దేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్? ( ఇండియన్ జాగ్రఫీ)
పశ్చిమ కనుమలు
-వీటిని సహ్యాద్రి పర్వతాలుగా కూడా పిలుస్తారు. ఇవి.. రెండు రకాలు.
1) ఉత్తర సహ్యాద్రి శ్రేణులు (Northern)
-ఇవి తపతి నదికి దక్షిణంగా మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో విస్తరించాయి.
-వీటి సగటు ఎత్తు 1200 మీ., ఇవి దక్కన్ నాపలు లేదా లావా శిలలతో ఏర్పడ్డాయి.
– సహ్యాద్రి కనుమలు కొంకణ్ తీరాన్ని (మహారాష్ట్ర, గోవా), మహారాష్ట్రలోని దక్కన్ పీఠభూమి ప్రాంతాన్ని వేరుపరుస్తాయి.
-వీటిలో ఉన్న శిఖరాలు
1) కల్సూబాయి (1646 మీ.) ఇది మహారాష్ట్రలో ఎత్తయిన శిఖరం
2) సాల్వేర్ (1567 మీ.)
3) ధోడప్ (1451 మీ.)
4) మహాబలేశ్వర్ (1438 మీ.)
5) హరిశ్చంద్రగఢ్ (1424 మీ.)
– వీటిలో ఉన్న వేసవి విడుదులు- మహాబలేశ్వర్, లోనావాలా ఖండాలా, మాథరన్, అంబోలి.
2) దక్షిణ సహ్యాద్రి శ్రేణులు (Southern Sahyadri)
-ఇవి కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి.
ఎ) నీలగిరి కొండలు (Blue Mountain)
– ఇవి తమిళనాడు, కర్ణాటక, కేరళ ట్రైజంక్షన్ వద్ద ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో విస్తరించిన పశ్చిమ కనుమలు. ఇవి ‘షోల’ అడవులకు ప్రసిద్ధి.
– వీటిలో ఎత్తయిన శిఖరం దొడబెట్ట (2637 మీ.). ఈ శిఖరం పాదాల చెంతన వేసవి విడిది అయిన ‘ఊటీ (ఉదక మండలం)’ ఉంది.
– మాకుర్తి శిఖరం (2,554 మీ.) దీనిలోనే ఉంది.
— తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతం నీలగిరి కొండల్లోని ‘గుడలూరు’. వీటిలో నివసించే తెగలు కోట, తోడ, ఇరుల, కురుంబ.
– దేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ను 1986లో నీలగిరి కొండల్లోనే ప్రారంభించారు.
– సైలెంట్ వ్యాలీ, ముదుమలై, మాకుర్తి, నాగర్హూల్, బందీపూర్ నేషనల్ పార్క్‌లు, వైనాడ్, సత్యమంగళం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఈ నీలగిరుల్లోనే ఉన్నాయి.
– నీలగిరి కొండలకు తూర్పునగల సత్యమంగళం వైల్డ్‌లైఫ్ శాంక్చువరీ పశ్చమ, తూర్పు కనుమల జీవ ఆవాసాలకు అనుసంధానంగా ఉంది.
-ఈ నీలగిరి కొండల దిగువనే కోయంబత్తూర్ పట్టణం ఉంది.
బి) అన్నామలై కొండలు
– అన్నామలై అంటే ఏనుగుల కొండలు అని అర్థం.
-ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన శ్రేణులు.
– దీనిలో ఎత్తయిన శిఖరం అనైముడి (2,695 మీ.).
– అత్యధిక వర్షపాతం పొందే పశ్చిమ కనుమల్లోని భాగం.
– ఇరవికులం నేషనల్ పార్క్, పరాంబికులం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఈ పర్వతాల్లో ఉంది.
సి) పళని కొండలు
– అన్నామలై కొండలకు తూర్పు వైపునగల పర్వతాలు, ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి.
– వీటిలో ఎత్తయిన శిఖరం వందరావు శిఖరం (2,533 మీ.).
-ఇక్కడ ఉన్న వేసవి విడిది ‘కొడైకెనాల్’.
పశ్చిమ కనుమల్లోని ముఖ్యమైన శిఖరాలు
1) అనైముడి శిఖరం (2,695 మీ.)– ఇది అన్నామలై పర్వత శ్రేణిలో, ఇడుక్కి (కేరళ)లో ఉంది. దక్షిణ భారత్‌లో, ద్వీపకల్ప పీఠభూమిలో, పశ్చిమ కనుమల్లో, అన్నామలై కొండల్లో, కేరళ రాష్ట్రంలో ఎత్తయిన శిఖరం. దీనిని దక్షిణ భారత్‌లో ఎవరెస్ట్ అంటారు. ఇది ఇరవికులం నేషనల్ పార్క్‌లో ఉంది.
2) దొడబెట్ట శిఖరం (2,637 మీ.)- దక్షిణ భారత్‌లో, ద్వీపకల్ప పీఠభూమిలో, పశ్చిమ కనుమల్లో రెండో ఎత్తయిన శిఖరం. తమిళనాడులో, నీలగిరి కొండల్లో అత్యంత ఎత్తయిన శిఖరం.
3) వందరావు శిఖరం- ఇది తమిళనాడులోని పళని కొండల్లో ఎత్తయిన శిఖరం.
4) ముల్లయనగిరి శిఖరం (1930 మీ.)– ఇది కర్ణాటకలో ఎత్తయిన శిఖరం. బాబా బుడాన్ కొండల్లో ఉంది.
5) దేవరమల్లి శిఖరం (1922 మీ.)- ఇది కేరళలో కార్డమమ్ కొండల్లో ఎత్తయిన శిఖరం. పెరియార్ నది ఇక్కడి నుంచే ప్రారంభమయ్యింది.
6) కుద్రేముఖ్ శిఖరం (1892 మీ.)- ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది.
7) కల్సూబాయి శిఖరం (1646 మీ.)- ఇది మహారాష్ట్ర లోని సహ్యాద్రి కొండల్లో ఉంది. ఇది మహారాష్ట్రలోనే ఎత్తయిన శిఖరం.
– దేశంలో ప్రసిద్ధమైన జలపాతం ‘జోగ్ జలపాతం (253 మీ.). ఇది కర్ణాటకలో ‘శరావతి నది’పై ఉంది.
పశ్చిమ కనుమల్లోని ప్రధాన కనుమలు
1) థాల్‌ఘాట్ (కాసర ఘాట్) కనుమ- ఇది మహారాష్ట్ర లోని ముంబై, నాసిక్‌లను కలుపుతుంది. ‘నేషనల్ హైవే 160’ని ఈ కనుమ గుండా నిర్మించారు.
2) నానేఘాట్ కనుమ- ఇది మహారాష్ట్రలోని ముంబై, జున్నార్లను కలుపుతుంది. దీని గుండా ‘నేషనల్ హైవే 61’ని నిర్మించారు.
3) భోర్ ఘాట్ కనుమ- ఇది మహారాష్ట్రలోని ముంబై, పుణెలను కలుపుతుంది. ‘నేషనల్ హైవే 48’ని ఈ కనుమ గుండా నిర్మించారు.
4) అంబెనాలి కనుమ- ఇది మహారాష్ట్రలోని రాయగఢ్, సతారాలను కలుపుతుంది. దీని గుండా ‘నేషనల్ హైవే 72’ను నిర్మించారు.
5) అంబఘాట్ కనుమ- ఇది మహారాష్ట్రలోని రత్నగిరి, కొల్హాపూర్లను కలుపుతుంది. ‘నేషనల్ హైవే 66’ను ఈ కనుమ గుండా నిర్మించారు.
6) పాల్ఘాట్ (పాలక్కాడ్ ఘాట్) కనుమ– ఇది కేరళలో పాలక్కాడ్ (కేరళ), కోయంబత్తూర్ (తమిళనాడు)లను కలుపుతుంది. ఇది ఉత్తరాన నీలగిరి పర్వతాలకు, దక్షిణాన అన్నామలై కొండలకు మధ్యలో ఉంది. ఈ కనుమ 24 నుంచి 30 కి.మీ. వెడల్పు ఉంది. భరత్‌పూజ నది ఈ కనుమ గుండా ప్రవహిస్తుంది. ‘నేషనల్ హైవే 544’ను ఈ కనుమ గుండా నిర్మించారు.
7) శెన్ కోట్టె ఘాట్ (శెంగోళైఘాట్) కనుమ- ఇది తమిళనాడులోని కొల్లమ్, మధురైలను కలుపుతుంది. పాల్ఘాట్ కనుమ తరువాత పశ్చిమ కనుమల్లో రెండో పెద్దది. దీనిని ‘దక్షిణ తమిళనాడు ముఖద్వారం’ అంటారు.
తూర్పు కనుమలు
-ఒడిశాలోని మహానది నుంచి తమిళనాడులోని వైపర్ నది వరకు దక్కన్ పీఠభూమి తూర్పు భాగాన 1200 కి.మీ. పొడవునా, 100-150 కి.మీ. వెడల్పునా విస్తరించిన విచ్ఛిన్న శ్రేణులు.
-ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న వీటిని ‘పూర్వఘాట్స్’ అని కూడా పిలుస్తారు.
-పశ్చిమ కనుమల కన్నా పురాతనమైన ఈ పర్వతాలు సగటున 600 మీ. కన్నా ఎక్కువ ఎత్తును కలిగి ఉన్నాయి.
– తూర్పు కనుమల్లో ఉన్న ఈ కొండలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ‘పయన్ ఘాట్స్’ అని పిలుస్తారు.
– ఈ తూర్పు కనుమలను తమిళనాడులో ‘కిళక్కు తోడర్చిమలై’ అని కూడా అంటారు.
– పశ్చిమ కనుమలతో పోలిస్తే ఇవి తక్కువ ఎత్తులో ఉండటమేకాక, ద్వీపకల్ప నదులతో ఖండిస్తాయి.
– గోదావరి, కృష్ణా నదుల మధ్య తూర్పు కనుమలు దాదాపుగా లేవు.
-తూర్పు కనుమల వైవిధ్యాలను పరిగణనలోకి తీసుకొని వీటిని 3 భాగాలుగా విభజించారు.
1) తూర్పు శ్రేణులు- మహానది, గోదావరి నదుల మధ్య
2) కడప శ్రేణులు- కృష్ణా, పాలార్ నదుల మధ్య
3) తమిళనాడు కొండలు- పాలార్ నుంచి వైపర్ నది వరకు.
తూర్పు శ్రేణులు
-తూర్పు కనుమల్లో పర్వత లక్షణాలను కలిగిన కొండలు ఈ శ్రేణులే.
– తూర్పు కనుమల్లో ఉత్తర భాగాన వంశధార, నాగావళి, శబరి, సీలేరు, ఇంద్రావతి, మాచ్‌ఖండ్ లాంటి నదులు పుట్టి పశ్చిమం వైపు ప్రవహిస్తున్నాయి.
-ఈ తూర్పు శ్రేణులను ప్రాంతీయంగా విభజించారు.
ఎ) నయాగర్ కొండలు
-మహానదికి దక్షిణాన తేల్, రుషికుల్య నదుల మధ్యలో ఒడిశాలో ‘నయాగర్ శ్రేణులు’ ఉన్నాయి.
బి) మాడుగుల కొండలు
-ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో వంశధార, నాగావళికి తూర్పున మహేంద్రగిరి కొండలు (1501 మీ.) పడమరన మాడుగుల కొండలు ఉన్నాయి. వీటిలో మాడుగుల కొండలు ఎత్తయినవి.
– మొత్తం తూర్పు కనుమల్లో అన్నింటికంటే ఎత్తయిన శిఖరం అరమొ కొండ (1680 మీ.) లేదా సీతమ్మ కొండ లేదా జిందగడ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని అరకు ఏరియాలో గల పాడేరు రెవెన్యూ ప్రాంతంలో ఉంది.
-సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం జిందగడ. గాలికొండ (1643 మీ.), సింక్రం గుట్ట (1620 మీ.)లు కూడా ఇక్కడే ఉన్నాయి.
– గాలికొండల వద్ద గల వేసవి విడిది ‘అరకులోయ’ దీనిని ఆంధ్రప్రదేశ్ ఊటీ అని పిలుస్తారు.
సి) మలియా కొండలు
– ఖోండలైట్స్, చార్నోకైట్స్ శిలలతో నిర్మితమైన మలియా కొండలు ఉత్తర భాగంలో ఉన్నాయి.
-ఈ కొండ లైట్స్ శిలలు ఉన్న ప్రాంతం ‘మాంగనీస్’ నిక్షేపాలకు ప్రసిద్ధి.
డి) తూర్పు శ్రేణుల్లోని ఇతర కొండలు
-తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పాపికొండలు, ధూమ కొండలు ఉన్నాయి.
-పాపికొండల వద్దనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది.
-ఇమర్ గిరులు, నియం గిరులు, కోరాపుట్ కొండలు, జయపూర్ కొండలు, బోనాయి కొండలు, కియోంజర్ కొండలు, మయూర్భంజ్ కొండలు, మేఘసాని కొండలు ఒడిశాలో ఉన్నాయి.
– విశాఖపట్నంలో కైలాస పర్వతశ్రేణి (దీనిలో సింహాచల క్షేత్రం), యారాడ కొండల తూర్పున డాల్ఫిన్ నోస్ కొండ ఉంది. దీనిపై లైట్‌హౌస్ నిర్మించారు.
-కృష్ణాజిల్లాలో మొగల్రాజపురం కొండలు, కొండపల్లి కొండలు ఉన్నాయి.
– నాగర్‌కర్నూల్ జిల్లాలో అమ్రాబాద్ గుట్టలు ఉన్నాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. దక్షిణ భారతదేశంలో ఎత్తయిన శిఖరం ‘అనైముడి’ ఏ పర్వతాల్లో విస్తరించి ఉంది?
1) నీలగిరి 2) కార్డమమ్
3) అన్నామలై 4) పళని
2. కర్ణాటక రాష్ట్రంలో ఏ పర్వతాల్లో ‘కాఫీ’ పంట బాగా పండుతుంది?
1) మాలన్ 2) పళని
3) బాబు బుడాన్ 4) ఏదీకాదు
3. కింది వేసవి విడుదుల్లో మహారాష్ట్రలో లేని వేసవి విడిది ఏది?
1) మహాబలేశ్వర్ 2) ఖండాలా
3) లోనావాలా 4) కొడైకెనాల్
4, నీలగిరి పర్వతాల పాదాల వద్ద ఉన్న పట్టణం?
1) మధురై 2) కోయంబత్తూర్
3) సేలం 4) నాగపట్నం
5. మహారాష్ట్ర పశ్చిమ కనుమలో ఎత్తయిన శిఖరం కింది వాటిలో ఏది?
1) కల్సూబాయి 2) కుద్రేముఖ్
3) దొడబెట్ట 4) దేవరమల్లి
6. తూర్పు కనుమల్లో తమిళనాడు రాష్ట్రంలో దక్షిణ కొనలో ఉన్న నది?
1) వైపర్ 2) పాలార్
3) కావేరి 4) వైగై
7. కింది నదుల్లో తూర్పు వైపు ప్రవహించనది?
1) సీలేరు 2) లాంగుల్య
3) మాండవి 4) మాచ్‌ఖండ్
8. పాల్ఘాట్ కనుమ కేరళ, తమిళనాడుల మధ్య పశ్చిమ కనుమల్లో ఉంది. దీని గుండా ఏ జాతీయ రహదారిని నిర్మించారు?
1) NH 544 2) NH 61
3) NH 48 4) NH 66
9. ముంబై, నాసిక్ పట్టణాలను NH 160 రహదారితో కలిపారు. ఈ జాతీయ రహదారిని కింది ఏ కనుమ గుండా నిర్మించారు?
1) థాల్‌ఘాట్ 2) భోర్ ఘాట్
3) పాల్ఘాట్ 4) నానేఘాట్
సమాధానాలు
1-3, 2-3, 3-4, 4-2, 5-1, 6-1, 7-3, 8-1, 9-1.
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు