తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆధునిక శతకకర్తలు
కపిలవాయి లింగమూర్తి
– ఈయన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట సమీపంలోని జిన్నుకుంటలో 1928, మార్చి 31న జన్మించారు. తల్లిదండ్రులు మాణిక్యమ్మ, వెంకటాచలం. ఈయన రాసిన శతకాలు – ఆర్యా శతకం, తిరుమలేశ శతకం, దుర్గాభర్గ శతకం, పండరినాథ విఠల శతకం, పరమహంస శతకం.
– ఇతర రచనలు – చక్రతీర్థ మహాత్మ్యం, పాలమూరు జిల్లా దేవాలయాలు, ఛత్రపతి, గద్వాల హనుద్వచనాలు, సౌర శిఖరం, పద్యకథా పరిమళం మొదలైనవి.
– బిరుదులు – కవితా కళానిధి, పరిశోధన పంచానన, గురు శిరోమణి, వేదాంత విశారద, సాహితీ విరాన్మూర్తి మొదలైనవి.
కూరెళ్ల విఠలాచార్య
– ఈయన 1938, జూలై 9న నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, వెంకట రాజయ్య. స్వస్థలం వెల్లంకి గ్రామం. ఈయన రాసిన విఠలేశ్వర శతకం సాహితీలోకంలో చాలా ప్రసిద్ధిగాంచింది.
– ఇతర రచనలు – జీవన వేదం, ఆత్మదర్శనం, అమరవాక్సుధా స్రవంతి మొదలైనవి.
పండిత రామసింహ కవి
– ఈయన 1855-1963 మధ్య జీవించారు. జన్మస్థలం కరీంనగర్ జిల్లా. ఈయన శతకం – విశ్వకర్మ శతకం.
ఉత్పల సత్యనారాయణాచార్య
– ఈయన ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలో 1927, జూలై 4న జన్మించారు. 2007, అక్టోబర్ 23న హైదరాబాద్‌లో మరణించారు. ఈయన రాసిన శతకం – ఉత్పలమాల శతకం.
– ఇతర రచనలు – ఈ జంట నగరాలు హేమంత శిఖరాలు, గజేంద్రమోక్షం, భ్రమర గీతం, గోపీ గీతం, రాజమాత, వేణు గీతం, యశోదనంద, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైనవి.
– శ్రీకృష్ణ చంద్రోదయానికి 2003లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
గౌరీభట్ల రఘురామ శాస్త్రి
– ఈయన మెదక్ జిల్లా రిమ్మనగూడలో 1929, ఏప్రిల్ 22న జన్మించారు. 2004, ఫిబ్రవరి 4న మరణించారు. ఈయన శతకం – శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక.
– ఇతర రచనలు – వ్యాస తాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణదాస చరిత్రం, శివపద మణిమాల, భావానందస్వామి చరిత్ర మొదలైనవి.
అందె వెంకటరాజం
– కరీంనగర్ జిల్లా కోరుట్లలో 1933, అక్టోబర్ 14న జన్మించారు. 2006, సెప్టెంబర్ 11న మరణించారు. ఈయన శతకాలు – నింబగిరి శతకం, ఈశ్వర శతకం.
– వానమామలై వరదాచార్యుల కృతులు-అనుశీలన అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశారు.
-బిరుదులు – కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన మొదలైనవి.
ఇమ్మడిజెట్టి చంద్రయ్య
– మహబూబ్‌నగర్ జిల్లా తాళ్లపల్లి గ్రామంలో 1934, మార్చి 31న జన్మించారు. 2001 మార్చి 1న మరణించారు. ఈయన రాసిన శతకాలు – చంద్రమౌళీశ్వర శతకం, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వేంకటేశ్వర శతకం.
– ఇతర రచనలు – హనుమద్రమ సంగ్రామం, భక్త సిరియాళ, వీరబ్రహ్మేంద్ర విలాసం, శ్రీ శిరీష నగగండికా మహాత్మ్యం, కర్పరాద్రి మహాత్మ్యం మొదలైనవి.
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ
– మెదక్ జిల్లా పోతారెడ్డిపేట గ్రామంలో జన్మించారు. ఈయన 1934-2011 మధ్య కాలంలో జీవించారు. 300లకు పైగా అష్టావధానాలు చేసి అవధాన శశాంక, ఆశు కవితాకేసరి అనే బిరుదులు పొందారు. ఈయన రాసిన శతకం – విశ్వనాథేశ్వర శతకం.
– ఇతర రచనలు – కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరీ స్తుతి మొదలైనవి.
నంబి శ్రీధరరావు
-నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో 1934లో జన్మించారు. 2000లో మరణించారు. ఈయన రాసిన శతకాలు – శ్రీలొంక రామేశ్వర శతకం, శ్రీమన్నింబగిరి నరసింహ శతకం. ఈయనకు గల బిరుదు కవిరాజు.
గడిగె భీమకవి
– రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట గ్రామంలో 1920, జనవరి 14న జన్మించారు. 2010, ఏప్రిల్ 3న మరణించారు. ఈయన రాసిన శతకం – వేణుగోపాల శతకం.
కౌకుంట్ల నారాయణరావు
– రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామంలో 1883లో జన్మించారు. 1953లో మరణించారు. ఈయన రాసిన ప్రభు తనయ శతకం చాలా ప్రసిద్ధి చెందింది.
శిరశినగల్ కృష్ణమాచార్యులు
– నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో 1905, ఆగస్టు 13న జన్మించారు. 1992, ఏప్రిల్ 15న మరణించారు. ఈయన రాసిన శతకం – గాంధీతాత శతకం.
– ఇతర రచనలు – కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్రా ప్రబంధం, రత్నమాల మొదలైనవి.
– నైజాం రాష్ట్ర ఆద్య శతావధానిగా ప్రసిద్ధిగాంచారు. అభినవ కాళిదాసు అనే బిరుదు పొందారు.
సూరోజు బాల నరసింహాచారి
-నల్లగొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామంలో 1946, మే 9న జన్మించారు. 2014, ఫిబ్రవరి 2న మరణించారు. ఈయన రాసిన శతకాలు – బాలనృసింహ శతకం, మహేశ్వర శతకం.
– ఇతర రచనలు – కవితాకేతనం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర మొదలైనవి. సహజకవిగా ప్రసిద్ధుడు.
రావికంటి రామయ్య గుప్త
-కరీంనగర్ జిల్లా మంథనిలో 1936, జూన్ 17న జన్మించారు. 2009, మార్చి 30న మరణించారు. ఈయన రాసిన శతకాలు – నగ్నసత్యాలు శతకం, గౌతమేశ్వర శతకం.
-ఇతర రచనలు – గీతామృతం, వరదగోదావరి.
– వరకవి పేరిట మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు. ఈయనకు కవిరత్న అనే బిరుదు ఉంది.
ఆడెపు చంద్రమౌళి
– వరంగల్‌కు చెందిన ఈయన 1939, ఏప్రిల్ 7న జన్మించారు. 2009, సెప్టెంబర్ 28న మరణించారు. ఈయన రాసిన శతకాలు – శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం, వేములవాడ రాజరాజేశ్వర శతకం. ఈయన రాసిన పద్యకావ్యం – రామాయణ రమణీయం.
– ఈయనకు కవిశశాంక అనే బిరుదు ఉంది.
ధూపాటి సంపత్ కుమారాచార్య
– ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన రాసిన శతకం శ్రీ యాదగిరి లక్ష్మీనారసింహ శతకం.
ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు
– నల్లగొండ జిల్లా మునగాల మండలం నరసింహపురం గ్రామంలో 1936, ఏప్రిల్ 11న జన్మించారు. 2011, జనవరి 9న మరణించారు. ఈయన శతకాలు యాదగిరి లక్ష్మీనరసింహ శతకం, శ్రీ వేంకటేశ్వర శతకం.
– ఇతర రచనలు – గోదాదేవి, గోదావరి, సత్యవతీస్వాంతం, మారుతి మొదలైనవి.
– విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందారు.
వెంకటరావు పంతులు
– రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో 1937, ఫిబ్రవరి 3న జన్మించారు. 1994, ఆగస్టు 26న మరణించారు. ఈయన రాసిన శతకం – శ్రీబాక వరాంజనేయ శతకం.
సమ్మెట గోపాలకృష్ణ
-నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో 1937, మార్చి 2న జన్మించారు. తల్లిదండ్రులు రాములమ్మ, చంద్రయ్య. ఈయన రాసిన శతకాలు – కృష్ణ శతకం, సమ్మెట పలుకులు, ఆర్య శతకం, కాలధర్మాలు, సీస పద్యమాలిక. ఇతర రచన – మావూరు-నాడు నేడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు