింఖాన్ తిరుగుబాటు చేయగా ఫ్రెంచ్ వారు ఇతడిని తుమ్మలపాలెం యుద్ధంలో ఓడించారు. (1757)
- విజయనగర జమీందారు అయిన రంగరాజును 1757 జూన్ 24న బొబ్బిలి యుద్ధంలో గజపతి ద్రోహంతో ఓడించాడు. దీనితో రంగారావు బావమరిది తాండ్రపాపరాయుడు విజయనగర గజపతిరాజును హత్యచేసి బొబ్బిలి పులిగా మారాడు.
- 1758లోబ్రిటిష్ సేనాని అయిన కర్నాల్ వోల్ట్, ఫ్రెంచ్ సేనాని కన్ ప్లాక్స్ మధ్య జరిగిన చందుర్తి యుద్ధంలో కన్ప్లాక్స్ ఓడిపోవడంతో ఫ్రెంచ్ ఆధిపత్యం అంతం అయ్యింది.
- దీనికి ప్రధాన కారణం సమర్ధుడు అయిన బుస్సీని వేరే ప్రాంతానికి బదిలి చేయటం.
- 1759 కోద్దురు/ కొండూరు యుద్ధంలో ఫ్రెంచి వారిని పూర్తిగా ఓడించి తరిమివేశాడు.
- 1759లో మే 14 నా సలాబత్‌జంగ్ ఫ్రెంచ్‌వారి స్నేహంను వదిలి బ్రిటిష్ వారితో స్పేహం చేశాడు.
- సలాబత్ జంగ్ తనను వ్యతిరేఖించిన సోదరులను దౌలతాబాద్ కోటలో బంధించాడు.
- కానీ తర్వాత నిజాం అలీఖాన్ బీదర్‌కు సుబేదార్ అయ్యాడు.
- చివరికి 1762లో సలాబత్‌జంగ్‌ను ‘బీదర్ కోటలో’ బంధించి, తర్వాత హత్యచేసి నిజాం అలీఖాన్ రాజు అయ్యాడు.
నిజాం అలీఖాన్
- 2వ అసఫ్‌జా. 2వ నిజాం. ఇతను అధికారికంగా నిజాం అనే బిరుదును తీసుకున్న తొలిపాలకుడు. ఇతడు తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైద్రాబాద్‌కు మార్చాడు.
- హిందువు అయిన విఠాల్ సుందర్‌ను తన ప్రధాన మంత్రిగా నియమించుకున్నాడు.
- ఉత్తర సర్కార్లను బ్రిటిష్‌వారి నుంచి తిరిగి తీసుకున్నాడు. దీనితో బ్రిటిష్‌వారు జనరల ైక్లెమాండ్, జనరల్ స్మిత్‌లను నిజాం వద్దకు పంపారు. వీరిద్దరు మధ్య దుబాసిగా (మధ్యవర్తిగా) వెళ్లిన వ్యక్తి ‘కాండ్రోగులా జోగి పంతులు’.
- కాండ్రోగులా జోగి పంతులు మధ్యవర్తిత్వం వల్ల నిజాం అలిఖాన్ 4 ఉత్తర సర్కారులను ఆంగ్లేయులకు ఇచ్చాడు.
- 1782 వరకు గుంటూరును ఆంగ్లేయులకు ఇవ్వలేదు.
- 1790లో నిజాం అలీఖాన్, ఆంగ్లేయులు, మరాఠీలు కలిసి మైసూర్ పాలకుడైనా టిప్పు సుల్తాన్‌ను ఓడించాడు. (3వ మైసూర్ యుద్ధంలో) దీనితో 1792లో శ్రీరంగ పట్నం సంధి చేసుకున్నారు.
- లార్డ్ వెల్లెస్లీ- 1798లో సైన్య సహకార వ్యవస్థను (మే 17) ప్రవేశ పెట్టాడు.
- ఈ సైన్య సహకార వ్యవస్థకు ఒప్పుకున్న మొదటి స్వదేశీరాజు ‘నిజాం అలీఖాన్’ ఈ ఒప్పందం ప్రకారం కడప కర్నూల్, అనంతపురం, బళ్లారి వంటి దత్తమండలాలు/ సిడెప్ జిల్లాలను బ్రిటిష్ వారికి ఇచ్చాడు. ఇతని కాలంలో ఫ్రెంచ్ దేశానికి చెందిన ముసియర్ రేమాండ్ వచ్చాడు.
- ఇతని సమాధి మలక్‌పేటలో ఉంది.
- రేమాండ్ సహకారంతో ఫతే మైదానంలో ‘గన్‌ఫౌండ్రి అనే తుపాకులు, ఫిరంగులు, మందుగుండు సామాగ్రిని తయారు చేసే ఒక కర్మాగారాన్ని కట్టించాడు.
- నిజాం అలీఖాన్ కాలంలో 1803 రెసిడెన్సి భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని శామ్యూల్- ఖైరున్నిసా కోసం నిర్మించాడు.
నిజాం అలీ నిర్మాణాలు
1. మోతీ మహర్
2. గుల్సాన్ మహల్ 3. రోషన్ మహల్
సికిందర్జా
- నిజాం అలీకుమారుడు
- సికిందర్జా 3వ అసఫ్‌జా అనే బిరుదుతో రాజ్యానికి వచ్చాడు.
- 3వ నిజాం అయిన ఇతని పేరు మీదగానే సికిందరాబాద్ ఏర్పడింది.
- ఇతని పెస్కార్ ‘చందూలాల్’బ్రిటన్ వారి చేతిలో కీలుబొమ్మగా మారాడు.
- చందూలాల్ కర్నూల్లోని అహోబిలం దేవాలయాన్ని పునరుద్ధరించాడు.
- బ్రిటిష్‌వారు తమకు అనుకూలమైన మీర్ ఆలంను దివాన్‌గా నియమించారు.
- మీర్ ఆలం హైదరాబాద్‌లో మీర్ ఆలం చెరువును తవ్వించాడు.
- ఇతని ఆస్థానానికి హెన్రీ రస్సెల్ అనే అధికారి వచ్చాడు. ఇతడు హైదరాబాద్ సంస్థానం రక్షించడం కోసం హెన్సీ రస్సెల్ దళాన్ని స్థాపించాడు. ఇతని సైన్యాన్ని హైదరాబాద్ కాంటిన్జెన్సీ సైన్యం అంటారు
- ఈ హెన్రీ రస్సల్ సైన్యానికి అయ్యే ఖర్చును ‘సికిందర్ జా ’భరించాలి.
- దీనితో సికిందర్జా పాలిమర్ అండ్ కో కంపెనీ దగ్గర 60 లక్షల అప్పు చేశాడు.
- ఈ సమయంలో హెన్రీ రస్సెల్ స్థానంలో చార్లెస్ మెట్కాఫ్ వచ్చాడు. ఇతడు 60 లక్షల రుపాయల అప్పును పాలిమార్ కంపెనీకి చెల్లిస్తాను. తాము ఉత్తర సర్కారులకు కట్టవలసిన రూ. 9 లక్షల రద్దు చేయమన్నాడు.
ఆంజనేయులు
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
Previous article
REC LIMITED | అర్ఈసీ లిమిటెడ్‌లో 125 పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు