అనంతవిశ్వంలో అద్భుతం – భూమి అక్షాంశాలు-రేఖాంశాలు

భూమిపై ఉత్తర, దక్షిణ ధృవాల బిందువులు స్థిరం. కాబట్టి అక్షాంశాలు, రేఖాంశాలను గీశారు.
-అక్షాంశాలు, రేఖాంశాలు అనే పదాలను మొదటగా వాడినది హిపార్కస్.
అక్షాంశాలు
-భూగోళంపై తూర్పు, పడమరలను కలుపుతూ గీసిన ఊహారేఖలే అక్షాంశాలు.
-ఉత్తర, దక్షిణ ధృవాలకు సమానదూరంలో భూగోళంపై గీసిన వృత్తానికి భూమధ్యరేఖ అని పేరు.
-భూమధ్యరేఖను 00 అక్షాంశం అని అంటారు.
-భూమధ్యరేఖ భూగోళాన్ని రెండు అర్ధభాగాలుగా విభజిస్తుంది.
-భూమధ్యరేఖ ఉత్తరంగా ఉన్న భాగాన్ని ఉత్తరార్థగోళం అని, దక్షిణ భాగాన్ని దక్షిణార్థ గోళం అని అంటారు.
-భూమధ్యరేఖ సమాంతరంగా ఒక డిగ్రీ తేడాతో ఉత్తర, దక్షిణ ధృవాల వరకు గీసిన వృత్తాలు అక్షాంశాలు.
-అక్షాంశాలను సమాంతర రేఖలు అని కూడా అంటారు.
-అక్షాంశ రేఖలన్నింటిలోకి భూమధ్య రేఖ వృత్తం అతిపెద్దది. ఈ ప్రాంతంలో భూమి చుట్టుకొలత 40,075 కి.మీ. ఉంటుంది.
-మిగతావన్నీ పోనుపోను తగ్గి ధృవాల వద్ద బిందువుగా ఏర్పడతాయి.
-ఒక అక్షాంశం విలువ భూమధ్యరేఖ నుంచి ఉత్తరంగాగాని, దక్షిణంగాగాని ఆ అక్షాంశంపైగల బిందువుల నుంచి భూకేంద్రాన్ని కలుపుతూ గీసిన రేఖకు, భూమధ్యరేఖా తలానికి మధ్య ఉన్న కోణానికి సమానం.
-ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలున్నాయి. వీటిని ఉత్తర అక్షాంశాలని అంటారు.
-దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలున్నాయి. వీటిని దక్షిణ అక్షాంశాలని అంటారు.
-231/20ల ఉత్తర అక్షాంశరేఖను కర్కాటకరేఖ అని అంటారు.
-231/20ల దక్షిణ అక్షాంశరేఖను మకరరేఖ అని అంటారు.
-661/20ల ఉత్తర అక్షాంశరేఖను ఆర్కిటిక్ వలయం అని అంటారు.
-661/20ల దక్షిణ అక్షాంశరేఖను అంటార్కిటిక్ వలయం అని అంటారు.
-అక్షాంశాలన్నీ ఊహారేఖలు. ఇవి మొత్తం 0 అక్షాంశమైన భూమధ్యరేఖను కలుపుకొని 181 ఉన్నాయి.
-అక్షాంశానికి, అక్షాంశానికి మధ్య దూరం 111 కి.మీ. ఉంటుంది.
-00 అక్షాంశం వద్ద పగటికాలం 12 గంటలుంటుంది. ఈ పగటికాలం అక్షాంశాన్ని, రుతువులను బట్టి మారుతూ ఉంటుంది.
-అక్షాంశాలను డిగ్రీలు (0), నిమిషాలు (1), సెకండ్ల()గా సూచిస్తారు.
-అక్షాంశాల్ని ఇంగ్లిష్‌లో లాటిట్యూడ్ అంటారు. లాటిట్యూడ్ అంటే వెడల్పు అని అర్థం.
-లాటిట్యూడ్ అనే పదం లాటిన్ అనే పదం లాటిట్యూడో అనే పదం నుంచి వచ్చింది.
-అన్ని అక్షాంశాల్లో భూమధ్యరేఖ అతి పొడవైంది. రెండువైపులా అంటే ఉత్తర, దక్షిణ వైపులకు వెళ్లేకొద్దీ ఈ అక్షాంశాలు చిన్నవిగా కనిపిస్తాయి.
-అర్ధగోళాన్ని ఇంగ్లిష్‌లో Hemispere అంటారు. Hemi అంటే సగభాగం అని అర్థం.
-అక్షాంశానికి, మరొక అక్షాంశానికి మధ్యదూరం 111 కి.మీ.
రేఖాంశాలు
-భూమధ్యరేఖను ఖండిస్తూ ధృవాలను కలుపుతూ భూమి చుట్టూ లంబంగా గీసినవి రేఖాంశ వృత్తాలు.
-వీటి అర్ధవృత్తాలను రేఖాంశాలు అని అంటారు.
-భూగోళంపై ఒక డిగ్రీ అంతరంతో 360 రేఖాంశాలుంటాయి.
-ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాల్లో ఒకేసారి మిట్టమ
ధ్యాహ్నం అవుతుంది. అందుకే వీటిని మధ్యాహ్నరేఖలు అంటారు.
-00ల రేఖాంశం గ్రీనిచ్‌లో ఉంది. దీన్ని ప్రధాన రేఖాంశం అంటారు.
-గ్రీనిచ్ రేఖకు తూర్పుగా 180, పశ్చిమంగా 180 రేఖాంశాలున్నాయి. ఇవి రెండు ఒకటే 1800 రేఖాంశం ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు.
-తూర్పు రేఖాంశం వరకు ఉన్నది పూర్వార్ధగోళం/తూర్పు రేఖాంశాలు అంటారు.
-పడమర రేఖాంశం వరకు ఉన్నది పశ్చిమార్ధగోళం/పశ్చిమ రేఖలు అంటారు.
-ఇవి ఊహారేఖలు. భూమి 10 రేఖాంశం తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది.
-అక్షాంశ రేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి.
-రేఖాంశాలు ధృవాల వద్ద కేంద్రీకృతమవుతాయి.
-ఒక రేఖాంశం విలువ ఆ రేఖాంశంపై ఉన్న బిందువు నుంచి భూమధ్యరేఖ వెంట ప్రధాన రేఖాంశం వరకు ఉన్న కోణీయ దూరానికి సమానం.
-ప్రపంచాన్ని రేఖాంశాల సహాయంతో 24 కాల మండలాలుగా విభజించారు.
-రేఖాంశాన్ని ఇంగ్లిష్‌లో లాంగిట్యూడ్ అంటారు.
-లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది.
-ఇవి పూర్తి వృత్తాలు కావు. ధృవం నుంచి ధృవం వరకు ఉండే అర్ధవృత్తాలు ఇవి.
-రేఖాంశం ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది.
ఉపయోగాలు
1) వీటి సహాయంతో భూగోళంపై ఒక ప్రదేశం ఉనికి సులభంగా గుర్తించవచ్చు.
2) కర్కాటక, మకర రేఖలు దాటి సూర్యుడి కిరణాలు నిట్టనిలులుగా పడవు. కాబట్టి అక్షాంశరేఖలతో ఒక ప్రదేశ శీతోష్ణస్థితి తెలుసుకోవచ్చు.
FULL_MOONS_OF_JUPITER
3) భూమి తన చుట్టూ తాను ఒక డిగ్రీ దూరం తిరగడానికి 4 నిమిషాలు పడుతుంది. కాబట్టి రేఖాంశాల సహాయంతో వివిధ ప్రదేశాల్లో, కాలాల్లో తేడాలు గుర్తించవచ్చు. అందుకే రేఖాంశాలను కాలరేఖలని కూడా అంటారు.
అక్షాంశాలు, రేఖాంశాలన్నీ ఊహాజనిత గీతలు
-ప్రతి రేఖాంశం వద్ద ఒక్కొక్క సమయం ఉంటుంది. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి 00 రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకొని తూర్పు, పడమరలను కలిసి మొత్తం 24 కాల మండలాలను గుర్తించారు.
-ఒక్కొక్క కాలమండలం 150 రేఖాంశాల మేర ఉంటుంది.
-ఒక కాలానికి, మరొక కాలమండలానికి ఒక గంట తేడా ఉంటుంది.
-00 గ్రీనిచ్ రేఖ నుంచి తూర్పుకు వెలుతుంటే 4 నిమిషాల సమయం కలపాలి. పడమర వైపు వెళ్లితే 4 నిమిషాల సమయం తీసివేయాలి.
-దేశంలో 821/20ల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక సమయంగా గుర్తించారు (IST).
-IST అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం.
-భారత ప్రామాణిక రేఖకు, 0 గ్రీనిచ్ రేఖకు మధ్య 51/2 గంటల వ్యత్యాసం ఉంటుంది.
గ్రహణాలు
-సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక సరళరేఖపై వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది.
చంద్రగ్రహణం
-సూర్యుడి కిరణాలు చంద్రుడిపై పడకుండా భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
-భూమి సూర్యుడికెదురుగా సగం ఉంటుంది. మిగతా సగం తన నీడలో సూర్యకిరణాలు పడకుండా చీకటి ఉంటుంది.
-పై నీడ భాగాన్ని ప్రచ్ఛాయ అని, నీడ చుట్టూ ఉన్న భాగాన్ని పాక్షిక ఛాయ అని అంటారు.
-పాక్షిక స్థాయిలో నీడ కొద్దిగా ప్రసరిస్తుంది.
-చంద్రుడు ప్రచ్ఛాయలోకి వచ్చినప్పుడు (పౌర్ణమి రోజు) చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
-చంద్రగ్రహణం అన్ని పౌర్ణమిల్లో ఏర్పడదు. కారణం చంద్రుడి కక్ష్యాతలం భూమి కక్ష్యాతలానికి 509 నిమిషాల కోణంలో ఉంది.
-చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి 271/3 రోజుల సమయం పడుతుంది.
సూర్యగ్రహణం
-సూర్యుడు కనబడకుండా భూమికి చంద్రుడు అడ్డువస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
-ఇది అమావాస్య రోజున ఏర్పడుతుంది.
-సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు చంద్రబింబం సూర్యుడికాంతి ఆవరణాన్ని కప్పినట్లు కనపడుతుంది. అప్పుడు నేరుగా చంద్రుడి నీడలో ఉన్న భూభాగంలో సంపూర్ణంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాక్షికంగా గ్రహణం ఏర్పడుతుంది.
సహజ ఉపగ్రహాలు
-మొత్తం సౌరకుటుంబంలో 8 గ్రహాలు, 181 ఉపగ్రహాలున్నాయి. కొత్తగా కనుగొన్న మరుగుజ్జు గ్రహాలు కూడా సౌరకుటుంబంలో భాగంగా ఉన్నాయి. ఇటీవల ప్లూటోను మరుగుజ్జు గ్రహంగా గుర్తించారు. గనిమెడ్ అనే ఉపగ్రహం అతి పెద్దది. ఇది గురుడు ఉపగ్రహం. అతి చిన్నది డెమోస్. ఇది అంగారకుని ఉపగ్రహం.
-NASA (National Aeronautics & Space Administration) ప్రకారం బృహస్పతికి -63, యురేనస్-27, నెప్ట్యూన్ -13, మార్స్ -2, భూమి-1 ఉపగ్రహాలను కలిగి ఉన్నాయి. బుధుడు, శుక్రుడు గ్రహాలకు ఉపగ్రహాలు లేవు.
-మరుగుజ్జు గ్రహమైన ప్లూటోకు మూడు ఉపగ్రహాలున్నాయి.
భూమి అంతర్గత నిర్మాణం
భూమిని ప్రధానంగా మూడు పొరలుగా విభజించవచ్చు.
-అయితే భూకేంద్ర మండలాన్ని తిరిగి రెండు పొరలుగా విభజించారు.
1. బయటికేంద్రభాగం 2,900-5,100 కి.మీ ఇనుము, నికెల్ వంటి లోహాలు ద్రవరూపంలో ఉంటాయి.
2. లోపలికేంద్ర భాగం 5,100- 6,376 కి.మీ ఇనుము, లోహమిశ్రమాలు, బంగారం వంటి పదార్థాలు
-భూపటలం నిత్యం ఏర్పడుతూ, నశిస్తూ ఉంటుంది. దీనికి కారణం భూకేంద్ర భాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాల నుంచి సముద్రతలంలోని పగుళ్ల నుంచి పైకివచ్చి, చల్లబడి భూమిపై పొరగా మారుతుంది. భూమిలో అనేక ప్రాంతాల్లో పై పొర తిరిగి మధ్యపొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది.
భూమిగ్రిడ్ వ్యవస్థ
-అట్లాసును ఉపయోగించి ఒక ప్రదేశం అక్షాంశ, రేఖాంశాలను తెలుసుకోవచ్చు.
-ఇంటర్నెట్ ద్వారా గూగుల్ ఎర్త్‌ను ఉపయోగించి కూడా అక్షాంశ, రేఖాంశాలను తెలుసుకోవచ్చు.
-గ్లోబుపై అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. ఇవి అడ్డంగా, నిలువుగా గీయడంతో ఏర్పడిన గళ్లనే గ్రిడ్ అంటారు.
-ఈ గ్రిడ్ వ్యవస్థతో భూమి ఒక ప్రదేశం శీతోష్ణస్థితి, కాలం, ఇతర పరిస్థితులను తెలుసుకోవచ్చు.
RELATED ARTICLES
-
Biology – JL / DL Special | ఆశ్రయం పొందుతాయి.. హాని తలపెడతాయి
-
Telangana Socio Economic Survey | ఆయిల్‌పామ్ పండించే రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం?
-
Indian festivals and culture | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
-
Geography – Groups Special | విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించినది ఎవరు?
-
Economy | డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం.. పాత కొత్తల మేలు కలయిక
-
Biology | విటమిన్ల లోపం వల్ల చర్మానికి వచ్చే వ్యాధి?
Latest Updates
DSC Special – Social Studies | బ్యాంకులు పూచీకత్తులు లేకుండా రుణాలు ఎవరికి ఇస్తాయి?
General Studies | బ్రిటిషర్లు ‘కైజర్-ఇ-హింద్’ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు?
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు
CLAT 2024 | Common Law Admission Test Latest Updates
Current Affairs | కెంటకీ నగరం ఏ రోజు ‘సనాతన ధర్మ’ రోజుగా ప్రకటించింది?
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా జరుగుతుంది?
Society QNS & ANSWERS | తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏది?
Physics – IIT/NEET Foundation | Vector Subtraction is Useful to?
RBI Recruitment | ఆర్బీఐలో 450 అసిస్టెంట్ పోస్టులు