Indian History | ఆంగ్లేయుల అణచివేత – సడలని స్వతంత్ర దీక్ష
గదర్‌పార్టీ
- గదర్పార్టీని 1913 శాన్ఫ్రాన్సిస్కోలో లాలా హరిదయాల్, సోహాన్‌సింగ్, బన్నా స్థాపించారు.
- నినాదం – ఆంగ్రేజి-క-దుష్మన్
- ఈ పార్టీలో చేరిన ఏకైక హిందువు దర్షి చంద్రయ్య
ముస్లింలీగ్ పార్టీ
- 1906 ముస్లింలీగ్ పార్టీని బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నవాబుల్లా ఖాన్, షోయబుల్లా ఖాన్లు స్థాపించారు.
- దీని మొదటి సమావేశం 1908లో అమృత్‌సర్‌లో అఘఖాన్ 3 అధ్యక్షతన జరిగింది.
- పాకిస్థాన్ అనే పదాన్ని మొదటిసారి వాడిన పంజాబ్ ముస్లిం యువకుడు -రహమత్ అలీఖాన్.
- పాకిస్థాన్ గురించి మొదట ప్రసంగించి, కవిత్వాన్ని రాసిన వ్యక్తి – మహ్మద్ ఇక్బాల్ (ఉర్దూ కవి) సారే జహాసే అచ్ఛా
- ప్రత్యేక పాకిస్థాన్ కోసం పోరాడిన పార్టీ – ముస్లింలీగ్
- ప్రత్యేక పాకిస్థాన్ చర్యదినం 1946 ఆగస్టు 16
- పాకిస్థాన్ జాతిపిత – మహ్మద్ఆలీజిన్నా(పాకిస్థాన్ ఏకైక గవర్నర్)
గాంధీయుగం (1919-1947)
- మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్బందర్లో జన్మించారు.
- తల్లి పుత్లీబాయి, తండ్రి కరమ్ చంద్ గాంధీ
- గాంధీకి ఇంగ్లండ్ వెళ్లి లా చదవమని చెప్పిన వ్యక్తి మాండిదావే
- గాంధీతో 3 ప్రమాణాలు చేయించినది బేచర్డే స్వామి
- గాంధీకి ఇంగ్లండ్ వెళ్లడానికి ఆర్థికంగా సహకరించిన జైన సన్యాసి రుషభానంద స్వామి
- ఇంగ్లండ్‌లో గాంధీకి వసతి కల్పించినది ప్రాంజిమన్ మెహతా.
- 1883లో తన 13వ ఏట కస్తూర్బా గాంధీని వివాహం చేసుకున్నాడు.
- బాల్య వివాహం గురించి తన ఆత్మకథ అయిన ‘My Experiment with Truth’ లో వర్ణించాడు.
- గాంధీని ప్రభావితం చేసిన వ్యక్తులు
1) లియోటాల్‌స్టాయ్ 2) జాన్ రస్కిన్
3) గోర్కి 4) హెన్నీ డెవిడ్ థోరో
బిరుదులు-ఇచ్చినవారు - జాతిపిత – సుభాష్ చంద్రబోస్
- మహాత్మా – రవీంద్రనాథ్ ఠాగూర్
(విశ్వకవి -గాంధీ) - బాపూజీ -నెహ్రూ
- అర్ధనగ్న ఫకీర్ – విన్స్టన్ చర్చిల్
- పత్రికలు : ఇండియన్ ఒపీనియన్ 1903 దక్షిణాఫ్రికా, యంగ్ ఇండియన్, నవజీవన్, హరిజన్
- పుస్తకాలు : 1) హిందూ స్వరాజ్, 2) సత్యాగ్రహ, 3) సర్వోదయ
కుమారులు : హరిలాల్, మణిలాల్, రామ్‌దాస్, హరి దేవదాస్
ఆశయాలు: దక్షిణాఫ్రికాలోని జోహోన్నెస్బర్గ్లో టాయ్స్టాల్ ఫార్మ్, - దర్బన్ -Pomx
- గుజరాత్ – సబర్మతి -1916
- ఎంహెచ్లోని వార్ధా – సేవాగ్రామ్
- ఇతని రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే (కమర్షియల్ కీపర్)
- ఆధ్యాత్మిక గురువు – టాయ్స్టాయ్
షిష్యులు: 1) మీరాబెన్ 2) సరళబెన్ 3) అనసూయ బెన్ - 1915 జాన్ 9న గోఖలే సూచన మేరకు, భారతదేశానికి వచ్చారు.
- ఆరోజును ప్రవాస భారతీయ దినంగా జరుపుకొంటారు
- సబర్మతి ఆశ్రమాన్ని 1916లో నిర్మించారు.
1915-16 హోంరూల్ ఉద్యమం
- హోంరూల్ అనే పదాన్ని ఇంగ్లండ్ నుంచి స్వీకరించారు.
- హోంరూల్ లీగ్‌ను స్థాపించింది తిలక్
- హోంరూల్ ఉద్యమాన్ని స్థాపించింది అనీబిసెంట్
హోంరూల్ ఉద్యమ లక్ష్యాలు
1) స్వపరిపాలన
2) వెంటనే భారతీయులకు స్వయం ప్రతిపత్తి కల్పించటం
3) మాతృభాషలో విద్యాబోధన
4) భారతీయులకు ఉన్నత పదవులు కల్పించటం
చంపారన్ ఉద్యమం (1917)
- గాంధీ ప్రారంభించిన మొదటి ఉద్యమం
- ఈ ఉద్యమం బీహార్‌లో నీలిమందు పండించే రైతుల కష్టాలు తీన్ కతియార్ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగింది.
- బ్రిటిష్‌వారు 3/20 వంతు భూమిలో నీలిమందును పండించమని ఒత్తిడి చేశారు.
- అప్పుడు చంపారన్ ప్రజలు- రాజ్‌శుక్లా నాయకత్వంలో ఉద్యమం చేశారు.
- రాజ్‌శుక్లా సూచన మేరకు గాంధీ ఉద్యమం చేసి రైతులకు న్యాయం చేశారు.
- దీన్ని నీలి విప్లవం అంటారు.
ఖేడా/ ఖైరా ఉద్యమం (1918)
- గుజరాత్‌లోని ఖేడా ప్రాంతంలో 1/3వంతు ఉన్న పన్నును 1/2కి పెంచారు.
- దీంతో గాంధీ ఆ రైతుల తరఫున పోరాడి ఆ సంవత్సరం పన్నులను పూర్తిగా రద్దు చేయించారు.
- గాంధీకి సహకరించినవారు సర్దార్ వల్లభాయ్ పటేల్ 1918 అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సమ్మె
- అహ్మదాబాద్ నూలు మిల్లులో చాలా మంది కార్మికులు పనిచేస్తున్నారు.
- ఈ సమయంలో నూలు మిల్లులో ప్లేగు వ్యాధి సంభవించింది.
- దీంతో కార్మికులంతా పనిని మానేశారు.
- బ్రిటిష్‌వారు 70 శాతం బోనస్ ప్రకటించారు.
- గాంధీ కార్మికుల తరుపున ఉద్యమం చేసి 35 శాతం బోనస్ ఇప్పించారు.
రౌలత్ చట్టం 1919 ఏప్రిల్ 09
- ఏప్రిల్ 6ను ప్రార్థన, గౌరవ భంగ దినంగా జరుపుకోమన్నది- గాంధీ
- రౌలత్ చట్టం ప్రకారం బ్రిటిష్‌వారి అనుమతి లేకుండా ఏ ఉత్సవాన్ని సమావేశాన్ని నిర్వహించరాదు.
- దీనిని గాంధీ నల్ల చట్టమని విమర్శించారు.
- ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేసిన, భారతీయ విద్యావేత్తలు
1) డా. సత్యపాల్ 2) సైపుద్దీన్ ఖిచ్లు - వీరిద్దరిని పంజాబ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అయిన జనరల్ డయ్యర్ అరెస్ట్ చేశాడు.
- దీంతో భారతీయులు, వారిద్దరి నిర్బంధం నుంచి విముక్తి కోసం పంజాబ్, అమృత్సర్ జిల్లాలో జలియన్ వాలాబాగ్‌లో సమావేశమయ్యారు.
- లాలలా హన్స్‌రాజ్ ప్రసంగిస్తున్న సమయంలో జనరల్ డయ్యర్ తన సైన్యంతో వెళ్లి కాల్పులు జరపగా 1000 మంది సజీవ దహనం అయ్యారు.
- దీనికి నిరసనగా రవీంద్రనాథ్ఠాగూర్ నైట్‌హుడ్, సర్ బిరుదులను త్యజించెను.
- జనరల్ డయ్యర్, ఓ.డయ్యర్లను చంపడానికి పంజాబ్ సిక్కు అయిన ఉద్దమ్‌సింగ్ లండన్ వెళ్లగా, అప్పటికే జనరల్ డయ్యర్ కలరాతో మరణించగా, 1940లో జనరల్ ఓ.డయ్యర్‌ను 1940లో ఉద్దమ్‌సింగ్ హత్యచేసి వచ్చాడు .
- ‘పాంచాలి పరాభవ’ అనే గ్రంథాన్ని రాసిన తెలుగువాడు దామరిక పుండరికాక్షుడు. ఇది జలియన్వాలాబాగ్పై వచ్చిన గ్రంథం.
- జలియన్వాలాబాగ్పై బ్రిటిష్‌వారు నియమించిన కమిటీ హంటర్ కమిషన్ (1919) దీనిని గాంధీ వైట్‌వాష్‌గా విమర్శించారు.
సహాయ నిరాకరణ ఉద్యమం (1920-22)
- సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాలని, గాంధీ 1920లో ఐఎన్‌సీ నాగపూర్ సమావేశంలో నిర్ణయించారు.
- 1920 ఆగస్టు 1 తిలక్ మరణించిన రోజున సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.
- ఈ ఉద్యమ సమయంలో గాంధీ త్యజించిన బిరుదులు -2
1) ఖైజర్-ఎ- హింద్
2) హిందుస్థాన్ సింహం - సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీ నినాదాలు
1) విదేశీ వస్తువులను బహిష్కరించండి, స్వదేశీ వస్తువులనే ఉపయోగించండి
2) విదేశీ పాఠశాలలు, కళాశాలలను బహిష్కరించండి.
3) స్వదేశీ పాఠశాలలకు, కళాశాలకు వెళ్లండి
4) విదేశీయులు ఇచ్చిన పదవులకు రాజీనామా - గాంధీ ఇచ్చిన పిలుపుతో 90,000 మంది విద్యార్థులు విదేశీ పాఠశాలలకు వెళ్లడం మానేశారు.
- వీరి కోసం 8,000 స్వదేశీ పాఠశాలలను ఏర్పాటు చేశారు.
- గాంధీ మాటలు విని చాలామంది న్యాయవాద వృత్తికి రాజీనామా చేశారు.
- ఈవిధంగా గాంధీ, శాంతి, సత్యం, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో సహాయ నిరాకరణ ఉద్యమం చేయమన్నారు.
- దీనితో యూపీలోని గోరఖ్‌పూర్‌లోని చౌరిచౌరా ప్రాంతంలో వేలాది మంది భారతీయులు ప్రదర్శన చేస్తుండగా 22 మంది పోలీసులు వచ్చి వారిని నిర్బంధించారు.
- దీనితో కోపోగ్రస్థులైన భారతీయులు, ఆ 22 మందిని బంధించి సజీవదహనం చేశారు.
- దీంతో గాంధీ బార్దోలి ప్రాంతం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
- సహాయ నిరాకరణ ఉద్యమం 1922 ఫిబ్రవరి 5న చౌరీచౌరా సంఘటనతో ఆగిపోయింది.
- సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ఆంధ్రలో జరిగిన 3 ముఖ్య సంఘటనలు
1) చీరాల పేరాల ఉద్యమం - నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
బిరుదు ఆంధ్రరత్న - ఈ ఉద్యమ కాలంలో వీరు ఈ ప్రాంత ప్రజలు నిర్మించుకున్న నగరం – రామ్‌నగర్
- ఈ ఉద్యమ కాలంలో 15000 మందికి సేవ చేసిన సైన్యం రామదండు
2) పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం - నాయకుడు పర్వతనేని వీరయ్య చౌదరి
- ఆయన బిరుదు ఆంధ్ర శివాజీ
3) పుల్లరి సత్యాగ్రహం - నాయకుడు పన్నెగంటి హన్మంతరావు
- పుల్లరి సత్యాగ్రహం కడప రాయచోటి ప్రాంతాల్లో ఎక్కువగా జరిగింది.
ఖిలఫత్ ఉద్యమం (1919-1920)
- మొదటి ప్రపంచ యుద్ధంలో, ఇంగ్లండ్ చేతిలో టర్కీ ఓటమి పాలయ్యింది.
- ఇంగ్లండ్ టర్కీని ఆక్రమించుకొని టర్కీలోని మత పెద్ద పదవి అయిన ఖలీఫా పదవిని ఆంగ్లేయులు రద్దు చేశారు.
- దీంతో టర్కీలో ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది.
- ఈ సమయంలో భారత్‌లో కూడా అహ్మద్ అలీ, షెకావత్ అలీ అనే సోదరులు, ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
- దీనికి గాంధీ కూడా మద్దతు ఇచ్చారు. ఆల్ ఇండియా ఖిలాఫత్ డే అక్టోబర్ 17.
స్వరాజ్ పార్టీ (1922 డిసెంబర్ 31)
- 1922 డిసెంబర్ 31న మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్‌లు స్థాపించారు.
- అధ్యక్షుడు చిత్తరంజన్ దాస్ (బిరుదు దేశబంధు)
- సుభాష్ రాజకీయ గురువు
- రైతుబంధు చౌదరి చరణ్ సింగ్
- దీనబంధు -సీఎఫ్ అండ్రూస్
- కార్యదర్శి మోతిలాల్ నెహ్రూ
- స్వరాజ్‌పార్టీ తరుఫున స్పీకర్‌గా
- ఎన్నికైన వారు విఠల్దాస్
నెహ్రూ రిపోర్ట్ (1926)
- ‘భారతీయులు భారత్‌ను పాలించగలరా? రాజ్యాంగం తయారు చేయగలరా’ అనే లార్డ్ చార్లెస్ హుడ్ సవాలును స్వీకరిస్తూ కాంగ్రెస్ 1928లో మోతిలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా సుభాష్ ఉపాధ్యక్షుడిగా నెహ్రూ కార్యదర్శిగా 1+7 మంది సభ్యులతో నెహ్రూ రిపోర్ట్ తయారు చేశారు.
l 1929 ఐఎన్‌సీ లాహోర్ సమావేశంలో ఈ రిపోర్టు ఆమోదం పొందింది.
జిన్నా 14 ఫార్మూలాస్ (1929)
- జిన్నా నెహ్రూ రిపోర్ట్‌ను విమర్శిస్తూ 14 అంశాలతో తయారు చేసినదే జిన్నా 14 ఫార్ములాస్ .
- బ్రిటిష్‌వారు భారత్‌లో చేసిన చట్టాల సంఖ్య 800
- మొదటి చట్టం – రెగ్యులేటింగ్ యాక్ట్ 1773
- 1909 చట్టం మింటోమార్లే సంస్కరణలు ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు.
- 1919లో మాంటెంగ్ చెమ్స్ఫార్డ్ సంస్కరణ ల ద్వారా రాష్ట్రస్థాయిలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీనిపై నిర్మించిన మొదటి కమిటీ ముద్దేమాన్ కమిటీ
- 1919 చట్టంపై నియమించిన 2వ కమిటీ సైమన్ కమిషన్ దీనినే బట్లర్ కమిషన్ అంటారు.
- దీనికి వ్యతిరేకంగా లాలా లజపతిరాయ్, ఆంధ్రలో టంగుటూరి ప్రకాశం1927లో సైమన్ కమిషన్ గో బ్యాక్ అంటూ ఉద్యమించారు.
- 1921లో గాంధీ విజయవాడలో పర్యటించిన సందర్భంలో ఆయన చేసిన ప్రసంగాన్ని అయ్యదేవర కాళేశ్వరరావు తెలుగులోకి అనువదించారు.
- ఈ సమావేశంలో తిలక్నిధిని గాంధీ ఏర్పాటు చేశారు.
- తిలక్ నిధిని 1 కోటి రూపాయలు వసూలు అయ్యాయి. దీంతో 20 లక్షల రాట్నాలను/ చక్రాలను తయారు చేసి భారతీయులకు ఇచ్చారు.
- తిలక్ నిధికి నగలను దానం చేసిన స్త్రీ మాగంటి అన్నపూర్ణమ్మ
- తిలక్ నిధికి యావత్ ఆస్తిని దానం చేసినవారు యామిని పూర్ణ తిలకం
- 1921లో సహాయ నిరాకరణోద్యమ కాలం లో ‘మాకొద్దు ఈ తెల్లదొరతనంబు’ అని నినాదం ఇచ్చింది గరిమెళ్ల సత్యనారాయణ
ఆంజనేయులు
ఫ్యాకల్టీ,ఏకేఆర్ స్టడీ సర్కిల్
Next article
Scholarship 2023 | Scholarships for Students
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు